Category Archives: Punyakshetralu
అపర భద్రాద్రి సిర్సనగండ్ల సితారామాలయం
అపర భద్రాద్రి సిర్సనగండ్ల సితారామాలయం
హైదరాబాద్ జిల్లా కేంద్రానికి 80కిలో మీటర్ల దూరంలో
కల్వకుర్తి నుంచి దేవరకొండ వెళ్ళు రహదారిలో కల్వకుర్తి నుంచి 30 కిమీ దూరంలో ఉన్న చారకొండ నుంచి 5 కిమీ లో ఉన్న సిరసనగండ్ల గ్రామంలో ఉన్న సీతారామచంద్రస్వామి ఆలయం తెలంగణ రాష్ట్రంలో రెండవ భద్రాచలంగా పిలవబడుతుంది. ఈ క్షేత్రం రామాయణ గాథతో ముడిపడింది. ప్రతి కోట్ల మంది దర్శించుకుంటారు. నిత్యపూజలందుకుంటూ ధూపధీపాలతో సంవత్సరాంతం ఉత్సవాలు జరుగుతుంటాయి.
14వ శతాబ్దంలో వెలసిన సిరసనగండ్ల శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని సందర్శించిన భక్తుల కి జన్మ సుకృతమే.ఏటా ఇక్కడ చైత్రశుద్ధ్య పాడ్యమి నుంచి నవమి వరకు వసంత నవరాత్రులు,నవమి నుండి పౌర్ణమి వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. 16 రోజుల స్వామి వారికి వివాహ వేడుకలు జరుగుతాయి.ఈ సమయంలో భక్తులు రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుండి కాకుండా రాష్ట్ర నలు మూలల నుండి కూడా వేలసంఖ్యలో తరలివచ్చి కనులారా చూసి తన్మయం చెందుతారు.
ఆలయ చరిత్ర:
ఈ ఆలయాన్ని 14వ శతాబ్దిలో నిర్మించబడినట్లు శిలాశాసనాల వల్ల తెలుస్తుంది. అప్పడు ఈ ప్రాంతం భీకర అరణ్యంగా ఉండేదని, గుట్టపై దత్తాత్రేయ ఆశ్రమం, ముత్యాలమ్మ గుడి ఉండేవని ప్రతీతి. సిర్సనగండ్ల గ్రామానికి చెందిన రామయాజ్వికి శ్రీరాముడు కలలో కనిపించి భద్రాచలంలో ప్రతిష్టించాల్సిన సీతారామ విగ్రహాలు ఖమ్మం జిల్లా పాల్వంచ సమీపంలోని రావిచేడ్ గ్రామంలో ఒక పురోహితుడి ఇంటి పెరటిభాగంగా ఉన్నట్లు చెప్పినట్లు, ఆ విగ్రహాలు సకాలంలో భద్రాచలానికి చేరనందున వేరే విగ్రహాలు అక్కడ ప్రతిష్టించినట్లు, వాటిని సిర్సనగండ్లలో ప్రతిష్టించమని చెప్పినట్లు కథనం ప్రచారంలో ఉంది. కలలో శ్రీరాముడు చెప్పిన విధంగా పాల్వంచ సమీపంలోని విగ్రహాలు తీసుకొని వచ్చికోడికూత, రోకలిమోత వినిపించని సిర్సనగండ్ల గుట్టపై ప్రతిష్టించబడినట్లు, గుట్టపై కోనేరు కూడా నిర్మించినట్లు తెలుస్తుంది. ఢేరము జంబురాలు సిర్సనగండ్ల రామచరిత్రము అనే యక్షగానాన్ని రచించాడు.
14 వ శతాబ్దంలో వెలసిన సిరసనగండ్ల శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయానికి ప్రతి ఏటా భక్తులు వేలాది తరలివచ్చి సీతారాముల కల్యాణాన్ని కనులారా చూసి తన్మయం చెందుతారు. సీతారాముచంద్రుల కల్యాణోత్సవానికి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తరపున హోం శాఖమంత్రి నాయిని న ర్సింహారెడ్డి హాజరయ్యారు. స్వామివారి కల్యాణానికి పట్టువస్త్రాలను, తలంబ్రాలను అందజేశారు. ఇక్కడ స్వామి దర్శన మాత్రం చేత.. మానసిక ఆనందం సిద్ధిస్తుందని భక్తులకు నమ్మకం.స్వామివారి కల్యాణోత్సవానికి హైదారబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌తో పాటు రాష్ట్రంలో పలు జిల్లాల నుండి భక్తులు హాజరవుతారని
అర్చకులు డేరం లక్ష్మణ్ శర్మ వివరించారు.