Category Archives: Short Films

విక్రం ఆర్ట్స్ ‘అదిరే’ ట్రైలర్ విడుదల

డైరెక్టర్ కె.విక్రమాదిత్యరెడ్డి 60 కి పైగా జానపద ఆల్బమ్స్ రూపొందిచి మరియు కొన్ని టీవి షో లో రాణిస్తు
మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విక్రమాదిత్యరెడ్డి తన సతీమణి శ్రీవాణిలు యాక్టింగ్ ,డాన్స్ స్కూల్ ను స్థాపించి విధ్యను అందిస్తున్నారు. విక్రమాదిత్యరెడ్డి నిర్మాతగా మారి ‘విక్రం ఆర్ట్స్’బ్యానర్ తో నిర్మాణ సంస్థను ప్రారంభించారు.విక్రమాదిత్య తన మొదటి ప్రయత్నం గా
‘కెవ్ కబడ్డీ ‘అనే కార్యక్రమానికి శ్రీకారం చూట్టారు. 50 మందికి పైగా టీవీ నటీమణులతో మొట్టమొదటిసారిగా కెవ్ కబడ్డీ పోటీలు నిర్వహిచారు. తనకంటూ ప్రత్యేకతను సొంతం చేసుకున్న విక్రమాదిత్య ఔత్సాహిక కళాకారులని పరిచయం చేయాలనే సంకల్పంతో ఇప్పుడు యూట్యూబ్ రంగం లోకి అడుగు పెట్టారు. నిర్మాతగా లఘు చిత్రాలని నిర్మిస్తున్నారు. మొదటి ప్రయత్న0గా ‘అదిరే’ అనే లఘు చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.హరి శ్రేయ హీరో హీరోయిన్ గా చేస్తున్నారు. ప్రతాప్ ఈ లఘు చిత్ర దర్శకుడు.ఇందులో రెండు పాటలు ఉన్నాయి.శివ నాగులు సాహిత్యం అందించగా ప్రముఖ గాయనీగాయకులు దామిన భట్ల ి,ఉమానేహా,సాయిచరణ్ ఆలపించారు.త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రానుంది.FB_IMG_1515249624382

 

 

Https://m.youtube.com/watch?feature=youtu.be&v=TsowjuVHdm4

5d mark iii for rent

img-20170103-wa0001

Writers Needed For Comedy Web Series

looking for new and emerging writers who have a passion for writing quality comedy scripts for upcoming web series.
Contact :Santosh Kumar Gujjeti
Contact : 9010896583
Location: Hyderabadfb_img_1479902738678

deshamante matti kaadhyoi”trailer

For the time kavi, writer, sree pusyame sagar has drected the film called “deshamante matti kaadhyoi”. Film trailor. Please give your bless.

మొదటి సారి గా కవి రచయత అయినా పుష్యమీ సాగర్ గారు “దేశమంటే మట్టి కాదోయి “అనే లఘు చిత్రానికి దర్శకత్వం వహించారు ..దాని యొక్క ట్రైలర్.received_1159075010811980

!! సాయమే దేవుడు !!

“మానవ సేవ నే మాధవ సేవ ” ఈ సామెత మీకందరికీ తెలిసే ఉంటుంది . ఇప్పుడు ఎందుకు గుర్తు చేసుకోవాలి అని ప్రశ్నించవచ్చు ..ప్రతి దానికి అర్థం పరమార్ధం రెండు ఉంటాయి. సూక్ష్మం లో మోక్షం . చిన్న చిన్న విషయాలతోనే గొప్ప భావాన్ని తెలియచేయవచ్చు .. దృశ్య మాధ్యమం లో చరిత్ర ని మలుపు తిప్పగల చిత్రరాజం రాకపోవచ్చునెమో గాని ..ఖచ్చితంగా చరిత్ర గుర్తు పెట్టుకొనే ఓ లఘు చిత్రం మాత్రం మనందరి ముందుకు వచ్చింది …”శివోహం”, సాయమే దేవుడు. నిజమే నూటికో కోటికో ఒక్కడు ఉంటాడు ..అది దేవుడే కానవసరం లేదు ..మానవుడు ..మనిషి, సాయం చేసే ప్రతివాడు దేవుడే …నీలో, నాలో, మనదరి లో ఉంటాడు …కాకపోతే గుర్తించం …

“అద్భుతం జరగనప్పుడు ఎవరు గుర్తించారు, అద్భుతం జరిగాక గురించనవసరము లేదు ” అలాంటి కోవలోకే ఈ శివోహం/ స్వార్ధం పడగవిప్పి బుస కొడుతున్నప్పుడు ఇంకా మానవత చచ్చిపోలేదని బతికే వుంది అని తెలియచెప్పే చిరు ప్రయత్నం ..

ఇంత గా మనం మాట్లాడుతున్న “శివోహం ” లో ఏమి ఉంది …కంటెంట్ లేకుండా ఒక గంట పాటు సీట్ లో కూర్చోబెట్టి చూపించే సత్తా దమ్ము ఉందా ..? చూద్దాం …టూకీ గా ..
శంకర్ ఓ నిజాయితీ గల కార్మికుడు …అనాధ, అమ్మ నాన్నలు లేకపోయినా కస్టపడి పైకి రావాలని అనుకునేవాడు .జీవితం పట్ల ఎన్నో ఆశలు, కోరికలు, కలలు ఉన్నవాడు ..తన బాస్ తనని ఎన్ని తిట్టినా కొట్టినా సహనము తో పని చేస్తూ పోతుంటాడు ..ఇతనికి ఉండే ఒకే ఒక వీక్నెస్ హెల్పింగ్ నేచర్., ఇది ఎంత వరకు పోతుంది అంటే తనకు ఆకలి అయినా , అన్నం అని ఆదుకున్న వాళ్ళకి తన దగ్గర ఉన్నదీ అంతా ఇచ్చేంత …వీళ్ళ ఫ్రండ్స్ కూడా మంచివారు …ఓ రోజు లోడింగ్ చేస్తున్న సరుకు లో తేడా వచ్చింది అని ఆ నేరం శంకర్ ఏ చేసాడని బాస్ ఆరోపిస్తాడు …నింద వేస్తాడు ..ఆ ఫ్రస్ట్రేషన్ లో ఫుల్ గా తాగి దేవుడిని తిడతాడు.. రమ్మంటాడు ..అసలు లేవు అంటాడు ..ఆశ్చర్యం గా దేవుడు ప్రత్యక్షం అవుతాడు వరాలు కోరుకోమంటాడు ,…డ్రామా కంపెనీ నుంచి వచ్చావని హేళన చేస్తాడు ..నువ్వు “దేవుడా” అని పిలవగానే వస్తాను అంటూ దేవుడు ఐదు వరాలు ఇస్స్తాడు ..అందులో రెండిటిని వ్యర్థం చేస్తాడు ..మూడో వరం డబ్బులు వచ్చే ఉధ్యోగానికి, నాలుగో వరం కోరుకున్న అమ్మాయి ని దక్కించుకుంటాడను ..నేనే కష్టపడ్డాను ..నా వల్లనే ఇదంతా అన్న అహం పెరిగిపోతుంది ..పెళ్లి కి వెళ్లి వస్తున్నా స్నేహితుల కార్ ఆక్సిడెంట్ కి గురి అవుతది అందరూ చావు బతుకుల్లో వుంటున్నారు ..అప్పటి కి దేవుడి ని తలుచుకోరు …కొన్ని కష్టాల తరువాత …దేవుడిని అడుగుతాడు 50 లక్షలు ఇమ్మని …చివరి వరం ఇచ్చి వెళ్ళిపోతాడు ..హాస్పిటల్ బిల్ కట్టే టైం కి ఆటో లో ఆ డబ్బు ని మర్చిపోతాడు ……ఎప్పుడో శంకర్ వలన సహాయం పొందిన టీవీ రిపోర్టర్ చూసి అడుగుతది ..తాను వున్నా సిట్యుయేషన్ ని చెప్తాడు ..వెంటనే లైవ్ టెలికాస్ట్ పెట్టి సహాయం అడుగుతది ..అందరు వచ్చి డబ్బు కడతారు …వాళ్ళ స్నేహితులు బతుకుతారు ..చివరికి హమ్మయ్య..దేవుడా అనుకుంటున్నాడు ..మల్లి దేవుడు వస్తాడు ..అతని తో వాదిస్తాడు నేనే నా వలెనే ఇది అంతా అని చెప్తాడు ..వాళ్ళు అలా నీకు హెల్ప్ చేయడానికి నేనే ప్రేరేపించెను అంటాడు …నీకు సహాయం చేసిన ప్రతి ఒక్కరి లో “దేవుడు ” వున్నాడు చూడు అని అందరి లో ను దేవుడిని చూపిస్తాడు ..

సర్వే జన సుఖినోభవంతు అని ముగిస్తాడు ..!

టూకీ గ చెప్తే కధ ఇది ..”సహాయం చేసే ప్రతి మనిషి లో దేవుడు” ఈ కాన్సెప్ట్ బాగుంది …ఇప్పటివరకు ఎవరు టచ్ చెయ్యలేదు …కానీ మీకు ఎక్కడో ఓ చోట “ఖలేజా ” గుర్తుకు వస్తుంది కదా…తప్పేమి కాదు ఎందుకు అంటే అక్కడ కేవలం ఒక మనిషి చుట్టూ తిరుగుతుంది ఇక్కడ సమూహం చుట్టూ తిరుగుతుంది సహాయం చేసే ప్రతి మనిషి లో మాధవుడు ఉంటాడు ..

ఇక కాస్టింగ్ క్రూ కి వస్తే అందరూ చక్కగా నటించారు …ముఖ్యం గా శంకర్ పాత్రధారి చక్కని హావ భావాలను పలికించారు. మిగితా వారు అంతా వారి పరిధి ని మించి చక్కగా నటించారు ..మ్యూజిక్, ఎడిటింగ్, డబ్బ్బింగ్ అన్ని కుదిరాయి …ఒక ఇండిపెండెంట్ ఫిలిం,. అది కూడా 55 నిమిషాల నిడివి తో వ్యూయర్స్ ని కూర్చోపెట్టడం మాటలు కాదు .. ఈ విషయము లో వీరు విజయం సాధించారు అని చెప్పవచ్చు .,.చంద్రుడి లో కూడా అక్కడ అక్కడ మచ్చలు ఉన్నట్టు ఇందులో కూడా కొన్ని కనిపిస్తాయి ..స్లో నరేషన్, వినోదం పాలు తక్కువ కావడం, నిడివి తగ్గించక పోవడం ..లాంటివి వదిలేస్తే …కధ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా, సంభాషణల పరంగా చక్కగా ఆకట్టుకుంటాయి ..

గంగాధర్ అద్వైత గారు తీసిన ఈ లఘు చిత్రం నిజంగా సాహసమే అని చెప్పుకోవాలీ ఎందుకంటే ట్రెండ్ కి బిన్నం గా వెళ్తున్నారు …ఈ సినిమా చూస్తే మీకు ఏమి వస్తుందో రాదో తెలియదు కానీ ఖచ్చింతగా “సాయం ” గురించి మాత్రం తెలుసుకుంటారు ..మరిన్ని మంచి చిత్రాలు తీసి మనల్ని అలరిస్తారని ఆశిస్తున్నాను .. అభినందనలు “శివోహం ” టీం కి ….all the best ganga gaaru and his crew…

-పుష్యమీ సాగర్

IMG-20160728-WA0006

 

SIVOHAM(SAAYAME DAIVAM) INDEPENDENT FILM PREMIERE

“One who helps others is no less than the God himself.” Based on the same point, we present our independent film SIVOHAM. Request you to bless us with your gracious presence on the eve of the screening of our SIVOHAM.

VENUE: PRASAD LABS, BESIDE L.V.PRASAD EYE CARE, JUBILEE HILLS.
DATE AND TIME: 31ST JULY 2016 Sunday 6:00 PM

Your presence is our blessing and your support is our strength..
Regards,
Gangadhar Advaitha
శివోహం (సాయమే దైవం) (ఇండిపెండెంట్ సినిమా 55 mnts only)ప్రదర్శన
“సాటి మనిషి కి సాయం చేసినవారు ఎవరైనా దైవం తో సమానం.” ఈ సత్యo ఆధారంగా మేము రూపొందించిన ఇండిపెండెంట్ చిత్రం “శివోహం”.దర్శకులు
గంగాధర్ అద్వైత మాట్లాడుతు
మా ఈ చిత్రoతో మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వస్తున్నాం. మీరు తప్పకుండ వస్తారని, మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం.. అన్నారు

వేదిక: ప్రసాద్ లాబ్స్, ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి పక్కన, జూబిలీ హిల్స్.
తేది మరియు సమయం: జూలై 31, 2016 ఆదివారం సా:6:00 గం||ల కు..IMG-20160728-WA0006

రివ్యూ : ఒక్క క్షణం (మంచికైనా – చెడుకైనా)

తారాగణం : శ్రీధర్ యాదవ్, సంతోష్ కుమార్, స్వప్న, శ్రీనివాస్ కొలాల, జాన్సన్ ఇతర నటి నటులు.
కెమరా : డి. యాదగిరి, ఎడిటింగ్ : టి.రామం, సంగీతం : ప్రవీన్ కుమార్, నిర్మాత : శ్రీధర్ యాదవ్ స్టోరి: రామోజు కృష్ణ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : వాలీ
కథ లోకి వెళితే : ఊర్లో పంచాయితీలు, సెటిల్మెంట్లు చేసుకునే శ్రీధర్ యాదవ్ అనే ఒక రౌడీ సిటీ లో చదువుకుంటున్న తన చెల్లి మేధని చూడటానికి హాస్టల్ కి బయల్దేరుతాడు… అక్కడికి వెళ్ళెసరికి మేధ గుడికి వెళ్ళిందని తెలిసి అక్కడికి బయల్దేరుతాడు… దారిలో ఎదురైన తన చెల్లితనని వెంబడిస్తూ వస్తున్న అంజి గురించి ఏడ్చుకుంటూ చెప్పగానే కోపంతో ఊగిపోయిన శ్రీధర్ అతన్ని ఏం చేశాడు… అసలు అంజి మేధని ఎందుకు వెంబడించాడు, ఆ తర్వాతేం జరిగింది అనేది సినిమాలోనే చూడాలి.

విశ్లేషణ:
ఏయే అంశాలైతే ప్రేక్షకులు కోరుకుంటారో ఆయా అంశాలన్నీ చెప్తూనే, ఎమోషన్‌ను ఎక్కడా పడిపోకుండా దర్శకుడు జాగ్రత్తపడ్డాడు. ఆయా ఎమోషన్స్‌ను పండించిన విధానం, క్లైమాక్స్‌లలో దర్శకుడి ప్రతిభ చాలా బాగుంది.6-Sheet-001
భిన్నమైన ఎమోషన్స్‌ను, నేపథ్యాన్ని, కథ రీత్యా వచ్చే మార్పులను సినిమాటోగ్రఫీ పరంగానూ ఎలివేట్ చేయడం బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయేలా ఉంది. ఎడిటింగ్ పద్ధతిగా బాగుంది. ఈ సినిమాకు అన్నింటికంటే ప్రధానమైన ప్లస్ పాయింట్ అంటే విలన్ క్యారెక్టరైజేషన్ అనే చెప్పుకోవాలి. విలన్ పాత్రను రూపొందించిన విధానం వల్ల సినిమాకు కాస్త కొత్తదనం వచ్చింది. ఇక ఆ పాత్రలో నటించిన శ్రీధర్
కూడా సినిమాకు ఓ హైలైట్‌గా నిలిచారు. స్టైలిష్‌గా కనిపిస్తూ, వయలంట్‌గా ప్రవర్తిస్తూ ఆ పాత్రను బాగా చేశాడు.
దర్శకుడు సాంకేతికంగా కానీ, నటీనటుల నుంచీ కానీ మంచి అవుట్ పుట్ రాబట్టుకున్నాడు.నిర్మాణ విలువలు ఉన్నంతలో బాగున్నాయి. సంతోష్ కుమార్, స్వప్న, శ్రీనివాస్ కొలాల, జాన్సన్
తదితర నటీనటులంతా తమ పరిధిమేర బాగా నటించారు.

4-Sheet

 

రివ్యూ : నేను ప్రిన్సిపల్ కూతురు

received_221613544862384
తారాగణం : సూర్య ప్రకాష్ రెడ్డి, దాలియ, ఇతర నటి నటులు.
కెమరా : సింహ, ఎడిటింగ్ : యశ్వాంత్ సంగా, సంగీతం : వెంకటేష్ బోల్లా, నిర్మాతలు : అశోక్ పిల్లి, సూర్య ప్రకాష్ రెడ్డి, స్టోరి – డైలాగ్ – డైరెక్టర్ : అశోక్ పిల్లి.
కథ లోకి వెళితే : సంజు ( సూర్య ) తన ఫ్రెండ్స్ అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నరు తనకే లేదు అని బాధ పడతాడు ఒక్క మందు సిట్టింగ్ లో. అతని ఫ్రెండ్స్ నీ క్వాలిటీ తగ్గ అమ్మాయి మన కాలేజ్ లో నే ఉందిరా మన ప్రిన్సిపల్ కూతురు ఆపేక్ష ( దలియ) రేపు వాలంటైన్స్ డే కదా ప్రపోజల్ చేయమంటారు. అతని ఫ్రెండ్స్ సలహా మేరకు ఆపేక్ష నీ ఆకట్టుకునే విదంగా ప్రపోజ్ చేస్తాడు.తను ఓపుకోవడం వెంట వెంటనే జరిగి పోతాయి. అ తర్వాత ప్రిన్సిపల్ కూతురి తొ సంజు కి జరిగన ప్రేమాయణం యుటూబ్ స్క్రీన్ పై చూడాల్సిందే.
వర్క్ గురించి : హీరో సూర్య నటన అంత అంత మత్రమే. హీరోయిన్ దాలియ బాగ చేసింది. మంచి ఆఫర్లు వస్తాయి ఈ షార్ట్ ఫిల్మ్ తర్వాత. హీరో ఫ్రెండ్స్ బాగ చేసారు తమ పాత్రల మేరకు.
అశోక్ పిల్లి స్టోరీ దర్శకత్వం బాగునాయి. వెంకటేష్ బోల్లా గారి సంగీతం, యేశ్వంత్ ఎడిటింగ్ సింహ కెమరా వర్క్ బాగునాయి

జైదేవ్ ముదిరాజ్