పినాకిని మీడియా అవార్డు ప్రధానోత్సవం

పినాకిని మీడియా అవార్డు ప్రధానోత్సవం
కళల ద్వార, మనలోని అలసత్వాన్ని పోగోట్టుకోని నూతన ఉత్సాహంతో పని చేస్తూ అభివృద్ధి సాదిస్తాం…అదిగో అలాంటి ప్రగతి పధంలో నడిచేవారి మానసిక ఆనందం కోసం, వారి లోని కళలని గుర్తించి ప్రపంచానికి పరిచయం చేయడానికే మా పినాకిని సంస్థ ఆవిర్బవించింది
ఇది స్వచ్చంద సంస్థ. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకి విజ్ఞానం అందించాలన్నది సంస్థ లక్ష్యం… మా పినాకిని ఆవిర్బివించి ఇప్పటికీ మూడు వసంతాలు…06/02/2016 న మొదలు అయిన పినాకిని దినదిన ప్రవర్దమానం అవుతూ ఇప్పుడు నాల్గవ వసంతంలోకి అడుగు పెడుతుంది.

National book trust house లో ప్రముఖుల సమక్షంలో మొదలు అయి అందరి ఆదరాబిమానాలను సంపాదించిది…ధార్మిక విషయలపై మా సంస్థ వెబ్ సైట్ లొ ప్రతీ రోజు ఒక కొత్త విషయాన్ని తెలియజేయడం దాన్ని అందరూ ఆదరించారు‌‌‌‌‌…కేవలం ధార్మిక విషయాలే కాకుండా సాహిత్యానికి పెద్ద పీట వేసాం…..
కధలు, కవితలు,సినిమా వార్తలు, పుస్తక సమీక్షలతో మమూలు పాఠకులనే కాకుండా సాహిత్తకారులకి కవులకి రచయిత లకి దగ్గర అయ్యేందుకు ప్రయత్నించాం…..అందులో నూ విజయం సాదించాం.ఈ సంవత్సరం కూడా వివిధ రంగాలలో ని ప్రతిభావంతులకి చంద్రునికో నూలుపోగులా అవార్డు తో సత్కరించాము.ఈ కార్యక్రమానికి అతిధిలు గా రమణ గురుస్వామి గారు,ప్రముఖ న్యాయవాది రామశంకర్ గారు,బషీర్ మాస్టర్ విచ్చేశారు. విచ్చేసిన అతిధులుకు
ఈ కార్యక్రమానికి దిగ్విజయం చేసిన అందరుకి పేరు పేరు నా కృతజ్ఞతలు.

అవార్డును అందుకున్న ప్రముఖులు పేర్లు

ఆధ్యాత్మిక రంగం: డేరం భాస్కర్ శర్మ గారు
బెస్ట్ రైటర్ : సోమ సుందర్
బెస్ట్ ఆర్టిస్ట్: రాకేష్ గుప్తా
బెస్ట్ ఫోటోగ్రఫర్ : S. అమీర్
.యూత్ ఐకన్
:సాయి కృష్ణ శ్రీ గాయత్రి ఈవెంట్స్
బెస్ట్ సింగర్ :మార్తి లలిత
టికేటాక్ స్టార్:నాగరాజు

బెస్ట్ బిజినెస్ మెన్ :సప్పిడి రమేష్
బెస్ట్ డిజైనర్ : ప్రణయ్ ముకిరాల
బెస్ట్ డైరెక్టర్ : గంగాధర్ అధ్వైతIMG-20200203-WA0004IMG_20200203_194548_694

బ్రాహ్మణాభ్యుదయ పరిషత్ (రంగారెడ్డి జిల్లా) శ్రీ శార్వరి నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ

బ్రాహ్మణాభ్యుదయ పరిషత్ (రంగారెడ్డి జిల్లా) శ్రీ శార్వరి నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు . నాదరుగుల్ లో బ్రాహ్మణాభ్యుదయ పరిషత్ భవనం లో
పంచాంగం ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో
రంగి సత్యనారాయణ శర్మ గారు,ప్రముఖ న్యాయవాది గుండెపుడి రమశంకర్ శర్మగారు ,మరియు బ్రాహ్మణాభ్యుదయ పరిషత్ రంగారెడ్డి జిల్లా సంఘం ప్రతినిధులు మరియు యువజన సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.IMG_20200203_114131IMG-20200203-WA0011

24 న శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి ప్రతిభ పురస్కరాలు

శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి 4 వ వార్షికోత్సవ సందర్భంగా వివిధ రంగాల్లో తమ తమ సేవలను అందిస్తున్న వారికి ప్రతిభ పురస్కారాలు అందజేస్తున్నట్లు సంస్థ ఫౌండర్& చైర్ పర్సన్ ఎర్రం పూర్ణ శాంతి గారు తెలియచేసారు.

ఈ అవార్డులు ప్రతి సంవత్సరం ఎర్రం పూర్ణ శాంతి గారు ప్రధానం చేస్తున్నారు.ఈ అవార్డులను ఆయా రంగాలలో అత్యుత్తమ విజయాలు సాధించిన సేవా రంగాల వారికి, నిపుణులకు ఇస్తారు. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా 4వ వార్షిక సందర్భంగా ప్రతిభ పురస్కరాలు అవార్డులను అందజేయనున్నారు. హైదరాబాద్ లో శ్రీ పొట్టిశ్రీరాములు యూనివర్సిటీ ఎన్టీఆర్ ఆడిటోరియం ఈఏడాది ఈ ఉత్సవానికి వేదిక కానుంది. ఈ అవార్డుల ప్రధానోత్సవం ఈ నెల 24వ తేదీన అంగరంగ వైభవంగా జరగనుంది.

IMG-20191019-WA0000

IMG-20191019-WA0001

ప్రారంభమైన Aibsjac బ్రాహ్మణ సమైక్యత యాత్ర

బ్రాహ్మణ సమైక్యత కోసం ఆల్ ఇండియా బ్రాహ్మణ సంఘాల జాక్ ఈ రోజు నుండి 3 రోజులు ఆంధ్రప్రదేశ్ యాత్ర ప్రారంభించింది.

ఈ సందర్భంగా యాత్ర విజయవంతం అవ్వాలి రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి శ్రీ వేణు గోపాల చారి గారు, ఆధ్యాత్మిక వేత్త శ్రీ జ్యోతి దివ్య వేకంటరమణ మాత , శ్రీ దివ్య జ్ఞాన సిద్ధాంతి గారు, శ్రీ రాజేశ్వర్ శర్మ గారు జెండా ఊపి యాత్ర
ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాక్ చైర్ పర్సిన్ శ్రీమతి కే. గీతా మూర్తి గారు, శ్రీ రమాశంకర్ గారు,బాలసుబ్రహ్మణ్యం గారు శ్రీ శ్రీరంగం గోపి కృష్ణమాచార్యులు గారు , మోహన్ రావు గారు, శ్రావణి గారు, ఏ ఎస్ మూర్తి గారు, శ్రీప్రియ గారు,నీలకంఠ శర్మ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, ప్రభావతి గారు, శ్రీనివాస్ శర్మ గారు, మొదలగు జాక్ సభ్యులు కూడా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం ఈరోజు నుండి 3 రోజులు ఆంద్రప్రదశ్ రాష్ట్రం లోని విజయవాడ,గుంటూరు, బాపట్ల.మచిలీపట్నం తో పాటు మరికొన్ని కేంద్రలలో కొనసాగుతుందని జాక్ సభ్యులు తెలియచేసారు.

IMG-20190913-WA0061

వైభవంగా బ్రాహ్మణాభ్యుదయ పరిషత్ ఆధ్వర్యంలో ఉపాకర్మ నిర్వహణ

వైభవంగా బ్రాహ్మణాభ్యుదయ పరిషత్ ఆధ్వర్యంలో ఉపాకర్మ నిర్వహణ
బ్రాహ్మణాభ్యుదయ పరిషత్ రంగారెడ్డి జిల్లా
ఆధ్వర్యంలో నూతన వటువులకు ఉపాకర్మ(మౌంజీ) మరియు సామూహిక వరలక్ష్మీవ్రతాలు నిర్వహించారు..జూన్ 9 న
నిర్వహించిన ఉపనయన కార్యక్రమంలో నూతనంగా ఉపనయనం చేసుకున్న వారు తప్పనిసరిగా శ్రావణ పౌర్ణమి రోజున తప్పనిసరిగా మౌంజీ కార్యక్రమం చేసుకోవాలి కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బ్రాహ్మణాభ్యుదయ పరిషత్ అధ్యక్షులు డేరం భాస్కర్ శర్మ తెలియచేసారు.ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి
మాట్లాడుతూ బ్రాహ్మణుల్లో చాలా మంది పేదలున్నారని, వారిని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణ పరిషత్‌ను ఏర్పాటు చేసి పలు సంక్షేమ పథకాలను అమలుచేస్తోందన్నారు. ఈసందర్భంగా 15 మందికి శాస్ర్తోక్తంగా ఎలాంటి లోటు లేకుండా ఉపాకర్మ యజ్ఞోపవీతం కార్యక్రమాన్నిచేశారు. ఈ కార్యక్రమంలో బడంగిపెట్ మాజీ చైర్మెన్ యాతం శ్రీశైలం యాదవ్, ఆలిండియా బ్రాహ్మణ జేఏసీ గౌరవ అధ్యక్షులు రమాశంకర్ శర్మ, తెలంగాణ బ్రాహ్మణ జేఏసీ కార్యదర్శి ప్రమోద్ కోటార్, బ్రాహ్మణాభ్యుదయ పరిషత్ యువజన మరియు మహిళ విభాగం సభ్యులు

తదితరులు పాల్గొన్నారు.IMG-20190814-WA0088

IMG-20190814-WA0100IMG-20190814-WA0034

 

పెనుతుఫాను

1
నిరాశ్రయుల ఆశ్రయంగా
అన్నార్తుల ఫలాలుగా పచ్చగా
ఎదగాలనుకున్నాను కానీ స్వార్థం
నన్ను కూకటివేళ్లతో పెకిలించింది

2
మానవత్వ పరిమళాల్ని
వికసింప సమతాసుమంగా
మొగ్గతొడగాలనుకున్నాను కానీ
మతమౌఢ్యచీడ అంకురదశలోనే
నన్ను కబళించింది

3
కులకుట్రల అగ్గి పై
కుండనీటినవ్వాలనుకున్నాను
కానీ కులగజ్జి ముంతనీటిగానే
నన్ను ముక్కలు చేసింది

4
దాచిన సత్యాల్ని
చాటిజెప్ప సరికొత్త చరిత్ర
పుస్తకమవ్వాలనుకున్నాను కానీ
బూర్జువా చెదపురుగులు నా పుటల్ని మేసి,
పెంటపుటల్ని కానుకిచ్చేయి

5
మూగబోయిన గళాల నవస్వరమై
రవళించాలనుకున్నాను కానీ ..
కత్తికోకండగా నన్ను కాకుల – గద్దల
ఆహారంగా విసిరారు

6
కానీ .. ఇది నా అంతమనీ
మీ జబ్బలుజరుచుకునే
ఈ మిడిసిపాటు ఏలనోయి ?
కానొస్తలేదా ..? మీ కుతంత్రాల
కుంపట్లపై కవనజలఖడ్గవృష్ఠిగా
విరుచుకపడనున్న పెనుతుఫాను
పవనంగా పలకరించిన నా రాక

-:ఇస్లావత్ గోవర్ధన్ నాయక్:-

Ys జగన్ పై ఓ రేంజ్ లో రెచ్చిపోయిన యామిని

 

ఆంజనేయుడికి 5 అంకె ఇష్టమా?*

 
యు

అంకెలలో 5 అంటే ఆంజనేయుడికి ఎంతో ఇష్టము . అని అంటారు పురాణ పురుషులు . అది ఒక నమ్మకము . ఇష్టా ఇష్టాలు ప్రతిజీవికి ఉంటాయి. అలాగే మారుతి కి కూడా ఉండేఉండవచ్చు. కారణమేమిటో చూద్దాం : ఆంజనేయ స్వామి తల్లిదండ్రులపేర్లు చూస్తే .. ”వాయుదేవుడు” , ”అంజనాదేవి” పేర్లలో 5 అక్షరాలే . ”సీతారాములు ” , ”లక్ష్మణస్వామి” లోనూ 5 అక్షరాలే . అంతేకాదు ఆయన పేర్లలో ” హనుమంతుడు ” , ” ఆంజనేయుడు ” లోనూ 5 అక్షరాలే . ఆయన తపస్సు చేసిన పర్వతము ” గంధమాదవ ” లోనూ 5 అక్షరాలే . ఇలా పంచముఖాంజనేయునికి ఈ 5 అంకె తంటే చాలా ఇష్టమని అంటారు .images (9)

కాశీ యాత్రలో దర్శించు కోవలసిన ఘాట్లు

కా

 

కాశీలోని గంగా నది ప్రవాహంలో అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి.

పూర్వం కాశీలో దేవతలు ఋషులు రాజులూ నిర్మించిన అనేక మందిరాలు కట్టడాలు వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది.

కానీ మహమ్మదీయ దండ యాత్రికులు కాశీని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసి ధ్వంసం చేసిన తరవాతి కాశిని మనం చూస్తున్నాము.

విశ్వనాథ, బిందు మాధవ తో పాటు ఎన్నో అనేక మందిరాలను కూల్చి మసీదులు కట్టినారు.

నేటికీ విశ్వనాథ మందిరంలో నంది, మసీదు వైపు గల కూల్చ బడ్డ మందిరం వైపు చూస్తోంది.

అక్కడే శివుడు త్రిశూలం తో త్రవ్విన జ్ఞానవాపి తీర్థం బావి ఉంటుంది.

ఈరోజు మనం దర్శించే విశ్వనాథ మందిర అసలు మందిరానికి పక్కన ఇండోర్ రాణి శ్రీ అహల్యా బాయి హోల్కర్ గారు కట్టించారు…

కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు వున్నాయి..

ఇందులో దేవతలు, ఋషులు, రాజుల తో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి ఎన్నో వున్నాయి. అందులో కొన్ని : ముఖ్యంగా 18 వివరించ బడింది..

1) దశాశ్వమేధ ఘాట్:
బ్రహ్మ దేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే. రోజూ సాయకాలం విశేషమైన గంగా హారతి జరుగుతున్నది.

2) ప్రయాగ్ ఘాట్:
ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా,సరస్వతిలు కలుస్తాయి.

3) సోమేశ్వర్ ఘాట్:
చంద్రుని చేత నిర్మితమైనది.

4) మీర్ ఘాట్:
సతీదేవీ కన్ను పడిన స్థలం. విశాలాక్షి దేవి శక్తి పీఠం.
ఇక్కడే యముడు ప్రతిష్టించిన లింగం ఉంటుంది.

5) నేపాలీ ఘాట్:
పశుపతి నాథ్ మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజు కట్టినాడు.

6) మణి కర్ణికా ఘాట్:
ఇది కాశీలో మొట్ట మొదటిది. దీనిని విష్ణు దేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించాడు. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది. ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపాలు తొలిగి పోతాయి. జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ ముఖ బ్రహ్మ దేవుడు కూడా వర్ణించలేడట.

7) విష్వేవర్ ఘాట్:
ఇప్పుడు సింధియా ఘాట్ అంటారు. ఇక్కడే అహల్యా బాయి తప్పసు చేసింది. ఇక్కడ స్నానం చేసే బిందు మాధవుణ్ణి దర్శిస్తారు.

8 )పంచ గంగా ఘాట్:
ఇక్కడే భూగర్భం నుండి గంగలో 5 నదులు కలుస్తాయి.

9) గాయ్ ఘాట్:
గోపూజ జరుగుతున్నది.

10) తులసి ఘాట్:
తులసి దాస్ సాధన చేసి రామాచరిత మానస్ లిఖించమని శివుని ఆదేశం పొందినది.

11) హనుమాన్ ఘాట్:
ఇక్కడ జరిగే రామ కథ వినడానికి హనుమంతుడు వస్తుంటాడు. ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క్ కుండం వున్నది
ఇక్కడే శ్రీ వల్లభాచార్యులు జన్మించారు.

12) అస్సి ఘాట్:
పూర్వం దుర్గా దేవి శుంభ, నిశుంభ అను రాక్షసులను చంపి అట్టి ఖడ్గంను వెయ్యడం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఉద్బవించింది.

13) హరిశ్చంద్ర ఘాట్:
సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శవ దహన కూలీగా పని చేసి దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు. నేటికి ఇక్కడ నిత్యం చితి కాలుతూ ఉంటుంది…

14) మానస సరోవర్ ఘాట్:
ఇక్కడ కైలాసపర్వతం నుండి భూగర్భ జలధార కలుస్తున్నది.
ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లభిస్తున్నది.

15) నారద ఘాట్:
నారదుడు లింగం స్థాపించాడు.

16)చౌతస్సి ఘాట్:
ఇక్కడే స్కంధపురాణం ప్రకారం ఇక్కడ 64 యోగినిలు తపస్సు చేసినారు.
ఇది దత్తాత్రేయునికి ప్రీతి గల స్థలం… ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలిగి 64 యోగినుల శక్తులు ప్రాప్తిస్తాయి.

17) రానా మహల్ ఘాట్:
ఇక్కడే పూర్వం బ్రహ్మ దేవుడు సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలను తొలగించమని వక్రతుండ వినాయకుణ్ణి తపస్సు చేసి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు.

18)అహిల్యా బాయి ఘాట్

కాశీ స్మరణం మోక్షకారకం*2019-03-25-16-20-37-888

*ప్రపంచ సంతోష దినోత్సవం సందర్భంగా*……
సంతోషం అనేది అందరికీ ఒకలాగా ఉండదు. నిజానికి సంతోషం అంటే తమకు బాగా ఇష్టమైన అంశం అందుకోగలగటమే . అందుకోసమే అందరూ కృషిచేస్తారు. ఒక్కొక్కరికి ఒకలాంటి ఆనందం ఉంటే మరొకరికి మరోక ఆనందం ఉంటుంది ఇలా ఎందుకుంటుందంటే వారు పెరిగిన వాతావరణం, వారి కర్మఫలాలను బట్టి ఉంటుంది.
ఆనందం అందించే అంశం ఏమిటో అది ఎలా అందుకోవాలి అనే దాని దగ్గరే అసలు సమస్య ఉంది. ఆనందం అనేది మనసుకు సంబంధించినది. దానికోసం మనిషి చెడు మార్గాలోకి కూడా వెళతాడు. సమస్యలు అక్కడే మొదలవుతాయి అతని అభివృద్ధికి అవరోధం అవుతాయి మానసిక సమస్యలు సృష్టిస్తాయి.
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. దృఢమైన శరీరంలోనే దృఢమైన మనసు ఉంటుందని కూడా అన్నారు. మనిషి మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉండగలడు. ఆనందంగా ఉండేవారు ఆరోగ్యంగా, హాయిగా ఉంటారు. ఇవి పరస్పర పూరకాలు. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. మానవ మనస్తత్వానికి సంబంధించిన అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ‘మన శరీరాలు మన పూదోటలు. మన మనసులు మన అభీష్టాలూ.. వాటికి తోటమాలులు, వీలు కాకపోతే నిస్సారంగా విడిచి పెట్టవచ్చు. లేదా పరిశ్రమతో పండించుకోవచ్చు…’ అంటాడు షేక్‌స్పియర్‌. అయితే స్వీకరించే మనసుల్ని బట్టి ఆ ఆనందం ఎంత అనేది తెలుస్తుంది. ఒక హృదయం నుంచి మరో హృదయానికి నేరుగా తాకే ఓ సంకేతమే ఆనందం. మనుషులు మాత్రమే మాట్లాడుకునే ఓ అనుభూతి మాధ్యమమే ఆనందం. గిలిగింతల ఉద్వేగమే ఆనందం. ఈ ఆనందం ఒక మనిషికి మరో మనిషి వల్లో, ప్రకృతి వల్లో వస్తుంది. కొనుక్కోవడానికి ఇది అంగట్లో దొరికే వస్తువు కాదు. ఈ సంతోషానికి మనిషికీ జంతువుకీ పెద్ద తేడాలేదు ఒక్క విచక్షణలో తప్ప. ఆకలి, దాహం, నిద్ర, మైధునం- వీటిలో మనిషికి, జంతువుకి తేడాలేదు. ‘మనిషిలో ఉన్నట్లే జంతువులోనూ స్పందనలుంటాయి. ఆనందం అయినా… బాధ అయినా అవికూడా స్పందిస్తాయి’ అంటాడో రచయిత. హాస్య ప్రవృత్తిలేని, నవ్వటం చేతకాని మనుషుల గురించిజాషువా ఇలా అన్నారు………. ….. ‘నవ్వవు జంతువుల్‌ నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికిన్‌ దివ్వెలు…’ ………… ప్రతి మనిషీ ఆనందంగా ఉండాలనే కోరుకుంటాడు. కొందరు నిజంగానే ఉంటారు. చాలామంది ఉన్నామనుకుంటారు. మరికొందరు ఆనందంగా వున్నట్లు నటిస్తుంటారు. ఏది ఏమైనా నిజమైన అనందం ఎప్పుడు కలుగుతుంది అంటే మనస్ఫూర్తిగా ఈర్ష్య ఆసూయలను దూరం చేసుకోవాలి… అలాగే మన ప్రక్కవాడు ఎదుగుతున్నాడు అంటే వాడి కృషి వాడి పట్టుదల వాడి పూర్వజన్మ వాసనాఫలం.. భగవత్ కృప ఈ నాలుగే.ఇవి లేకుండా నేను ఎదగలేక పోయానే అని బాధ పడకూడదు…అలా ఉన్న రోజు నువ్వు ఎంత సంపాదనా పరుడవైన ఎంత మంచి ఉద్యోగం లో ఉన్న…నీవు ఏమి లేనివాడితోనే సమానం!భగవంతుడు నా చదువుకు నా అర్హతకు ఇదే ఇచ్చాడు చాలు అనుకోవడంలో తృప్తి ఉంటుంది ఆ తృప్తి నుంచి మేలైన ఆనందం కలుగుతుంది.
ప్రపంచవ్యాప్తంగా మనుషులెంత సంతోషంగా జీవిస్తున్నారో తెలియజేసే ఒక సూచికను వరల్డ్‌ హ్యాపీనెస్‌ ఇండెక్స్‌ ఇటీవల విడుదల చేసింది. ఐరాస లెక్కల ప్రకారం 2016లో 118వ స్థానంలో వుంటే, 2017 నాటికి 122వ స్థానానికి చేరింది. తాజాగా ఐరాస లెక్కల ప్రకారం సంతోషం వెల్లివిరిసే జనాభాలో ఇండియా 133వ స్థానానికి దిగజారింది. ఫోర్బ్స్ అనే పత్రిక అంచనా ప్రకారం ప్రపంచములో సంతోషముగా ఉన్న మొదటి 20 దేశాలలో భారత దేశం లేదు….కానీ ప్రపంచములో సంపన్నులుగా ఉన్నవారు మొదటి 20 దేశాలలో మనవారు కూడా ఉన్నారు. డబ్బు ఉంటే ఆనందం ఉంటుంది అనుకుంటే… అది అంతా ఒట్టి భ్రమే.మనకున్న దాంట్లో నలుగురికి సహాయం చేస్తే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.. సహాయం అంటే ఇక్కడ ధనమే కాదు ..మాట సాయం కూడా కావొచ్చు ..ఒక్కోసారి పెద్ద పెద్ద మందులతో నయం కాని జబ్బులు కూడా మాటలతో నమ్మకంతో నయం అయ్యాయి అని చరిత్ర చెప్పిన సత్యం.. చిన్న చిన్న వాటిలో కూడా ఆనందం వెతుక్కునే పసి పిల్లల తత్వం, భగవంతుని మీద విశ్వాసం మనకి వస్తే..అదే మన సంతోషాలకి తాళంచెవి అని తెలియజేస్తూ……ఈ రోజు ప్రపంచ సంతోష దినోత్సవం సందర్భంగా…. ఒక మంచి పాట పల్లవితో…మన ఆనందాలను పెంచుకుందాం!! అందమే ఆనందం అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం. అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం. అందమే ఆనందం
పడమట సంధ్యారాగం కుడి ఎడమల కుసుమపరాగం
పడమట సంధ్యారాగం కుడి ఎడమల కుసుమపరాగం
ఒడిలో, చెలి మోహనరాగం ఒడిలో, చెలి మోహనరాగం
జీవితమే మధురానురాగం జీవితమే మధురానురాగం
అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం.
అందమే ఆనందం..
..శ్రీపాదశ్రీవల్లభ చరణదాసుడు *మానికొండ రాజశేఖర్ శర్మ* విద్యా ఆధ్యాత్మిక వేత్త వాస్తు జ్యోతిష నిపుణులు భారతీయ జనతాపార్టీ ధార్మికసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సెల్9493882906 వాట్సాప్ 9154466606IMG-20190320-WA0039