Monthly Archives: July 2018

అపర భద్రాద్రి సిర్సనగండ్ల సితారామాలయం

అపర భద్రాద్రి సిర్సనగండ్ల సితారామాలయం

హైదరాబాద్‌ జిల్లా కేంద్రానికి 80కిలో మీటర్ల దూరంలో
కల్వకుర్తి నుంచి దేవరకొండ వెళ్ళు రహదారిలో కల్వకుర్తి నుంచి 30 కిమీ దూరంలో ఉన్న చారకొండ నుంచి 5 కిమీ లో ఉన్న సిరసనగండ్ల గ్రామంలో ఉన్న సీతారామచంద్రస్వామి ఆలయం తెలంగణ రాష్ట్రంలో రెండవ భద్రాచలంగా పిలవబడుతుంది. ఈ క్షేత్రం రామాయణ గాథతో ముడిపడింది. ప్రతి కోట్ల మంది దర్శించుకుంటారు. నిత్యపూజలందుకుంటూ ధూపధీపాలతో సంవత్సరాంతం ఉత్సవాలు జరుగుతుంటాయి.

14వ శతాబ్దంలో వెలసిన సిరసనగండ్ల శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని సందర్శించిన భక్తుల కి జన్మ సుకృతమే.ఏటా ఇక్కడ చైత్రశుద్ధ్య పాడ్యమి నుంచి నవమి వరకు వసంత నవరాత్రులు,నవమి నుండి పౌర్ణమి వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. 16 రోజుల స్వామి వారికి వివాహ వేడుకలు జరుగుతాయి.ఈ సమయంలో భక్తులు రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుండి కాకుండా రాష్ట్ర నలు మూలల నుండి కూడా వేలసంఖ్యలో తరలివచ్చి కనులారా చూసి తన్మయం చెందుతారు.

ఆలయ చరిత్ర:
ఈ ఆలయాన్ని 14వ శతాబ్దిలో నిర్మించబడినట్లు శిలాశాసనాల వల్ల తెలుస్తుంది. అప్పడు ఈ ప్రాంతం భీకర అరణ్యంగా ఉండేదని, గుట్టపై దత్తాత్రేయ ఆశ్రమం, ముత్యాలమ్మ గుడి ఉండేవని ప్రతీతి. సిర్సనగండ్ల గ్రామానికి చెందిన రామయాజ్వికి శ్రీరాముడు కలలో కనిపించి భద్రాచలంలో ప్రతిష్టించాల్సిన సీతారామ విగ్రహాలు ఖమ్మం జిల్లా పాల్వంచ సమీపంలోని రావిచేడ్ గ్రామంలో ఒక పురోహితుడి ఇంటి పెరటిభాగంగా ఉన్నట్లు చెప్పినట్లు, ఆ విగ్రహాలు సకాలంలో భద్రాచలానికి చేరనందున వేరే విగ్రహాలు అక్కడ ప్రతిష్టించినట్లు, వాటిని సిర్సనగండ్లలో ప్రతిష్టించమని చెప్పినట్లు కథనం ప్రచారంలో ఉంది. కలలో శ్రీరాముడు చెప్పిన విధంగా పాల్వంచ సమీపంలోని విగ్రహాలు తీసుకొని వచ్చికోడికూత, రోకలిమోత వినిపించని సిర్సనగండ్ల గుట్టపై ప్రతిష్టించబడినట్లు, గుట్టపై కోనేరు కూడా నిర్మించినట్లు తెలుస్తుంది. ఢేరము జంబురాలు సిర్సనగండ్ల రామచరిత్రము అనే యక్షగానాన్ని రచించాడు.
14 వ శతాబ్దంలో వెలసిన సిరసనగండ్ల శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయానికి ప్రతి ఏటా భక్తులు వేలాది తరలివచ్చి సీతారాముల కల్యాణాన్ని కనులారా చూసి తన్మయం చెందుతారు. సీతారాముచంద్రుల కల్యాణోత్సవానికి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తరపున హోం శాఖమంత్రి నాయిని న ర్సింహారెడ్డి హాజరయ్యారు. స్వామివారి కల్యాణానికి పట్టువస్త్రాలను, తలంబ్రాలను అందజేశారు. ఇక్కడ స్వామి దర్శన మాత్రం చేత.. మానసిక ఆనందం సిద్ధిస్తుందని భక్తులకు నమ్మకం.స్వామివారి కల్యాణోత్సవానికి హైదారబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌తో పాటు రాష్ట్రంలో పలు జిల్లాల నుండి భక్తులు హాజరవుతారని
అర్చకులు డేరం లక్ష్మణ్ శర్మ వివరించారు.IMG-20180726-WA0087 IMG-20180726-WA00782018-07-27-15-36-25-523IMG-20180726-WA0076

చంద్ర గ్రహణం

 

విలంబనామ సంవత్సర ఆషాడ శుద్ధ చతుర్ధశి శుక్రవారం 27-07-2018 న ఉత్తరాషాడ నక్షత్రం చతుర్ధ పాదం శ్రవణా నక్షత్రం ప్రధమ పాదం నందు కేతుగ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణం సంభవిస్తుంది.

“గ్రహణే సంక్రమణేవాసి, నస్నాయాద్యది మానవః
సప్తజన్మని కుష్ఠిస్యాత్‌, దుఃఖభాగేచ జాయతే||

గ్రహణకాలమునగాని, సంక్రమణ కాలాదులలోగాని, స్నానము చేయనివారు, ఏడుజన్మల పర్యంతము కుష్ఠురోగాది బాధలతో, దుఃఖితులైయుందురు.

“రాత్రో స్నానం నకుర్వీత” అను నిషేధం ప్రకారం ప్రతిదినము రాత్రికాలమున స్నానము చేయరాదు.

నైమిత్తికంతు కుర్వీత స్నానం దానంచ, రాత్రిషు

అను ధర్మము ప్రకారము ఏదేని గ్రహణాదికారణములు నిమిత్తముగ చేసికొని రాత్రి కాలమున స్నానాదులు చెయవచ్చును.

జన్మక్షే నిధనం గ్రహేజ నిభతో ఘాతః క్షతిః శ్రీర్వ్యధా
చింత సౌఖ్య కళత్ర దౌస్ధ్య మృతయః స్సుర్శాననాసః సుఖం
లాభోపాయ ఇతి క్రమాత్త ద శుభ ధస్త్యే జపహపః స్వర్ణగో
దానం శాంతి రధో గ్రహం త్వశుభదం నో వీక్షమహుః పరే

జన్మ నక్షత్రమందు గ్రహణం వచ్చిన నాశనం, జన్మ రాశి యందు గ్రహణం వచ్చిన మానసిక సమస్యలు, ద్వితీయ మందు హాని, తృతీయ మందు సంపద, చతుర్ధమందు రోగం, పంచమం నందు చికాకులు, షష్టమందు సౌఖ్యం, సప్తమం నందు భార్యకు కష్టాలు, అష్టమం నందు మరణతుల్య కష్టాలు, నవమం నందు గౌరవ భంగం, దశమం నందు సుఖం, ఏకాదశం నందు లాభం, ద్వాదశం నందు అపాయం. అశుభ దోష పరిహారానికి జపం, స్వర్ణ దానం, గోదానం, శాంతి చేయాలి. అశుభ ఫలప్రదమైన గ్రహణాన్ని చూడరాదు.

రాజ్యాభిషేక (ప్రమాణ స్వీకారం) నక్షత్రంలో గ్రహణం పడితే రాజ్య భంగం, బంధు క్షయం, మరణతుల్య కష్టాలు. ఉద్యోగస్తులు, వ్యాపారస్ధులు ఉద్యోగంలో, వ్యాపారంలో ప్రవేశించిన నక్షత్రాన్ని గుర్తు పెట్టుకొని ఉద్యోగ, వ్యాపార కాలంలో ఆ నక్షత్రంలో గ్రహణం పడితే శాంతి చేసుకోవటం మంచిది.

గ్రహణ సమయమున దేవత అర్చనలు, దైవ ధ్యానము, జపతపాదులు చేయడం క్షేమము. గ్రహణ సమయంలో రాహుకేతువులతో సూర్యచంద్రుల కాంతులు మిళితమయ్యి, అనేక విషకిరణాలు ఉద్భవిస్తాయి. అవి చాలావరకూ మానవ నిర్మాణానికి ఇబ్బందులను కలిగిస్తాయి. ఎంతో సున్నితంగా ఉండే స్త్రీ గర్భంలోని శిశువుకు హాని కలగకూడదని గ్రహణం చూడొద్దంటారు.గ్రహణ సమయంలో మానవ ప్రయత్నముగా గర్భవతులు దైవధ్యానమే శ్రేయస్కరము.

చంద్రగ్రహణం పౌర్ణమి నాడు మాత్రమే సంభవిస్తుంది.అన్ని పౌర్ణమి లకు చంద్రగ్రహణం ఏర్పడదు. .చంద్రగ్రహణం పౌర్ణమి నాడు ఏర్పడటానికి,కొన్ని పౌర్ణమిలకు ఏర్పడకపోవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి.చంద్రుడు పౌర్ణమి నాడు సూర్యునికి ఎదురుగా ఉంటాడు.అంటే భూమికి ఇరువైపుల సూర్య చంద్రులు ఉంటారు.సూర్య చంద్రుల మద్యలో భూమి ఉంటుంది.అన్ని పౌర్ణమిలకు సూర్యుడు ,భూమి,చంద్రుడు ఒకే సరళ రేఖపై ఉండరు .అందువల్ల అన్ని పౌర్ణమిలకు చంద్రగ్రహణం ఏర్పడదు.

సూర్యుడు చంద్రుడు,భూమి ఒకే సరళరేఖపై ఉండి చంద్రుడు రాహువు దగ్గర గాని కేతువు దగ్గర గాని ఉండటం వల్ల భూమి యొక్క నీడ చంద్రునిపై పడుతుంది.చంద్రుడు పూర్తిగా కనపడకపోవటాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు.పాక్షికంగా కనపడటాన్ని పాక్షిక చంద్రగ్రహణం అంటారు.చంద్రబింబం పూర్తిగా కనిపించకుండా పోయి మరల పూర్తిగా కనిపించే వరకు గల కాలాన్ని గ్రహణం అంటారు.సూర్య చంద్ర గ్రహణాలకు రాహు కేతువులు కారణం కావటం వల్ల మన పూర్వీకులు సూర్య చంద్రులను రాహు కేతువులు మింగటం వల్ల గ్రహణాలు ఏర్పడుతున్నాయని చమత్కరించారు.

గ్రహణములు అనగానే కీడు జరుగుతుంది, ఫలానా నక్షత్రములలో జనించిన వారు ఈవిధముగా పరిహారం చేయాలి, ఆలయాలు మూసేయాలి, లోకంలో ప్రకృతి విపత్తులు సంభవిస్తాయి. ఈ గ్రహణ ప్రభావము 2,3 నెలల వరకు ఉంటుందని. ఈ గ్రహణ సమయంలో ఇంట్లో దీపారాధన చేయరాదని, కొందరు చేయ వచ్చని. ఫలానా నక్షత్రముల వారికిశాంతి చేయించాలని. ఈ గ్రహణ సమయంలో కొన్ని పనులు శుభమును ఇస్తాయని, కొన్నిఅశుభమును ఇస్తాయని. గ్రహణ సమయంలో పుట్టిన వారికి గ్రహణ మొర్రి వస్తుందని, గ్రహణ సమయంలో గర్భిని స్త్రీలు బయటకు వెళ్లరాదని, పౌర్ణమి-అమావాస్య నిజముగా అందరికి కీడు చేస్తాయా. ఇలాచాలా అపోహలు, అనుమానాలు ఉన్నాయి.

గ్రహణం సంభవించినపడు విడుదల అయ్యే కిరణాలు ప్రభావంతో అనారోగ్య సమస్యలు వస్తాయని, మన పెద్దలు కొన్ని నియమాలు పెట్టారు. ఆ కిరణాలు ఎక్కడికైనా చొచ్చుకు పోతాయి కాబట్టి గ్రహణ సమయంలో వండటం, తినడం లాంటివి చేయకూడదు అంటారు.

*శ్రీకొండ ఉమాకాంత శర్మ సిధ్ధాంతి.*
చరవాణి:9440232574.lunar-eclipse

గ్రహణము—హేతువాదుల తర్కం*

 

గ్రహణం ఎప్పుడు వస్తుంది అనేది మనకి ఆధునిక శాస్త్రజ్ఞులూ తెలియచేస్తున్నారు అలానే మన పంచాంగ కర్తలూ తెలియ చేస్తున్నారు. అయితే, గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమ నిభందనల గురించి మాత్రం కేవలం భారతీయ శాస్త్రం మాత్రమే చెప్తుంది. పాశ్చాత్య శాస్త్రం ఆ విషయం గురించి ఏమీ చెప్పదు

రాహువు, కేతువు అనే గ్రహాలు సర్ప రూపంలో సూర్య, చంద్రులని మింగేయ్యడం వలన గ్రహణాలు ఏర్పడతాయి, అని మన పురాణాలలో ఉన్న కథ చాలా మందికి తెలుసు. మన పురాణాలలో ఉన్న అసంబద్ధమైన విషయాలకి దీనినో ఉదాహరణగా చూపుతారు హేతువాదులు. రాహు, కేతువుల కథ అసంబద్దం అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. పాములు వచ్చి, సూర్య చంద్రులని మింగడం వలన గ్రహణం వస్తుంది అని నమ్మడం కన్నా మూర్కత్వం ఇంకోటి లేదు. ఈ విషయం అర్దం కావడానికి పెద్దగా మేధస్సు కూడా అవసరం లేదు.

అయితే ఈ విషయాన్ని మరింత లోతుగా పరిశీలిస్తే కొన్ని ఆసక్తి కరమైన విషయాలు బయట పడతాయి. అసలు ముందు గ్రహణాలు ఎలా ఏర్పడతాయో చూద్దాం

సూర్య గ్రహణం: సూర్యుడికి, భూమికీ మధ్య చంద్రుడు వస్తే, అప్పుడు చంద్రుడి నీడ భూమి మీద పడుతుంది. ఆ నీడ లో ఉన్నవారికి సూర్యగ్రహణం.

చంద్ర గ్రహణం: సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి వస్తే, భూమి నీడ చంద్రుడి మీద పడుతుంది. సూర్యుడి కాంతి వల్లనే చంద్రుడికి ప్రకాశం కనుక, ఆ సమయం లో చంద్రుడు కనపడదు, చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.

రెంటిలోనూ నీడ పడటం ప్రధానం. రాహు, కేతువులని ఛాయ గ్రహాలూ అంటారు. ఛాయ అంటే నీడ, అంటే గ్రహణ సమయం లో భూమి మీద, చంద్రుడి మీద పడే నీడలనే మన వాళ్ళు రాహువు, కేతువు అన్నారు, అన్నది స్పష్టం అవుతుంది. ఇది మొదటి విషయం. ఇక రెండో విషయం, మన వాళ్ళు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేకుండానే గ్రహణ సమయాలని వేల సంవత్సరాలుగా చెప్తున్నారు. ఎన్నో పురాణాలలో, రామాయణ, భారత, భాగవతాలలో గ్రహణాల గురించి ఆ సమయాలలో గ్రహ స్థితుల గురించి కనబడుతుంది. ఖగోళ శాస్త్రం మీద ఇంత లోతైన అవగాహన ఉన్నవారు, పాములు సూర్య చంద్రులని మిగేయ్యడం వలన గ్రహణం వస్తుంది అని ఎలా నమ్మరు, అనే అనుమానం సహజం

వివిధ శాస్త్రాలని, కథల సహాయంతో చెప్పడం అనే ప్రక్రియ మన పురాణాలలో చాలా ఎక్కువగా కనబడుతుంది. భారతీయ విద్యా విధానం మీద అవగాహనా ఉన్న వారికి ఈ విషయం బాగా తెలుసు. దీనినే సంకేత వాదం అంటారు. మన పురాణాల నిండా ఇవే కనబడతాయి. పులి కుక్కతో మాట్లాడినట్లు, నక్క బాతుతో మాట్లాడినట్లు ఉన్న కథలు ఇటువంటివే. మన హేతువాదులు అనుకునేటట్లు మన పూర్వీకులు ఎంత వీర్రి వాళ్లైనా మరీ కుక్క, నక్క మాట్లతాయి అనుకోరు కద. ఒక విషయాన్ని సులభంగా అర్ధమయ్యేలా చెప్పే ప్రక్రియే ఈ సంకేత వాదం. ఈ రాహు కేతువుల కథ కూడా ఇటువంటిదే.

గ్రహణ సమయంలో నియమాలు

గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాల గురించి హిందువులలో చాలా మందికి తెలుసు. గర్భిణీ స్త్రీలచే ఈ నియమాలని మన పెద్ద వాళ్ళు తప్పక పాటిమ్పచేస్తారు. గ్రహణం ఉన్న రోజున కొన్ని చానళ్లలో పండితులు గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాల గురించి చెప్తుంటే, మరి కొన్నిటిలో హేతువాదులు ఇవాన్నీ మూఢ నమ్మకాలని వాటిని పాటించనక్కర లేదని చెప్తారు.
గ్రహణ సమయం లో మన శాస్త్రాలలో చెప్పే నియమాలు పాటించకపోతే కలిగే నష్టాల గురించిన ఏ ఆధారమూ లేదు. అయితే, అదెంత నిజమో, నష్టాలు ఉండవు అని నిరూపించడానికి కూడా ఏ ఆధారాలూ లేవు, అనేది కూడా అంతే నిజం

గ్రహణ సమయలో ప్రకృతిలో ఒక పెద్ద మార్పు జరుగుతోంది, ఆ మార్పు వలన భూమి మీద కొన్ని మార్పులు స్పష్టంగా కనబడుతున్నాయి. సముద్రపు అలలు ఎగసి పడటం ఇందులో ఒకటి. అటువంటప్పుడు గ్రహణ ప్రభావం మనిషి మీద మాత్రం ఎందుకు ఉండకూడదు? ఉంటుది అని నేను అనడం లేదు, కానీ ఉండటానికి అవకాసం ఉంది అని అంటున్నా. ఈ విషయంమై ఎటువంటి పరిశోధనా జరిగినట్లు నాకు తెలియదు. మరి అలాంటప్పుడు జన విజ్ఞాన వేదిక వంటి హేతువాద సంఘాలు వీటిని మూఢనమ్మకాలు అని ఎలా నిర్ధారించాయి?

ఈ ప్రశ్నకి వారు చెప్పే సమాధానాలు ఇవి

గ్రహణ సమయంలో నియమాలు పాటించక పోతే నష్టాలు కలుగుతాయి అని ఏమిటి రుజువు?
మేము ప్రతీ సారీ గ్రహణ సమయాలలో బయట భోజనం చేస్తాం. గర్భిణీ స్త్రీలు కూడా ఎందరో అలా చేస్తారు వారికేమీ కాలేదు.
నిజమే, నష్టాలు జరుగుతాయి అని సాక్షాలు లేవు, అయితే నష్టాలు లేవు అని కూడా సాక్షాలు లేవు కద? ఇటువంటి స్థితిలో రెండు వాదాలకీ సామాన ప్రాధాన్యతనివ్వడం విజ్ఞులు చెయ్యాల్సిన పని. హేతువాదులు, ఏవిధమైన హేతువూ లేకుండానే వీటిని మూఢ నమ్మకాలు, అని కొట్టి పారెయ్యడం కేవలం వారి పక్షపాత బుద్దికీ లేదా అజ్ఞానానికీ సాక్ష్యం.

మరి గ్రహణ సమయాలలో బోజనాలు చేసిన వారికి ఏమీ కాలేదు కదా, దాని సంగతి ఏంటి, అని అడగవచ్చు. సాధారణంగా హేతువాద సంఘాల వారు, గర్భిణీ స్త్రీల తో సహా గ్రహణ సమయంలో భోజనాలు చేసి, చూసారా మాకేమీ అవ్వలేదు, కాబట్టి ఇవన్ని మూఢ నమ్మకాలు అంటుంటారు. నేను కూడా ఒక వంద మందితో రాత్రంతా మధ్యం తాగించి తరువాత రోజు నిద్ర లేపి, ఇంటికి పంపి, చూసారా ఎంత తాగినా ఏమీ అవ్వలేదు కాబట్టి తాగడం వలన నష్టం లేదు, అది మూఢ నమ్మకం అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? వెర్రి వాడు అంటారు. హేతువాదుల వాదన కూడా ఇలాంటిదే. ఇంకో ముఖ్యమైన విషయం, అసలు ఇటువంటి ప్రయోగాలు గర్భిణీ స్త్రీల మీద చెయ్యకూడదు. ఇవే కాదు, అసలు ఎటువంటి ప్రయోగాలూ వారి మీద చెయ్యకూడాదు. అది చట్ట వ్యతిరేకం. మరి ఈ సంఘాల వారు, ఎవరి అనుమతి తీసుకొని గర్భిణీ స్త్రీల మీద ఇటువంటి ప్రయోగాలు చేస్తున్నారో వారే చెప్పాలి.

గ్రహణ సమయంలో తినడం వలన ఎం నష్టాలు కలుగుతాయి అని శాస్త్రాలలో చెప్పారో తెలుసుకొని, తరువాత శాస్త్రీయ అధ్యయనం ద్వారా, అవి కలగలేదు అని గణాంక సహితంగా నిరూపిస్తే, అది కూడా ఒక ప్రముఖ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగితే లేదా ఏదైనా ప్రముఖ మెడికల్ జర్నల్ లో ప్రచురితం అయితే, అప్పుడు దానికి ఏదైనా విలువ, విశ్వసనీయత ఉంటుంది. అంతే కానీ వారికి వారే చేసేసుకొని, ఫలితాల్ని ప్రకటించేస్తే, వారికి అనుకూలమైన టీవీ చానాళ్ళ వాళ్ళు చూపిస్తే చూపించవచ్చు కానీ, ఇటువంటి వాటికి శాస్త్రీయ ప్రపంచంలో విలువ ఏమీ ఉండదు. ఇది పూర్తిగా అశాస్త్రీయం, అహేతుకం

అయితే మరి హేతువాదులం అని చెప్పుకునే వారు, ఇంత ఆహేతుకంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? మరి కారణం ఏమిటి? దీనికి మూలాలు మన విద్య విధానంలో ఉన్నాయి.

విద్యా విదానం

శాస్త్రీయ ప్రగతి సమాంతరము, ప్రగతి శీలము అనేది చాలా మంది నమ్మకము. అంటే మొన్నటి కన్నా, నిన్న; నిన్నటి కన్నా ఈ రోజు శాస్త్ర పరంగా ప్రపంచం ముందు ఉంటుంది అనేది ఈ నామ్మకం సారంశం. ఇది నిరంతర ప్రక్రియ అనేది కూడా ఈ నమ్మకంలో భాగమే. ఈ సిద్ధాంతం ప్రకారం, ఇప్పటి కాలం వారి కంటే గత కాలం వారికి శాస్త్రీయ అవగాహన ఎక్కువగా ఉండే అవకాసం లేదు. మన విద్యా విధానం వలన, తమకు తెలిసో తెలియకో ఈ సిద్ధాంతం వలన ప్రభావితం అయిన వారు, మన పూర్వీకులు కొన్ని రంగాలలో ఇప్పటి కాలం కన్నా ముందుండే వారు అంటే, కనీసం ఇందులో నిజం ఎంత, అని పరిశీలించడానికి కూడా సిద్ధ పడరు. ఒక విధంగా దీనిని వారి అజ్ఞానంగా లేదా వారిలో వారికే తెలియకుండా ఉన్న ఒక్క చీకటి కోణంగా మనం పరిగణించవచ్చు. ఒక పరిమిత కాలాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటే ఈ సిద్ధాంతం నిజమే. దీర్ఘకాలం లో మాత్రం కాదు.

భారతీయ శాస్త్రాలు కాలాన్ని చూసే విధానం దీనికి పూర్తిగా విరుద్ధం. మనం కాలాన్ని సలళము అనము, చక్రీయము అంటాము. అందుకనే మన దగ్గర కాల చక్రం అనే మాట ఉంది. అందుకే మన పూర్వీకులు, కనీసం కొన్ని రంగాలలో అయినా ప్రస్తుత కాలం కంటే ముందుండే వారు అంటే మనకి మూర్కత్వం అనిపించదు. ఇప్పటికి ఎన్నో నాగరికతలు కాల గర్భం లో కలిసిపోయాయి. వాటితో పాటే వారు సాధించిన శాస్త్రీయ ప్రగతి కూడా. ఒక నాగరికతని మాత్రమే పరిగణలోకి తీసుకొని చూసినప్పుడు శాస్త్ర ప్రగతి, ప్రగతిశీలంగానే కనిపిస్తుంది, దానిని ఎవరూ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. అయితే నాగరికతలకి అతీతంగా శాస్త్ర ప్రగతిని చూసినప్పుడు అది సరళము అనుకోవడం, తార్కికం అనిపించుకోదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన నాగరికతల శాస్త్రీయ పరిజ్ఞానం ఏమిటి అనేది మనకి పూర్తిగా తెలియడానికి అవకాసం లేదు. అందువలన వారు ప్రస్తుత నాగరికత కంటే అన్ని రంగాలలోనూ వెనకబడే ఉన్నారు అనుకోవడం తార్కికం కాదు.

శాస్త్ర ప్రగతి సరళము అనే వాదానికి ప్రతికూల ఉదాహరణలు మనకి ఎన్నో కనిపిస్తాయి, అందులో యోగా ఒకటి. 40-50 సంవత్సరాల క్రితం వరకూ కూడా యోగ విద్యని ఒక మూడ నమ్మకంగా పరిగణించేవారు. ఆయుర్వేదం మరో ఉదాహరణ. థైరాయిడ్, నడుము నొప్పి లాంటి పాశ్చాత్య వైద్య విధానం నయం చెయ్యాలని ఎన్నో వ్యాధులని ఆయుర్వేదం ఏంతో సులభంగా, చాలా తక్కువ ఖర్చుతో నయం చెయ్యగలదు. అలా బాగుపడ్డ వారు ఎందరో నాకు స్వయంగా తెలుసు. యోగ విద్య, ఆయుర్వేదం వంటివి, శాస్త్ర ప్రగతి చక్రీయం అని నిరూపించే సాక్షాలు. కనీసం కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి శాస్త్రాలు నేటి ఆధునిక శాస్త్రాల కంటే మెరుగైనవి అంటే, శాస్త్ర ప్రగతి సరళం కానట్లే కద. ఇవి మనకి తెలిసిన శాస్త్రాలు. ఇదే విధంగా మనకి అసలు తెలియని, కేవలం పేర్లు మాత్రం తెలిసిన ఎన్నో ఇతర శాస్త్రాలు ఉండటానికి అవకాసం ఉంది. అయితే కేవలం మన పురాణాలలోనో ఇంకో దగ్గరో ఈ శాస్త్రాల ప్రస్తావన ఉంది కాబట్టి వాటిని నమ్మాలి అని నేను అనడం లేదు. ఏ విధమైన పరిశోధనా చెయ్యకుండా, వాటిని మూఢ నమ్మకాలు అని కొట్టి పారేయ్యడాన్నే నేను వ్యతిరేకిస్తున్నాను.

అందువలన గ్రహణ కాలంలో నియమాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, కేవలం అవి ఇంతక ముందు కాలానికి చెందినవి అనో, పాశ్చాత్యులు ఇంకా గుర్తించలేదు అనో మూఢ నమ్మకాలు అనుకోవడం, మన మూఢత్వమే అవుతుంది కానీ హేతుబద్దమైన ఆలోచన అనిపించుకోదు.

దీనికి మరో కారణం ఆత్మాన్యూనత. ఇటువంటి వారికి తెలిసో, తెలియకుండానో పాశ్చాత్యుల కంటే మనం తక్కువ అనే భావన ఉంటుంది. ఐరోపా దేశాల వలస పాలనలో ఉన్న అన్ని దేశాలలోనూ ఈ పరిస్థితి ఉంటుంది. దీనికి భారతదేశం మినహాయింపు కాదు. అయితే మనకి గొప్ప చరిత్ర, సంస్కృతి, హిందూ ధర్మం ఉండటం వలన ఈ జాడ్యం నుండి, బహుసా త్వరగానే బయటపడతాం.

కాబట్టి భారతీయ గ్రహణ శాస్త్రం నిజామా కాదా అనేది ఖచ్చితంగా ఎవరమూ చెప్పలేము. అయితే నిజం అవ్వడానికే సంభావ్యత ఎక్కువగా ఉంది. నా కారణాలు

గ్రహణ సమయంలో ప్రకృతిలో ఒక పెద్ద మార్పు జరుగుతోంది, దాని ప్రభావం వలన సముద్రపు అలలు ఎగసి పడటం మనం చూస్తున్నాం. కాబట్టి గ్రహణ ప్రభావం మనుషుల మీదా కూడా ఉండే అవకాసం ఉంది
యోగ శాస్త్రం, ఆయుర్వేదం వంటి ఎన్నో గొప్ప శాస్త్రాలని ఇచ్చిన, గ్రహణ సమయాన్ని ఈరోజుకీ చిన్న కాగిత కలం సహాయం తో లెక్కించడానికి వీలైన పరిజ్ఞానాన్ని ఇచ్చిన సంస్కృతే ఈ గ్రహణ నియమాలని కూడా చెప్తోంది.

వందల వేల సంవత్సరాలుగా ఈ నియమాలు మన సంస్కృతిలో భాగం అయిపోయాయి. కాబట్టి ఒక బలమైన, శాస్త్రీయమైన కారణం లేకుండా వాటిని తప్పు అని తెల్చేయ్యడం మూర్ఖత్వమే అవుతుంది
ఈ నియమాలు పాటించడం వలన, లాభం సంగతి పక్కనబెడితే నష్టమైతే లేదు.
ఈ కారణాల వలన, ఈ నియమాలు తప్పు అని పూర్తి ఆధారాలతో నిరూపితం అయ్యే దాకా మనం నియమాలని పాటించడమే ఉత్తమం. నియమాలని పాటించడం, పాటించకపోవడం వ్యక్తిగత. అయితే, తమ మిడి మిడి జ్ఞానం తో ఇవన్ని తప్పు అని ప్రచారం చెయ్యడం మాత్రం తప్పు. ఈ పని ఎక్కువగా చేసే జన విజ్ఞాన వేదిక వారు కొంచెం పునరాలోచించు కోవాలి.

*శ్రీకొండ ఉమాకాంత శర్మ సిధ్ధాంతి.*
చరవాణి:9440232574.

స్త్రీలు చేయకూడని పనులు

 

గ్రహణ సమయమందు భూమ్యాకర్షణ శక్తి మార్పు చెందుతుంది. దాని పరిమాణము మనపై చాల ఉంటుంది ముఖ్యముగా మన కడుపులో ఆహార పదార్థములు జీర్ణమవ్వడానికి కావలసిన ఆమ్లములు ఉండవు అందువల్ల జీర్ణము కాదు ఈ కారణముగానే గ్రహణ సమయమునకు ముందుగ మూడు గంటలకు పూర్వమే మన కడుపులో ఏమి ఉండకూడదు అంటారు.

మీ భర్త పిల్లలు మంగళ వారము నాడు క్షవరము గడ్డము గీసుకోవడము చేయనీయ వద్దు. ఈ ప్రక్రియ దరిద్రాన్ని సంభవింప చేయును.

మంచి పనులను శుక్ల పక్షము నందే అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయ వలెను.

మీరు మీ పిల్లలు దిండు పైన కూర్చో వద్దు ఐతే ఈ కాలములో అందరూ దీనిని తప్పక చేస్తుంటారు.

స్త్రీలు రాత్రి సమయమున గాజులు కమ్మలు తీయరాదు. దుఃఖము విచారణ చేయ వచ్చిన వారిని ఆహ్వానించ కూడదు. అలాగే వారు పోయేటప్పుడు వెళ్ళి వస్తానని చెప్ప కూడదు.
ఈ మధ్య కాలంలో దుఃఖము విచారించ వచ్చిన వారిని రండి రండి అంటూ సాదరముగా ఆహ్వానించి స్థలము ఇచ్చి కూర్చోపెట్టి కాపీలు ఇచ్చి చాల అతిథి మర్యాదలు చేస్తారు .అపరోక్షముగా మనము అశుభములను కోరుకోవడానికి ఇది నాంది అవుతుంది.

కొత్త వస్త్రములను ధరించే ముందు దానికి కొంత పసుపు ఏదైనా ఒక మూల రాయాలి, పసుపు క్రిమి నాసిని.

ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోడదు అయితే ఈ మధ్య కాలములో ఈ పని చాల చోట్లలో సహజమై పోయింది.

నలుపు రంగు వస్తువులు బట్టలు ధరించ కండి ఈ మధ్య కాలంలో సువాసిని స్త్రీలుకుడా నలుపు రంగు వస్తువులు ధరించడం ఎక్కువై పోయింది.

ఉప్పు మిరప చింతపండు వీటిని ఎవరికి ఇచ్చిన చేతిలో ఇవ్వకూడదు ,కింద పెట్టండి వాళ్ళే తీసుకొంటారు .ఈ మద్య కాలంలో ఉప్పు చేతితో వడ్డించడం చాల చోట్లలో గమనిస్తాము.

ప్రతి రోజు భోజనమునకు ముందు కాకికి అన్నము పెట్టండి, ఇది పితృ దేవతలకు ప్రీతి .కాకికి మనము భోజనము చేయుటకు ముందు కుక్కకు మనము తిన్న తర్వాత పెట్టాలి.

అయితే కుక్కలను ఎల్లప్ప్పుడు కన్న సంతానానికంటే ఎక్కువగా లాలిస్తూ దాని నోటికి ఆకులోంచి అందిస్తూ భోజనము చేయడము ఎక్కువై పోయింది.

టెంకాయ చిప్ప తామ్బులము ఇచ్చేటప్పుడు మూడు కండ్లు వుండే భాగము మీరు ఉంచుకొని మిగత భాగము ఇతరులకు ఇవ్వవలెను.

స్త్రీలు ఎప్పుడు జుట్టు విరపోసుకొని ఉండకూడదు .ఇది జ్యేష్టాదేవి స్వరూపము ఇంటిలో మంగళము జరుగుటకు విఘ్న కారణమవుతుంది. ఈ చర్య ప్రతి గృహములో ఇప్పుడు ఒక తప్పని సరి అయిపొయింది.

శుక్రవారమునాడు గాని ,జీతము రాగానే గాని ఆ డబ్బుతో మొట్ట మొదటి సారి ఉప్పు కొనండి ఈ చర్య పై పై డబ్బులు చేరటానికి అవకాశము ఎక్కువ.

కాలిపైకాలు వేసుకొని కుర్చోవడము, కాళ్లాడిస్తూ కూచోవడం, ఒంటి కాలితో నిలవడం, స్తిరముగా నిలవక ఉగుతుండడం లాంటి పనులు చేయకూడదు ఇందువల్ల ఒకటి దారిద్ర హేతువు మరియొకటి ఆ ప్రదేశములు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశములు ఎక్కువ.

ఎల్లప్పుడు ఇచ్చి పుచ్చుకోవడానికి కుడి చేతిని అలవాటు చేయాలి ,ఎడమ చేతిని ఉపయోగించ కూడదు.

సుమంగళి స్త్రీలు రాత్రి వేళలందు అలిగి ,ఆహారము తినకుండా నిద్రించ కూడదు.

స్త్రీలు బహిష్టు సమయమందు పూలు తలలో పెట్టుకోరాదు. పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పు రాదు ,రేపు తీసుకుంటాను అని అనవలెను.

ఎప్పుడు మన నోటినుండి పీడ ,దరిద్రం, శని పీనుగా కష్టము, అనే పదములను ఎప్పుడు ఉపయోగించ కూడదు.

ఇంటిలో దుమ్ము ధూళి, సాలెగూడు కట్టడం లాంటివి దారిద్ర హేతువులు, పదిరోజులకు ఒకమారు మంగళ శుక్ర వారములు కాకుండా దులిపి శుభ్రము చేయవలెను.

శ్రాద్ధ దినమందు ఇంటి ముందు ముగ్గు శ్రాద్ధము అయ్యేవరకు వేయకూడదు, శ్రాద్ధానంతరము ముగ్గు వేసి తర్వాత ఇంటిలోని వారు భోజనము చేయవలెను.

దిండులు, ఓర దుప్పట్లు అప్పుడప్పుడు ఉతుకుతూ వాడాలి .మనకు తెలియని సుక్ష్మ క్రిములు చాల ఉంటాయి దాని వాల్ల మనకు హాని జరుగును.

చింత గోపి శర్మ సిద్ధాంతి

2018-07-25-09-25-18-303

FB_IMG_1532495002290