*ప్రపంచ సంతోష దినోత్సవం సందర్భంగా*……
సంతోషం అనేది అందరికీ ఒకలాగా ఉండదు. నిజానికి సంతోషం అంటే తమకు బాగా ఇష్టమైన అంశం అందుకోగలగటమే . అందుకోసమే అందరూ కృషిచేస్తారు. ఒక్కొక్కరికి ఒకలాంటి ఆనందం ఉంటే మరొకరికి మరోక ఆనందం ఉంటుంది ఇలా ఎందుకుంటుందంటే వారు పెరిగిన వాతావరణం, వారి కర్మఫలాలను బట్టి ఉంటుంది.
ఆనందం అందించే అంశం ఏమిటో అది ఎలా అందుకోవాలి అనే దాని దగ్గరే అసలు సమస్య ఉంది. ఆనందం అనేది మనసుకు సంబంధించినది. దానికోసం మనిషి చెడు మార్గాలోకి కూడా వెళతాడు. సమస్యలు అక్కడే మొదలవుతాయి అతని అభివృద్ధికి అవరోధం అవుతాయి మానసిక సమస్యలు సృష్టిస్తాయి.
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. దృఢమైన శరీరంలోనే దృఢమైన మనసు ఉంటుందని కూడా అన్నారు. మనిషి మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉండగలడు. ఆనందంగా ఉండేవారు ఆరోగ్యంగా, హాయిగా ఉంటారు. ఇవి పరస్పర పూరకాలు. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. మానవ మనస్తత్వానికి సంబంధించిన అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ‘మన శరీరాలు మన పూదోటలు. మన మనసులు మన అభీష్టాలూ.. వాటికి తోటమాలులు, వీలు కాకపోతే నిస్సారంగా విడిచి పెట్టవచ్చు. లేదా పరిశ్రమతో పండించుకోవచ్చు…’ అంటాడు షేక్‌స్పియర్‌. అయితే స్వీకరించే మనసుల్ని బట్టి ఆ ఆనందం ఎంత అనేది తెలుస్తుంది. ఒక హృదయం నుంచి మరో హృదయానికి నేరుగా తాకే ఓ సంకేతమే ఆనందం. మనుషులు మాత్రమే మాట్లాడుకునే ఓ అనుభూతి మాధ్యమమే ఆనందం. గిలిగింతల ఉద్వేగమే ఆనందం. ఈ ఆనందం ఒక మనిషికి మరో మనిషి వల్లో, ప్రకృతి వల్లో వస్తుంది. కొనుక్కోవడానికి ఇది అంగట్లో దొరికే వస్తువు కాదు. ఈ సంతోషానికి మనిషికీ జంతువుకీ పెద్ద తేడాలేదు ఒక్క విచక్షణలో తప్ప. ఆకలి, దాహం, నిద్ర, మైధునం- వీటిలో మనిషికి, జంతువుకి తేడాలేదు. ‘మనిషిలో ఉన్నట్లే జంతువులోనూ స్పందనలుంటాయి. ఆనందం అయినా… బాధ అయినా అవికూడా స్పందిస్తాయి’ అంటాడో రచయిత. హాస్య ప్రవృత్తిలేని, నవ్వటం చేతకాని మనుషుల గురించిజాషువా ఇలా అన్నారు………. ….. ‘నవ్వవు జంతువుల్‌ నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికిన్‌ దివ్వెలు…’ ………… ప్రతి మనిషీ ఆనందంగా ఉండాలనే కోరుకుంటాడు. కొందరు నిజంగానే ఉంటారు. చాలామంది ఉన్నామనుకుంటారు. మరికొందరు ఆనందంగా వున్నట్లు నటిస్తుంటారు. ఏది ఏమైనా నిజమైన అనందం ఎప్పుడు కలుగుతుంది అంటే మనస్ఫూర్తిగా ఈర్ష్య ఆసూయలను దూరం చేసుకోవాలి… అలాగే మన ప్రక్కవాడు ఎదుగుతున్నాడు అంటే వాడి కృషి వాడి పట్టుదల వాడి పూర్వజన్మ వాసనాఫలం.. భగవత్ కృప ఈ నాలుగే.ఇవి లేకుండా నేను ఎదగలేక పోయానే అని బాధ పడకూడదు…అలా ఉన్న రోజు నువ్వు ఎంత సంపాదనా పరుడవైన ఎంత మంచి ఉద్యోగం లో ఉన్న…నీవు ఏమి లేనివాడితోనే సమానం!భగవంతుడు నా చదువుకు నా అర్హతకు ఇదే ఇచ్చాడు చాలు అనుకోవడంలో తృప్తి ఉంటుంది ఆ తృప్తి నుంచి మేలైన ఆనందం కలుగుతుంది.
ప్రపంచవ్యాప్తంగా మనుషులెంత సంతోషంగా జీవిస్తున్నారో తెలియజేసే ఒక సూచికను వరల్డ్‌ హ్యాపీనెస్‌ ఇండెక్స్‌ ఇటీవల విడుదల చేసింది. ఐరాస లెక్కల ప్రకారం 2016లో 118వ స్థానంలో వుంటే, 2017 నాటికి 122వ స్థానానికి చేరింది. తాజాగా ఐరాస లెక్కల ప్రకారం సంతోషం వెల్లివిరిసే జనాభాలో ఇండియా 133వ స్థానానికి దిగజారింది. ఫోర్బ్స్ అనే పత్రిక అంచనా ప్రకారం ప్రపంచములో సంతోషముగా ఉన్న మొదటి 20 దేశాలలో భారత దేశం లేదు….కానీ ప్రపంచములో సంపన్నులుగా ఉన్నవారు మొదటి 20 దేశాలలో మనవారు కూడా ఉన్నారు. డబ్బు ఉంటే ఆనందం ఉంటుంది అనుకుంటే… అది అంతా ఒట్టి భ్రమే.మనకున్న దాంట్లో నలుగురికి సహాయం చేస్తే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.. సహాయం అంటే ఇక్కడ ధనమే కాదు ..మాట సాయం కూడా కావొచ్చు ..ఒక్కోసారి పెద్ద పెద్ద మందులతో నయం కాని జబ్బులు కూడా మాటలతో నమ్మకంతో నయం అయ్యాయి అని చరిత్ర చెప్పిన సత్యం.. చిన్న చిన్న వాటిలో కూడా ఆనందం వెతుక్కునే పసి పిల్లల తత్వం, భగవంతుని మీద విశ్వాసం మనకి వస్తే..అదే మన సంతోషాలకి తాళంచెవి అని తెలియజేస్తూ……ఈ రోజు ప్రపంచ సంతోష దినోత్సవం సందర్భంగా…. ఒక మంచి పాట పల్లవితో…మన ఆనందాలను పెంచుకుందాం!! అందమే ఆనందం అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం. అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం. అందమే ఆనందం
పడమట సంధ్యారాగం కుడి ఎడమల కుసుమపరాగం
పడమట సంధ్యారాగం కుడి ఎడమల కుసుమపరాగం
ఒడిలో, చెలి మోహనరాగం ఒడిలో, చెలి మోహనరాగం
జీవితమే మధురానురాగం జీవితమే మధురానురాగం
అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం.
అందమే ఆనందం..
..శ్రీపాదశ్రీవల్లభ చరణదాసుడు *మానికొండ రాజశేఖర్ శర్మ* విద్యా ఆధ్యాత్మిక వేత్త వాస్తు జ్యోతిష నిపుణులు భారతీయ జనతాపార్టీ ధార్మికసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సెల్9493882906 వాట్సాప్ 9154466606IMG-20190320-WA0039