మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీ హస్తిన మహిళా మండలి నారీ అవార్డ్స్ ప్రదానోత్సవం

 

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన ప్రముఖ మహిళలకు స్త్రీ హస్తిన మహిళ మండలి నారీ అవార్డ్స్ పేరుతో సత్కరిస్తున్నట్లు శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి వ్యవస్థాపకురాలు మరియు అధ్యక్షురాలు మరియు శ్రీ హస్తినా మహిళా మండలి వ్యవస్థాపకురాలు, అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రం పూర్ణశాంతి గారు తెలియజేశారు. ఈ ఆవార్డులకు ఎంపికైన వారిలో విద్య, వైద్య, క్రీడా, సాహిత్యం, నాట్యం, సంగీతం తదితర రంగాలకు చెందిన మహిళలు ఉన్నారు. ఈ అవార్డలను మార్చి 7న ఉప్పల్ లో సత్కరించనుంది.