Category Archives: Poetry

పెనుతుఫాను

1
నిరాశ్రయుల ఆశ్రయంగా
అన్నార్తుల ఫలాలుగా పచ్చగా
ఎదగాలనుకున్నాను కానీ స్వార్థం
నన్ను కూకటివేళ్లతో పెకిలించింది

2
మానవత్వ పరిమళాల్ని
వికసింప సమతాసుమంగా
మొగ్గతొడగాలనుకున్నాను కానీ
మతమౌఢ్యచీడ అంకురదశలోనే
నన్ను కబళించింది

3
కులకుట్రల అగ్గి పై
కుండనీటినవ్వాలనుకున్నాను
కానీ కులగజ్జి ముంతనీటిగానే
నన్ను ముక్కలు చేసింది

4
దాచిన సత్యాల్ని
చాటిజెప్ప సరికొత్త చరిత్ర
పుస్తకమవ్వాలనుకున్నాను కానీ
బూర్జువా చెదపురుగులు నా పుటల్ని మేసి,
పెంటపుటల్ని కానుకిచ్చేయి

5
మూగబోయిన గళాల నవస్వరమై
రవళించాలనుకున్నాను కానీ ..
కత్తికోకండగా నన్ను కాకుల – గద్దల
ఆహారంగా విసిరారు

6
కానీ .. ఇది నా అంతమనీ
మీ జబ్బలుజరుచుకునే
ఈ మిడిసిపాటు ఏలనోయి ?
కానొస్తలేదా ..? మీ కుతంత్రాల
కుంపట్లపై కవనజలఖడ్గవృష్ఠిగా
విరుచుకపడనున్న పెనుతుఫాను
పవనంగా పలకరించిన నా రాక

-:ఇస్లావత్ గోవర్ధన్ నాయక్:-

ప్రతీ కవికి ఈ “అక్షర హారం” అంకితం 🌷 కవి – కర్షకుడు 🌷

కవి ఓ నిత్య కర్షకుడు ,

🔥”ప్రతి పంటకు ప్రసవించేవాడు కర్షకుడు …
ప్రతి అక్షరానికి ప్రసవించేవాడు కవి ….”
🔥 కవియే కర్షకుడై కలం అనే హలంతో అక్షర సేద్యం చేస్తాడు .నాగలి తలక్రిందులై నడిస్తే గాని నాగరికత నిలువజాలదు , కవి చేతి కలం తలక్రిందులై కాగితాన్ని కదిలిస్తేగాని భావం బ్రతుకజాలదు .
🔥 కండను కరిగించి అన్నాన్ని పండించి ఆకలి అన్నవారికి అండగా నిలిచే రైతులాగా, కవి తన కలాన్ని కదిలించి అక్షరాలను అందించి భావ దారిద్య్రంలో మునిగిన వారికి బాసటగా నిలుస్తాడు .

🔥 ఆకలితో డొక్క పాతాళానికి చేరినా పట్టించుకోక దుక్కి దున్ని పాతాళంనుండి పరమాన్నము ప్రసాదించే రైతు లాగా ,కవి యొక్క కడుపు కరువుకు శాశ్వత చిరునామాగా మారినా పట్టించుకోక శ్రమించి , తన మేధస్సును పదును చేసి పదాలను పరిగెత్తిస్తూ పరమాత్మ తత్త్వం యొక్క పరమార్థాన్ని ప్రసాదిస్తాడు .
అందుకే ….
” కర్షకుడిని ఆదుకోండి , కవిని ఆదరించండి ……”
🌻 డా .శివ ప్రసాద శాస్త్రి 🌻FB_IMG_1505882403905

నిజం

మనం హృదయం విప్పి
నిజం చెబితే నమ్మరు
కానీ నోరు విప్పి చక్కగా
అబద్దం చెబితే
మాత్రం నమ్ముతారు
పైగా నిజం చెప్పినందుకు
మనల్ని ముంచుతారు
వారేమో అబద్దంలో
అలా మునిగితేలుతూ
ఉంటారు
అదే లోకం తీరు
కానీ మనం నిజమే చెబుదాం
మన గుండెని పదిలంగా
ఉంచుకుందాం
అదే మనకి పదివేలు!

పాల ఫణీంద్ర శర్మreceived_1721494971224324

చక్రభ్రమణం

పుట్టుక శాకాహారిగా ఉంచుతుంది .

స్నేహం మాంసాహారిగా మారుస్తుంది .
ధ్యానం మళ్ళీ శాకాహారిని చేస్తుందేమో…!

***
బతుకేం దువ్వాడ సినిమా కాదు,
అగ్రహారీకుడెంట అందాలబొమ్మ పడదు..
గురజాడ వారెప్పుడో చెప్పినట్టు
వైదీకపాళ్ల పునిస్త్రీలూ,
తలచెడ్డ పూటకూళ్లమ్మలూ
జమిలిగా “చీపురుకట్ట సరసం” ఆడతారు.

***
పిల్లలకు గేమ్ ఆఫ్ థ్రోన్లూ; పీయస్ ఫోర్లూ
అమ్మగారికి 4కె రిసొల్యూషన్ హెచ్ డీ టీవీల కోసం
జగన్నాధాలూ, పరాంకుశాలూ ఆక్టీవాలెక్కాలి.
మధుమేహం మందమవుతుందన్న భయంతో
ఆబ్దీకం పెట్టడానికైనా అన్నం తినే వెళ్లాలి.
నక్తం అంటూ నంగనాచి వేషాలెయ్యాలి.

***
గొట్టిపాటి వారి పిల్లాడికి మున్సబీ అయ్యే ఛాన్సేలేదు..
68% ముందస్తు బుక్కింగైపోగా
దొరల, పటేళ్ల, రాజుల, చౌదర్ల,నాయుళ్ళ, రెడ్ల
వెనక మిగిలిన ముప్ఫైమూడో వాడే
బక్క బాపనోడు…
సమకాలీన సమాజంలో ఆధునిక అస్పృశ్యుడు..
***
అప్ డేట్ ఇవ్వరా అంటే వినడే..
పోనీ శంకరశాస్త్రిగారా..అంటే అదీ కాదు..
పంచె కట్టుకుని ఒప్పుకున్న పూజ చేసి,
ప్యాంటేసుకుని పనికి పరిగెడతాడు.
బక్క ప్రాణంతో “పరశురాముణ్నం”టూ కేకలేస్తాడు.
.
.

కులానికో వీరుడున్నాడ్రా బాబూ..
పాతసొల్లేయమాక,
కుళ్లు కంపు కొడతాంది.
పొద్దున్నే లేచి చదివేది..
ఈనాడా..?? ఈశావానోపనిషత్తా..??
తాత గారి నేతి మూతిని వదిలి,
ఇవాళ మజ్జిగ ఉందా..?లేదా..? చూడు..
రేపటి పాలూ, పెరుగు సంగతాలోచించు
***
చౌదరిగారి ఛానల్లో ఎవడి దినఫలం వాడు చూసుకుంటున్నాడు గానీ,
పురోహితుణ్ని అంటూ పనికిరాని జపం చేయకు..
పురపుహితమును కొంతమానుకు
సొంతహితముకు పాటుపడవోయ్…FB_IMG_1498374850526

ఆనందం

ఆనందం …
అందుకోవడం, అందివ్వడం…అనుభవించడం…
అన్ని విషయాలలో ఇదే సూత్రం సఖా
మంచిగా బ్రతకాలి అనుకుంటే.

చెప్పడం, వినడం తో సరి కాదు…

రామాయణ .. భాగవతాలైనా అమ్మ నాన్నకు చేసే సేవల ముందు బలాదూర్….

కొడుకులు
కూతుళ్లు
రెక్కలురాగానే ఎగిరిపోరా….
పోతే పోనీ
నువ్వెందుకు ఆలోచించి చస్తావ్….
ఉన్నంత వరకు
సుఖంగా ఉండడానికి
ప్రయత్నం చెయ్…

స్వార్ధపు సామర్థ్యం
నీకు తెలియనిదా?
తాత బొచ్చె తర తరాలేగా….

అర్ధం చేసుకో
అర్థం గొప్పతనం…
బంధాలన్ని
విహంగాలే,
ఎప్పుడు ఎగిరిపోతాయో…
నీ జీవితం ఎప్పుడు
ఇగిరి పోతుందో….

వరసాయి స్వామీ…కాళీపీఠం ,గుంటూరు.FB_IMG_1498142385532

వర్షం వెలిసాక వచ్చే చంద్రోదయం చాలా బాగుంటుంది 👌

మేఘాలేవీ లేకుండా నిర్మలంగా ఉండి చక్కగా చుక్కలతో, , చంద్రుని కాంతితో ప్రకాశించే ఆకాశమూ,,” ముట్టుకుంటే నలుపు రంగు వేళ్ళకి అంటుకుంటుందేమో….!!! ” అన్నట్లు బయటుండే చీకటీ చూడడానికి చాలా బాగుంటాయి…. తడిసిన పూలవాసన ఈ అందానికి అదనం ( జాజిపూల పందిరి ఉన్న వాళ్ళు అదృష్టవంతులు ఈ సమయంలో 😘 )

చక్కగా ఆకాశం నుండి తెల్లగన్నేరు పూలు కుప్పలుకుప్పలుగా కురిసి ఊరంతా పరుచుకున్నట్లు ఉంటుంది వెన్నెల ఈ జ్యేష్ఠమాసంలో 😊

– Kks Kiranreceived_1277436155648760

డిజిటల్ స్నేహం మీద నా అభిప్రాయం

డిజిటల్ స్నేహం మీద నా అభిప్రాయం చెప్పగానే ఒక “మేతావి” ‘ ఎవర్నైనా పట్టుకుంటే తప్ప నీ దూల తీరదా..?’ అంటూ వెటకారాలాడాడు. ఇంకొకరికి ఫోన్ చేస్తే “only text please.” అంటూ ఆటో మెస్సేజ్ వస్తుంది. తను నన్ను “సూటిగా, సుత్తి లేకుండా , సొల్లెయ్యకుండా పాయింట్ చెప్పు ..!” అంటున్నారని అర్ధమైపోతుంది.

ఆలోచనలని, భావాలని యథాతథంగా చెప్పడానికి రాత కన్నా మాటే ముఖ్యమని నేను నమ్ముతాను. ఈ “పాయింటు కి రా..!” అనే లక్షణం మన ఓపిక లేనితనాన్ని గుడ్డలిప్పి ప్రదర్శిస్తుంది. తోటివాళ్ళ ఆలోచనలతో సహగమించలేని అలసత్వాన్ని, మొరటుతనాన్ని నిర్లజ్జగా కళ్ళకు కట్టిస్తుంది. పుష్కరాల వయస్సున్న స్నేహసంబంధాలు instant messenger లోకి కుదింప బడుతున్నాయి. ఇత్తడి గ్లాసు లోని ఫిల్టర్ కాఫీ కాపుచినో కప్పైపోయింది. Social Media అపరిచితుల contacts పెంచింది. సుపరిచితుల connections తుంచింది. మనసు లో శూన్యాన్ని చేర్చింది. మెదడు లో చెత్తని పేర్చింది.

24/7 hyper connectivity మనుషుల మధ్య దూరాన్ని శత సహస్ర యోజనాలుగా పెంచేసింది. దీని విశ్వరూపం ఇంతింతై బ్రహ్మాండాంత సంవర్ధియై, నయాపైసా ఖర్చు లేకుండా ఫ్లోరిడా స్నేహితులతో చాటింగ్ చేయిస్తోంది. కానీ, పక్క ఫ్లాట్ వృద్ధుడిని బాల్కనీ లోనుండి కూడా పలకరించలేనంత మొద్దు బారేలా చేసింది.
Messages పెరిగాయి. Meetings తరిగాయి.చెప్పడం పెరిగింది; వినడం తరిగింది. “I am little pre occupied yaar..! Let’s catch up some time soon..” అనే ముక్తాయింపు వాస్తవమైతే అదో ఎనిమిదో వింత.

పొట్టిక్కలో, పెసరట్లో, మొలక వడలో తింటూనో; ఉదయం కాఫీ మగ్గుతోనో సాయంత్రం విస్కీ పెగ్గుతోనో అప్పుడప్పుడైనా కలిసేవాళ్ళం. ముఖాముఖంగా మాట్లాడుకునే వాళ్ళం.కళ్ళ కలయికలతో సమస్త సృష్టి వర్ణ చిత్రాన్ని ఆవిష్కరించే వాళ్ళం. కొట్టుకునే వాళ్ళం, తిట్టుకునే వాళ్ళం, కౌగిలించుకునే వాళ్ళం, ఏడిచే వాళ్ళం, ఏడిపించే వాళ్ళం, నవ్వే వాళ్ళం, నవ్వించే వాళ్ళం.

అంతా మారిపోతోంది.పెళ్ళిళ్ళకి వచ్చే బంధువులు తగ్గారు. Reception కి వచ్చే సహోద్యోగులు పెరిగారు. యంత్రాలకు మనిషి మేధస్సుని జత కలిపే పనిలో పడ్డ మనిషి యంత్రమై పోయాడు.మన భావాలు emoticons లా మరుగుజ్జు రూపం దాల్చాయి. కప్పెట్టిన వాళ్లకి పెడుతున్న RIP లు చిరాకు తెప్పిస్తున్నాయి.మోక్షానికి విశ్రాంతి ఏంటో నా కోడి (బోడి) బుర్రకి అర్ధం కావడం లేదు.

నిజమే..! ఈ రుద్దబడుతున్న తద్దినానికి మనం మెల్లమెల్లగా అలవాటు పడిపోతున్నాం. కానీ,ఒక sense of relatedness, belongingness, understanding మృగ్యమై పోతున్నాయని దిగులేస్తోంది. నాలాంటివాడు పొరపాటున ఈ విషయం కెలికితే “టైం ఎక్కడుందీ..? “పాత వాగుడు వాగకు…!” అంటూ తిలక్ ఎప్పుడో రాసిన న్యూ సిలబస్ ని ఇప్పటికీ వల్లె వేస్తున్నారు.

నిజమే..! మనది బిజీ టైం. కానీ మనం నెమ్మదించడం అత్యవసరం. సుఖపడేందుకు కుప్పలు కుప్పలుగా మార్కెట్ లో డంప్ అవుతున్న వస్తువుల్లో మనను ఆనందపరచే ఆవిష్కరణలు మైక్రోస్కోపు తో వెదికితే ఒకటో, అరో దొరుకుతాయేమో..! మైథునం మార్కెట్లో కూడా దొరుకుతుంది. కానీ శృంగారపు చిరునామా సందింటి లోనే కదా..!

కొత్తతరపు communications వల్ల సంభాషణా చాతుర్యం, సహానుభూతి లాంటి మానవ సహజ లక్షణాలు అంతర్దానమైపోతున్నాయి. ఎదుటి వ్యక్తి నిజాయితీ తో తో కూడిన మెచ్చుకోలు; నిష్కామ స్నేహం కన్నా మననేవీ సంతృప్తి పరచలేవు. తెలిసిన నాలుగు ముక్కలు తెలిసిన నలుగురితో పంచుకోకుండా లోలోపలే పెట్టేసుకోవడం ఫ్లాట్ బీర్ అంత ; చీకట్లో కన్ను కొట్టడం అంత నిష్ప్రయోజనం.

లింగబేధంతో నిమిత్తం లేకుండా ఎవరి సలహా నన్ను ముందుకు నడిపిస్తుందో; ఎవరి విమర్శ నన్ను ఆపుతుందో; ఎవరి చేతి రుమాలు నా కన్నీటిని తుడుస్తుందో; ఎవరి కలయిక నా దుఃఖాన్ని దునుమాడుతుందో; ఎవరి విరహం నా సంతోషాన్ని మింగేస్తుందో; ఎవరి మాట నన్ను శ్రోతని చేస్తుందో; ఎవరి శ్రద్ధ నన్ను వక్తని చేస్తుందో; ఎవరి కోసం చావాలని అనుకుంటానో; ఎవరి కోసం చంపాలని అనుకుంటానో ఆ రక్త మాంసాలతో నిండి ఉన్న సజీవ మూర్తికి నా పాదాభివందనాలు; ఆత్మీయ ఆలింగనాలు…! Gottimukkula KamalakarFB_IMG_1489294231564

దేశ భాషలందు తెలుగు భాష లెస్స

దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు 4వ శతాబ్దం లోనే శ్రీ శ్రీనాథుల వారు చెప్పారు.అలాంటి మహానుభావులు చెప్పిన మాటలను మనం విస్మరిస్తున్నాం.  నిద్ర లేచిన దగ్గరి నుండి మృత భాష మాట్లాడుతాము.మనం మాట్లాడే మాట సత్యం అగుగాక అని దీవిస్తుంటారు (శ్రవణులు) తథాస్తు దేవతలు తథాస్తు అంటారు.దీని వలన మనం ప్రతి రోజు ఏన్నో బాధలు కలుగుతున్నాయి.అందుకే విదేశీయులు సైతం మన భాష,సంస్క్రతుల గోప్పదనం తెలుసుకొని వారు మనకంటే ముందు వరుసలో వున్నారు. కనుక మనం ఇప్పటికైన మనకు పెద్దలు ఇచ్చిన సంపదను కాపాడుదాం…….
మనం బ్రతకడానికి తెలుగు మాట్లాడుదాము — మన జీవనానికి ఇంగ్లీషును వాడుదాం….
మనం మాట్లాడే కొన్ని అర్థాలు తెలుసుకుందాం.

* అమృతాన్ని వర్షించు *అమ్మ* యను మాట మరచి,
మృతశరీరాన్ని స్ఫురింపజేసే *మమ్మీ* యను మాట నేర్చిరి! అమ్మను అమృత వాణిని కాస్త జీవం లేనిదానిగా చేస్తిరి..?

* *నాన్నా!* యనగ, ప్రేమమీరగ విశ్వమంతను చూపే తండ్రిని,
*డ్యాడ్* అంటూ బ్యాడ్ గా డమ్మీని చేసిరి! నాన్నను సంస్కారం లేని వానిగా చేస్తిరి..?

* అమ్మా నాన్నల ప్రేమ కలగలపిన *అన్న* ను,
*(బ్రో) దర్*అంటూ బరువూ బాధ్యత లేనివానిగ మార్చి! బ్రో(ద) కర్ గా చేస్తిరి..?

* *తమ్ముడూ!* అను మురిపాల పిలుపునకు కూడా, *(బ్రో) దర్ ఒకటే పదం* అంటూ సెలవిచ్చి! జోకర్ గా చేస్తిరి..?

* *అక్కా!* యనగ, అవ్యాజానురాగమైన ప్రేమను అనంతంగా కురిపించు
అమృతమూర్తిని, *(సిస్ )టర్* అంటూ మిస్ చేసి! సిస్ అంటు అక్కను మాయం చేస్తిరి..?

* *చెల్లీ!* యనగా,  కష్టాల్లో నాకంటూ తోడుగా నా అన్న వున్నాడంటూ
భ్రమించే చెల్లికి కూడా, *(సిస్ )టర్ ఒకటే పదమే* అంటూ సొద పెట్టి! చెల్లిని వ్యర్థానికి సూచిక చేస్తిరి..?

* సంస్కారాన్ని తెలిపే *నమస్కారాన్ని*,
*హెలో!, హాయ్!* అంటూ జాయ్‌గా ఎంజాయ్‌గా మార్చిరి ! నమస్కారానికి సంస్కారం లేకుండ చేస్తిరి..?

* యుగానికే ఆది తెలుగు *ఉగాది*, సంస్కృతీ సంబరాలను మరచి, *తల్లుల(దినం) రోజు, తండ్రుల (దినం)రోజు, ప్రేమికుల (దినం)రోజు,ఆంగ్ల సంవత్సరాది* విందుల మత్తులో మునిగితేలిరి? బ్రతికి వుండగానే దినం పెట్టేస్తిరి..?

* *సుమతి* లోపించి, *వేమన* ను మరచి, తెలుగున సంభాషించు వాడిని చిన్నచూపు జూచి,
ఆంగ్లము అరకొరగా, అస్తవ్యస్తముగా పలికినా, చిలక పలుకులని భ్రమించ సాగిరి? చిలుక పలుకులని కాకి పలుకులు పలికిస్తిరి..?

* వేయి మాటలేల, అత్తకు పిన్నమ్మకు *ఆంటీ*, మామకు పెద్దయ్యకు *అంకుల్*,అంటూ
బోడిగుండుకు మోకాలికి ముడి వేసినట్లుగా, ఒక్కొక్కటే పదమనిరి! అందరిని అంట్టి ముట్టనట్లుగా వ్యవహరించిరి..? ఇదా మన తెలుగు……..!

* అక్షరాలు తక్కువై, ఇఛ్ఛానుసారం పదాలను పొందుజేసి,
పెంపొందింపజేసిన ఎంగిలిభాష, విశ్వభాష యెట్లయ్యనో?

*సుధామధురిమలొలుకు పరిపూర్ణ అమృతఘటము వంటి తేట తెనుగు*,
*విశ్వము నుండి కనుమరుగు యెట్లు కాజొచ్చెనో?*
*యెంత ఆలోచించినను, అవగతం కాకుండె వినర తెనుగు రాయుడా!!*
తెలుగు మాన్యులారా నా చిరు ప్రయత్నం….
తెలుగులోనే మాట్లాడుదాం పరాయి భాష మనకొద్దు తెలుగు భాషే ముద్దు.
జై తెలుగు భాష….  జై జై తెలుగు భాష…….

*తెలుగుభాషాభిమానులైన మాన్యులందరకీ వందనం, శుభాభినందనం.*

శ్రీకొండ ఉమాకాంత శర్మ సిథ్థాంతి

చరవాణి:9440232574.%e2%80%aa91-94402-32574%e2%80%ac-20161215_121502

|| నెచ్చెలి ||

కలగా మిగలిపోవాలని

ఒడిలో ఒదగిపోవాలని…
ఊపిరి ఊయలలో…
నీ ప్రాణంగా ఊగిపోవాలని..
చేరువ కాలేని నిశ్శబ్ద ఝరిని..!!

ఊహల కురులు నీవైతే…
అగరుల ధూపం నేనవనా…
క్షణాల నీడలలో నిలవనా…
ప్రతీక్షణం నిన్నే వెతకనా…
కాలాన్ని కాగడా చేస్తూ..!!

మనసంతా ముందు పరచి…
మమకారమే అద్దనా…
మదిలోన నిన్ను నిలిపి..
నను నేనే మరవనా…
విరహపు పాన్పునే వేసి..!!

నీలాకాశము నీవైతే..
చందమామ నేనేనవనా…
ఇరువురి మేను తడపగా…
ప్రేమ చినుకై చేరనా…
హరివిల్లుల సిగ్గునద్దుతూ…!!

నా అధరాల కౌగిలిలో
నీ చిరునవ్వుకు ఆసనమేసి
ముత్యాలెన్నో దాయనా…
మురిపాల మువ్వలతో…
పిల్లగాలిలా సరసమాడనా..!!

హృదయపు లోతులలో..
ఓ జ్ఞాపికవై నిలిచిపో ..
ఈ జీవితపు ప్రయాణం లో…
ఓ నెచ్చెలివై ఉండిపో…
రాధలా రమ్యంగా..!!

ఊసుల గుసగుసలను
మౌనంతో పెనవేసి …
ఒక్కటి గా కలిసిపోనీ..
నాలోనే మిగిలిపోనీ…
అమృతమై నను బతికిస్తూ…!!

|| కాకరపర్తి పద్మజా ||

సంకల్పం

అనంతమైన సాగరమైనా
చిరు చినుకుతోనే మొదలు
ఎంతటి ఘన విజయమైనా
సంకల్పం అనే తొలిఅడుగు తోనే మొదలు
విడదీయలేని ఆత్మానుబంధం కూడా
చిన్న చిరునవ్వుతోనే మొదలు
పంచ భక్ష్య పరమన్నాలు ఎన్నునా
అమ్మచేతి గోరుముద్ద చాలు
లక్షల కోట్ల అస్థి కన్నా
అవసరంలో వెన్నంటి ఉండే మిత్రుడే చాలు
మానవత్వం లేని వందేళ్ళ కన్నా
మనిషిగా ఒకరోజే చాలు
||సోమ సుందర్ నిమ్మరాజు||img-20161115-wa0035