Monthly Archives: March 2020

నీకు మాత్రమే చెప్తా అంటున్న తరుణ్ భాస్కర్

గతంలో మాదిరిగా ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువగా ధియేటర్ల వైపు పరుగులు పెట్టడం లేదు. కావలసినంత వినోదం స్మాల్ స్క్రీన్ లో దొరుకుతుంది. సీరియల్స్, వీక్లి ప్రోగ్రామ్సే కాదు, రిలీజైన తక్కువ రోజుల్లోనే సినిమాలు కూడా బుల్లితెరపై ప్రత్యక్షమవుతున్నాయి. అందుకే స్మాల్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ మీద చాలా డిమాండ్ ఉంది. కొద్ది కాలంగా బుల్లితెర మీద వీక్లి ప్రోగ్రామ్స్ కి క్రేజ్ పెరిగింది. కామెడీ షోలు, డాన్స్ బేస్డ్ షోలు, రియాలిటీ షోల వల్ల, ఆడియన్స్ కి స్మాల్ స్క్రీన్ మీద చాలా ఎంటర్టైన్మెంట్ దొరుకుతోంది. తెలుగులో టాప్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ అయిన ఈటివిలో చూస్తే…వీక్లి ప్రోగ్రామ్స్ ఎక్కువగా ఈటివిలోనే ఉంటున్నాయి.
మన తెలుగు లో కింగ్ నాగార్జున ,రానా దగ్గుబాటి నెం1 యారీ ప్రోగ్రామ్స్
హోస్ట్ గా వ్యవరించి భారీ హిట్ చేసిన సంగతి తెలిసిందే, ఇప్పుడు తెలుగు దర్శకులు కూడా ఆ తరహా ప్రోగ్రాం లకు వ్యాఖ్యాతలు గా మారటంతో ఒక్కసారిగా సగటు అభిమానులు ఈ ప్రోగ్రాం కోసం ఎదురుచూస్తున్నారు.
పెళ్లిచూపులు అనే చిన్న సినిమాతో పెద్ద క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. ఫలక్‌నుమా దాస్, మీకు మాత్రమే చెప్తా అంటూ నటుడిగా తన సత్తాను చాటాడు. ఇలా మల్టీ టాలెంటెడ్‌గా తన లోని భిన్న కోణాలు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు. తాజాగా మరో కొత్త అవతారమెత్తి ప్రేక్షకులను మెప్పించేందుకు వస్తున్నాడు. ఆ విశేషాలేంటో ఓ సారి చూద్దాం. ఢీ ,క్యాష్ స్టార్ స్పోర్ట్స్ ప్రో కబడ్డీ వంటి పలు ప్రోగ్రాం లు ఇంకా మరెన్నో ప్రోగ్రాంలకి అసోసియేట్ డైరెక్టర్ గా చేసిన శరత్ చంద్ర బొద్దనపల్లి తొలిసారిగా దర్శకుడు గా మారి ఓ షో డైరెక్ట్ చేస్తున్నారు. తొలి ప్రయత్నం తోనే ఓ పెద్ద షో ద్వారా ప్రేక్షకుల ముందు రానున్నారూ.1N2A1673
తరుణ్‌భాస్కర్ చేస్తున్న ఈ టాక్‌షో పేరు ‘నీకుమాత్రమే చెప్తా’. ప్రజాప్రభాకర్, శ్రీకాంత్ నిర్మాతలు. డైరెక్టర్‌ను మరో డైరెక్టర్ ఇంటర్వ్యూ చేయడం ఈ షో ప్రత్యేకత. ఒక డైరెక్టర్ వెనుక ఎన్ని కష్టాలు ఉన్నాయి?ఒక డైరెక్టర్ వెనుక ఎంత కష్టం ఉంది అనేది ఈ షో లో చూపించడం జరుగుతుంది. 87133140_2678652855503718_2454904431951478784_nఈ షో
ఈ శనివారం నుండి ఈ టివి ప్లస్ లో ప్రతి శనివారం సాయంత్రం 9 గంటలకు ప్రసారం కానున్నది.

బ్రాహ్మణాభ్యుదయ పరిషత్ (రంగారెడ్డి జిల్లా) నూతన కార్యవర్గం ఎన్నిక

 

బ్రాహ్మణాభ్యుదయ పరిషత్ (రంగారెడ్డి జిల్లా) నూతన కార్యవర్గం ఎన్నిక నాదరుగుల్ లో బ్రాహ్మణాభ్యుదయ పరిషత్ భవనం లో గొట్టిముక్కుల నరసింహ శర్మ గారి అధ్యక్షత న ఈ రోజు జరిగింది.
కార్యవర్గ సభ్యులు వివరాలు
గౌరవ అధ్యక్షులు :
1.పాల రాజశేఖర్ శర్మ
2.శ్రీరామకావచం అంబాప్రసాద్ శర్మ
3.బంధకవి వెంకట రమణ శర్మ

అధ్యక్షులు: డేరం భాస్కర శర్మ
ఉపాధ్యక్షులు:1.కుర్మెటి శ్రీధర్ శాస్ట్రీ
2.భిన్నురి నరసింహ శర్మ
ప్రధాన కార్యదర్శి: చింతలపల్లి మధు బాబు
కోశాధికారి: డేరం గోపీ శర్మ
సహాయ కార్యదర్శి :వరహాల రవీందర్ శర్మ
కార్యదర్శి:చింతలపల్లి నరేందర్ శర్మ
ప్రచార కార్యదర్శి:ఎల్లికంటి వంశీకృష్ణ శర్మ
ఎగ్జికుటివ్ మెంబర్స్ :
పప్పు నాగేశ్వర శర్మ
సత్యనారాయణ మూర్తి
పాల సదాశివ శర్మ
గౌరవ సలహాదారులు
గుండాల గోపాల కృష్ణయ్య శర్మ
ఎల్లికంటి శ్యామ్ సుందర శర్మ
సురభి నాగరాజు
న్యాయ సలహాదారు :గుండెపుడి రమశంకర్ శర్మ
భవన నిర్వహణ కమిటీ
అధ్యక్షులు :కుర్మెటి శ్రీనివాస్ శర్మ
సహాయ అధ్యక్షులు:ఎల్లికంటి శ్యామ్ సుందర శర్మ
కార్యదర్శులు
1.వేముల రాజేశ్వర రావు
2.గోవిందు కిషన్ శర్మ
3.కుర్మెటి ప్రవీణ్ శర్మ

వైదిక కార్యక్రమాల నిర్వహణ
వ్యాఖ్యాత :రంగి సత్యనారాయణ శర్మ
మాడా సుధాకర్ శర్మ
గుండాల అనంత పద్మనాభ శర్మ
నితీష్ కులకర్ణి
సృష్టి రఘురామ శర్మ
మహిళ సంఘ సభ్యులు
అధ్యక్షురాలు డేరం విజయ లక్ష్మి
ఉపాధ్యక్షురాలు శ్రీరామకావచం అంబుజ
కార్యదర్శి :కుర్మెటి గిరిజ
కోశాధికారి :కుర్మెటి ఉమారణి
కొన్ని అనివార్య కారణాల కారణంగా యువజన విభాగం ఎన్నికలు వాయిదా కావడం జరిగింది.
ఈ కార్యక్రమంలో
బ్రాహ్మణాభ్యుదయ పరిషత్ రంగారెడ్డి జిల్లా సంఘం ప్రతినిధులు మహిళ సంఘ మరియు యువజన సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.IMG-20200308-WA0010

మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీ హస్తిన మహిళా మండలి నారీ అవార్డ్స్ ప్రదానోత్సవం

 

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన ప్రముఖ మహిళలకు స్త్రీ హస్తిన మహిళ మండలి నారీ అవార్డ్స్ పేరుతో సత్కరిస్తున్నట్లు శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి వ్యవస్థాపకురాలు మరియు అధ్యక్షురాలు మరియు శ్రీ హస్తినా మహిళా మండలి వ్యవస్థాపకురాలు, అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రం పూర్ణశాంతి గారు తెలియజేశారు. ఈ ఆవార్డులకు ఎంపికైన వారిలో విద్య, వైద్య, క్రీడా, సాహిత్యం, నాట్యం, సంగీతం తదితర రంగాలకు చెందిన మహిళలు ఉన్నారు. ఈ అవార్డలను మార్చి 7న ఉప్పల్ లో సత్కరించనుంది.