Category Archives: Stories

అగ్రవర్ణ పేదల ews10% రిజర్వేషన్ సాధన రౌండ్ టేబుల్ సమావేశం

కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరించి ఆర్థికంగా వెనుక పడిన అగ్ర వర్ణ పేదలకు (ews) 10% రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వ విద్య, ఉద్యోగాలలో కల్పించిన విషయం మీ అందరికి తెలిసిందే, అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కూడ ఈ 10%రిజర్వేషన్ ను అగ్రవర్ణ పేదలకు విద్య ఉద్యోగాలలొ కూడ కల్పిస్తే అగ్రవర్ణ పేదలు కూడ సామాజికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని,
అంతే కాదు అగ్రవర్ణ పేదలకు ఈ 10% రిజర్వేషన్ రాజకీయంగా కూడ కల్పిస్తే, బ్రాహ్మణులు ఒక్కరే కాదు వైశ్య, రెడ్డి, మరియు ఇతర అగ్రవర్ణ కులాలు అందరూ కలిసి పోరాడితే అది సాధ్యం అవుతుందని విషయం మీద తేది 09-01-2021 బడంగ్పేట్ బ్రాహ్మణ కమ్యూనిటీ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది ఈ సమావేశం లొ ews 10% సాధన కొరకు ఏమి చేయాలే అనే విషయం చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిచుకోవడం జరుగుతుంది, ఈ సమావేశానికి అందరూ ఆహ్వానితులే, కాబట్టి బ్రాహ్మణ నాయకులు, అన్నిబ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు ఈ సమావేశానికి రావాలని శ్రీ వాణి గాయత్రి సేవా ట్రస్టు చైర్మన్ గుండెపూడి రమ శంకర్ గారు తెలియచేసారు .

https://youtu.be/iCa04-leZhU

 

inbound1863904885670147034

https://youtu.be/iCa04-leZhU

 

 

మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీ హస్తిన మహిళా మండలి నారీ అవార్డ్స్ ప్రదానోత్సవం

 

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన ప్రముఖ మహిళలకు స్త్రీ హస్తిన మహిళ మండలి నారీ అవార్డ్స్ పేరుతో సత్కరిస్తున్నట్లు శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి వ్యవస్థాపకురాలు మరియు అధ్యక్షురాలు మరియు శ్రీ హస్తినా మహిళా మండలి వ్యవస్థాపకురాలు, అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రం పూర్ణశాంతి గారు తెలియజేశారు. ఈ ఆవార్డులకు ఎంపికైన వారిలో విద్య, వైద్య, క్రీడా, సాహిత్యం, నాట్యం, సంగీతం తదితర రంగాలకు చెందిన మహిళలు ఉన్నారు. ఈ అవార్డలను మార్చి 7న ఉప్పల్ లో సత్కరించనుంది.

ప్రారంభమైన Aibsjac బ్రాహ్మణ సమైక్యత యాత్ర

బ్రాహ్మణ సమైక్యత కోసం ఆల్ ఇండియా బ్రాహ్మణ సంఘాల జాక్ ఈ రోజు నుండి 3 రోజులు ఆంధ్రప్రదేశ్ యాత్ర ప్రారంభించింది.

ఈ సందర్భంగా యాత్ర విజయవంతం అవ్వాలి రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి శ్రీ వేణు గోపాల చారి గారు, ఆధ్యాత్మిక వేత్త శ్రీ జ్యోతి దివ్య వేకంటరమణ మాత , శ్రీ దివ్య జ్ఞాన సిద్ధాంతి గారు, శ్రీ రాజేశ్వర్ శర్మ గారు జెండా ఊపి యాత్ర
ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాక్ చైర్ పర్సిన్ శ్రీమతి కే. గీతా మూర్తి గారు, శ్రీ రమాశంకర్ గారు,బాలసుబ్రహ్మణ్యం గారు శ్రీ శ్రీరంగం గోపి కృష్ణమాచార్యులు గారు , మోహన్ రావు గారు, శ్రావణి గారు, ఏ ఎస్ మూర్తి గారు, శ్రీప్రియ గారు,నీలకంఠ శర్మ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, ప్రభావతి గారు, శ్రీనివాస్ శర్మ గారు, మొదలగు జాక్ సభ్యులు కూడా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం ఈరోజు నుండి 3 రోజులు ఆంద్రప్రదశ్ రాష్ట్రం లోని విజయవాడ,గుంటూరు, బాపట్ల.మచిలీపట్నం తో పాటు మరికొన్ని కేంద్రలలో కొనసాగుతుందని జాక్ సభ్యులు తెలియచేసారు.

IMG-20190913-WA0061

మంచినీ, సంకల్పాన్నీ తట్టిలేపే కథ””

“”మంచినీ, సంకల్పాన్నీ తట్టిలేపే కథ””

ఒకానొక చిన్న పల్లెటూరు. అందులో చాలా పేరుగాంచిన జ్యోతిషపండితుడు నివసించేవాడు.

ఆయన చెప్పిన మాట పొల్లుపోదనీ చెప్పి ఫలితం తప్పుకాదనీ ఆ ఊరి ప్రజల విశ్వాసం.

ఆ నోటా ఈ నోటా విన్న ఓ పేదరైతు పక్కనున్న గ్రామం నుంచి జ్యోతిషుని దగ్గరకు వచ్చి తనకు జోస్యం చెప్పమనీ తన జాతకాన్ని అతనికి ఇస్తాడు.

తనపై నమ్మకముంచి వచ్చినందుకు ఆ పేదరైతుకు కూర్చోమని సైగచేసి అతని జాతకాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి చూస్తాడు.

ఎటువంటి జాతకాలను చూసినా చలించని ఆ జ్యోతిషుడు పేదరైతు జాతకం చూస్తూనే కంగారు పడతాడు.

ఎందుకంటే ఆ జాతకం ప్రకారం పేదరైతుకు ఆనాటి రాత్రి ప్రాణ గండం కనిపించడం వల్లనే.

ఎంతటి నిజాన్నైనా చెప్పగలను కానీ రైతుతో సూటిగా నీకు ప్రాణగండం ఉందని ఎలా చెప్పనని చింతించి ఎలాగోలా తనను తాను తమాయించుకొని రైతుకు ఏమాత్రం సందేహం రాకుండా ఇవాళ నాకు చాలా పనిఉంది.

మీ జాతకం నా దగ్గరే ఉంచి వెళ్ళండి. రేపు మీరు మళ్ళీ రాగలిగితే నేను నిశితంగా పరిశీలించి చెబుతాను అని అంటాడు.

జ్యోతిషునిపై మర్యాదతో ఆ పేదరైతు సరేనని కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోతాడు.

రైతు వెళ్ళగానే జ్యోతిషుడు తన భార్యతో విషయం చెబుతాడు.

కానీ మనసులో పాపం పేదరైతు నేడు మరణిస్తాడే. నేను రేపు రమ్మన్నాననే తలంపుతో వెళ్ళిపోయాడేనని చింతిస్తాడు జ్యోతిషుడు.

పేదరైతు జ్యోతిషుని ఇంటినుండి బయలుదేరి తన గ్రామానికి నడిచి వెళుతున్నాడు. దారిలోనే చీకటి పడటంతో తలదాచుకోవడానికి స్థలాన్ని వెదకడం మొదలుపెట్టాడు.

ఇంతలో కుండపోతగా వర్షం కురవసాగింది. కాస్త దూరంలో శిథిలావస్థలో శివుని ఆలయం కనిపించిందతనికి. అక్కడికి చేరుకొని ఆలయం ముందున్న మండపంలో నిలబడి ఆలయ స్థితిని చూసి ఎంతో బాధపడ్డాడు.

ప్రజలకు మనఃశ్శాంతినీ, భక్తి భావాలనూ పెంపొందించే ఆలయం నేడు ఈ దుస్థితికి చేరిందే. నా దగ్గర డబ్బుండుంటే నేను ఈ శివాలయాన్ని పునరుద్ధరించే ప్రయత్నాన్ని చేసేవాణ్నిని మనసులో అనుకుంటాడు.

మానసికంగానే ఎలా గోపురాన్ని నిర్మించాలి. రాజగోపురం ఎంత ఎత్తుగా ఉండాలి.

మండపాలు ఎలాకడితే బాగుంటుంది. అలా పూర్తిగా కట్టబడిన శివాలయంలో అభిషేకాలూ, పూజలూ నిర్విఘ్నంగా జరుగుతుంటే ఎంత బాగుంటుందనీ శివుని ఆన ఉంటే తప్పక అది జరుగుతుందనీ అనుకుంటుండగానే మండపం పైభాగంలోంచి నల్లని త్రాచుపాము అతనిని కాటు వేయడానికి అతనిపై దూకపోతుంటే తప్పించుకొని ఆ ఆలయం నుండి బయటకు వచ్చేస్తాడు.

మండపంతో సహా ఆ పాడుబడిన గుడి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది.

అమ్మయ్య! బతికి పోయాననుకొని ఇంటికి చేరుకుంటాడా పేదరైతు.

మరునాడు తన జాతకాన్ని గురించి తెలుసుకోవాలనుకొని జ్యోతిషుని దగ్గరకు వెళతాడు పేదరైతు.

అతణ్ని చూసి ఆశ్చర్యపోయిన జ్యోతిషుడు నా గణనలో తప్పు జరిగి ఉంటుందని చాలా శాస్ర్తాలను తిరగేసి మళ్ళీ మళ్ళీ అతని జాతకాన్ని పరిశీలిస్తాడు.

కానీ గణింపులో ఎక్కడా తేడాలేదు. అంతా సరిగ్గానే ఉంది. ఇక తప్పదన్నట్లు విషయం పేదరైతుకు వివరించి జ్యోతిషుడు నిన్న ఏం జరిగిందో ఏదీ మర్చిపోక తెలియజేయమని రైతుకు చెబుతాడు.

జరిగిందంతా వివరిస్తాడు పేదరైతు.

మంచి చేయాలని కేవలం తలింపు మాత్రంగా అనుకున్నందుకే ఇంత గొప్ప ఫలితం చేకూరితే మనకు చేతనైనంత మంచి చేస్తే ఎటువంటి జీవితం లభిస్తుందో రైతుకు జరిగిన సంఘటనే నిదర్శనం.

మనం బాగుండాలంటే మన ఆలోచనలు బాగుండాలి. మన ఆలోచనలు సత్సంకల్పాలయితే మన చుట్టూ ఉన్న ప్రపంచం బాగుంటుంది.

ప్రపంచం బాగుంటే అందులోని మనం కూడా బాగుంటాం.

అందుకే అంటారు అందరూ మంచిగా ఉండాలి. మంచివారి సంకల్పాలూ మంచిగా ఉండాలి.

మంచి అవకాశం నలుగురికి తెలపండి..!! నిరుద్యోగులకు ఉపాధి కలిపించండి!!!

Hindu TV

FB_IMG_1508910403974

కె .రాఘవేంద్ర రావు గారి మన్ననలను పొందిన ” జీవన సూత్రాలు

🌻 హిమాలయాల్లో పుట్టిన గంగానది అనేక మలుపుల గుండా ప్రయాణిస్తూ యావత్ ఆస్తిక మహాశయులను పునీతం చేస్తున్నట్టు, శారదాంబ కటాక్షంతో నిరాటంకంగా సాగుతున్న జీవన సూత్రాల రచనా ప్రయాణం కుడా పాఠకుల జీవితాల్లో నూతనోత్తేజం నింపుతూ నేడు ఒక గొప్ప మజిలీ చేరింది .
🌻 శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకేంద్రుడు కె .రాఘవేంద్ర రావు గారు , శతాధిక జీవన సూత్రాల ప్రయాణాన్ని అభినందిస్తూ , పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ నా కలను నెరవేర్చి ,నాలో ఉన్న కళను మరోమారు తట్టిలేపి , నా చేతి కలానికి కొత్త పరుగులు నేర్పి వెన్ను తట్టడం నిజముగా ఒక వరంగా భావిస్తున్నాను .
🌻మీ అందరూ నాపై చుపిస్తున్న అభిమానం అక్షయం కావాలని ఆశిస్తూ ……
మీ
డా .శివ ప్రసాద శాస్త్రిFB_IMG_1506577624440FB_IMG_1506577629919

జీవన సూత్రాలు ” భక్తి – భావం “

🌷నేను శాక్తేయుడను , శక్తిని ఆరాధిస్తాను .
“అందుకే విద్యుచ్ఛక్తిని ఆదాచేస్తాను , ఒకరి ఆత్మశక్తిి వృద్ధి చెందేలా ధైర్యంతో కూడిన మాటలు మాట్లాడతాను” .
🌷నేను వైష్ణవుడను , విష్ణును పూజిస్తాను .
“అందుకే , ఎదుటివారి ముఖం పైన చిరునవ్వు అలంకారమవడానికి కారణమవుతాను” .(అలంకారప్రియుడు విష్ణు )
🌷నేను శైవుడను , శివుణ్ణి అభిషేకిస్తాను .
“అందుకే , ఎదుటివారి మనస్సుని శివలింగం గా భావించి మమకారపు మధుర జల్లులతో అభిషేకిస్తాను” .(అభిషేక ప్రియుడు శివుఁడు )
🌷నేను గణాపత్యుడను , గణపతిని ప్రార్థిస్తాను .
“అందుకే , అందరి ముందుంటూ , అందరి బాధ్యతలను స్వీకరిస్తూ , ఎవరి జీవితాల్లో విఘ్నాలు సంభవించకుండా చూసుకుంటాను”. (గణేశుడే విఘ్నేశ్వరుడు )
🌷 డా .శివ ప్రసాద శాస్త్రి 🌷FB_IMG_1504244665373

తెలంగాణా క్రికెట్ కి మూలం …

 

తెలంగాణా ప్లేయర్స్ ని అన్యాయం జరుగుతువుంది ఈ క్రమంలో 1992 లో తెలంగాణా నుండి ఒక్క ప్లేయర్ మాత్రమే HCA రంజీ టీం కి ఎంపిక కావడం జరిగింది తర్వాత కాలంలో తెలంగాణా డిస్ట్రిక్ట్ నుండి హైదరాబాద్ రంజీ టీం లో ఒక్కరుకూడా లేకపోవడం గమనార్హం.HCA వాళ్ళు తెలంగాణా జిల్లాలనుండి మొహినుద్దులా క్రికెట్ కప్ కి ఒక టీం ని ఎంపిక చేసవారు కానీ గత కొంతకాలంగా ఆ ఒక్క అవకాశాన్ని కూడా HCA వాళ్ళు తొలగించారు ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణా జిల్లాల క్రీడాకారులు ఎక్కడ ఆడాలి?????
ఈలాంటి పరిస్థితులు తెలంగాణా క్రీడాకారులు ఎదురుకుంటున్న సమయం లో తెలంగాణా రాష్ట్రానికి గుర్తింపు రావాలనీ తెలంగాణ క్రికెటర్లను రంజిస్థాయి వరకు తీసుకెళ్లేందుకు
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చే ఉద్దేశ్యంతో
భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంనుంచి ఎక్కువ మంది ఆటగాళ్లు భారత్‌కు ప్రాతినిధ్యం వహించేలా చేయడమే లక్ష్యంగా,
తెలంగాణా క్రీడాకారులకు ప్రత్యేక హోదా ఉండాలనే మార్గం లో లవన్ కుమార్ అనే మాజీ క్రీడాకారుడు
వరంగల్ జిల్లా కేసముద్రం
అనే మారుమూల గ్రామానికి చెందిన క్రీడాకారుడు 2000 స లో క్రికెట్ వరంగల్ డిస్ట్రిక్ట్ S.G.F.I. టీం కి ఎంపిక కావడం జరిగింది అల
2001 లో అల్ ఇండియా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారు నిర్వహించే టోర్నమెంట్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తరుపున ఆడడం జరిగింది.
2002 .2003 లో అండర్-16 డిస్ట్రిక్ట్ టీం కెప్టెన్ గా 2003 లో అండర్-16 ఆంధ్రప్రదేశ్ కెప్టెన్ గ క్రికెట్ లో కెరియర్ ప్రారంబించాడు క్రమేపి 2004-5 స లో వరంగల్ డిస్ట్రిక్ట్ తరపున చాల టోర్నమెంట్ లలో పాల్గొన్నాడు .ఈ సమయం లో
వరంగల్ లోని కిట్స్ కాలేజీ మైదానం లో ఆంధ్రప్రదేశ్ ట్వంటీ20 క్రికెట్ అసోసియేషన్ వారు నిర్వహించిన సెలెక్షన్స్ లో అంబటి సుకుమార్ సెలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక అయ్యాడు.
2005 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కు కెప్టెన్ గ ఎంపిక కావడం డిల్లీలో జరిగిగే అండర్-19 అల్ ఇండియా టోర్నమెంట్ లో పాల్గొనడం జరిగింది .అక్కడ ప్రతిభ ఆదరంగా నేపాల్ లో జరిగిన అండర్-19 జూనియర్ ఆసియ కప్ కి సౌత్ ఇండియా టీం నుండి ప్లేయర్ గ పాల్గొన్నాడు .
అదేదే స0.లో నందిగామలో నిర్వహించిన ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ లో వరంగల్ కి కెప్టెన్ గ రాణించాడు
2006 లో ఆంధ్రప్రదేశ్ ట్వంటీ20 క్రికెట్ అసోసియేషన్ వారు జగితాల్ లో నిర్వహించిన ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ కి వరంగల్ డిస్ట్రిక్ట్ టీం కి కెప్టెన్ గా వ్యవహరించాడు.
2006 లో పంజాబ్ రాష్ట్రము పంచకుల లో జరిగిన ఈ.ట్.ఛ్.F (ఇండియన్ ట్వంటీ20 క్రికెట్ ఫెడరేషన్ ) కప్ కి ఆంధ్రప్రదేశ్ తరపున ఆడాడు.
2006 లో యూనివర్సిటీ అఫ్ ఆర్ట్స్ & సైన్స్ కాలేజీ లో స్పోర్ట్స్ కోటా లో ఉదయభాను రావు వరంగల్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ ద్వరా కాలేజీ లో చేరడం జరిగింది యూనివెర్సిటీ సెలెక్షన్స్ లో వరంగల్ జోనేల్ టీం కి ఎంపిక అయ్యాడు తరవాత ఈనాడు టోర్నమెంట్ లో ఆర్ట్స్ కాలేజీ తరపున విజయాలలో కీలక పాత్ర పోషించాడు
EENADU ఛాంపియన్షిప్ లలో తెలంగాణా జోన్ నుండి హైదరాబాద్ . విజయవాడ . లో ఆర్ట్స్ కాలేజీ తరపున ఆడాడు
2007 -2008-2009 లో కాకతీయ UNIVERCITY తరపున అల్ ఇండియా యూనివర్సిటీ మచ్ లకు ఏమ్పికకవడం జరిగింది
2007 లో గుంటూరు నర్సారవ్పేట లో జరిగిన స్టేట్ లెవెల్ క్యాంపు లో రాణించి హైదరాబాద్ టీం కి కెప్టెన్ గ జార్ఖండ్ రాష్ట్రము ధన్బాద్ లో జరిగిన Inter స్టేట్ టోర్నమెంట్ లో ఆడాడు
అదే స లో పంజాబ్ లో నభ లో జరిగిన సీనియర్ అల్ ఇండియా ఛాంపియన్షిప్ కి ఆంధ్రప్రదేశ్ కి కెప్టెన్ గ ఆడాడు
2007 లో నే మల్లి నేపాల్ లో జరిగిన ఇండో -నేపాల్ ఛాంపియన్షిప్ కి ITCF -A టీం కి కెప్టెన్ గ వ్యవహరించాడు
2008 మెదక్ జిల్లా మెత్పెల్లి లో నిరహించిన స్టేట్ క్యాంపు లో సత్తా చాటాడు
విదర్భ . తమిళనాడు మహారాష్ట్ర రాజస్తాన్ డిల్లి కాశ్మీర్ ఇలా అనేక రాష్ట్రాలలో ఇండియన్ ట్వంటీ20 క్రికెట్ ఫెడరేషన్ వారు నిర్వహించిన అల్ ఇండియా టోర్నమెంట్ లలో ఆంద్ర . హైదరాబాద్ జట్లకు పలు రకాలుగా కెప్టెన్ గ వ్యవహరించాడు
2009-10 లో HCA అండర్ లో జరిగే మొహినుద్దిల రంజీ ట్రోఫీ కి కామ్బండ్ డిస్ట్రిక్ట్ టీం ప్లేయర్ గ ఆడాడు
2010-12 స లో ఇండియన్ క్రికెట్ ఫెడరేషన్ వారు దూరదర్శన్ వారి ప్రత్యెక ప్రసారం లో నిర్వహించిన ఇండియన్ ప్రీమియర్ కార్పొరేట్ లీగ్ లో సౌత్ ఎగలేస్ తరపున ఆడడం జరిగింది
తర్వాత
తెలంగాణా గ్రామీణ పట్టణ ప్లేయర్స్ కోసం 2012 లో ఇండియన్ క్రికెట్ అకాడమి వారి అద్వర్యం లో జరిగే అల్ ఇండియా ఇంటర్ స్టేట్ ఛాంపియన్షిప్ కి తెలంగాణా రాష్ట్రము నుండి బాద్యత స్వీకరిస్తూ కెప్టెన్ గా మధ్యప్రదేశ్ లో జరిగిన అల్ ఇండియా క్రికెట్ ఛాంపియన్షిప్ లో మొట్టమొదట తెలంగాణా రాష్ట్రము నుండి పాల్గొనడం జరిగింది తర్వాత పంజుబ్ లో ని Jalender లో జరిగిన అల్ ఇండియా క్యాంపు కి తెలంగాణా రాష్ట్రము నుండి 7 మంది ప్లేయర్స్ ని పంపియడం జరిగింది తర్వాత ఇండియన్ ట్వంటీ20 క్రికెట్ ఫెడరేషన్ వారు తెలంగాణా జోన్ కి ఆర్గనైజింగ్ సెక్రటరీ గ నియమించడం జరిగింది
2013 జనవరి లో తెలంగాణా ట్వంటీ20 క్రికెట్ అసోసియేషన్ ని స్థాపించి ఫౌండర్ జనరల్ సెక్రటరీ గ తెలంగాణా రాష్ట్రము లోని అన్ని జిల్లాల నుండి ప్రతిభగల క్రీడాకారులను ఎంపిక చేసి వివిధ రాష్ట్రాలలో జరిగే అల్ ఇండియా ఇంటర్ స్టేట్ టోర్నమెంట్ లకు పంపియడం జరుగుతుంది
ఈ అసోసియేషన్ ని ముందంజలో నడిపించే క్రమం లో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ని 2015 లో శ్రీ పేరాల శేకర్ రావు గారి అద్వర్యం లో ఏర్పాటు చేయడం జరిగింది
ఈ అసోసియేషన్ కి పెరలా శేఖర్ రావు గారు ప్రెసిడెంట్ గ వున్నారు .
లవన్ కుమార్ గొట జనరల్ సెక్రటరీ & చీఫ్ కోచ్ గ తెలంగాణా క్రికెట్ అసోసియేషన్ కి నియమితులయ్యారు
2015 అక్టోబర్ 28 నుండి 31 వరకు ప్రముఖ లాల్ భాహాదుర్ స్టేడియం లో నిర్వహించిన తెలంగాణా ఇంటర్ డిస్ట్రిక్ట్ డాక్టర్ ఏ పి జె అబ్దుల్ కలం మెమోరియల్ కప్ టోర్నమెంట్ లో తెలంగాణా క్రికెట్ అసోసియేషన్ ముఖ్య కార్యదర్శిగా కీలక పాత్ర పోషించారు. తెలంగాణా క్రికెట్ అకాడమీ
మొత్తం అన్ని ఏజ్ కేటగిరి లలో ఇప్పటివరకు 47 సార్లు తెలంగాణా రాష్ట్రము తరపున ఇంటర్ స్టేట్ అల్ ఇండియా టోర్నమెంట్ లలో Lavankumar అద్వర్యం లో తెలంగాణా అసోసియేషన్ టీం పాల్గొన్నది
2012
జూలై jalender
సెప్టెంబర్ భార్గట్(m.p)
అక్టోబర్ (అహ్మదబాద్)
(IPCL, Live మ్యాచ్ లకు తెలంగాణా నుండి 4 ప్లేయర్లు సౌత్ ఈగల్స్ టీం లో ఆడారు)
డిసెంబరు (రాజస్థాన్ )
2013
అస్సాం
జమ్మూ (దోడ)
చెన్నై
మథుర ఉత్తరప్రదేశ్
హర్యానా (పంజాబ్)
అహ్మదాబాద్
బెంగుళూర్
శ్రీనగర్
జైపూర్
2014 లో
Laknow
ఉత్తరాఖండ్
శ్రీనగర్
గోవా
కొలకత్తా
చెన్నై
బెంగళూర్
పాండిచ్చేరి
విజయవాడ
2015
రాజస్తాన్
షిర్డీ
వెస్ట్ బెంగాల్
జైపూర్
నాగపూర్
భార్గాట్ (మద్తప్రదేశ్)
కర్ణాటక
గోవా
హైదరాబాద్
మహారాష్ట్ర
రాజస్థాన్(Lalsot)

2016 లో

ఇంటర్ డిస్ట్రిక్ట్
రేపల్లె (ఆంధ్ర)
షిర్డీ(మహారాష్ట్ర)
జైపూర్
వెస్టబెంగల్
హర్యానా
షిర్డీ
గోవా
సౌత్ ఇండియా కప్ హైదరాబాద్
నేపాల్
ఆగ్రా

2017 లో
గోవా
కోల్కత్తా
మధ్యప్రదేశ్ జబల్ పూర్
రాజస్థాన్ కరన్సర్
వెస్ట్ బెంగాల్ కల్యాణి గోషపూర్
జైపూర్ అండర్ 19

ల్లో ఇంటర్ స్టేట్ అల్ ఇండియా టోర్నమెంట్ లలో తెలంగాణ రాష్ట్రము తరపున ఫౌండర్ లవన్ కుమార్ ఆధ్వర్యం లో పాల్గొన్నది.
COME TO LEARN PLAY TO WIN.. అనే స్లోగన్ తో
లవన్ కుమార్ 2012 లో తెలంగాణా ట్వంటీ20 క్రికెట్ అసోసియేషన్ ని స్థాపించి ఫౌండర్ జనరల్ సెక్రటర తెలంగాణ అయింది.ఆ
తర్వాత
2014 లో : తెలంగాణ క్రికెట్ అకాడమీ ఫౌండర్ ప్రెసిడెంట్ గా

2015 లో
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్,
మరియు తెలంగాణా ప్రీమియర్ లీగ్
ని స్థాపించి రురల్ లో వుండే తెలంగాణా క్రీడాకారులకి ఒక వేదికను సిద్దం చేశారు ..received_1401434179944180received_1401434413277490received_1401429293278002received_1401433696610895received_1401433836610881received_1401433913277540received_1401433943277537received_1401434413277490

జులై 3 నబ్రాహ్మణఅభ్యుదయ పరిషత్,రంగారెడ్డి జిల్లా నూతన భవన శంకుస్థాపన

హైదరాబాద్ నగర శివారు నాదరుగుల్
లో సోమవారం బ్రాహ్మణఅభ్యుదయ పరిషత్,రంగారెడ్డి జిల్లా నూతన
భవనం శంకుస్థాపన జరుగనున్నది. వేద పాఠశాల ఆచార్యులు, ఘనాపాఠీలు, వేద విద్యార్థుల ప్రముఖుల సమక్షంలో శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ,బ్రాహ్మణ భవన నిర్మాణం చేపట్టాలని సత్సంకల్పం తో 3/7/2017 సోమవారం ఉదయం8.30 గంటలకు మన సంఘ నూతన భవన నిర్మాణ శంకుస్థాపన జరుగును కావున బ్రాహ్మణ బందువులు శ్రేయోభిలాషులు అందరు కార్యక్రమాన్ని విజవంతం చేసి సంఘ అభివృద్ధికి తోడ్పడలని తెలియచేసారు.IMG-20170628-WA0074

శ్రీ గాయత్రీ ఈవెంట్స్ &వెడ్డింగ్ ప్లానర్

నామకరణం.. మొదలుకుని వేడుకలు, ఎంగేజ్‌మెంట్‌, వివాహ మహోత్సవం రిసెఫ్షన్‌, ఇతర వేడుకల వరకు ఏ సందర్భమైనా వేడుక స్థలం, సమయం చెబితే చాలు… మనకు నచ్చిన రీతిలో అంగరంగ వైభవంగా జరిపించే, జీవితకాలం గుర్తుంచుకునే విధంగా బంధువులంతా అహో అనిపించేంత గొప్పగా ఏర్పాట్లు చేసే ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ వెడ్డింగ్‌ ప్లానర్స్‌ జిల్లాలోనూ ఉన్నారు. మహానగరాలకు దీటుగా ప్రతి ఒక్కరూ మెచ్చే విధంగా హైటెక్‌ హంగులతో సంప్రాదాయ బద్దంగా వేడుకలను చేస్తున్నారు. పెళ్లిపందిళ్లలో అతిథులను ఆహ్వానించేందుకు వెలకమ్‌ డాల్‌, పల్లకీలు, గుర్రపు బగ్గీలు వివిధ రకాల వాయిద్యాలు, డిజెమిక్స్‌లు
హ్లాదకరమైన వాతావరణం కోసం ఆర్కెస్ట్రాతో సంగీత కచేరి, బంధువులంతా కలసి ఆడుకునేందుకు దాండియా, కోలాటం… ఒకటేమిటి… అన్ని విధాల ఆహ్లాదపరుస్తారు. సెలబ్రిటీలతో వ్యాఖ్యానించడం సహా ‘సకల సదుపాయాలు మన ముంగిట్లో’ అన్నట్టుగా నిర్వహిస్తారు… ఈ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ నిర్వాహకులు.received_1790564864418360