నీకు మాత్రమే చెప్తా అంటున్న తరుణ్ భాస్కర్

గతంలో మాదిరిగా ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువగా ధియేటర్ల వైపు పరుగులు పెట్టడం లేదు. కావలసినంత వినోదం స్మాల్ స్క్రీన్ లో దొరుకుతుంది. సీరియల్స్, వీక్లి ప్రోగ్రామ్సే కాదు, రిలీజైన తక్కువ రోజుల్లోనే సినిమాలు కూడా బుల్లితెరపై ప్రత్యక్షమవుతున్నాయి. అందుకే స్మాల్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ మీద చాలా డిమాండ్ ఉంది. కొద్ది కాలంగా బుల్లితెర మీద వీక్లి ప్రోగ్రామ్స్ కి క్రేజ్ పెరిగింది. కామెడీ షోలు, డాన్స్ బేస్డ్ షోలు, రియాలిటీ షోల వల్ల, ఆడియన్స్ కి స్మాల్ స్క్రీన్ మీద చాలా ఎంటర్టైన్మెంట్ దొరుకుతోంది. తెలుగులో టాప్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ అయిన ఈటివిలో చూస్తే…వీక్లి ప్రోగ్రామ్స్ ఎక్కువగా ఈటివిలోనే ఉంటున్నాయి.
మన తెలుగు లో కింగ్ నాగార్జున ,రానా దగ్గుబాటి నెం1 యారీ ప్రోగ్రామ్స్
హోస్ట్ గా వ్యవరించి భారీ హిట్ చేసిన సంగతి తెలిసిందే, ఇప్పుడు తెలుగు దర్శకులు కూడా ఆ తరహా ప్రోగ్రాం లకు వ్యాఖ్యాతలు గా మారటంతో ఒక్కసారిగా సగటు అభిమానులు ఈ ప్రోగ్రాం కోసం ఎదురుచూస్తున్నారు.
పెళ్లిచూపులు అనే చిన్న సినిమాతో పెద్ద క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. ఫలక్‌నుమా దాస్, మీకు మాత్రమే చెప్తా అంటూ నటుడిగా తన సత్తాను చాటాడు. ఇలా మల్టీ టాలెంటెడ్‌గా తన లోని భిన్న కోణాలు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు. తాజాగా మరో కొత్త అవతారమెత్తి ప్రేక్షకులను మెప్పించేందుకు వస్తున్నాడు. ఆ విశేషాలేంటో ఓ సారి చూద్దాం. ఢీ ,క్యాష్ స్టార్ స్పోర్ట్స్ ప్రో కబడ్డీ వంటి పలు ప్రోగ్రాం లు ఇంకా మరెన్నో ప్రోగ్రాంలకి అసోసియేట్ డైరెక్టర్ గా చేసిన శరత్ చంద్ర బొద్దనపల్లి తొలిసారిగా దర్శకుడు గా మారి ఓ షో డైరెక్ట్ చేస్తున్నారు. తొలి ప్రయత్నం తోనే ఓ పెద్ద షో ద్వారా ప్రేక్షకుల ముందు రానున్నారూ.1N2A1673
తరుణ్‌భాస్కర్ చేస్తున్న ఈ టాక్‌షో పేరు ‘నీకుమాత్రమే చెప్తా’. ప్రజాప్రభాకర్, శ్రీకాంత్ నిర్మాతలు. డైరెక్టర్‌ను మరో డైరెక్టర్ ఇంటర్వ్యూ చేయడం ఈ షో ప్రత్యేకత. ఒక డైరెక్టర్ వెనుక ఎన్ని కష్టాలు ఉన్నాయి?ఒక డైరెక్టర్ వెనుక ఎంత కష్టం ఉంది అనేది ఈ షో లో చూపించడం జరుగుతుంది. 87133140_2678652855503718_2454904431951478784_nఈ షో
ఈ శనివారం నుండి ఈ టివి ప్లస్ లో ప్రతి శనివారం సాయంత్రం 9 గంటలకు ప్రసారం కానున్నది.