Category Archives: spirituality

గృహములోకి సూర్యకిరణాలు పడితే మంచిదా

 

గృహము నిర్మిస్తే మంచిగా గాలి, వెలుతురు వచ్చే విధంగా నిర్మించుకోవడం ఆరోగ్యకరం. గాలి వెలుతురు రావడానికి ఏర్పాటు చేసే కిటికీలు చిన్నవిగా వుంచడం, ఆ కిటికీలకు వెలుతురు రాకుండా కర్ర లేదా పేడ్ అద్దాలు బిగిచిండడం, కర్టెన్లు వేయడం దోమలు రాకుండా మెషన్ కిటికీలకు ఏర్పాటుచేయడం ఇన్ని ఏర్పాట్లు చూస్తే అసలు కిటికీలు ఎందుకో అనిపిస్తుంది. బయటి నుంచి చక్కటి గాలి వెలుతురు వచ్చే విధంగా కిటికీలు ఏర్పాటు చేసుకోవడంలో వాస్తుశాస్ర్తం చాలా సహకరిస్తుంది. ఈ మధ్య కాలంలో నైరుతి గదికి కిటికీలు వద్దని కొందరు శాస్ర్తవేత్తలు తెలియక చెబుతున్నారు. నైరుతి తెరపిగా వుండకూడదేగాని కిటికీలు వుండటంలో తప్పులేదు. తూర్పు, ఉత్తరాలలో పెద్దవిగా వుండే ఫ్రెంచ్ విండోస్ దక్షిణ పశ్చిమాలలో సాధారణ కిటికీలు పెట్టుకోవడం వాస్తుకు మంచిదే.

ఇంటిలోకి సూర్యకిరాణాలు వస్తే మంచిదని కొందరు తూర్పువైపు విపరీతమైన పెద్ద కిటికీలు ఏర్పాటు చేస్తున్నారు. ఏదైనా అతి పనికి రాదు. కిటికీ ఎలా వుండాలో అలా వుండి సమగ్రస్వరూపం కలిగి వుండాలేగాని రూపం చెడి వికృతంగా తయారు కాకూడదు.

ఇంటిలోకి సూక్యకిరాణాలు వస్తే మంచిదే కాని రాకపోయినా తప్పేమిలేదు. కిరాణాల కన్నా వెలుతురు రావడమే మంచిది.FB_IMG_1534904475938

ప్రాచీన భారతీయ వాస్తు శాస్త్ర రహస్యాలు

భారతీయుడిగా పుట్టినందుకు చాలా గర్విస్తున్నాను . ఎందుకంటే ప్రపంచంలో మరే దేశానికి , మరే సంస్కృతికి లేనంత గొప్ప ప్రాచీన విజ్ఞానం మన భారతీయులకు మన దేశానికే సోoతం . అటువంటి ప్రాచీన అద్బుతమైన విజ్ఞానాన్ని మనం మర్చిపోతున్నాం . ప్రస్తుత పరిస్థితుల్లో కొంతవరకు అయినా మరలా మీకు తెలియచేయాలి అనే ఈ చిన్న ప్రయత్నం .

మన ప్రాచీన శాస్త్రాలలో వాస్తుశాస్త్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. దానిలోని కొన్ని రహస్యాలు మీకోసం.

1. ప్రప్రధముగా గృహనిర్మాణం కావించునప్పుడు భూమిని పరీక్షించవలెను . అలాచేయనిచో ఆ గృహనిర్మాణం వ్యర్థం అగును.

2. గృహనిర్మాణం కావించు భూమి యందు చిల్లపెంకులు ఉన్నచో అది అశుభప్రదము . ఎముక యొక్క బూడిద ఉన్నచో అది నష్టప్రదము , బొగ్గులు మరియు చౌడు ఉన్నచో జీవహాని .

3. గృహనిర్మాణం చేయు భూమి తెల్లని రంగు కలిగి ఉన్నచో శ్రేష్టము . ఎర్రని రంగు గల భూమి మధ్యమము , పచ్చని రంగు కలిగిన భూమి అధమము , నల్లనిరంగు కలిగిన భూమి విడువవలెను .

4. భూమిని త్రవ్వినప్పుడు దానిలోని మృత్తిక నాలుకపై వేసుకొనినచో తియ్యగా ఉన్న శ్రేష్టం , మిశ్రమం అయినది మధ్యమం , పుల్లనిరుచి అధమం , చేదు రుచి కలిగినది మరింత అధమం.

5. తవ్విన మన్ను వాసన చూడగా తామరపద్మం వాసన వచ్చినచో శ్రేష్టం , గుర్రం మరియు ఏనుగు మదం వాసన వచ్చినచో మధ్యమం , పశువు మరియు ధాన్యం వాసన వచ్చినచో అది అధమం , ఇతర వాసనలు వచ్చినచో విడువవలెను .

6. నాలుగు దిక్కులు సమ చతురస్రం కలిగి గంధపు వర్ణం కలిగిన భూమి గృహనిర్మాణానికి అత్యంత అనుకూలం .

7. గృహనిర్మాణ స్థలం నందు ఒక మూర చతురస్రాకారంగా గొయ్యి తవ్వి దాని యందు రాత్రి సమయం లో నిండా నీరుపోసి పొద్దున్న లేచి చూడగా నీరు పూర్తిగా ఇంకిపోకుండా నిలిచి యున్నచో శుభప్రదం . ఇదే పద్ధతిని కొన్ని ప్రాచీన వాస్తుగ్రంధాలలో నీటిజాడని కనుక్కోవడానికి వాడేవారు. అదే గుంటలో నీరు ఇంకి బురదగా ఉన్నచో మధ్యస్తంగా నీరు పడును. నీరు పూర్తిగా ఇంకి భూమి నెర్రెలు కొట్టి ఉంటే ఎంత ప్రయత్నించినను నీరు పడదు.

8. దేవాలయములకు శంఖువు శిలతో చేయవలెను . గృహములకు శంఖువు కర్రతో చేయవలెను .

9. బ్రాహ్మణులకు పదహారు అంగుళములు , రాజులకు పదిహేను అంగుళములు , వైశ్యులకు పదునాలుగు అంగుళములు , శూద్రులకు పదమూడు అంగుళములు ఉన్న శంఖములను గృహగర్భము నందు వాడవలెను . ఆయా ప్రమాణాలలో సగం వర్తులాకారంలో ఉండవలెను . ఇది మగధదేశ నియమం .

10. శంఖువు ఎనిమిది అంగుళాల లావు వుండవలెను .

11. వృత్తాకారం గల స్థలం నందు గృహనిర్మాణం చేసి అందు నివసించేవారు దరిద్రులు అగును. విషమ కోణములు గల భూమి యందు నివసించేవారు దుఃఖితులు అగుదురు. ముక్కోణం గల స్థలం నందు ఇండ్లు కట్టి నివసించేవారు సివిల్ మరియు కేసులు సంప్రాప్తినుంచి ఇబ్బందులు పడును. చేట వంటి ఆకారం గల భూమి యందు గృహం నిర్మించి ఉండువారు ఎంతటి ధనవంతులు అయినను క్రమంగా రుణగ్రస్తులు అయ్యి దరిద్రులు అగును. కావున యోగ్యమైన భూమి యందే గృహనిర్మాణం చేయవలెను .

12. వాయువ్యమునకు గాని , ఆగ్నేయమునకు ముఖం కలిగి ఆ దిక్కుగా కట్టిన గృహము అగ్నిచే దహించబడును అని భృగుమహర్షి తెలియచేసెను . ఈశాన్య నైరుతి దిశలకు అభిముఖము కలిగి దిశతిరిగినట్టు కట్టిన గృహము నాశనం పొందును. కలహములచే ఎల్లప్పుడూ పీడించబడును.

13. గృహారంభం పగటిపూట మధ్యాహ్నానికి పూర్వమే చేయవలెను . మధ్యాహ్నం నందు మరణప్రదం . సంధ్యాసమయం , రాత్రికాలం నందు ఐశ్వర్యం కోరువారు చేయకూడదు .

14. రాత్రియందు శంఖుస్థాపన చేసినచో గృహహాని .

15. రాత్రిని నాలుగు భాగములు చేసి అందు నాలుగోవ బాగం యందు ఘడియలలో గృహారంభ ప్రతిష్ట చేయవచ్చు అని విశ్వకర్మ తన వాస్తుశాస్త్రం నందు తెలియచేశారు.

16. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు గృహారంభాలు చేయకూడదు . అలా చేసినచో గర్భహాని మరియు గృహహాని జరగవచ్చు.

17. గర్బము ధరించిన స్త్రీ యొక్క భర్త సింధు స్నానం , చెట్లు నరకుట , క్షౌరము , శవమును మోయుట , విదేశీయానం నిషిద్దం .

18. నూతన గృహములు నిర్మించుకొనువారు నిర్మాణానికి కొత్త కలపనే వాడవలెను . పాత గృహం కలప , కాలిన కలప వాడరాదు.

19. విష్ణు ఆలయములకు వెనక భాగం , ఈశ్వరాలయంకు ఎదుటను , శక్తి ఆలయములకు పక్క భాగములలో , వీధి శూలల యందు గృహం నిర్మించరాదు.

20. గృహము నందు మూడు ద్వారములు , మూడు మంచములు , మూడు దీపములు , 3 కిటికీలు ఉన్నచో ఆ గృహము దుఃఖప్రధమం అగును.

21. గృహము యొక్క గోడ దళసరి 12 భాగములు చేయగా లోపలి వైపు 7 భాగములు వెలుపలి వైపు 5 భాగములు ఉంచి మధ్య యందు ద్వారం ఉంచవలెను .

22. ద్వారము లేనిది కూపం అనియు , ఒక ద్వారం కలిగినదానిని దిగుడు బావి అనియు నాలుగువైపులా మెట్లు ఉన్నదానిని పుష్కరణి అని అంటారు. అదేవిదంగా పొడవుగా ఉన్నదానిని దీర్గికా అనియు , ఎల్లప్పుడూ నీరు ఉండేదాన్ని కుల్యం అని కూడా అంటారు.

23. లోగిలి యందు నీరు తూర్పుదిశకు వెళ్ళుట వృద్ధికరం . ఉత్తరదిశగా వెళ్లుట ధనప్రదం , పడమట దిశ యందుట ప్రవహించుట ధనక్షయం , దక్షిణదిశకు నీరుపోవుట మృత్యుపదం .

24. గృహనిర్మాణం చేయు భూమి దక్షిణ , పశ్చిమాలు ఎత్తుగా ఉండటం శుభపరిణాము . తూర్పు , ఉత్తరములు పల్లముగా వుండవలెను .

25. తిధి వృద్ది క్షయముల యందు , రోగగ్రస్తులగా ఉన్నప్పుడు , భయంతో కూడిన పరిస్థితులు ఉన్నప్పుడు , రాజాటంకం కలిగినప్పుడు , భార్య గర్భిణిగా ఉన్నప్పుడు, తనకు గ్రహస్థితి బాగాలేనప్పుడు , దుస్వప్నములు , దుశ్శకునాలు కనిపించినప్పుడు , ఇంట్లో మైల ఉన్నప్పుడు , అమావాస్య దగ్గర్లో , వర్జ్య ఘడియల్లో శంఖుస్థాపన నిషిద్దం .

26. గృహం అతిఎత్తైనది అయితే చోరభయం , అతికూరచ అవుటవల్ల దరిద్రం , అతి వెడల్పు వలన మరణం సంభంవించును.

27. ఆయష్షు కోరుకునే వారు తూర్పుముఖంగా , కీర్తికాముకులు దక్షిణముఖముగా , ఐశ్వర్యకాముకులు పడమటి ముఖంగా కూర్చుని భోజనం చేయవలెను . శార్ధకర్మలు యందు కాక మరే సమయంలోను ఉత్తరాభిముఖంగా భోజనం చేయరాదు . తల్లితండ్రులు జీవించి ఉన్నవాడు , తల్లి కాని తండ్రి కాని జీవించి ఉన్నవాడు కూడా దక్షిణ ముఖంగా తిరిగి భోజనం చేయరాదు . ఇదియే గృహము నందు భోజన నియమము .

28. స్వగృహము నందు తూర్పు తలగడ , అత్తవారింట దక్షిణ తలగడ , ఇతరచోట్ల పడమర తలగడ పెట్టుకుని పడుకోవలెను . ఉత్తర తలగడగా ఎప్పుడూ పడుకోగూడదు .

29. గడ్డియందు , దేవాలయం , పాషాణం , పల్లపు ప్రదేశం , మార్గము, ద్వారం, గృహమధ్య ప్రదేశం , ఒంటరిగా , స్మశానం , నాలుగు దార్లు కలిసేచోట , ఇంటి దూలం క్రింద , తన మరియు పర స్త్రీల సమీపం నందు పడుకోరాదు.

30. గృహమధ్యమం నందు వృక్షాలు ఉండరాదు.తులసి ఉండవచ్చు.FB_IMG_1533785304889

నవగ్రహాల అనుగ్రహానికి చేయవలసిన వ్రతములు

 

సూర్యగ్రహ అనుగ్రహముకు రథసప్తమి, సూర్య చంద్ర వ్రతము చేయాలి.

అమావాస్య సోమతి వ్రతం, కృష్ణాష్టమి వ్రతం, సోమవార వ్రతం,

కుజుని అనుగ్రహానికి నాగుల చవితి, నాగ పంచమి, అంగారక చవితి, కాత్యాయనీ వ్రతము, కుజగౌరీ వ్రతము బుధుడు అనుగ్రహానికి శ్రీ అనంత పద్మనాభ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము, తులసీ వ్రతము,

గురు అనుగ్రహానికి శ్రీ సత్యసాయి వ్రతము, శ్రీ సత్యదత్త వ్రతము, త్రినాథ వ్రతాలను చేయాల్సి ఉంటుంది.

శుక్రుడు అనుగ్రహానికి వరలక్ష్మీ వ్రతం, వైభవలక్ష్మీ వ్రతం, శ్రీలక్ష్మి కుబేర వ్రతం, సంతోషిమాత, అనఘాదేవి వ్రతాలను చేయాలి.

శని అనుగ్రహానికి హనుమద్వ్రతము, శివరాత్రి, శనైశ్చర వ్రతము

రాహు గ్రహానికి శ్రీదేవి నవరాత్రి, సావిత్రీ, షోడశగౌరీ వ్రతాము.

కేతువు అనుగ్రహానికి వినాయక చవతి, సంకష్టహర చతుర్థి, పుత్రగణపతి వ్రతాలు చేస్తే

మంచి ఫలింతములు కలుగుతాయి అని సిద్ధాంతాలు చెపుతున్నాయి.

చింతా గోపి శర్మ సిద్ధాంతి, Cell :- 9866193557

ఫిలింనగర్ దైవ సన్నిధానం ఉప ప్రధానార్చకులు చదివిన శివ గద్యం

 

FB_IMG_1533459737311

వివాహ సమయము

#వివాహ సమయము
(1)కళత్రకారకుడు,కళత్ర స్థానాధిపతియు బలవంతులైన వారి దశాంతర్దశలలో వివాహమగును.
(2)స్ఫుటలగ్నాధిపతి, సప్తమాధిపతుల రాశ్యాదిలో గోచారవశాత్తు గురుడు వచ్చినపుడు వివాహమగును.
(3)జన్మకాలిక చంద్రరాశ్యాధిపతి,అష్టమాధిపతుల రాశ్యాదులు కూడగా వచ్చిన రాశ్యాదికి గోచార గురుడు వచ్చినపుడు వివాహము కావచ్చును.
(4)లగ్నాధిపతియున్న నవాంశాపతి యున్న రాశికి ద్వితీయ స్థానమునకు గోచారచంద్రడు,గురుడు వచ్చినపుడు వివాహము కావచ్చును.
(5)సప్తమాధిపతి,లగ్నాధిపతి సమీపమున ఉన్నచో వివాహము బాల్యమున అగును.అట్లే లగ్నమునగాని,సప్తమమునకుగానిసమీపమున శుభగ్రహమున్నను బాల్యమున వివాహమగును.
(6)లగ్న,ద్వితీయ,సప్తమములందు శుభగ్రహములున్నను,శుభగ్రహదృష్టియున్నను బాల్యముననే వివాహమగును.(7)లగ్న,ద్వితీయ,సప్తమములందు శుక్రుడున్న,ఆలస్యముగా వివాహమగును.శుభగ్రహయుతికాని,దృష్టికాని ఉన్న బాల్య వివాహము జరుగును.
*యెాగనుసారముగా భార్య గుణములు*
(1)శుక్రుడు చరరాశియందుండి,గురుడు సప్తమమందుండి,లగ్నాధిపతి బలవంతుడైన జాతకుని భార్య పతివ్రతయగును.
(2)సప్తమాధిపతియైన గురునికి బుధ శుక్రుల దృష్టియున్నా,సప్తమస్థుడైన గురునికి పాపసంబంధము లేకన్నా భార్య పతివ్రత యగును.
(3)సప్తమమునకు గురుని పూర్ణదృష్టి యున్న జాతకుని భార్య దయావతి,సుందరి,పతివ్రత యగును.అట్లుగాక సప్తమమునకు పాపదృష్టియున్న కళత్రము గయ్యాళి,కష్టపెట్టెది అగును.
(4)లగ్నమున రాహువు లేక కేతువున్న కళత్రము పతివశ్య యగును.
(5)లగ్నాధిపతి సప్తమమున,సప్తమాధిపతి పంచమమున ఉన్న విధేయుడగును.
(6)సప్తమాధిపతి శుభగ్రహములతో కలిసియున్నా,స్వ,ఉచ్ఛ మిత్రగృహములందున్నా,జాతకుని భార్య మంచిది.శీలవతి యగును.సప్తమాధిపతికి గాని శుక్రునకుగాని గురుబుధల దృష్టియున్నా,గురుడు సప్తమమందున్నా,లేదా సప్తమాధిపతి కేంద్రగతుడైయున్నా అతని భార్య గుణవతి శీలవతి యగును.
(7)సప్తమాధిపతి కుజుడై స్వగృహ,మిత్ర,ఉచ్ఛ స్థానములందుండి,శుభగ్రహసంబంధము కల్గియున్న,కళత్రము నిషుర్ఠములాడునదైనా,ప్రేమకలిగి వశవర్తినిగా ఉండును,ఆ సప్తమాధిపతియైన కుజడు నీచ శత్రుగృహములందు ఉండినా,అస్తంగతుడైనా,భార్య కులట,దుశ్చరిత్ర యగును.
(8)సప్తమాధిపతి గురుడు స్వ,మిత్ర,ఉచ్ఛరాశులందుండి శుభగ్రహ సంబంధము కల్గియున్న,భార్య సంతానవతి,సదాచారశీల,ధార్మికబుద్ధి కలదగును.
(9)సప్తమాధిపతియైన శుక్రుడు పాపగ్రహ సంబంధము కలిగి,నీచ,శత్రు నవాంశగతుడైనచో భార్య కఠినచిత్త,కమలట యగును.
(10)బలవంతుడైన సప్తమాధిపతి,శుక్రుడు శుభహ సంబంధము కలిగి,శుభనవాంశగతుడైన,మిత్రరాశిస్థుడైనా,అతని భార్య పుత్రవతి సచ్చరిత్ర యగును.
(11)సప్తమాధిపతియగు శని బలవంతడై శుభగ్రహ సంబంధము కలిగి యున్న,జాతకుని భార్య వినయవతి ఉత్తమ స్వభావురాలు అగును.ఆ శని పాపదృష్టి,యుతి,కలిగి,నీచరాశి నీచ నవాంశలందున్నా కళత్రము క్రూరురాలు,కులట యగును.
(12)సప్తమాధి త్రిక(6,8,12)ములందుండి,శుక్రడు దుర్భలుడైనా,సప్తమాధిపతి శుక్రుడును నీచస్థులై శుభదృష్టి లేకున్న కళత్రము మంచిది కాక పోగా నిర్భయముగా మాట్లాడునది యగును.
(13)సప్తమదశమాధిపతులు,శుక్రుడు బలవంతులై శుభనవాంశలందున్నా సప్తమాధిపతి గురునితో కలిసియున్నా,చూడబడినా,సప్తమాధిపతికి శుక్రరవులు దృష్టియున్నా,గురడు సప్తమమందున్నాజాతకుని భార్యపతివ్రతయై మంచి లక్షణములు కలిగియుండును.FB_IMG_1533099832495

చంద్ర గ్రహణం

 

విలంబనామ సంవత్సర ఆషాడ శుద్ధ చతుర్ధశి శుక్రవారం 27-07-2018 న ఉత్తరాషాడ నక్షత్రం చతుర్ధ పాదం శ్రవణా నక్షత్రం ప్రధమ పాదం నందు కేతుగ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణం సంభవిస్తుంది.

“గ్రహణే సంక్రమణేవాసి, నస్నాయాద్యది మానవః
సప్తజన్మని కుష్ఠిస్యాత్‌, దుఃఖభాగేచ జాయతే||

గ్రహణకాలమునగాని, సంక్రమణ కాలాదులలోగాని, స్నానము చేయనివారు, ఏడుజన్మల పర్యంతము కుష్ఠురోగాది బాధలతో, దుఃఖితులైయుందురు.

“రాత్రో స్నానం నకుర్వీత” అను నిషేధం ప్రకారం ప్రతిదినము రాత్రికాలమున స్నానము చేయరాదు.

నైమిత్తికంతు కుర్వీత స్నానం దానంచ, రాత్రిషు

అను ధర్మము ప్రకారము ఏదేని గ్రహణాదికారణములు నిమిత్తముగ చేసికొని రాత్రి కాలమున స్నానాదులు చెయవచ్చును.

జన్మక్షే నిధనం గ్రహేజ నిభతో ఘాతః క్షతిః శ్రీర్వ్యధా
చింత సౌఖ్య కళత్ర దౌస్ధ్య మృతయః స్సుర్శాననాసః సుఖం
లాభోపాయ ఇతి క్రమాత్త ద శుభ ధస్త్యే జపహపః స్వర్ణగో
దానం శాంతి రధో గ్రహం త్వశుభదం నో వీక్షమహుః పరే

జన్మ నక్షత్రమందు గ్రహణం వచ్చిన నాశనం, జన్మ రాశి యందు గ్రహణం వచ్చిన మానసిక సమస్యలు, ద్వితీయ మందు హాని, తృతీయ మందు సంపద, చతుర్ధమందు రోగం, పంచమం నందు చికాకులు, షష్టమందు సౌఖ్యం, సప్తమం నందు భార్యకు కష్టాలు, అష్టమం నందు మరణతుల్య కష్టాలు, నవమం నందు గౌరవ భంగం, దశమం నందు సుఖం, ఏకాదశం నందు లాభం, ద్వాదశం నందు అపాయం. అశుభ దోష పరిహారానికి జపం, స్వర్ణ దానం, గోదానం, శాంతి చేయాలి. అశుభ ఫలప్రదమైన గ్రహణాన్ని చూడరాదు.

రాజ్యాభిషేక (ప్రమాణ స్వీకారం) నక్షత్రంలో గ్రహణం పడితే రాజ్య భంగం, బంధు క్షయం, మరణతుల్య కష్టాలు. ఉద్యోగస్తులు, వ్యాపారస్ధులు ఉద్యోగంలో, వ్యాపారంలో ప్రవేశించిన నక్షత్రాన్ని గుర్తు పెట్టుకొని ఉద్యోగ, వ్యాపార కాలంలో ఆ నక్షత్రంలో గ్రహణం పడితే శాంతి చేసుకోవటం మంచిది.

గ్రహణ సమయమున దేవత అర్చనలు, దైవ ధ్యానము, జపతపాదులు చేయడం క్షేమము. గ్రహణ సమయంలో రాహుకేతువులతో సూర్యచంద్రుల కాంతులు మిళితమయ్యి, అనేక విషకిరణాలు ఉద్భవిస్తాయి. అవి చాలావరకూ మానవ నిర్మాణానికి ఇబ్బందులను కలిగిస్తాయి. ఎంతో సున్నితంగా ఉండే స్త్రీ గర్భంలోని శిశువుకు హాని కలగకూడదని గ్రహణం చూడొద్దంటారు.గ్రహణ సమయంలో మానవ ప్రయత్నముగా గర్భవతులు దైవధ్యానమే శ్రేయస్కరము.

చంద్రగ్రహణం పౌర్ణమి నాడు మాత్రమే సంభవిస్తుంది.అన్ని పౌర్ణమి లకు చంద్రగ్రహణం ఏర్పడదు. .చంద్రగ్రహణం పౌర్ణమి నాడు ఏర్పడటానికి,కొన్ని పౌర్ణమిలకు ఏర్పడకపోవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి.చంద్రుడు పౌర్ణమి నాడు సూర్యునికి ఎదురుగా ఉంటాడు.అంటే భూమికి ఇరువైపుల సూర్య చంద్రులు ఉంటారు.సూర్య చంద్రుల మద్యలో భూమి ఉంటుంది.అన్ని పౌర్ణమిలకు సూర్యుడు ,భూమి,చంద్రుడు ఒకే సరళ రేఖపై ఉండరు .అందువల్ల అన్ని పౌర్ణమిలకు చంద్రగ్రహణం ఏర్పడదు.

సూర్యుడు చంద్రుడు,భూమి ఒకే సరళరేఖపై ఉండి చంద్రుడు రాహువు దగ్గర గాని కేతువు దగ్గర గాని ఉండటం వల్ల భూమి యొక్క నీడ చంద్రునిపై పడుతుంది.చంద్రుడు పూర్తిగా కనపడకపోవటాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు.పాక్షికంగా కనపడటాన్ని పాక్షిక చంద్రగ్రహణం అంటారు.చంద్రబింబం పూర్తిగా కనిపించకుండా పోయి మరల పూర్తిగా కనిపించే వరకు గల కాలాన్ని గ్రహణం అంటారు.సూర్య చంద్ర గ్రహణాలకు రాహు కేతువులు కారణం కావటం వల్ల మన పూర్వీకులు సూర్య చంద్రులను రాహు కేతువులు మింగటం వల్ల గ్రహణాలు ఏర్పడుతున్నాయని చమత్కరించారు.

గ్రహణములు అనగానే కీడు జరుగుతుంది, ఫలానా నక్షత్రములలో జనించిన వారు ఈవిధముగా పరిహారం చేయాలి, ఆలయాలు మూసేయాలి, లోకంలో ప్రకృతి విపత్తులు సంభవిస్తాయి. ఈ గ్రహణ ప్రభావము 2,3 నెలల వరకు ఉంటుందని. ఈ గ్రహణ సమయంలో ఇంట్లో దీపారాధన చేయరాదని, కొందరు చేయ వచ్చని. ఫలానా నక్షత్రముల వారికిశాంతి చేయించాలని. ఈ గ్రహణ సమయంలో కొన్ని పనులు శుభమును ఇస్తాయని, కొన్నిఅశుభమును ఇస్తాయని. గ్రహణ సమయంలో పుట్టిన వారికి గ్రహణ మొర్రి వస్తుందని, గ్రహణ సమయంలో గర్భిని స్త్రీలు బయటకు వెళ్లరాదని, పౌర్ణమి-అమావాస్య నిజముగా అందరికి కీడు చేస్తాయా. ఇలాచాలా అపోహలు, అనుమానాలు ఉన్నాయి.

గ్రహణం సంభవించినపడు విడుదల అయ్యే కిరణాలు ప్రభావంతో అనారోగ్య సమస్యలు వస్తాయని, మన పెద్దలు కొన్ని నియమాలు పెట్టారు. ఆ కిరణాలు ఎక్కడికైనా చొచ్చుకు పోతాయి కాబట్టి గ్రహణ సమయంలో వండటం, తినడం లాంటివి చేయకూడదు అంటారు.

*శ్రీకొండ ఉమాకాంత శర్మ సిధ్ధాంతి.*
చరవాణి:9440232574.lunar-eclipse

గ్రహణము—హేతువాదుల తర్కం*

 

గ్రహణం ఎప్పుడు వస్తుంది అనేది మనకి ఆధునిక శాస్త్రజ్ఞులూ తెలియచేస్తున్నారు అలానే మన పంచాంగ కర్తలూ తెలియ చేస్తున్నారు. అయితే, గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమ నిభందనల గురించి మాత్రం కేవలం భారతీయ శాస్త్రం మాత్రమే చెప్తుంది. పాశ్చాత్య శాస్త్రం ఆ విషయం గురించి ఏమీ చెప్పదు

రాహువు, కేతువు అనే గ్రహాలు సర్ప రూపంలో సూర్య, చంద్రులని మింగేయ్యడం వలన గ్రహణాలు ఏర్పడతాయి, అని మన పురాణాలలో ఉన్న కథ చాలా మందికి తెలుసు. మన పురాణాలలో ఉన్న అసంబద్ధమైన విషయాలకి దీనినో ఉదాహరణగా చూపుతారు హేతువాదులు. రాహు, కేతువుల కథ అసంబద్దం అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. పాములు వచ్చి, సూర్య చంద్రులని మింగడం వలన గ్రహణం వస్తుంది అని నమ్మడం కన్నా మూర్కత్వం ఇంకోటి లేదు. ఈ విషయం అర్దం కావడానికి పెద్దగా మేధస్సు కూడా అవసరం లేదు.

అయితే ఈ విషయాన్ని మరింత లోతుగా పరిశీలిస్తే కొన్ని ఆసక్తి కరమైన విషయాలు బయట పడతాయి. అసలు ముందు గ్రహణాలు ఎలా ఏర్పడతాయో చూద్దాం

సూర్య గ్రహణం: సూర్యుడికి, భూమికీ మధ్య చంద్రుడు వస్తే, అప్పుడు చంద్రుడి నీడ భూమి మీద పడుతుంది. ఆ నీడ లో ఉన్నవారికి సూర్యగ్రహణం.

చంద్ర గ్రహణం: సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి వస్తే, భూమి నీడ చంద్రుడి మీద పడుతుంది. సూర్యుడి కాంతి వల్లనే చంద్రుడికి ప్రకాశం కనుక, ఆ సమయం లో చంద్రుడు కనపడదు, చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.

రెంటిలోనూ నీడ పడటం ప్రధానం. రాహు, కేతువులని ఛాయ గ్రహాలూ అంటారు. ఛాయ అంటే నీడ, అంటే గ్రహణ సమయం లో భూమి మీద, చంద్రుడి మీద పడే నీడలనే మన వాళ్ళు రాహువు, కేతువు అన్నారు, అన్నది స్పష్టం అవుతుంది. ఇది మొదటి విషయం. ఇక రెండో విషయం, మన వాళ్ళు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేకుండానే గ్రహణ సమయాలని వేల సంవత్సరాలుగా చెప్తున్నారు. ఎన్నో పురాణాలలో, రామాయణ, భారత, భాగవతాలలో గ్రహణాల గురించి ఆ సమయాలలో గ్రహ స్థితుల గురించి కనబడుతుంది. ఖగోళ శాస్త్రం మీద ఇంత లోతైన అవగాహన ఉన్నవారు, పాములు సూర్య చంద్రులని మిగేయ్యడం వలన గ్రహణం వస్తుంది అని ఎలా నమ్మరు, అనే అనుమానం సహజం

వివిధ శాస్త్రాలని, కథల సహాయంతో చెప్పడం అనే ప్రక్రియ మన పురాణాలలో చాలా ఎక్కువగా కనబడుతుంది. భారతీయ విద్యా విధానం మీద అవగాహనా ఉన్న వారికి ఈ విషయం బాగా తెలుసు. దీనినే సంకేత వాదం అంటారు. మన పురాణాల నిండా ఇవే కనబడతాయి. పులి కుక్కతో మాట్లాడినట్లు, నక్క బాతుతో మాట్లాడినట్లు ఉన్న కథలు ఇటువంటివే. మన హేతువాదులు అనుకునేటట్లు మన పూర్వీకులు ఎంత వీర్రి వాళ్లైనా మరీ కుక్క, నక్క మాట్లతాయి అనుకోరు కద. ఒక విషయాన్ని సులభంగా అర్ధమయ్యేలా చెప్పే ప్రక్రియే ఈ సంకేత వాదం. ఈ రాహు కేతువుల కథ కూడా ఇటువంటిదే.

గ్రహణ సమయంలో నియమాలు

గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాల గురించి హిందువులలో చాలా మందికి తెలుసు. గర్భిణీ స్త్రీలచే ఈ నియమాలని మన పెద్ద వాళ్ళు తప్పక పాటిమ్పచేస్తారు. గ్రహణం ఉన్న రోజున కొన్ని చానళ్లలో పండితులు గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాల గురించి చెప్తుంటే, మరి కొన్నిటిలో హేతువాదులు ఇవాన్నీ మూఢ నమ్మకాలని వాటిని పాటించనక్కర లేదని చెప్తారు.
గ్రహణ సమయం లో మన శాస్త్రాలలో చెప్పే నియమాలు పాటించకపోతే కలిగే నష్టాల గురించిన ఏ ఆధారమూ లేదు. అయితే, అదెంత నిజమో, నష్టాలు ఉండవు అని నిరూపించడానికి కూడా ఏ ఆధారాలూ లేవు, అనేది కూడా అంతే నిజం

గ్రహణ సమయలో ప్రకృతిలో ఒక పెద్ద మార్పు జరుగుతోంది, ఆ మార్పు వలన భూమి మీద కొన్ని మార్పులు స్పష్టంగా కనబడుతున్నాయి. సముద్రపు అలలు ఎగసి పడటం ఇందులో ఒకటి. అటువంటప్పుడు గ్రహణ ప్రభావం మనిషి మీద మాత్రం ఎందుకు ఉండకూడదు? ఉంటుది అని నేను అనడం లేదు, కానీ ఉండటానికి అవకాసం ఉంది అని అంటున్నా. ఈ విషయంమై ఎటువంటి పరిశోధనా జరిగినట్లు నాకు తెలియదు. మరి అలాంటప్పుడు జన విజ్ఞాన వేదిక వంటి హేతువాద సంఘాలు వీటిని మూఢనమ్మకాలు అని ఎలా నిర్ధారించాయి?

ఈ ప్రశ్నకి వారు చెప్పే సమాధానాలు ఇవి

గ్రహణ సమయంలో నియమాలు పాటించక పోతే నష్టాలు కలుగుతాయి అని ఏమిటి రుజువు?
మేము ప్రతీ సారీ గ్రహణ సమయాలలో బయట భోజనం చేస్తాం. గర్భిణీ స్త్రీలు కూడా ఎందరో అలా చేస్తారు వారికేమీ కాలేదు.
నిజమే, నష్టాలు జరుగుతాయి అని సాక్షాలు లేవు, అయితే నష్టాలు లేవు అని కూడా సాక్షాలు లేవు కద? ఇటువంటి స్థితిలో రెండు వాదాలకీ సామాన ప్రాధాన్యతనివ్వడం విజ్ఞులు చెయ్యాల్సిన పని. హేతువాదులు, ఏవిధమైన హేతువూ లేకుండానే వీటిని మూఢ నమ్మకాలు, అని కొట్టి పారెయ్యడం కేవలం వారి పక్షపాత బుద్దికీ లేదా అజ్ఞానానికీ సాక్ష్యం.

మరి గ్రహణ సమయాలలో బోజనాలు చేసిన వారికి ఏమీ కాలేదు కదా, దాని సంగతి ఏంటి, అని అడగవచ్చు. సాధారణంగా హేతువాద సంఘాల వారు, గర్భిణీ స్త్రీల తో సహా గ్రహణ సమయంలో భోజనాలు చేసి, చూసారా మాకేమీ అవ్వలేదు, కాబట్టి ఇవన్ని మూఢ నమ్మకాలు అంటుంటారు. నేను కూడా ఒక వంద మందితో రాత్రంతా మధ్యం తాగించి తరువాత రోజు నిద్ర లేపి, ఇంటికి పంపి, చూసారా ఎంత తాగినా ఏమీ అవ్వలేదు కాబట్టి తాగడం వలన నష్టం లేదు, అది మూఢ నమ్మకం అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? వెర్రి వాడు అంటారు. హేతువాదుల వాదన కూడా ఇలాంటిదే. ఇంకో ముఖ్యమైన విషయం, అసలు ఇటువంటి ప్రయోగాలు గర్భిణీ స్త్రీల మీద చెయ్యకూడదు. ఇవే కాదు, అసలు ఎటువంటి ప్రయోగాలూ వారి మీద చెయ్యకూడాదు. అది చట్ట వ్యతిరేకం. మరి ఈ సంఘాల వారు, ఎవరి అనుమతి తీసుకొని గర్భిణీ స్త్రీల మీద ఇటువంటి ప్రయోగాలు చేస్తున్నారో వారే చెప్పాలి.

గ్రహణ సమయంలో తినడం వలన ఎం నష్టాలు కలుగుతాయి అని శాస్త్రాలలో చెప్పారో తెలుసుకొని, తరువాత శాస్త్రీయ అధ్యయనం ద్వారా, అవి కలగలేదు అని గణాంక సహితంగా నిరూపిస్తే, అది కూడా ఒక ప్రముఖ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగితే లేదా ఏదైనా ప్రముఖ మెడికల్ జర్నల్ లో ప్రచురితం అయితే, అప్పుడు దానికి ఏదైనా విలువ, విశ్వసనీయత ఉంటుంది. అంతే కానీ వారికి వారే చేసేసుకొని, ఫలితాల్ని ప్రకటించేస్తే, వారికి అనుకూలమైన టీవీ చానాళ్ళ వాళ్ళు చూపిస్తే చూపించవచ్చు కానీ, ఇటువంటి వాటికి శాస్త్రీయ ప్రపంచంలో విలువ ఏమీ ఉండదు. ఇది పూర్తిగా అశాస్త్రీయం, అహేతుకం

అయితే మరి హేతువాదులం అని చెప్పుకునే వారు, ఇంత ఆహేతుకంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? మరి కారణం ఏమిటి? దీనికి మూలాలు మన విద్య విధానంలో ఉన్నాయి.

విద్యా విదానం

శాస్త్రీయ ప్రగతి సమాంతరము, ప్రగతి శీలము అనేది చాలా మంది నమ్మకము. అంటే మొన్నటి కన్నా, నిన్న; నిన్నటి కన్నా ఈ రోజు శాస్త్ర పరంగా ప్రపంచం ముందు ఉంటుంది అనేది ఈ నామ్మకం సారంశం. ఇది నిరంతర ప్రక్రియ అనేది కూడా ఈ నమ్మకంలో భాగమే. ఈ సిద్ధాంతం ప్రకారం, ఇప్పటి కాలం వారి కంటే గత కాలం వారికి శాస్త్రీయ అవగాహన ఎక్కువగా ఉండే అవకాసం లేదు. మన విద్యా విధానం వలన, తమకు తెలిసో తెలియకో ఈ సిద్ధాంతం వలన ప్రభావితం అయిన వారు, మన పూర్వీకులు కొన్ని రంగాలలో ఇప్పటి కాలం కన్నా ముందుండే వారు అంటే, కనీసం ఇందులో నిజం ఎంత, అని పరిశీలించడానికి కూడా సిద్ధ పడరు. ఒక విధంగా దీనిని వారి అజ్ఞానంగా లేదా వారిలో వారికే తెలియకుండా ఉన్న ఒక్క చీకటి కోణంగా మనం పరిగణించవచ్చు. ఒక పరిమిత కాలాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటే ఈ సిద్ధాంతం నిజమే. దీర్ఘకాలం లో మాత్రం కాదు.

భారతీయ శాస్త్రాలు కాలాన్ని చూసే విధానం దీనికి పూర్తిగా విరుద్ధం. మనం కాలాన్ని సలళము అనము, చక్రీయము అంటాము. అందుకనే మన దగ్గర కాల చక్రం అనే మాట ఉంది. అందుకే మన పూర్వీకులు, కనీసం కొన్ని రంగాలలో అయినా ప్రస్తుత కాలం కంటే ముందుండే వారు అంటే మనకి మూర్కత్వం అనిపించదు. ఇప్పటికి ఎన్నో నాగరికతలు కాల గర్భం లో కలిసిపోయాయి. వాటితో పాటే వారు సాధించిన శాస్త్రీయ ప్రగతి కూడా. ఒక నాగరికతని మాత్రమే పరిగణలోకి తీసుకొని చూసినప్పుడు శాస్త్ర ప్రగతి, ప్రగతిశీలంగానే కనిపిస్తుంది, దానిని ఎవరూ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. అయితే నాగరికతలకి అతీతంగా శాస్త్ర ప్రగతిని చూసినప్పుడు అది సరళము అనుకోవడం, తార్కికం అనిపించుకోదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన నాగరికతల శాస్త్రీయ పరిజ్ఞానం ఏమిటి అనేది మనకి పూర్తిగా తెలియడానికి అవకాసం లేదు. అందువలన వారు ప్రస్తుత నాగరికత కంటే అన్ని రంగాలలోనూ వెనకబడే ఉన్నారు అనుకోవడం తార్కికం కాదు.

శాస్త్ర ప్రగతి సరళము అనే వాదానికి ప్రతికూల ఉదాహరణలు మనకి ఎన్నో కనిపిస్తాయి, అందులో యోగా ఒకటి. 40-50 సంవత్సరాల క్రితం వరకూ కూడా యోగ విద్యని ఒక మూడ నమ్మకంగా పరిగణించేవారు. ఆయుర్వేదం మరో ఉదాహరణ. థైరాయిడ్, నడుము నొప్పి లాంటి పాశ్చాత్య వైద్య విధానం నయం చెయ్యాలని ఎన్నో వ్యాధులని ఆయుర్వేదం ఏంతో సులభంగా, చాలా తక్కువ ఖర్చుతో నయం చెయ్యగలదు. అలా బాగుపడ్డ వారు ఎందరో నాకు స్వయంగా తెలుసు. యోగ విద్య, ఆయుర్వేదం వంటివి, శాస్త్ర ప్రగతి చక్రీయం అని నిరూపించే సాక్షాలు. కనీసం కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి శాస్త్రాలు నేటి ఆధునిక శాస్త్రాల కంటే మెరుగైనవి అంటే, శాస్త్ర ప్రగతి సరళం కానట్లే కద. ఇవి మనకి తెలిసిన శాస్త్రాలు. ఇదే విధంగా మనకి అసలు తెలియని, కేవలం పేర్లు మాత్రం తెలిసిన ఎన్నో ఇతర శాస్త్రాలు ఉండటానికి అవకాసం ఉంది. అయితే కేవలం మన పురాణాలలోనో ఇంకో దగ్గరో ఈ శాస్త్రాల ప్రస్తావన ఉంది కాబట్టి వాటిని నమ్మాలి అని నేను అనడం లేదు. ఏ విధమైన పరిశోధనా చెయ్యకుండా, వాటిని మూఢ నమ్మకాలు అని కొట్టి పారేయ్యడాన్నే నేను వ్యతిరేకిస్తున్నాను.

అందువలన గ్రహణ కాలంలో నియమాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, కేవలం అవి ఇంతక ముందు కాలానికి చెందినవి అనో, పాశ్చాత్యులు ఇంకా గుర్తించలేదు అనో మూఢ నమ్మకాలు అనుకోవడం, మన మూఢత్వమే అవుతుంది కానీ హేతుబద్దమైన ఆలోచన అనిపించుకోదు.

దీనికి మరో కారణం ఆత్మాన్యూనత. ఇటువంటి వారికి తెలిసో, తెలియకుండానో పాశ్చాత్యుల కంటే మనం తక్కువ అనే భావన ఉంటుంది. ఐరోపా దేశాల వలస పాలనలో ఉన్న అన్ని దేశాలలోనూ ఈ పరిస్థితి ఉంటుంది. దీనికి భారతదేశం మినహాయింపు కాదు. అయితే మనకి గొప్ప చరిత్ర, సంస్కృతి, హిందూ ధర్మం ఉండటం వలన ఈ జాడ్యం నుండి, బహుసా త్వరగానే బయటపడతాం.

కాబట్టి భారతీయ గ్రహణ శాస్త్రం నిజామా కాదా అనేది ఖచ్చితంగా ఎవరమూ చెప్పలేము. అయితే నిజం అవ్వడానికే సంభావ్యత ఎక్కువగా ఉంది. నా కారణాలు

గ్రహణ సమయంలో ప్రకృతిలో ఒక పెద్ద మార్పు జరుగుతోంది, దాని ప్రభావం వలన సముద్రపు అలలు ఎగసి పడటం మనం చూస్తున్నాం. కాబట్టి గ్రహణ ప్రభావం మనుషుల మీదా కూడా ఉండే అవకాసం ఉంది
యోగ శాస్త్రం, ఆయుర్వేదం వంటి ఎన్నో గొప్ప శాస్త్రాలని ఇచ్చిన, గ్రహణ సమయాన్ని ఈరోజుకీ చిన్న కాగిత కలం సహాయం తో లెక్కించడానికి వీలైన పరిజ్ఞానాన్ని ఇచ్చిన సంస్కృతే ఈ గ్రహణ నియమాలని కూడా చెప్తోంది.

వందల వేల సంవత్సరాలుగా ఈ నియమాలు మన సంస్కృతిలో భాగం అయిపోయాయి. కాబట్టి ఒక బలమైన, శాస్త్రీయమైన కారణం లేకుండా వాటిని తప్పు అని తెల్చేయ్యడం మూర్ఖత్వమే అవుతుంది
ఈ నియమాలు పాటించడం వలన, లాభం సంగతి పక్కనబెడితే నష్టమైతే లేదు.
ఈ కారణాల వలన, ఈ నియమాలు తప్పు అని పూర్తి ఆధారాలతో నిరూపితం అయ్యే దాకా మనం నియమాలని పాటించడమే ఉత్తమం. నియమాలని పాటించడం, పాటించకపోవడం వ్యక్తిగత. అయితే, తమ మిడి మిడి జ్ఞానం తో ఇవన్ని తప్పు అని ప్రచారం చెయ్యడం మాత్రం తప్పు. ఈ పని ఎక్కువగా చేసే జన విజ్ఞాన వేదిక వారు కొంచెం పునరాలోచించు కోవాలి.

*శ్రీకొండ ఉమాకాంత శర్మ సిధ్ధాంతి.*
చరవాణి:9440232574.

స్త్రీలు చేయకూడని పనులు

 

గ్రహణ సమయమందు భూమ్యాకర్షణ శక్తి మార్పు చెందుతుంది. దాని పరిమాణము మనపై చాల ఉంటుంది ముఖ్యముగా మన కడుపులో ఆహార పదార్థములు జీర్ణమవ్వడానికి కావలసిన ఆమ్లములు ఉండవు అందువల్ల జీర్ణము కాదు ఈ కారణముగానే గ్రహణ సమయమునకు ముందుగ మూడు గంటలకు పూర్వమే మన కడుపులో ఏమి ఉండకూడదు అంటారు.

మీ భర్త పిల్లలు మంగళ వారము నాడు క్షవరము గడ్డము గీసుకోవడము చేయనీయ వద్దు. ఈ ప్రక్రియ దరిద్రాన్ని సంభవింప చేయును.

మంచి పనులను శుక్ల పక్షము నందే అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయ వలెను.

మీరు మీ పిల్లలు దిండు పైన కూర్చో వద్దు ఐతే ఈ కాలములో అందరూ దీనిని తప్పక చేస్తుంటారు.

స్త్రీలు రాత్రి సమయమున గాజులు కమ్మలు తీయరాదు. దుఃఖము విచారణ చేయ వచ్చిన వారిని ఆహ్వానించ కూడదు. అలాగే వారు పోయేటప్పుడు వెళ్ళి వస్తానని చెప్ప కూడదు.
ఈ మధ్య కాలంలో దుఃఖము విచారించ వచ్చిన వారిని రండి రండి అంటూ సాదరముగా ఆహ్వానించి స్థలము ఇచ్చి కూర్చోపెట్టి కాపీలు ఇచ్చి చాల అతిథి మర్యాదలు చేస్తారు .అపరోక్షముగా మనము అశుభములను కోరుకోవడానికి ఇది నాంది అవుతుంది.

కొత్త వస్త్రములను ధరించే ముందు దానికి కొంత పసుపు ఏదైనా ఒక మూల రాయాలి, పసుపు క్రిమి నాసిని.

ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోడదు అయితే ఈ మధ్య కాలములో ఈ పని చాల చోట్లలో సహజమై పోయింది.

నలుపు రంగు వస్తువులు బట్టలు ధరించ కండి ఈ మధ్య కాలంలో సువాసిని స్త్రీలుకుడా నలుపు రంగు వస్తువులు ధరించడం ఎక్కువై పోయింది.

ఉప్పు మిరప చింతపండు వీటిని ఎవరికి ఇచ్చిన చేతిలో ఇవ్వకూడదు ,కింద పెట్టండి వాళ్ళే తీసుకొంటారు .ఈ మద్య కాలంలో ఉప్పు చేతితో వడ్డించడం చాల చోట్లలో గమనిస్తాము.

ప్రతి రోజు భోజనమునకు ముందు కాకికి అన్నము పెట్టండి, ఇది పితృ దేవతలకు ప్రీతి .కాకికి మనము భోజనము చేయుటకు ముందు కుక్కకు మనము తిన్న తర్వాత పెట్టాలి.

అయితే కుక్కలను ఎల్లప్ప్పుడు కన్న సంతానానికంటే ఎక్కువగా లాలిస్తూ దాని నోటికి ఆకులోంచి అందిస్తూ భోజనము చేయడము ఎక్కువై పోయింది.

టెంకాయ చిప్ప తామ్బులము ఇచ్చేటప్పుడు మూడు కండ్లు వుండే భాగము మీరు ఉంచుకొని మిగత భాగము ఇతరులకు ఇవ్వవలెను.

స్త్రీలు ఎప్పుడు జుట్టు విరపోసుకొని ఉండకూడదు .ఇది జ్యేష్టాదేవి స్వరూపము ఇంటిలో మంగళము జరుగుటకు విఘ్న కారణమవుతుంది. ఈ చర్య ప్రతి గృహములో ఇప్పుడు ఒక తప్పని సరి అయిపొయింది.

శుక్రవారమునాడు గాని ,జీతము రాగానే గాని ఆ డబ్బుతో మొట్ట మొదటి సారి ఉప్పు కొనండి ఈ చర్య పై పై డబ్బులు చేరటానికి అవకాశము ఎక్కువ.

కాలిపైకాలు వేసుకొని కుర్చోవడము, కాళ్లాడిస్తూ కూచోవడం, ఒంటి కాలితో నిలవడం, స్తిరముగా నిలవక ఉగుతుండడం లాంటి పనులు చేయకూడదు ఇందువల్ల ఒకటి దారిద్ర హేతువు మరియొకటి ఆ ప్రదేశములు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశములు ఎక్కువ.

ఎల్లప్పుడు ఇచ్చి పుచ్చుకోవడానికి కుడి చేతిని అలవాటు చేయాలి ,ఎడమ చేతిని ఉపయోగించ కూడదు.

సుమంగళి స్త్రీలు రాత్రి వేళలందు అలిగి ,ఆహారము తినకుండా నిద్రించ కూడదు.

స్త్రీలు బహిష్టు సమయమందు పూలు తలలో పెట్టుకోరాదు. పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పు రాదు ,రేపు తీసుకుంటాను అని అనవలెను.

ఎప్పుడు మన నోటినుండి పీడ ,దరిద్రం, శని పీనుగా కష్టము, అనే పదములను ఎప్పుడు ఉపయోగించ కూడదు.

ఇంటిలో దుమ్ము ధూళి, సాలెగూడు కట్టడం లాంటివి దారిద్ర హేతువులు, పదిరోజులకు ఒకమారు మంగళ శుక్ర వారములు కాకుండా దులిపి శుభ్రము చేయవలెను.

శ్రాద్ధ దినమందు ఇంటి ముందు ముగ్గు శ్రాద్ధము అయ్యేవరకు వేయకూడదు, శ్రాద్ధానంతరము ముగ్గు వేసి తర్వాత ఇంటిలోని వారు భోజనము చేయవలెను.

దిండులు, ఓర దుప్పట్లు అప్పుడప్పుడు ఉతుకుతూ వాడాలి .మనకు తెలియని సుక్ష్మ క్రిములు చాల ఉంటాయి దాని వాల్ల మనకు హాని జరుగును.

చింత గోపి శర్మ సిద్ధాంతి

2018-07-25-09-25-18-303

FB_IMG_1532495002290

ముహూర్త భాగము లో చక్రశుధ్దులు

 

(1)వివాహ చక్రశుద్ధి:- వివాహ ముహూర్త సమయమునకు సూర్యస్థిత నక్షత్రము నుండి అనగా సూర్యుని నుండి ముహూర్త నక్షత్రం వరకు లెక్కించంగా మెుదటి మూడు నక్షత్రములు(123) అయినచో వివాహమైన 8 సంవత్సరముల లోగా వధూవరులకు అరిష్టము కలుగును. 2వ మూడు అనగా 4,5,6 నక్షత్రములు శుభ ప్రధము,తరువాత మూడు నక్షత్రములు 7,8,9 సంతాన లోపము, తరువాత మూడు నక్షత్రములు 10,11,12 వైధవ్యము,తరువాత మూడు నక్షత్రములు 13,14,15 కళత్రమూలక గౌరవ,సుఖ,శాంతులు,ఆపై మూడు నక్షత్రములు 16,17,18 మరణప్రదము, తదుపరి మూడు నక్షత్రములు 19,20,21 వ్యభిచారదోషము,ఆపై మూడు నక్షత్రములు 22,23,24 ధనధాన్యవృద్ధి,సర్వ సంపత్తులు కలుగ గలవు.
(2)మాంగళ్య చక్రశుద్ధి:-వివాహ ముహూర్త సమయమునకు శుక్ర స్థితి నక్షత్రము నుండి వివాహ ముహూర్త నక్షత్రము వరకు లెక్కించగా 1,2,3 నక్షత్రములు అనారోగ్యం, అటుపై 4,5,6 తారలు లక్ష్మీ ప్రదము, తరువాత 7,8,9 తారలు దుర్భలము, 10,11,12 తారలు దారిద్ర్యము విష బాధ, 13,14,15 తారలు సర్వ సౌభాగ్యాములు, 16,17,18 తారలు సుఃఖభంగము వైధవ్యము దారిద్ర్యము,19,20,21 తారలు జారత్వదోషము,అటుపై 22,23,24 తారలు కుటుంబ వృద్ధి కలుగును.
(3)ఉపనయన చక్రశుద్ధి:-వటుని జన్మ నక్షత్రము నుండి ముహూర్త నక్షత్రము వరకు లెక్కించగా మెుదటి 5 నక్షత్రములు సుఖము, అటుపై 6,7,8 తారలు ఆచార హీనము, 9వ నక్షత్రము మూర్ఖత్వము, 10 నుండి 17 నక్షత్రములు అనారోగ్యము,18,19 తారలు బ్రహ్మ తేజస్సు, 20 నుండి 27 నక్షత్రములు విద్వాంసునిగా చేయును.ఇక రెండవ పద్ధతి:- వటుని జన్మ నక్షత్రము నుండి ముహూర్త సమయమునకు గల గురు సంచార నక్షత్రము వరకు లెక్కించి పై విధముగానే చూసి ముహూర్తమును నిర్ణయించవలెను.
(4)గృహారంభ చక్రశుద్ధి:-రవి యున్న నక్షత్రము నుండి ముహూర్త నక్షత్రము వరకు లెక్కించగా 1,2,3 దహనము,4,5,6,7 శూన్యము,8,9,10,11 స్థిరత్వం,12,13,14 ధన లాభం,15,16,17,18 సర్వత్ర లాభం,19,20,21 గృహ యజమాని నాశనము,22,23,24 కష్టములు,25,26,27 జయము కలుగును.ఈ చక్రశుద్ధి గృహారంభమునకు చూడవలెను.
(5)వృషభ చక్రశుద్ధి:-రవి యున్న నక్షత్రము మెదలు గృహప్రవేశ నక్షత్రము వరకు అభిజిత్తు తో గూడా లెక్కించగా 1,2,3 తారలు మృత్యువు, 4,5,6,7 దరిద్రము, 8,9,10,11 స్థిరత్వము, 12,13,14 ప్రయాణములు, 15,16,17,18 సంపద,19,20,21,22 ధ్యానము, 23,24,25 ఐశ్వర్యము,26,27,28 పశువృద్ధి ఈ చక్రశుద్ది గృహప్రవేశము నకు చూడ వలెను.
(6)కళశ చక్రశుద్ధి:- రవి యున్న నక్షత్రము మెదలు గృహప్రవేశ నక్షత్రము వరకు లెక్కించగా 1 శిరశ్ఛేధము, 2,3,4,5 విదేశీ గమనము, 6,7,8,9 నిర్ణయము, 10,11,12,13 భాగ్య వృద్ధి, 14,15,16,17 దరిద్రము,18,19,20,21 గర్భస్రావము, 22,23,24 సంపద, 25,26,27 పూర్ణాయువు.ఈ చక్రశుద్ధి గృహప్రవేశము నకు ముఖ్యంగా చూడవలెను.

చింతా గోపి శర్మ సిద్ధాంతిFB_IMG_1532495002290

నక్షత్రాలు 27

 

ఆకాశంలో చంద్రుడి గతిని పరిశీలిస్తే, నెల మొత్తంమీద ఒక్కో నక్షత్ర మండలముతో పాటుగా సంచరిస్తున్నట్లు గోచరిస్తున్నది. దీనినే పురాణ గాథలో అందంగా, ఆ నక్షత్రదేవతలు చంద్రుడి భార్యలు అని వివరించారు. వాస్తవానికి ఈ పేర్లతో ఉన్నది ఒక నక్షత్రగోళం కాదు. కొన్ని నక్షత్ర తేజః పుంజాల సమూహం. అందువల్లే వేదంలో కొన్ని చోట్ల ద్వివచనం, మరికొన్నిచోట్ల బహువచనాలను, కొన్ని చోట్ల ఏకవచనాలను ప్రయోగించారు.

ఈ నక్షత్ర మండలాల గురించిన విస్తారమైన ప్రస్తావన వేదమంత్రాలలో ఉన్నది. జ్యోతిస్సు అంటే నక్షత్రము. దీనికి సంబంధించిన విషయము కాబట్టే జ్యోతిష్యము అనే పేరు కూడ వచ్చినది. కాబట్టి, కష్టాలలో ఉండేవారు, నక్షత్రాలను, వాటి అధిదేవతలనూ స్మరించేందుకై నక్షత్ర జపం అనే సంప్రదాయం కూడ ప్రసిద్ధమైనది.

నక్షత్రాణ్యథ వక్ష్యన్తే వేదోక్త క్రమ నామతః।
కృత్తికా రోహిణీ చైవ మృగశీర్ష స్తథా ర్ద్రకా।।
పునర్వసూ తిష్య ఏవ తథాశ్రేషా మఘాః క్రమాత్।
పూర్వోత్తరే చ ఫల్గున్యౌ చ హస్త శ్చిత్రోపి తారకాః।।
నిష్ట్యా విశాఖే సంఖ్యాతే అనూరాధా హి జ్యేష్ఠకా।
మూలః పూర్వోత్తరాషాఢా అభిజిచ్చ విశేషభం।।
శ్రోణా శ్రవిష్ఠా శ్చ శత భిషగ్వేదే తు చోదితః। ।
పూర్వోత్తరాః ప్రోష్ఠపదాః రేవత్యశ్వయుజౌ తతః।।
ఉత్తమా తారకోక్తాప భరణ్యో భాని ఖే క్రమాత్।
అశ్విన్యాదీని వేదాంగే నక్షత్రాణి స్మృతాని వై।।

వేదములో, కృత్తికతో ప్రారంభించి ఈ నక్షత్రముల వరుస క్రమాన్ని చెప్పారు. కానీ, లోకంలో సాధారణంగా జ్యోతిష్కులంతా అశ్వినీ నక్షత్రముతో గణన ప్రారంభిస్తారు. అభిజిత్ అనే నక్షత్రం ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రాల మధ్యనున్నది. అక్కడక్కడా, దీనిని పరిగణిస్తారు.

ఈ నక్షత్రాలలో కొన్నిటిని పుంలింగములోనూ, మరికొన్నిటిని స్త్రీలింగములోనూ బోధించారు. (నక్షత్రదేవతలకు స్వేచ్ఛ ప్రకారంగా తమ లింగాన్నీ, రూపాన్నీ మార్చుకునే శక్తిని పరమేశ్వరుడు ప్రసాదించాడని పురాణ గాథ)

1. (అశ్వినీ) అశ్వయుఙ్నక్షత్రం 2. (అప) భరణీ నక్షత్రం 3. కృత్తికా నక్షత్రం 4. రోహిణీ నక్షత్రం 5. మృగశీర్ష నక్షత్రం 6. ఆర్ద్రా నక్షత్రం 7.పునర్వసు నక్షత్రం 8. తిష్య నక్షత్రం 9. ఆశ్రేషా నక్షత్రం 10. మఘా నక్షత్రం 11. పూర్వ ఫల్గునీ నక్షత్రం 12. ఉత్తర ఫల్గునీ నక్షత్రం 13. హస్త నక్షతం 14. చిత్రా నక్షత్రం 15. (స్వాతీ) నిష్ట్యా నక్షత్రం 16. విశాఖా నక్షత్రం 17. అనూరాధ నక్షత్రం 18. జ్యేష్ఠా నక్షత్రం 19. మూల నక్షత్రం20. పూర్వాషాఢా నక్షత్రం 21. ఉత్తరాషాఢా నక్షత్రం (21 అభిజిత్ నక్షత్రం) 22. (శ్రవణ) శ్రోణా నక్షత్రం 23. (ధనిష్ఠ) శ్రవిష్ఠా నక్షత్రం 24.శతభిషఙ్నక్షత్రం 25. (పూర్వాభాద్ర) పూర్వప్రోష్ఠపద నక్షత్రం 26. (ఉత్తరాభాద్ర) ఉత్తర ప్రోష్ఠపద నక్షత్రం 27. రేవతీ నక్షత్రం

కశ్యప ప్రజాపతి భార్య దితి గర్భంలో జన్మించిన 27మంది కుమార్తెలే 27 నక్షత్రాలు . వారిని చూచి ముచ్చటపడి దక్షప్రజాపతి వారిని తనయింటికి తీసికొని వెళ్ళి తన బిడ్డలవలె పెంచాడు. ఆ నక్షత్రముల పేర్లు – అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ (పూర్వఫల్గుణి), ఉత్తర (ఉత్తరఫల్గుణి), హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ట, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ఠ, శతభిషము, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి.

నక్షత్ర సంజ్ఞా విధము
1. క్షిప్ర నక్షత్రములు :- అశ్వని, హస్త, పుష్యమి
2. దారుణ నక్షత్రములు :- మూల, ఆరుద్ర, జ్యేష్ట, ఆశ్రేష
3. మృదు నక్షత్రములు :- చిత్త, రేవతి, మృగశిర, అనూరాధ
4. స్థిర నక్షత్రములు :- రోహిణి, ఉత్తరాషాడ, ఉత్తరా బాద్ర
5. చర నక్షత్రములు :- స్వాతి, పునర్వసు, శ్రవణము, ధనిష్ట, శతతార
6. ఉగ్ర నక్షత్రములు :- భరణి, మఖ, పుబ్బ, పూర్వాషాడ, పూర్వాభాద్ర
నక్షత్రాలు – దేవతలు
అశ్వని – అశ్వని దేవతలు, భరణి – యముడు, కృత్తిక – అగ్ని, రోహిణి – బ్రహ్మ, మృగశిర – చంద్రుడు, ఆరుద్ర – శివుడు, పునర్వసు – అదితి, పుష్యమి – గురుడు, అశ్రేశ – సర్పములు, మఖ – పితృదేవతలు, పుబ్బ – బృగుడు, ఉత్తర – అర్యముడు, హస్త – సూర్యుడు, చిత్త – ఇంద్రుడు, స్వాతి – వాయుడు, విశాఖ – ఇంద్రాగ్నులు, అనూరాధ – మిత్రులు, జ్యేష్ట – దేవేంద్రుడు, మూల – రాక్షసుడు, పూర్వాషాడ – ఉదకములు, ఉత్తరాషాడ – విశ్వేదేవతలు, శ్రవణం – విష్ట్నువు, ధనిష్ట – వసువులు, శతభిషం – వరుణుడు, పూర్వ భాద్ర – అజచరణుడు, ఉత్తరా భాద్ర – ఆహిర్భుద్నుడు, రేవతి – పూషుడు
ఒక్కొక్క నక్షత్ర ప్రమాణము =360
ఒక్కొక్క నక్షత్రము నాలుగు పాదాలు.