తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వస్తున్న మరో బయంకరమైన హారర్ చిత్రం 21

సన్ ఫ్లవర్ ఎంటర్ టైన్మెంట్స్ అండ్ ఫిలిమ్స్, అవుల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్స్ పై వెంకట్, వింధ్య, నవీన్ ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘21′ జైశంకర్ చిగురుల దర్శకత్వంలో యాదగిరి ఈ చిత్రాన్ని నిర్మించారు. అభిషేఖ్ వాలింబే సంగీతం అందించిన ఈ సినిమా  ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానున్నది.
చిత్ర దర్శకులు జైశంకర్ చిగురుల మాట్లాడుతూ ఇది హారర్ మూవీ. ఈ సినిమాలో చేస్తున్న ఆర్టిస్ట్‌లందరూ సినిమాకోసం ఎంతగానో సహకరించారు.పలువురు సినీ ప్రముఖులు మా సినిమాను చూసి అభినందిచటం జరిగింది.నేటి యువతరాన్ని మా సినిమా 100% ఆకట్టు కుంటుందన్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు , ట్రైలర్స్ కు మంచి స్పందన వచ్చింది.ఈ చిత్రాన్ని జూలై 29న విడుదలకు సిద్దమైంది. ప్రేక్షకులు ఈ ఆదరిస్తారన్న నమ్మకం ఉంది అన్నారు.

received_857966447681597

received_857966447681597