Category Archives: Movies

నీకు మాత్రమే చెప్తా అంటున్న తరుణ్ భాస్కర్

గతంలో మాదిరిగా ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువగా ధియేటర్ల వైపు పరుగులు పెట్టడం లేదు. కావలసినంత వినోదం స్మాల్ స్క్రీన్ లో దొరుకుతుంది. సీరియల్స్, వీక్లి ప్రోగ్రామ్సే కాదు, రిలీజైన తక్కువ రోజుల్లోనే సినిమాలు కూడా బుల్లితెరపై ప్రత్యక్షమవుతున్నాయి. అందుకే స్మాల్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ మీద చాలా డిమాండ్ ఉంది. కొద్ది కాలంగా బుల్లితెర మీద వీక్లి ప్రోగ్రామ్స్ కి క్రేజ్ పెరిగింది. కామెడీ షోలు, డాన్స్ బేస్డ్ షోలు, రియాలిటీ షోల వల్ల, ఆడియన్స్ కి స్మాల్ స్క్రీన్ మీద చాలా ఎంటర్టైన్మెంట్ దొరుకుతోంది. తెలుగులో టాప్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ అయిన ఈటివిలో చూస్తే…వీక్లి ప్రోగ్రామ్స్ ఎక్కువగా ఈటివిలోనే ఉంటున్నాయి.
మన తెలుగు లో కింగ్ నాగార్జున ,రానా దగ్గుబాటి నెం1 యారీ ప్రోగ్రామ్స్
హోస్ట్ గా వ్యవరించి భారీ హిట్ చేసిన సంగతి తెలిసిందే, ఇప్పుడు తెలుగు దర్శకులు కూడా ఆ తరహా ప్రోగ్రాం లకు వ్యాఖ్యాతలు గా మారటంతో ఒక్కసారిగా సగటు అభిమానులు ఈ ప్రోగ్రాం కోసం ఎదురుచూస్తున్నారు.
పెళ్లిచూపులు అనే చిన్న సినిమాతో పెద్ద క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. ఫలక్‌నుమా దాస్, మీకు మాత్రమే చెప్తా అంటూ నటుడిగా తన సత్తాను చాటాడు. ఇలా మల్టీ టాలెంటెడ్‌గా తన లోని భిన్న కోణాలు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు. తాజాగా మరో కొత్త అవతారమెత్తి ప్రేక్షకులను మెప్పించేందుకు వస్తున్నాడు. ఆ విశేషాలేంటో ఓ సారి చూద్దాం. ఢీ ,క్యాష్ స్టార్ స్పోర్ట్స్ ప్రో కబడ్డీ వంటి పలు ప్రోగ్రాం లు ఇంకా మరెన్నో ప్రోగ్రాంలకి అసోసియేట్ డైరెక్టర్ గా చేసిన శరత్ చంద్ర బొద్దనపల్లి తొలిసారిగా దర్శకుడు గా మారి ఓ షో డైరెక్ట్ చేస్తున్నారు. తొలి ప్రయత్నం తోనే ఓ పెద్ద షో ద్వారా ప్రేక్షకుల ముందు రానున్నారూ.1N2A1673
తరుణ్‌భాస్కర్ చేస్తున్న ఈ టాక్‌షో పేరు ‘నీకుమాత్రమే చెప్తా’. ప్రజాప్రభాకర్, శ్రీకాంత్ నిర్మాతలు. డైరెక్టర్‌ను మరో డైరెక్టర్ ఇంటర్వ్యూ చేయడం ఈ షో ప్రత్యేకత. ఒక డైరెక్టర్ వెనుక ఎన్ని కష్టాలు ఉన్నాయి?ఒక డైరెక్టర్ వెనుక ఎంత కష్టం ఉంది అనేది ఈ షో లో చూపించడం జరుగుతుంది. 87133140_2678652855503718_2454904431951478784_nఈ షో
ఈ శనివారం నుండి ఈ టివి ప్లస్ లో ప్రతి శనివారం సాయంత్రం 9 గంటలకు ప్రసారం కానున్నది.

Ys జగన్ పై ఓ రేంజ్ లో రెచ్చిపోయిన యామిని

 

నూతన నటీనటులకు అవకాశం

‘వానవిల్లు’ సినిమా తో మంచి సక్సెస్ సాదించిన
ప్రతీక్ ప్రేమ్ కరణ్ మళ్ళీ ఇప్పుడు సరికొత్త సినిమా తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు .
రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై లంకా కరుణాకర్ దాస్ నిర్మిస్తున్నారు.సినిమా మీద మంచి అభిరుచి ఉన్న ఈ దర్శక నిర్మాత లు చిత్ర నిర్మాణం కోసం అవసరమైన నూతన నటుల ఎంపికకు కూడా శ్రీకారం చుట్టారు. నటన పట్ల ఆసక్తి ఉన్న యువకులు తమ లేటెస్ట్ ఫోటోలను వారి వివరాలతో కలిపి ఈ దిగువ పేర్కొంటున్న ఈ మేల్ అడ్రెస్ కి పంపించవలసినదిగా ఈ సినిమా దర్శక నిర్మాత లు కోరుతున్నారు.

received_160986151387033

” నటన పట్ల ఆసక్తి కలిగి అవకాశం కోసం ఎదురుచూస్తున్న యువత కు ఒక చక్కని అవకాశం “

దలవాయ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో బాబా ని దర్శకుడిగా పరిచయం చేస్తూ రాజ్ దలవాయ్ ఒక చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రం ద్వారా నూతన నటీ-నటులకు అవకాశం కల్పించడానికి దర్శక-నిర్మాతలు కాస్టింగ్ కాల్ కు శ్రీకారం చుట్టారు. నటన పట్ల ఆసక్తి ఉన్న యువతి-యువకులు తమ లేటెస్ట్ ఫోటోలను వారి వివరాలతో కలిపి ఈ దిగువ పేర్కొంటున్న ఈ-మేల్ అడ్రెస్ కి పంపించగలరు.FB_IMG_1515239270381

నూతన నటీనటులకు అవకాశం

 

మశనీర్ ప్రొడక్షన్ హౌస్ పతాకం పై వీడు మాములోడు కాదు,జలక్ చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రేక్షకులకు ఎంతో దగ్గర అయిన దర్శకుడు రవి శర్మ . ఇప్పుడు నూతన చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమా మీద మంచి అభిరుచి ఉన్న ఈ దర్శక నిర్మాత లు చిత్ర నిర్మాణం కోసం అవసరమైన నూతన నటుల ఎంపికకు కూడా శ్రీకారం చుట్టారు. నటన పట్ల ఆసక్తి ఉన్న యువకులు తమ లేటెస్ట్ ఫోటోలను వారి వివరాలతో కలిపి ఈ దిగువ పేర్కొంటున్న ఈ మెయిల్ అడ్రెస్ కి పంపించవలసినదిగా ఈ సినిమా దర్శక నిర్మాత లు కోరుతున్నారు.received_10215337073842770

ప్రభాస్‌కు అనుష్క సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌

యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా అతడికి హీరోయిన్‌ అనుష్క ప్రత్యేక బహుమతి ఇచ్చిందట. ఈరోజు 38వ పుట్టినరోజు జరుపుకుంటున్న తన స్నేహితుడిని సర్‌ప్రైజ్‌ చేసేందుకు స్పెషల్‌గా ప్లాన్‌ చేసిందట. ఒక డిజైనర్‌ వాచీని గిఫ్ట్‌గా పంపి అతడిని ఆశ్చర్యానికి గురిచేసిందని ‘బాలీవుడ్‌లైఫ్‌’ వెల్లడించింది. ప్రభాస్‌కు వాచీలంటే ఇష్టమని అందుకే అతడికి డిజైనర్‌ చేతిగడియారాన్ని బహుమతిగా ఇచ్చిందని తెలిపింది.

పలు సినిమాల్లో కలిసి నటించిన వీరిద్దరూ మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ప్రభాస్-అనుష్క పెళ్లి చేసుకోబోతున్నట్టు ఇంతకుముందు వదంతులు వచ్చాయి. వీటిని ప్రభాస్ ఖండించారు. బహుబలి 2 తర్వాత ఎవరి ప్రాజెక్టుల్లో వాళ్లు బిజీ అయిపోయారు. ప్రభాస్‌.. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమాలో నటిస్తున్నాడు. అతడి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను నేడు విడుదల చేశారు. మరోవైపు అనుష్క.. ‘భాగమతి’ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.images (26)

మాంచి మెలోడి బిట్ లో నివేథా థామస్ తో రోమాన్స్ చేస్తున్న నవీన్ చంద్ర…

ఫస్ట్ లుక్, టిజర్ తోనే తెలుగు సిని ప్రేక్షకుల దృష్టి ని ఆకర్షించిన సినిమా జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్. ఇప్పుడు మరోసారి మ్యూజిక్ లవర్స్ ని కట్టిపడేసే పాట ని విడుదల చేసింది ఆ సినిమా టీం. రతీష్ వేగ సంగీత సారధ్యం లో ప్రాణం పోసుకున్న ఈ పాటకు కరుణాకర్ అందించిన సాహిత్యం మెయిన్ హైలేట్. ‘’నీకై వేచే కనులకే రాదే రాదు అలసటే, నిను చూసాక మనసే ఏగసే’’ అంటూ ఈ మధ్య కాలం లో విననటువంటి సరికొత్తగా అనిపించే ట్యూన్ కూడా మరొక ఆకర్షణ.
తన నటనాభినయం తో వరుస హిట్లు అందుకుంటున్న నివేథా థామస్ మరియు నవీన్ చంద్ర జంటగా అనురాగ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అనురాధ కొత్తపల్లి సమర్పిస్తుండగా కొత్తపల్లి రఘు బాబు, కే.బి చౌదరిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సుకుమార్ వద్ద పలు హిట్ సినిమాలకు సహాయకుడిగా పని చేసిన అజయ్ వోదిరాల దర్శకుడు.
ఆలి, అభిమన్యు సింగ్, తాగుబోతు రమేష్, జీవా, సుప్రిత్, గిరి, దేవన్, శ్రవణ్, రోహిణి వంటి భారి తారాగణం నటించగా భారి బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ గిరీష్ గంగాధరాన్ మరియు ఆథర్ విల్సన్. ఏడిటింగ్ ఎస్.బి ఉద్భవ్, ఆర్ట్ రాజీవ్ నాయర్, మలయాళం సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్ రతీష్ వేగ సంగీతం. అజయ్ వోదిరాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను త్వరలో విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సిద్దమవుతున్నారు.IMG-20171003-WA0111

https://youtu.be/aq_ngH7ZOE8

సోషల్ మీడియా లో సరికొత్త రికార్డ్ లు పలుకుతున్న పి.ఎస్.వి గరుడ వేగ..! నెం.1 ఇన్ ట్రేండింగ్.

యాంగ్రీ యంగ్ మాన్, విలక్షణ నటుడు డా రాజశేఖర్ నటిస్తున్న సినిమా పి.ఎస్.వి గరుడ వేగ. శివాని శివాత్మిక మూవీస్ సమర్పిస్తుండుగా, జ్యో స్టార్ ఎంటర్ప్రైజెస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు జాతీయ స్థాయి అవార్డు గ్రహిత ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తుండగా ఏం. కోటేశ్వర్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య విడుదల అయిన ఈ సినిమా టిజర్ సోషల్ మీడియా లో అతి తక్కువ వ్యవధి లో మూడు మిలియన్ లకు (3M) పైగా వీక్షించిన టిజర్ గా రికార్డ్ సృష్టించి నెం.1 ట్రేండింగ్ లో గత రెండు రోజులుగా కొనసాగుతుంది.
అద్భుతమైన కథ, అత్య అద్భుతమైన స్క్రీన్ ప్లే మరియు హైలి హాలీవుడ్ టెక్నికల్ వ్యాల్యుస్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా పై ప్రేక్షకులలో భారి అంచనాలు నెలకొన్నాయి. వరల్డ్ ఫేమస్ స్టార్ సన్నీ లియోన్ ఒక ప్రత్యేక సాంగ్ కి స్టెప్ లు వేయడం మరొక ఆకర్షణ.
రాజశేఖర్ కి సరిజోడి గా విశ్వరూపం ఫేం పూజా కుమార్ నటిస్తుండగా, కిషోర్, ఆలి, శ్రద్దా దాస్, నాజర్, అవసరాల శ్రీనివాస్, పృథ్వి మరియు ఇతర భారి తారాగణం నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం శ్రీ చరణ్ పాకాల మరియు భిమ్స్, సినిమాటోగ్రఫీ అంజి, గికా చేలిడ్జే, బకూర్ చికోబావా, సురేష్ రగుతు, శ్యాము, ఏడిటింగ్ ధర్మేంద్ర కాకరాల. భారి అంచనాలతో అతి త్వరలో మన ముందుకు రానున్న ఈ సినిమాకు నిర్మాత కోటేశ్వర్ రాజు, రచన దర్శకత్వం ప్రవీణ్ సత్తారు.
కెవి కుమార్ కావూరి.IMG-20170925-WA0037

సాగర్ దర్శకత్వంలో “నితీష్ రెడ్డి” హీరోగా “ప్రభాస్” చిత్రం ప్రారంభం.

నితీష్ రెడ్డి హీరోగా సీనియర్ డైరెక్టర్ సాగర్ దర్శకత్వంలో ఫార్చ్యూన్ మూవీస్ వారు నిర్మిస్తున్న”ప్రభాస్” చిత్రం 22 వ తేదీ ఉదయం అన్నపూర్ణ స్టూడియో లో వైభవంగా ప్రారంభం అయ్యింది. హీరో నితీష్ రెడ్డి, హీరోయిన్స్ నందిని, అమృత లపై ఫస్ట్ షాట్ చిత్రీకరించారు. ఈ ఫస్ట్ షాట్ కి ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు కెమెరా స్విచ్ ఆన్ చెయ్యగా,మరో సీనియర్ నిర్మాత,తెలంగాణ

ఎఫ్.డి.సి ఛైర్మెన్ పీ. రామ్మోహన్ రావ్ క్లాప్ కొట్టారు.ప్రముఖ దర్శకులు ఎస్.వి. కృష్ణా రెడ్డి తొలి షాట్ కి
దర్శకత్వం వహించారు. పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు
సాగర్ మాట్లాడుతూ…1983 లో రాకాసి లోయ సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించాను. మావారి గోల,
స్టువర్టుపురం దొంగలు, అమ్మ దొంగ, అమ్మానా కోడలా వంటి డిఫరెంట్ సినిమాలకు దర్శకత్వం వహించాను అన్నారు.
నిర్మాతలు అశోక్ , సతీష్ రెడ్డి మాట్లాడుతూ… ఖర్చుకు వెనకాడకుండా భారీగా ఈ సినిమాను నిర్మిస్తున్నాం,
తెలుగు , హిందీ, తమిళ,కన్నడ భాషలకు చెందిన నటీనటులు ముఖ్య పాత్రలు పోషించబోతున్నారు.
చిత్ర ప్రారంభానికి విచ్చేసిన చిత్ర రంగ ప్రముఖులకు దర్శక , నిర్మాతలు హీరో కృతజ్ఞతలు తెలిపారు.FB_IMG_1506081590843FB_IMG_1506081594602

నూతన నటీనటులకు అవకాశం

క్రిస్టో లైట్ మీడియ క్రియేషన్స్ పతాకం పై శ్రీ వర్ధన్ దర్శకత్వం లో ఒక నూతన చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా మీద మంచి అభిరుచి ఉన్న ఈ దర్శక నిర్మాత లు చిత్ర నిర్మాణం కోసం అవసరమైన నూతన నటుల ఎంపికకు కూడా శ్రీకారం చుట్టారు. నటన పట్ల ఆసక్తి ఉన్న యువకులు తమ లేటెస్ట్ ఫోటోలను వారి వివరాలతో కలిపి ఈ దిగువ పేర్కొంటున్న ఈ మేల్ అడ్రెస్ కి పంపించవలసినదిగా ఈ సినిమా దర్శక నిర్మాత లు కోరుతున్నారు.received_1637826802936796