Monthly Archives: March 2018

విళంబ నామ సంవత్సర ద్వాదశ రాశుల ఫలితాంశాలు

 

*మేష రాశి-*
అశ్వని 1,2,3,4 పాదములు [చు,చే,చొ,లా],భరణి 1,2,3,4 పాదములు [లీ,లూ,లే,లో,]కృత్తిక 1 వ పాదము [ఆ] ఈ అక్షరములతో పేరు మొదలయ్యేవారు *ఆదాయం 2*, *వ్యయం 14* ,-

*రాజ పూజ్యం 5* , *అవమానం 7* –

ఈ సంవత్సరం సముదాయముగా పరిశీలించగా గురువు అనుకూలత తక్కువ . శని సంచారిత సాదారణ స్థాయి.రాహువు అర్దాష్టం లో సరి యగు   పలితాలు ఇచే అవకాశాలు కనపటం లేదు .గురు సంచారం అక్టోబర్ వరకు నష్టాలూ వచ్చే అవకాశం లేదు . శని సంచారత ద్వారా నష్టాలూ రావు కాని రాహు కేతు వుల వలన చిన్న చిన్న ప్రతి బందకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .గురువు అష్టమ సంచారత ఇబ్బంది లేదు
ప్రతి పని లోను అసంతృప్తి మరియు అశాంతి ఎక్కువగా ఉంటాయి కొన్ని పనులలో స్వయం క్రుతాపరాదమే ఉంటుంది . కొన్ని పనుల్లో ఇతరుల సహకారమే ఉంటుంది . అన్ని పనులలో ఆలస్యంగా జరిగే అవకాశాలు ఉన్నాయి మీ సన్నిహితులతో మనస్తపాలు , విరోధాలు వోచే అవకాశాలు ఉన్నాయి .అందరిని అవమానించే అవకాశాలు ఉన్నాయి .పుణ్య కార్యాలు , శుభ కార్యాల్లో పాల్గొంటారు . గురు , పుణ్య క్షేత్ర దర్శన భాగ్యం కలుగుతుంది . సమయానికి పనులు పూర్తీ కావు జాప్యం జరుగుతుంది.ఒంటరి ప్రయాణాలు అనుకూలించవు . మిశ్రమ ఫలితాలు ఉంటాయి .
కుటుంబ చికాకులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . పిల్లల ప్రవర్తనలలో మార్పులు ఉంటాయి .అభివృద్ధి విషయం లో వ్హికాకులు తప్పవు .ఆరోగ్య విషయం లో జాగ్రత్త అవసరమున్నది . ముందు జాగ్రత్త పాటించక పొతే కొత్త సమస్యలు తలెత్తుతాయి .కరచుకు తగిన ఆదాయము ఉండదు . దానివల్ల సమస్యలు తలెత్తుతాయి .ఆర్దిక విష్యం లో దూకుడు తగ్గించుకుంటే మంచిది . సంపాదన తగ్గి నిలవ డబ్బు కర్చు పెట్టవలసి వస్తుంది .
ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం సాదారణ స్తాయి పలితాలు అందుకుంటారు .అభివృద్ధి మందగిస్తుంది . తోటి వారి సహకారము అందక పని వొత్తిడి పెరుగుతుంది . నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించక బాద  పడతారు . వ్యాపారస్తులకు సాదారణ ఫలితాలు ఉంటాయి .మిశ్రమ ఫలితాలు ఉంటాయి . రైతులకు శ్రమకు తగిన ఫలితము అందదు.షేర్ వ్యాపారస్తులు దూకుడు తగ్గిస్తే మంచిది . విద్యార్దులలో నిర్లక్ష్యం పెరిగి సరైన పలితాలు అందుకోలేక పోతారు .
*వృషభ రాశి*
కృత్తిక 2,3,4 పాదములు [ఈ,ఊ .ఎ],రోహిణి 1,2,3,4 పాదములు [ఓ,వా,వీ,వూ],మృగ శిర 1,2 పాదములు [వె,వో] ఈ అక్షరములతో పేరు మొదలయ్యేవారు. *ఆదాయం 11* , *వ్యయం 5* –

*రాజ పూజ్యం 1* , *అవమానం 3*

ఈ సంవత్సరం మొత్తము మీద పరిశీలించగా గురు సంచార సంవత్సర మొత్తము మీద అనుకూలం తక్కువ గానే ఉన్నది .శని గ్రహము యొక్క ప్రతి కూలట ఎక్కువగా ఉంటుంది . అష్టమ శని అన్ని విషయాలలోనూ వ్యతిరేకముగా ఉందును . అందరితో మనస్పర్ధలు , విరోధములు వచ్చును . శతృబాధలు అధికముగా ఉండును .అనారోగ్యం పీడిస్తూ ఉంటుంది .వృధా ఖర్చులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . వీరికి రాహువు అనుకూలంగానే ఉంటాడు . చిన్న చిన్న అలస్యములతో పనులు సాగుతుంటాయి .ప్రయాణాలలో విఘ్నాలు కలిగి ఉంటారు . ఒప్పుకున్నా పనులు సకాలములో పూర్తి చెయ్యలేక పోతారు .స్త్రీ పురుషల మద్య విబేదాలు , మనస్పర్ధలు కలిగే అవకాశాలు ఉన్నాయి . పూజ్యుల గురువుల దర్సనం లభిస్తుంది . బాద్యతలు , అవసరాలు మిమ్మల్ని బందం లోకి దిమ్పుతుంటాయి . దిన ప్రవర్తనలో గాంభీర్యం కోల్పోయే అవకాశం ఉన్నది . తిప్పట ఎక్కువగా ఉంటుంది . అప్పులు చేయ వలసి వస్తుంది . కొంచం దిన చర్య అస్తవ్యస్తంగా ఉంటుంది . అదికార భయం వలన చిరాకు పడుతుంటారు . గామ్బిర్యం కోల్పోయే అవకాశాలు ఉన్నాయి . అపనిందలు పాలయ్యే అవకాశాలు ఉన్నాయి . ప్రయాణాలు అదికంగా ఉంటాయి . మానసిక , ఆర్దిక ఆరోగ్యు సమస్యలుంటాయి . అంద్ఫరిమీద ద్వేషం పెంచుకుంటారు .
కుటుంబ విషయాలలో అన్ని పనులు చలా బాగా చక్క పరుస్తారు . కాని వారినుండి మాత్రం సహకారం లభించక ఇబ్బంది పాడుతారు . పెద్దవారి విషం లో ఆరోగ్య జాగ్రత్తలు అవసరమున్నది .వాత సంబంద వ్యాధులున్నవారు జాగ్రత్తగా ఉండాలి . ఆర్దిక విషయంలో అనుకున్న అంత ఆదాయాలు పొందలేరు . అధిక ఖర్చులు ఉంటాయి . కొన్ని వృదా ఖర్చులు పడే అవకాశాలు ఉన్నాయి .రావలసిన పాత ధన సంబంద పెండింగులు పరిష్కారము అవ్వగలవు . అవసరానుకి ధనము సర్దు బాటు ఔతుంది . ఉద్యోగస్తులకు సమస్యలతో కూడుకొని ఉంటుంది . వొత్తిడి ఎక్కువగా ఉంటుంది . సంవత్సర ఆకారులో కొన్ని మంచి [పలితాలు పొందుతారు .వ్యాపారస్తులకు శని ప్రభావము వలన ఆర్దిక ఇబ్బందులు తప్పవు .
నూతన వ్యాపారాలు చేయాలి  అనుకునే వారు వాయిదా వేసుకోవటం చాల మంచిది . రైతులకు బాగా ఉంటుంది . శ్రమకు తగిన పలితాలు అందుకుంటారు . షేర్ వ్యాపారస్తులు దూకుడు తగ్గించుకోవటం మంచిది . విద్యార్దులకు జ్ఞాపక శక్తీ తగ్గి సరైన పలితాలు అందుకోలేక పోతారు .
*మిధున రాశి-*
మృగశిర 3,4 పాదములు [కా,కి ],ఆరుద్ర 1,2,3,4 పాదములు [కూ,ఖం,జ్ఞ,చ్చ] ,పునర్వసు  1,2,3 పాదములు [కే,కో,హా] ఈ అక్షరములతో పేరు మొదలయ్యేవారు *ఆదాయం 14* , *వ్యయం 2* –

*రాజ పూజ్యం 2*–*అవమానం 3*

ఈ సంవత్సరము సముదాయముగా పరిశీలించగా శని సప్తమ సంచారము వలన మాద్యమ అనుకూలం కలిగి ఉంటారు . దేసంతరము వెళ్ళాలనే కోరిక బలంగా ఉంటుంది . ప్రతి పనిలోనూ జాప్యము ఉంటుంది . భయము , ధన విషయం లో అదిక కర్చు ఉండే అవకాశాలు ఉన్నాయి . మానసిక వొత్తిడి ఉంటుంది .గురువు పంచమ సంచారము వరకు అనుకూలంగా ఉంటుంది . షష్టమ సంచారము మాత్రం కొన్ని ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది . రాహు ఈ సంవత్సరమంత బాగా అనుకూలించిను . కుజ సంచారము కూడా అనుకూలిస్తుంది . కొత్త పనులకు నాంది పలుకుతారు . వ్రుత్తి వ్యాపారాలకు అనుకూల వాతావరణం ఉండదు . దూర ప్రయాణాలు తగ్గించు కొనుట మంచిది . చేస్తున్న పనులు వదలి వేరే ప్రయత్నాలకు ప్రేరణ కలుగుతుంది . ఒంటరిగా దూర ప్రయాణాలకు వాయిదా వేసుకోవటం మంచిది . దిన చర్యలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి . అక్టోబర్ వరకు పుణ్య కార్యాలలో , సుభ కార్యాలలో పాల్గొంటారు . ప్రతి పనులలో సహకారం లబిస్తుంది . కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి . కొన్ని సమస్యలు తలెత్తుతాయి .
కుటుంబ విషయంలో పెద్దల ఆరోగ్య కర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి . బాద్యతలు చక్కగా నిర్వర్తిస్తారు .పిల్లల ఆరోగ్య విషయంలో కర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి . కుటుంబ సమస్యలు పరిష్కారం ఒక కొలిక్కి వొస్తాయి . ఆరోగ్య విషయం లో వాత సంబంధం గాను , ఎముకల సంబంధం గాను ఇబ్బందులు రాగలవు . పథ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి .

ఆర్దిక విషయం లో ఆదాయం అక్టోబర్ వరకు బాగుంటుంది . అదిక కర్చులు ఉన్నా ఇబ్బంది ఉండదు . అక్టోబర్ తరువాత ఆర్దిక ఇబ్బందులు , కొన్ని చికాకులు కలిగే అవకాశాలు ఉన్నాయి . రావలసిన ఆదాయము ఆలస్యమౌతుంది.ఉద్యోగాస్తులలో పనులలో జాప్యం జరుగుతుంది . శ్రమకు తగిన పలితం అందదు . కాని నష్టము లేని జీవనమే ఉంటుంది . పనులు స్వయంగానే చేసుకోవటం మంచిది . పనివారి వలన వొత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగ ప్రయత్నాలు అక్టోబర్ వరకు అనుకూలంగా ఉంటుంది . తరువాత అనుకూలం తక్కువగా ఉంటుంది . ఈ సంవత్సరం అన్ని విదాల అనుకూలం తక్కువగా ఉంటుంది . అన్ని రకాల చికాకులు ఉంటాయి కాని నష్టాలు వోచే అవకాశాలు లేవు . నూతన వ్యాపార ప్రయత్నాలు వాయిదా వేసుకోవటం మంచిది . జులై , ఆగష్టులలో అనుకూలం ఉంటుంది . రైతులకు శ్రమ పెరుగుతుంది . ధనవ్యయం అధికముగా ఉంటుంది . రావలసిన పైకము అందక ఇప్పండి పడే అవకాశాలు ఉన్నాయి . షేర్ వ్యాపారస్తులకు అనుకూలంగా లేదు .విద్యార్దులు శ్రమతో కూడిన పలితం అందుకుంటారు .
*కర్కాటకరాశి-*
పునర్వసు 4 వ పాదము[హే], పుష్యమి 1,2,3,4 పాదములు [హు,హే,హొ,డా],ఆశ్లేషా 1,2,3,4 పాదములు [డీ,డు,డే,డో ] ఈ అక్షరములతో పేరు మొదలయ్యేవారు.

*ఆదాయం 8 , *వ్యయం 2*–

*రాజ పూజ్యం 7* , *అవమానం 3*

ఈ సంవత్సరం శని సంచారం అనుకూలంగా ఉంటుంది ఎంతటి సమస్యనైన తేలికగా డేటా వెయ గల సమర్ధత ఉంటుంది . కాని రాహు , కేతు , కుజ గ్రహ ప్రభావము చేత టెన్షన్ లు అదికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి . ప్రతి విషయం లోను వొత్తిడి ఉంటుంది . రాహు ప్రభావం వలన భార్యా పుత్రులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . భాగస్తులతో  విబేదాలు అందరిని చులకనగా చూడటం , అందరిచేత అవమానింప బడటం , అదిక ప్రయాణాలు , ఆర్దిక సమస్యలు , అనారోగ్య సమస్యలు ఉంటాయి .

రాహువు ఇబ్బందులు కలిగించినా ఏపని చేయాలో అవి ఆలస్యంగా నైన చేసుకుంటూ వెళతారు . ఇతరులను నమ్మి ఎ పనిలోకి దిగ కుండ ఉంటేనే మంచిది . గురువు బలము వలన పుణ్య కార్యాలు , దైవ దర్సనం ,విజ్ఞాన , వినోద కార్యక్రమములలో పాల్గొంటారు . ప్రతి విషయాలలో అనుమానాలు పెరిగే అవకాశాలు ఉంటాయి . ప్రతి విషయం లోను కష్టముతో కూడిన ఆదాయం పొందుతారు . వాహనంలు రిపేరుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి . తెలియని శరీర రుగ్మతలు ఉంటాయి . కుటుంబ సహకారము లబించదు బాద్యతలు మాత్రం చక్కగా నిర్వర్తిస్తారు . తెలియని భయాన్దోలనలకు గురి అవుతుంటారు .  పిల్లమీద ఆందోళన ఉంటుంది
.
ఆర్దిక విషయముల యందు సంవత్సరము అంత కూడా అనుకూలంగా ఉంటుంది . ఆయిత కొంత మోస పోయే అవకాశాలు ఉన్నాయి . అనవసరపు ఖర్చులు అదికంగా ఉంటాయి . ప్రతి విషయం లోను అదిక ఖర్చుల సూచనలు ఉన్నాయి .వాహన , గృహ రిపేర్ ఖర్చు పెరుగుతుంది . ఉద్యోగస్తులకు బద్రత తక్కువగా అనే భావన ఉంటుంది . నూతన ఉద్యోగ ప్రయత్నములు చేయు వారికి అనుకూలత ఉంటుంది వ్యాపారస్తులకు మోస పూరిత వాతావరణం ఉంటుంది . ఊహించని పొరపాట్లు జరిగే అవకాశాలు ఉన్నాయి . వాటి వలన ఇబ్బందులు పడతారు . పనివారితో జాగ్రత్తగా ఉండాలి .
నూతన వ్యాపార ప్రయత్నాలు విచిత్రమైన అనుబూతులు ఎదురౌతాయి . అనుకూలం కాదు .రైతులకు అనుకూలంగా ఉన్నాకూడా కల్తి వస్తువుల వలన ఇబ్బందులు గురి ఔతారు . షేర్ వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి . దూకుడు నష్టాన్ని సూచిస్తుంది . విద్యర్డులో మొండి ప్రయత్నాలు చేసినా కూడా ప్రతి బంధకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .
*సింహ రాశి-*
మఖ 1,2,3,4, పాదములు{మా,మీ,ము,మే}  , పుబ్బ 1,2,3,4 పాదములు{మో,టా,టీ,టు} ఉత్తరా  1 వ పాదము{టే} ఈ అక్షరములతో పేరు మొదలయ్యేవారు

*ఆదాయం 11* ,*వ్యయం 11* –

*రాజ పూజ్యం 3* ,*అవమానం 6*

ఈ సంవత్సరము మొత్తము మీద గ్రహ సంచార స్తితులమును బట్టి అనుకూల స్తితి తక్కువగా ఉన్నది . అన్ని వ్యవహారములు స్వయముగా చూసుకోవడం మంచిది . సొంత ఆలోచనలను వాయిదా వేసుకోవటం మంచిది . గురు సంచార అనుకూలత తక్కువగా ఉన్నది . శని రాహు అనుకూలత కూడా అలాగే ఉన్నది . కుజ సంచార అనుకూలం చాల బాగున్నది . మంచి పలితాలను అందుకో గలరు . శ్రమకు ప్రాదాన్యత ఇచ్చి మంచి పలితాలను పొందుతారు . దేవత కార్యములు చేయుట , జన్మ సతలములో దేవతా కార్యములు చేయుట వలన ఉపశమనం పొందుతారు . చేయు పనుల మీద నిర్లక్ష్యం కలిగే అవకాశాలు ఉంటాయి .ఆందోళన ఉంటుంది .
మిగిలిన గ్రహ సంచార అనుకూల దృష్ట్యా సమస్యలు పెరగ కుండ జాగ్రత్త పడి జీవితం గడుపుతారు . ఆస్తి తగాదాలు ఉన్నవారు ఈ సంవత్సరం ఓకే సెటిల్మెంట్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయి . తక్కువ స్తాయి వారి వలన కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది . కుజ స్తంబన వలన వస్తు , ధన , ధాన్య లాభం చేకూరడం , కీర్తి ప్రతిష్టలు పెంచడం ,మానసిక ఉల్లాసం అదికంగా ఉండడం , ప్రతి విషయం లో ప్రమోషన్ అందుతుంది.
కుటుంబ విషయాలు పరిశీలించగా పెద్దల ఆరోగ్య విషయంగా కాని ,వ్యవహార పరంగా కాని కొంత భయము , ఇబ్బంది ఉంటుంది . పిల్లల అభివృద్ధి బాగుంటుంది , కుటుంబ వ్యవరాలు చక్క బడుతాయి అన్ని విషయాలలో సానుకూలంగానే ఉంటుంది . ఆరోగ్య విషయం లో ప్రత్యెక శ్రద్ద తీసుకోవలసిన అవసరం ఉంటుంది . ఆర్దిక విషయం లో ఇబ్బందులు లేకుండా సాగుతుంది .ఖర్చులు నియంత్రించే విషయంలో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి . ప్రతి విషయం లోను అవుతుందో కాదో అనే భయం మాత్రం వెంటాడుతుంది . శ్రమ పెరుగుతుంది . శ్రమకు తగిన పలితం ఉంటుంది . ఉద్యోగస్తులకు మానసిక అశాంతి పెరుగుతుంది . కొన్ని పనుల్లో చాల ధైర్యంగాను . కొన్ని పనులు ఆందోళనతో చేస్తుంటారు . నష్టాలు ఉండవు కానీ జాగ్రత్త అవసరం ఉన్నది . నూతన ఉద్యోగ ప్రయత్నాలు వట్టిడిగా అనుకోలమౌతాయి . వ్యాపారస్తులకు సాదారణ పలితాలు ఉంటాయి . వచ్చే ఆలోచనలకు చేసే పనులకి పొంతన ఉండదు . వ్యాపార పరంగా నిర్లక్ష్య దొరని ఉండే అవకాశాలు ఉంటాయి . నూతన వ్యాపార ప్రణాళికలు సాదారణ స్టయి లో ఉంటాయి .
రైతులు పనులు సాగించి నష్టాలు లేకుండా కాలక్షేపం చేస్తారు . మానసిక వత్తిడి ఉంటుంది . షేరు వ్యాపారస్తులకు నష్టాలూ ఉండవు .విద్యార్దులలో నిర్లక్ష్యం పెరిగి అనుకున్న ఫలితాలు సాధించలేక పోతారు .
*కన్యా రాశి-*
ఉత్తర 2,3,4,పాదములు [టో,పా,పీ],హస్త 1,2,3,4 పాదములు [పూ,షం,ణా,ఢ]చిత్త 1,2, పాదములు [పే,పో] ఈ అక్షరములతో పేరు మొదలయ్యేవారు. *ఆదాయం 14*, *వ్యయం 2*– *రాజపూజ్యం 6* , *అవమానం 6* సంవత్సరం మొత్తం పరిశీలించగా గ్రహ సంచార అనుకూలత లో గురువు అక్టోబర్ వరకు అనుకూలంగా ఉన్నాడు , రాహు కేతు సంచారము కూడా అనుకూలగానే ఉన్నాడు . శని సంచారం అనుకూలత తక్కువా ఉన్నాడు . మానసిక దైర్యం పెరుగుతుంది . కాని ఎదో చెన్న భయం ఆందోళన పీడిస్తూ ఉంటుంది . అలంకరణ వస్తులాభం  ఉంటుంది . విందు వినోదాలలో పాల్గొంటారు . అక్టోబర తరువాత సాదారణ ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి . భావిస్యట్టుమీద ఆస పెరుగుతుంది . మనకు మంచే జరుగుతుంది అని విశ్వాసం పెరుగుతుంది . ప్రతి అంశంలోనూ దైర్యము తెలివి తేటలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . ఈ సంవత్సరం, విజయ శాతం , ఈక్కువ పుణ్య కార్యాచరణ , దైనందన కార్యక్రమాలు సక్రమంగా జరిగుతాయి . ఇతరుల సహాయ ,సహకారాలు అందుతాయి .
సంవత్సర అంతములో కొన్ని ఆందోళనలు ఉంటాయి . నష్టం వస్తుందేమో అనే భయం పెరుగుతుంది . కాని నష్టాలూ వచ్చే అవకాశాలు మాత్రం లేవు . ప్రతి పనిలోనూ అనుకూల వాతావరణం  ఉంటుంది . సమాజం లో గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . నూతన వాహన అవకాశాలు ఉన్నాయి . కుజ స్తంబన వలన కోపం విసుగు పెరిగే అవకాశాలు ఉన్నాయి . పనుల్లో అలసత్వం నిర్లక్ష్య దొరని పెరుగుతంది .
కుటుంబ విషయంలో పరీలిస్తే అందరికి సహాయ సహకారాలు అందిస్తారు . పెద్దల, పిల్లల బాద్యతలు చక్కగా నిర్వర్తిస్తారు . సంవత్సర ఆకారులో కుటుంబ సమస్యలు , బంధువులతో వైరం పెరిగే అవకాశాలు ఉన్నాయి . ఆరోగ్యాభి వృద్ది ఉంటుంది . గత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది .కోసమస్యలు రాకుండా జాగ్రత్త వహిస్తారు . వైద్య సలహాలు పొంద వలసి వస్తుంది . అలంకరణ వస్తువులకు ప్రాదాన్యత ఇస్తారు . దాన ధర్మాలు కి కర్చు పెడతారు . పాత ఆర్దిక సమస్యలమీద నిర్లక్ష్యం పెరుగుతుంది .
ఉద్యోగస్తులకు ఉద్యోగ అభివృద్ధి కుంటూ పడుతుంది . కొన్ని అవరోదాలు ఉండే అవకాసం ఉన్నది . కానీ ప్రతి పని ధైర్యంగా చేస్తారు . ఆటంకాలను జయిస్తారు . ప్రతిపని గౌరవ మర్యాదలను పెంచుతుంది . నూతన ఉద్యోగ ప్రయత్నాలకు మంచి సలహాలు అందుతాయి . వ్యాపారస్తులకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది . ధనాదయాం బాగుంటుంది . పనుల్లో జాప్యం జరుగుతుంది . రైతులకు మంచి పలితాలు అందుకుంటారు . సమతూకంగా ఉంటుంది . షేర్ వ్యాపారాలు తెలివిగా జాగ్రత్తగా ఉంటె మంచి ఆదాయాని పొంద గలరు . మానసిక చాంచల్యము వలన విద్యార్దులకు బాగుండదు .
*తులా రాశి-*
చిత్త 3,4 పాదములు [రా,రి,]స్వాతి 1,2,3,4 పాదములు [రూ ,రే,రో,తా]  విశాఖ1,2,3 పాదములు [తీ,తూ,తే] ఈ అక్షరములతో పేరు మొదలయ్యేవారు . *ఆదాయం 11* ,*వ్యయం -5* –

*రాజ పూజ్యం 2* , *అవమానం 2*

ఈ సంవత్సరము అంతయు శని , గురు సంచారము అనుకులముడా ఉన్నది కావున చాలం మంచి పలితాలను అందుకుంటారు .మానసిక ప్రవర్తన కూడా సంస్కార వంతముగా ఉంటుంది . బయట ఉండేవారు స్వస్తన చేరే అవకాశాలు ఉన్నాయి . భార్యా  పిల్లలతో సంతోషముగా గడుపుతారు .బండులతో విందు వినోదాలలో పాల్గొంటారు మీ సొంత ఆలోచనల వల్ల గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .

గురు రాహు సంచారము కూడా అనుకూలంగానే ఉన్నది . దానివలన కూడా మంచి పలితాలను అందుకుంటారు . దైవ దర్శనాలు , తీర్ధ యాత్రలు చేస్తారు . అందరి సహాయ సహకారాలు పొందుతారు . ప్రతిపని అదిక శ్రమతో సాదిస్తారు . పాత సమస్యలు తీరి సమాజంలో గుర్తింపును పొందుతారు .దూర ప్రయాణాలు పెరుగుతాయి . పెద్ద స్తాయి వారికి కూడా సలహాలు ఇవ్వడం జరుగుతుంది . బాద్యతలన్ని గొప్పగా నిర్వహిస్తారు . మంచి ప్రశాంతముగా ఉంటారు .

కుజ స్తంభన వలన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి . అన్ని కూడా చిన్న స్థాయిలోనే ఉంటాయి .

కుటుంబ విషయానికి వస్తే మీ సలహాలు అందరు పాటిస్తారు . కుటుంబ బాద్యతలు చక్కగా నిర్వర్తిస్తారు .కుటుంబ సబ్యుల సహకారముతో సమస్యలకు పరిష్కారము దొరుకుతుంది . అన్నిటా విజయం చేకూరుతుంది . పాత అనారోగ్య సమస్యలకు కూడా వైద్యుల సహాయ సహకారాలతో పరిష్కారం దొరుకుతుంది . కొత్త అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడతారు . మంచి విదానాలను అవలంబిస్తారు . ఈ సంవత్సరమంతా ధనాదాయము బాగుంటుంది . అదిక కర్చులను అదుపులో ఉంచుతారు . మంచికి ధనము ఖర్చు చేస్తారు . అది ఒక సుభ సూచకమే .. ధన వృద్ది బాగుంటుంది .

ఉద్యోగస్తులకు ఈ సంవత్సరము అంతా అబివృద్ది పదంలో సాగుతుంది .తోటి ఉద్యోగులు మరియు అధికారులు చాల అనుకూలంగా ఉంటారు . నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయు వారికి అనుకూలంగా ఉంటుంది . సుభ వార్తలు వింటారు . వ్యాపారస్తులకు మంచి అనుకూల సమయమే . శ్రమకు తగిన లాభాలు ఉంటాయి . అన్ని కోణాలలో అందరి నుండి సహాయ సహకారాలు లభిస్తాయి . ప్రోత్సాహం బాగుంటుంది . నూతన వ్యాపార ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి .

రైతులకు జాగ్రత్తలతో కూడిన మంచి పలితాలు అందుకుంటారు . రుణ సహకారము లేబర్ సహకారము చాల బాగుంటుంది . షేర్ వ్యాపారులకు అన్నిరకాలుగా అనుకూలంగా ఉంటుంది . ప్రణాళిక బద్దంగా వ్యాపారము చేస్తారు . విద్యార్దులకు అబివృద్ది కలుగుతుంది .
*వృశ్చిక రాశి-*
విశాఖ 4 వ పాదము [తో]అనురాధ 1,2,3,4 పాదములు [న,ని,ను,నే]జేష్ట1,2,3,4 పాదములు [నో,యా,యీ ,యు]  ఈ అక్షరములతో పేరు మొదలయ్యేవారు ,

*ఆదాయం 2* , *వ్యయం 14* –

*రాజ పూజ్యం 5* , *అవమానం 2*

ఈ సంవత్సరము పరిశీలించగా ఏలినాటి శని ప్రభావం గురు రాహు సంచారము సరిగా లేకపోవడం వలన ప్రతి విషయం లోను చాల జాగ్రత్తగా నడచుకోనుట మంచిది . పరాయి వ్యవహారములలో తల దూర్చకున్దుట ఉత్తమం . ఎవరినో నమ్మి మోస పోయే అవకాశాలు ఉన్నాయి . ప్రతి విషయం రహస్యంగా ఉంచుట మంచిది . కొత్త విషయాల జొలీ వెళ్ళకుండా , పాత వాటిమీదే మనసు పెట్టి ఉండుట మంచిది . ప్రతి ఒక్కరితో విరోదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . ఆర్దిక సమస్యలు బాగా ఉంటాయి . మానసిక వొత్తిడి పెరుగుతుంది . అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి .
గురు రాహు సంచారత సరిగా లేక పోవడం వలన చాల ఓర్పు సహనం పాటించుట మంచిది . వీలైనంత వరకు దైవ చింతనలో గడపటం చాలా మంచిది . కొత్త అనుభవాలు చవి చూస్తారు . చాలా విషయాలలో చాలా జాగ్రత్తగా మసలుకోనుత మంచిది . కొన్ని పనుల్లో జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి . శ్రమ ఎక్కువగా ఉంటుంది . అనుకున్న పలితం అదక ఇబ్బంది పడతారు . స్తిరాస్తికి సంబంధించి కొంత ధనము కర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి . వాహన మార్పు ఆలోచనలు చేస్తారు . మంచి జీవన శైలి కోసం చేయు ప్రయత్నాలకు అవరోధం కలుగుతుంది .
దిన చర్యలలో కూడా అవరోదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . కుజ స్తంబన వలన అదిక ఆదాయము ఉంటుంది కానీ సానుకూలత ఉండదు . తెలియని చికాకులు ఉండే అవకాశాలు ఉన్నాయి . పెద్దలకు ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .
ప్రతి విషయం లోను అదిక కర్చు ఏర్పడుతుంది . అప్పులు చేయ వలసి వస్తుంది . శ్రమతో కూడిన ఆదాయము ఉంటుంది . అనవసర కర్చులు పెరుగుతాయి .కొన్ని సమస్యలకు పరిష్కారము లభిస్తుంది . లావాదేవిల విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తే మంచిది .
ఉద్యోగస్తులకు ఆశించిన అభివృద్ధి ఉండదు . అధికారుల వొత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి . కొన్ని నష్టాలు కూడా ఉండ గలవు . ఎవరి సహాయ సహకారాలు అందవు . శ్రమ ఎక్కువ పలితం తక్కువ ఉంటుంది . నూతన ఉద్యోగ ప్రయత్నాలు మంచి పలితాలి ఇస్తాయి . కానీ ఉద్యోగ వొత్తిడి ఉంటుంది . నూతన వ్యాపార ప్రయత్నాలు వాయిదా వేసుకొనుట మంచిది . రైతులకు అనుకున్నంత పలితం అందాకా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి . కాని నాశములు ఉండవు . షేర్ వ్యాపారస్తులకు జాగ్రత్త అవసరము . సంవత్సరము మొత్తము మీద సాదారణ స్తాయి పలితాలు ఉంటాయి . విద్యార్దులకు ఉత్తీర్ణత ఉంటుంది కానీ మార్కుల శాతం తగ్గుతుంది
*ధనుస్సురాశి-*
మూల 1,2,3,4 పాదములు[యో ,యో, బా,బి]పూర్వాషాడ 1,2,3,4పాదములు [భు,ద ,భా,ఢ]ఉత్తరాషాడ  1 పాదము [భె]ఈ అక్షరములతో పేరు మొదలయ్యేవారు .

*ఆదాయం 5* , *వ్యయం 5* –

*రాజ పూజ్యం 1* , *అవమానం 5*

ఈ సంవత్సరము మొత్తము మీద పరిశీలించగా ఎలానాటి శని రెండవ బాగము మరియు అష్టమ రాహు ప్రభావము చేత ఎక్కువ చికాకాకులతో కూడి ఉంటుంది . అయితే గురుబలము ఉన్నందున వాటిని అధిగమించే అవకాశాలు ఎకువగా ఉన్నాయి . అక్టోబర్ 11 నుండి సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . అప్పటి నుండి గురుబలం తగ్గుతుంది .మానసిక అత్తుడులు పెరిగే అవకాశాలు ఉన్నాయి . ఆర్దిక సమస్యలు , అప్పులు చేయించుట , ఆసుపత్రులు తిప్పట ఉంటుంది . ఎన్ని కష్టాలు ఎదురైనా దైవ సహకారము తో అదిగమించ గలుగుతారు . శరీరంలో తేజస్సు తగ్గుతుంది . ప్రతి పనిలోని భయము , ఆందోళన ఎక్కువగా ఉంటుంది .
గురువు అక్టోబర్ 11 వరకు లాభంలో ఉన్నందు వలన పెద్దగా ఇబ్బందులు తెలియ కుండా జరిగిపోతుంది . .తరువాత అష్టమ రాహు ప్రభావము బలమైన వొత్తిడి ఉంటుంది . పనులు సకాలములో పూర్తి అవ్వక అగౌరవము పొందుతారు . స్వంత పనులమీద నిర్లక్ష్యం ఉంటుంది . అతివాదనల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు . సమయ పాలన లేక పోవడము వల్లనే అన్ని సమస్యగా తయారౌతాయి . ఒంటరి ప్రయాణాలు తగ్గించుకోవటం మంచిది . కుజ స్తంబన వలన శరీరంలో బాల హీనతలు రావడం , కార్య బంగములు ,ధన వ్యయము , చేడుపనులకు ప్రేరణ కలగటం జరుగుతుంటాయి . అక్టోబర వరకు కుటుంబ విషయాలు సమస్యలు దాటుకుంటూ వెళతారు . తరువాత సమస్యలు ప్రతాపం చూపిస్తాయి . తట్టుకోవటం చాల కష్టంగా ఉంటుంది . అనవసర విచిత్ర సమస్యలతో పోరాడతారు .
ఆరోగ్య విషయం లో బహు జాగ్రత్తలు అవసరము .ఇబ్బందులు రాగలవు . పాత సమస్యలు ,మరియు కొత్త సమస్యలు తోడూ అయి ఇబ్బంది పెడతాయి . ఆర్దిక విషయం లో ఆదాయ వ్యయాలు పరిదిలో ఉండవు . అక్టోబర్ వరకు కార్చి నియత్రణ లేకున్నా ఆదాయం బాగుంటుంది .తరువాత ఆదాయం తగ్గుతుంది . అదిక కర్చు , ధన నష్టాలు రాకుండా జాగ్రత్త అవసరమున్నది .ఉద్యోగస్తులకు సకాలములో పనులు పూర్తి కాకా ఇబ్బంది పడతారు .అధికారుల వొత్తిడి పెరుగుతుంది .రావలసిన లాభాలు , సౌకర్యాలు సకాలములో అందవు .
నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయు వారికి శ్రమతో కూడిన పలితం లభిస్తుంది . ఒకరి మీద ఆధారపడి వ్యాపారములు చేయు వారికి ఇబ్బంది కాలమే అని చెప్పవచు . మోసపోయే అవకాశాలు బలంగా ఉన్నాయి . మొండి బాకీలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . గురుబలము వలన నష్టాలూ రాకుండా ఉండ గలరు . నూతన వ్యాపార ప్రయత్నాలు వాయిదా వేయటం మంచిది . రైతులకు శ్రమతో కూడిన పలితం ఉంటుంది . షేర్ వ్యాపారస్తులకు తెలివితో కూడిన ధన లాభం ఉంటుంది . అక్టోబర్ తరువాత చాల జాగ్రత్త అవసరము ఉన్నది .విద్యార్దులకు విద్య మీద దృష్టి తగ్గుతుంది .
*మకర రాశి-*
ఉత్తరాషాడ 2,3,4 పాదములు,[బో ,జా,జి],శ్రవణం 1,2,3,4 పాదములు [జు,జె,జో ఖ ],ధనిష్ఠ 1,2 పాదములు [గా,గి] ఈ అక్షరములతో పేరు మొదలయ్యేవారు  . *ఆదాయం 8*, *వ్యయం 14* –*రాజపూజ్యం 4* –*అవమానం 5*

ఈ సంవత్సరము అంతా పరిశీలించగా ఎల్నాటి శని ప్రధమ బాగము రాహు ప్రతికూల సంచారము వలన మరియు గురువు అనుకూల సంచార దృష్ట్యా ఈ సంవత్సరము మిశ్రమ పలితాలు అందుకుంటారు . శని . కుజ ,రాహు సంచార దృష్ట్యా కష్టాలు ఎదురౌతున్నప్పటికి  గురుబలము ,దైవబలము , బుడ్డి వికాసముతో సమస్యలనుండి తప్పించుకోగలుగుతారు . ఎలానటి శని ప్రభావము వలన తేజస్సు తగ్గడం , బద్ధకం పెరగడం , మానసిక వొత్తిడి . అనారోగ్య సమస్యలు పీడిస్తాయి.
అయితే గురు ప్రభావం దీనికి విరుద్దంగా అక్టోబర్ నుండి కొంత సానుకులము స్వస్తత పొంద గలరు . అక్టోబర్ వరకు మాత్రం సమస్యలు వెంటాడుతూనే వుంటాయి వస్తునష్టం , చోరి బాహ్యము ,అప్పుల బాధ పెరిగే అవకాశాలు ఉన్నాయి . కొందరి నుండి మోసపోయే అవకాశాలు ఉన్నాయి . ప్రతి విషయము రహస్యంగా ఉంచడమే మంచిది . పుణ్య కార్యాలు , దైవ దర్శనాలకు కూడా అవరోదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . అనుకోకుండా ఖర్చులు పెరిగి అప్పులు చేయ వలసి వస్తుంది . అక్టోబరు నుండి సహకారము దొరుకుతుంది . సాంఘిక కార్యక్రమాలలో జోక్యం చేసుకోకుండా ఉండటమే మంచిది. కొన్ని కార్యక్రమములలు అవమానాలు జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పాటించ వలసినది . అనుకోని ప్రయాణాలు , కుటుంబ కలహాలు , స్నేహితులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి
కుటుంబ విషయాలు పరిశీలించగా అంతా మిశ్రమ పలితాలతో నడచును ఎవరి సహకారము లభించదు . పిల్లలనుండి ఆశించిన పలితాలు అందవు.పెద్దల విషయం లో పథ ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి . ఆరోగ్య విషయాలలో చాలా జాగ్రత్త పాటించడం మంచిది . చిన్న అనారోగ్యం కూడా పెద్ద వైద్యం చేయించుకోవలసి వస్తుంది . శరీర ఘాయాలు తగిలే అవకాశాలు ఉన్నాయి . ఆదాయ వ్యయాలు ఒక పద్దతిలో ఉండక చేకాకు పడతారు . తోటి ఉద్యోగుల సహకారము లబించక అధికారుల ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది . అక్టోబర తరువాత కొంత అనుకూలం ఏర్పడుతుంది . ఉద్యోగస్తులు చాల జాగ్రత్తలు పాటించ వలసి వస్తుంది . నూతన ఉద్యోగ ప్రయత్నం చేయు వారు ఎవరిని నమ్మకుండా ఉండటమే మంచిది లేకపోతె మోసపోయే అవకాసము ఉన్నది . వ్యాపారస్తులకు అదిక జాగ్రత్త అవసరమున్నది . ప్రతి పనిలోనూ మానసిక వొత్తిడి ఉంటుంది .ఎన్ని ఉన్న గురుబలము వలన నష్టాలను అధిగమిస్తారు .
నూతన వ్యాపార ప్రయత్నమూ చేయువారికి మంచి ఆలోచనలు సహకారము అందినను మండగమనమే .రైతులు గురు బలం దృష్ట్యా మంచి లాభాలు పొందుతారు . కానీ ఎక్కువ కష్టము ఉంటుంది . మోసపోయే అవకాశాలు ఉన్నాయి . షేర్ వ్యాపారులకు నష్టాలే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులలో జ్ఞాపక శక్తి తగ్గుతుంది . అనుకున్న మార్కులు రాక పొవచ్చు.
*కుంభ రాశి-*
ధనిష్ఠ 3,4, పాదములు[గు ,గే]శతభిషం ,1,2,3,4 పాదములు [గో,సా,సీ,సు]పూర్వాభాద్ర 1,2,3 పాదములు [సే ,సో ,దా ]ఈ అక్షరములతో పేరు మొదలయ్యేవారు .

*ఆదాయం 8*, *వ్యయం 14* – *రాజపూజ్యం 7* ,*అవమానం 5*

ఈ సంవత్సరము మొత్తము మీద గురు ,రాహు , శనులు అనుకూల పలితాలను ఇచేవిగా ఉన్నాయి . చాలా మంచి జీవనం  సాగుతుంది . వ్యయంలో కుజ స్తంబాన వలన రావలసిన చెడు పలితాలను తగ్గిస్తుంది . ధర్మ , పుణ్య కార్యాచరణ మీద దృష్టి పెరుగుతుంది .సమాజం లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ..క్షణం వృదా చేయకుండా శ్రమ చేసిన యడల పాత సమస్యలకు పరిష్కారం దొరుకుతాయి . కొత్త ప్రణాలికలు ప్రతిబడుస్తారు అనుకూలంగా ఉంటుంది . ఆదాయము బాగుంటుంది . కుటుంబం ఆరోగ్య వంతముగా ఉంటుంది.మంచి ఫలితాలను అందుకుంటారు .

సంతృప్తి కరమైన జీవితం గడుపుతారు . ప్రతి విషయం లో పటుదలతో విజయం సాధిస్తారు . బందువులు స్నేహితులుగా మారతారు . మీ ప్రతి కార్యములో సహకరించే వారుంటారు . ప్రతి విషయం లోను అనుకూలంగానే ఉంటుంది . జీయన శైలి చాల బాగుంటుంది . దూరమైన వ్యక్తులు దగ్గరౌతారు . కొత్త పనులకు శ్రీకారము చుడతారు . మంచి అభివృద్ధి ఉంటుంది .

కుటుంబ విషయాలు పరిశీలించగా అందరి సహకారము ఉంటుంది . భార్యా పుత్రులు ఆరోగ్య కరంగా ఉంటారు . వారితో విహార యాత్రలు చేస్తారు . పిల్లల ఉన్నతి స్తితి ఉంటుంది . శుభ వార్తలు వింటారు . ఆరోగ్య విషయం లో తగు జాగ్రత్తలు తీసుకొని సంతోషంగా ఉంటారు. సరైన వైద్యం దొరుకుతుంది .ఆర్దిక విషయంలో ధనాదాయము ఉంటుంది . కర్చులు అదుపులో ఉంచ గలుగుతారు . అలంకార వస్తువులు , గృహ ఉపకరణములు  సమకూర్చుకొనే అవకాశము ఉన్నది .సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . అన్ని విధాల సమృద్దిగా ఉంటుంది .

ఉద్యోగస్తులకు పై అధికారులనుండి , తోటి వారినుండి అన్ని రకాల సహకారము లభిస్తుంది . మంచి ఫలితాలతో ముందుకు సాగుతారు . నూతన ఉద్యోగ ప్రయత్నం చేయు వారికి చాలా అనుకూలంగా ఉంటుంది .వ్యాపారస్తులకు ఆదాయము చాలా బాగుంటుంది .ఆర్దిక సహకారము అందుతుంది . పనివారి సహకారము లభిస్తుంది .పెద్దల ప్రోత్సాహం బలంగా లభిస్తుంది .

రైతులకు శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు . మంచి లాభాలను పొందుతారు . వ్యాపారస్థులకు కూడా మంచి ధనాదాయము ఉంటుంది . నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.విద్యార్దులకు మంచి అనుకూలంగా ఉంటుంది .
*మీన రాశి-*
పూర్వాభాద్ర 4 వ పాదము [దీ] ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు [దూ,శం,ఝు ,దా ],రేవతి1,2,3,4,పాదములు [దే,దో,చా,ఛి ]  ఈ అక్షరములతో పేరు మొదలయ్యేవారు .

*ఆదాయం 5* , *వ్యయం 5* –

*రాజ పూజ్యం 3*, *అవమానం 1*

ఈ సంవత్సరం మొత్తం మీద పరిశీలించగా రాహు , కేతు , శని  సంచారాలు అనుకూలంగానే ఉన్నాయి . అయిన అక్టోబర్ 11 వరకు వ్యతిరేక పలితాలను , తరువాత అనుకూల పలితాలను ఇస్తున్నాడు . కుజస్తంభన కూడా అనుకూలన్నే ఇస్తున్నాడు . ఎటు చూసినా అనుకూల వాతావరణమే కనిపిస్తున్నది .

అకాల భోజనం ఉంటుంది . మృష్టాన్న భోజన ప్రాప్తి ఉంటుంది . ప్రతి పని అలోచించి చేస్తారు . బందు, స్నేహితుల సహాయ సహకారములు పొందుతారు .అక్టోబరు నుండి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . దానివలన మంచే జరుగుతుంది . భవిష్యత్తు ప్రణాలికలు చర్చిస్తుంటారు . తీర్ధయాత్రలు , దైవ దర్సనాల వల్ల ప్రతి అంశము సానుకూలంగా ఉంటుంది . అనేక రంగాలలో శ్రమ సమకుతగిన పలితం ఉంటుంది. కొన్ని విషయాలలో అవరోదాలు ఉంటాయి . వాటిని సమయస్పూర్తి తో దాట గలుగుతారు . అందరి నుండి సహాయ , సహకారాలు అందుకుంటారు . గౌరవ మర్యాదలు పొందుతారు . మీకు కుజ స్తంబన వలన అనుకూలంగా ఉంటుంది .
కుటుంబ విషయాలు పరిశీలించగా వొత్తిడి భయం ఉంటుంది .కాని నష్టాలు వోచే అవకాశాలు లేవు . పెద్దవారి ఆరోగ్యం బాగుంటుంది . స్నేహితుల , బందు సహకారం బాగుంటుంది . కుటుంబ అవసరాలు సకాలములో పూర్తి చేస్తారు . చాలా ఆనందమైన వాతావరణమే ఉంటుంది . పాత సమస్యలకు మంచి పరిష్కార మార్గం దొరుకుతుంది . అన్ని రంగాలలో విజయమే సాదిస్తారు . ఆర్దిక విషయంలో ధనాదాయం బాగుంటుంది . అవసరాలు తీరతాయి . విలాసవంతమైన జీవితం గడుపుతారు . ఎటువంటి విషమ పరిస్తితిలోనైన ఆర్దిక సమస్యలుండవు .
ఉద్యోగస్తులకు అధికారుల వలన వత్తిడి వచ్చిన మరల వారె సహకరిస్తారు . సమస్యలు లేకుండా కలం గడుపుతారు . ఉద్యోగ ప్రయత్నం చేయు వారికి మంచి అనుకూలంగానే ఉంటుంది .శుభ వార్తలే వింటారు . మొండి దైర్యముతో ముందుకు వెళతారు . రైతులకు శ్రమకు తగిన పలితం ఉంటుంది . మంచి ఫలితాలు అందుకుంటారు . షేర్ వ్యాపారస్తులకు ఓపిక పడితే మంచి ఫలితాలు లభిస్తాయి . విద్యార్దులకు మంచి సలహాలు లభిచి ఉత్తీర్ణత సాధిస్తారు .
మీ పంచాంగ కర్త:

*శ్రీకొండ ఉమాకాంత శర్మ, సిధ్ధాంతి.*2018-03-18-10-02-21-107

*శ్రీ విళంబ నామ సంవత్సర పంచాంగ శ్రవణం. సంవత్సరఫలితాలు.*

 

*ఈ సంవత్సరంను విళంబ : అంతా సుభిక్షంగా ఉంటుంది.*
*ఈ సంవత్సరం*

*రాజు* — సూర్యుడు (రవి),

*మంత్రి* — శని,

*సేనాధిపతి, ఆర్ఘాధిపతి, మేఘాధిపతి* — శుక్రుడు,

*సస్యాధిపతి, నీరసాధిపతి* — కుజుడు,

*ధాన్యాధిపతి* — రవి,

*రసాధిపతి* — గురుడు.

నవనాయకుల్లో నలుగురు శుభులు, ఐదురుగు పాపులు. అలాగే, ఉపనాయకుల్లోని 21మందిలో 11మంది శుభులు, మిగతా వారు పాపులు. రాజు రవి కావడం, మంత్రి శని కావడం, ఇద్దరూ శత్రువులు అయినందున పాలనాపరంగా కొన్ని ఇబ్బందులు, సమస్యలు  ఎదురైనా అధిగమించి ప్రజలు ఆశించిన రీతిలో పాలన కొనసాగుతుంది.

పంటల దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. అలాగే,  పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో మంచి వర్షాలు కురుస్తాయి. గోధుమలు, వరి సహా ఎరుపు ధాన్యాల దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. అలాగే, ఎరుపు నేలలు బాగుగా పండుతాయి.

కళారంగాల వారికి విశేష లాభదాయకమైన కాలమనే చెప్పాలి. వీరికి అవార్డులు, రివార్డులు దక్కుతాయి.

అలాగే, పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వపరంగా సహాయం అందుతుంది. మంత్రి శని కావడం వల్ల మేఘాలు, గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల అతివృష్టి, మరికొన్ని చోట్ల అనావృష్టి పరిస్థితులు నెలకొంటాయి.

మొత్తం మీద పరిశీలించగా కేంద్రంలో పాలనాపరమైన మార్పులు జరుగుతాయి. అలాగే, పాలకపక్షం తీసుకునే నిర్ణయాలు ప్రజలకు ఊరటనిస్తాయి. రాష్ట్రాల మధ్య వివాదాలు నెలకొన్నా కేంద్రం చొరవతో సర్దుబాటు కాగలవు.

శాంతిభద్రతల లోపంతో దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఘర్షణలు, ఉద్యమాలు చెలరేగి ప్రజాజీవనం అస్తవ్యస్తమయ్యే అవకాశాలున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య సహకార లోపం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అలాగే, కొన్ని రాష్ట్రాల్లో పాలక పార్టీలు మారవచ్చు.

సాంకేతిక రంగాలు మరింత పుంజకుంటాయి. ముఖ్యంగా ఐటీ పరిశ్రమ పుంజుకుంటుంది.

వ్యవసాయ రంగం  ఆటుపోట్లు ఎదుర్కొన్నా రైతులకు కొంత లాభదాయకంగానే ఉంటుంది.
వైద్యం, పరిశోధనా రంగాల వారికి  విశేషయోగదాయకంగా ఉంటుంది.

ఈ ఏడాది ఎరుపు భూములు బాగా పండుతాయి. అలాగే, వాణిజ్య పంటల దిగుబడి మరింత పెరుగుతుంది. అపరాలు, మిర్చి, చింతపండు పంటలు విశేషం. తూర్పు, దక్షిణ ప్రాంతాలలో సుభిక్షం. ఇతర ప్రాంతాలలో  వర్షాభావ పరిస్థితులతో ఇక్కట్లు తప్పకపోవచ్చు. తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో అధికంగానూ, దక్షిణ, వాయువ్య ప్రాంతాల్లో సామాన్యంగా వర్షాలు కురుస్తాయి.

బంగారం, వెండి, రాగి లోహాల ధరలు పెరిగే సూచనలు. ఈ ఏడాది 9భాగాల వర్షం సముద్రమందు, 9 భాగాలు పర్వతాలయందు, 2 భాగాలు నేలపై కురుస్తుంది.

ఈ ఏడాది వర్ష లగ్నం కన్యారాశి అయినది. లగ్న, దశమాధిపతి బుధుడు లాభాధిపతి చంద్రుడు, వ్యయాధిపతి రవి, ద్వితీయ, భాగ్యాధిపతి శుక్రునితో కలిసి సప్తమమైన మీనంలో కలయిక. ద్వితీయ మందు గురుడు, తృతీయ, అష్టమాధిపతి కుజుడు పంచమ, షష్ఠాధిపతి శనితో చేరి చతుర్ధమైన ధనుస్సులోనూ, పంచమమైన మకరంలో కేతువు, లాభ మైన కర్కాటకంలో రాహువు సంచారం.

ఇక జగర్లగ్నం మిథునమైనది. లగ్నాధిపతి బుధుడు ద్వితీయాధిపతి చంద్రునితో కలిసి దశమమైన మీనంలోనూ, ద్వితీయంలో రాహువు, పంచమంలో సప్తమ, దశమాధిపతి గురుడు, అష్టమ, భాగ్యాధిపతి శని, షష్ఠమ, లాభాధిపతి కుజునితో కలిసి సప్తమమైన ధనుస్సులో, అష్టమంలో కేతువు, తృతీయాధిపతి రవి, పంచమ, వ్యయాధిపతి శుక్రుడితో కలిసి దశమమైన మేషరాశిలో సంచారం.

వీటిరీత్యా చూస్తే పాలకుల మధ్య కొన్ని విభేదాలు ఏర్పడవచ్చు.  ప్రతిపక్షాల నుంచి అధికార పక్షానికి సవాళ్లు ఎదురుకావచ్చు. అయితే చాకచక్యంగా కేంద్ర ప్రభుత్వం వాటిని అధిగమిస్తుంది. మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తవచ్చు. నిరుద్యోగులకు మంచి కాలమనే చెప్పాలి.  ప్రభుత్వ నిర్ణయాలు వీరికి ఉపకరిస్తాయి.

విద్యార్థులకు కూడా అనుకూలమైనదే. రాజు రవి కావడం వల్ల నాయకులు పేరు ప్రతిష్ఠలు పొందుతారు. ఉన్నత పదవుల్లో ఉన్న వారికి విశేషంగా రాణిస్తుంది. చిత్రపరిశ్రమ పుంజుకుంటుంది. కళాకారులకు  ప్రోత్సాహవంతంగా ఉంటుంది. తూర్పు, ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాలు భారీ వర్షాలు, తుపానులతో అతలాకుతలమవుతాయి. అలాగే, వరదలు వణికించవచ్చు. ఉత్తరాదిన భూకంపాల ప్రభావం కనిపిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయి. మహిళలు ప్రభుత్వాలలో కీలకపాత్ర పోషిస్తారు. ఒక కీలకనేతకు గడ్డుకాలమనే చెప్పాలి. విమాన, రైలు, బస్సు ప్రమాదాలు కొంత కలవరపెట్టవచ్చు. పశు పోషణ, మత్స్య, ఇతర వ్యవసాయానుబంధ రంగాల పై ఆధారపడిన వారికి లాభదాయకంగా ఉంటుంది. మొత్తం మీద కొన్ని ఒడిడుదుడుకులు ఎదురైనా ప్రజలకు అనుగుణంగా పాలకులు వ్యవహరించే  అవకాశాలున్నాయి.

ఆర్థిక ఒడిదుడుకులు కారణంగా స్టాక్‌మార్కెట్లు తరచూ పతనం కావచ్చు. నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో ఉంటాయి. ఉల్లి, చింతపండు ధరలు విశేషంగా పెరుగుతాయి.

ఏదేమైనా రాజు రవి, మంత్రి శని కావడం వల్ల  దేశంలోని అధికార, ప్రతిపక్షాల మధ్య స్పర్ధలు పెరుగుతాయి. క్రీడాకారులకు మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి.

ఈ ఏడాది అధిక జ్యేష్ఠ మాసం చివరిలో తొలకరి జల్లులు కురుస్తాయి. శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజ మాసాల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం. తెలుగు రాష్ట్రాల్లో కొత్త ఉద్యమాలకు తెరలేచే అవకాశం. అక్టోబర్, నవంబర్‌మధ్యకాలంలో కాల సర్పదోషం కారణంగా వింత వ్యాధులు, భారీచోరీలు, ప్రకృతి వైపరీత్యాలు తప్పకపోవచ్చు. విళంబినామ సంవత్సరంలో ప్రజల్లో దైవభక్తి పెరుగుతుంది. దానధర్మాలను ఇతోధికంగా చేస్తారు.
నిజ జ్యేష్ఠ శు.దశమి శుక్రవారం అనగా జూన్‌ 22వ తేదీ  రాత్రి 7.13 గంటలకు చిత్తా నక్షత్రమందు రవి ఆరుద్రా నక్షత్రంలో ప్రవేశం. ఈరీత్యా చూస్తే  రాత్రి పూట రవి ఆరుద్ర నక్షత్ర ప్రవేశం. దీనివల్ల శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. ఈ ఏడాది పశుపాలకుడు యముడు కావడం వల్ల పశునష్టం,  గోష్టప్రాపకుడు, గోష్టబహిష్కర్త శ్రీ కృష్ణుడు కావడం వల్ల పశుసంపద, పాడిపరిశ్రమ అభివృద్ధి చెందుతుంది.

*నవనాయక ఫలాలు*

*1. రవి–* రాజు

కావడం వల్ల అగ్ని, శస్త్రాల వల్ల భయాందోళనలు. అల్పవృష్టి, చోరాగ్ని, రోగాలతో ప్రజలకు ఇబ్బందులు. రాజకీయాల్లో కొంత అస్తవ్యస్థ పరిస్థితులు, పాలకుల మధ్య వివాదాలు నెలకొనవచ్చు.  గోధుమలు, ధాన్యం, పగడాలు, మిరియాలు, కందులు, వేరుసెనగ, కొబ్బరికి గిరాకీ పెరుగుతుంది.

*2. శని*– మంత్రి
కావడం వల్ల వర్షాలు కొంత తగ్గే సూచనలు. రోగాగ్ని బాధలు. ప్రజలకు సమస్యలు ఎదురుకావచ్చు. ధాన్యం వంటి ఆహార ధాన్యాల ధరలు పెరుగుతాయి.

*3. సైన్యాధిపతి– శుక్రుడు* కావడం వల్ల సువృష్టి, సస్యాల వృద్ధి. సుభిక్షం, ధాన్యాల ధరలు పెరుగుతాయి. వస్త్రాలు, నూలు, పత్తి ధరలు పెరుగుతాయి.

*4. సస్యాధిపతి– కుజుడు* కావడం వల్ల కందులు, మిర్చి, వేరుసెనగ, ఎర్రని ధాన్యాలు బాగా పండుతాయి. మెట్టపంటలు అధికమవుతాయి.

*5. ధాన్యాధిపతి– రవి–* వర్షాలు తక్కువగా ఉంటాయి. ఆహార ధాన్యాల ధరలపై పరిమితులు విధిస్తారు. రాజకీయ ఒడిదుడుకులు, దేశంలో అలజడులు, ఆందోళనలు. వెండి,బంగారం ధరలు పెరిగి నిలకడగా ఉంటాయి.

*6.ఆర్ఘాధిపతి–శుక్రుడు*–వర్షాలు అనుకూలిస్తాయి. ధాన్యాల ధరలు అందుబాటులో ఉంటాయి. బియ్యం, రాగి, పట్టు, పత్తి ధరలు సమతూకంగా ఉంటాయి.

*7. మేఘాధిపతి–శుక్రుడు*–అతివృష్టి, సుభిక్షం, ప్రజలు ఆరోగ్యవంతులై ఉంటారు. పాడి సమృద్ధిగా ఉంటాయి.

*8. రసాధిపతి– గురుడు.* వర్షాలు సమృద్ధిగా ఉంటాయి. బంగారం, వెండి, నెయ్యి, పట్టు, బెల్లం, పంచదార, వస్త్రాల ధరలు తగ్గి ప్రజలకు అందుబాటులో ఉంటాయి.

*9. నీరసాధిపతి–కుజుడు…*
సుగంధ ద్రవ్యాలు, బంగారం, చందనం, ఉక్కు, యంత్రపరికరాలు, రాగి, ఇత్తడి, మిర్చి, పొగాకు, ఉక్కు, అపరధాన్యాల ధరలు పెరుగుతాయి. బియ్యం ధరలు కొంత తగ్గుతాయి.

మొత్తం మీద ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే మన దేశం వృద్ది శాతం పెరుగును.
*సర్వేజనాః సుఖీనో భవంతు*

శాంతిః శాంతిః శాంతిః
*శ్రీకొండ ఉమాకాంత శర్మ సిధ్ధాంతి.*

2018-03-17-20-55-20-964

విళంబి నామ సంవత్సరం శుభాకాంక్షలు

ఉగాది పండగ తెలుగు వారి ప్రముఖ పండగ మరియు ఘనంగా అధికారికంగా జరుపుకునే పండగ. ఈ పండగ చైత్ర మాస చైత్ర మాస శుద్ధ పాడ్యమి నాడు వస్తుంది. ఈ పండుగ రోజున పంచాంగ శ్రవణము చేయుట ,షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి ని భుజించుట ప్రశస్త్యమైనది.

ఉగాది’ అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. ‘యుగము’ అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం ‘యుగం’ (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది. తత్రచైత్రశుక్ల చైత్రశుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది ‘ఉగాది’గా ఆచరణీయమని నిర్ణయసింధుకారుడు పేర్కొనియున్నాడు.

“ఉగాది” ఆచరణ విధానం:

ఉగాది పర్వాచరణ విధానాన్ని ‘దర్మసింధు’ కారుడు ’పంచవిధుల సమన్వితం’గా ఇలా సూచించియున్నాడు. తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం, నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం), ధ్వజారోహణం (పూర్ణకుంభదానం), పంచాంగ శ్రవణం…మున్నగు ‘పంచకృత్య నిర్వహణ’ గావించవలెనని వ్రతగంధ నిర్దేశితం.

(1) తైలాభ్యంగనం

తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం ప్రధమ విధి. ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను, ఆవహించి వుండునని ఆర్యోక్తి. కావున నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేసిన లక్ష్మి, గంగా దేవుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అభ్యంగంకారయోన్నిత్యం సర్వేష్వంగేషు పుష్ఠినం (అభ్యంగన స్నానం అన్ని అవయవాలౌ పుష్ట్టిదాయకం) అని ఆయుర్వేదోక్తి దృష్ట్యాఅభ్యంగనం ఆరోగ్యం కూడా. ఆరోగ్యరీత్యా ఆధ్యాత్మికరీత్యా తైలభ్యంగనానికీ రీతిగా విశేష ప్రాధాన్యమీయబడినది.

(2) నూతన సంవత్సర స్తోత్రం

అభ్యంగ స్నానానంతరం సూర్యునికి, ఆర్ఘ్యదీపధూపాధి,పుణ్యకాలానుష్టానం ఆచరించిన పిదప మామిడి ఆకులతోరణాలతో, పూలతోరణాలతో దేవుని గదిలో మంటపాన్ని నిర్మించి, అందు నూతన సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది దేవతను, ఇష్టదేవతారాధనతో బాటు పూజించి ఉగాది ప్రసాదాన్ని (ఉగాది పచ్చడి) నివేదించవలెను.

(3) ఉగాడి పచ్చడి సేవనం

ఉగాది నాటి ఆచారాలలో ఉగాది పచ్చడి సేపనం అత్యంత ప్రధానమైనది. వేపపూత, కొత్త చింతపండు, బెల్లం లేక పంచదార లేక చెరకు ముక్కలు, నేయి, ఉప్పు, మిరియాలు, షడచులు మిళితమైన రసాయనాన్నే ఉగాడి పచ్చడి అంటాం!

అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతమ్‌ భక్షితం పూర్వయామేతు తద్వర్షే సౌఖ్య దాయకమ్‌ అని ధర్మ సింధు గ్రంధం చెబుతున్నది. ఈ ఉగాడి పచ్చడిని ఇంట్లో అందరూ పరగడుపున సేవించవలెను. ఉగాడి నాడు ఉగాడి పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా సౌఖ్యదాయకమని ఈ శ్లోక భావం, పలురుచుల మేళవింపు అయిన ఉగాడి పచ్చడి కేవలం రుచికరమే కాదు ప్రభోదాత్మకం కూడా! తీపి వెనుక చేదు, పులుపు ఇలా పలురుచులకు జీవితాన కష్టాలు, తదితర అనుభూతులు, ప్రతీకలే అనే నగ్న సత్యాన్ని చాటుతూ సుఖాలకు పొంగకు, దు:ఖానికి క్రుంగకు, సుఖదు:ఖాలను సమభావంతో స్వీకరించు అనే ప్రగతిశీల సందేశాన్నిస్తుందీ ఉగాది పచ్చడి. అంతేగాక ఈ పచ్చడి సేవన ఫలంగా వివిధ అనారోగ్య స్థితులు పరిహరించబడి, రోగశాంతి, ఆరోగ్యపుష్టి చేకూరుట గమనార్హం.

(4) పూర్ణ కుంభదానం

ఉగాదినాడు ఇంద్రధ్వజ, బ్రహ్మధ్వజ ప్రతిష్టపన ఆచారంగా ఉన్నది. ఒక పట్టు వస్త్రాన్ని ఒక వెదురు గడకు పతాకం వలె కట్టి దానిపై నారికేళముంచబడిన కలశాన్ని వుంచి, ఆ కర్రకు మామిడి ఆకులు, నింబ పత్రాలు, పూల తోరణాలు కట్టి ఇంటి ప్రాంగణంలో ప్రతిష్టించి ఆరాధించడం ధ్వజావరోహణం. ఇటీవల ఈ ఆచారం చాలావరకు కనుమరుగై దాని స్థానంలో కలశ స్థాపన, పూర్ణకుంభదానం ఆచరణలోకి వచ్చింది. యధాశక్తి రాగి, వెండి, పంచలోహం లేదా మట్టితో చేసిన కొత్తకుండను కలశంలా చేసి రంగులతో అలంకరించి అందులో పంచపల్లవాలు (మామిడి, అశోక, నేరేడు, మోదుగ మరియు వేప చిగుళ్ళు) సుగంధ చందనం కలిపి పుష్పాక్షతలు వేసి ఆవాహనం చేసి, పూజించి కలశానికి ఒక నూతన వస్త్రాన్ని చుట్టి కలశంపై పసుపు కుంకుమ చందనం, పసుపు దారాలతో అలంకరించిన కొబ్బరి బోండాం నుంచి పూజించి పురోహితునకుగాని, గురుతుల్యులకుగానీ, పూర్ణకుంభదానమిచ్చి వారి ఆశీస్సులు పొందడం వల్ల సంవత్సరం పొడవునా విశేష ఫలితం లభిస్తుందని ప్రతీతి.

(5) పంచాంగ శ్రవణం

తిధి, వార, నక్షత్ర, యోగ, కరణములనెడి పంచ అంగాల సమన్వితం పం చాంగం. ఉగాది నాడు దేవాల యంలోగాని, గ్రామ కూడలి ప్రదేశాల్లోగాని, పండితుల, సిద్థాం తుల సమ క్షంలో కందాయఫలాలు స్థూ లంగా తెలుసుకొని తదనుగుణంగా సంవత్సరం పొడవునా నడచుకొనుటకు నాడే అంకురార్పణం గావించవలెనని చెప్పబడియున్నది. ఉగాదినాటి పంచాంగ శ్రవణం వల్ల గంగానదిలో స్నానం చేస్తే అభించేటంత ఫలితం లభిస్తుంది.

ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్రసమాన వైభవాన్ని, కుజుడు శుభాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహువు బాహుబలాన్ని, కేతువు కులాధిక్యతను కలుగచేస్తారని చెప్పబడినది.
ఉగాది రోజున బ్రహ్మను పూజించాలని తెలుసు కదా. అలాగే ఈరోజు పూజించాల్సిన మరో దైవం కూడా వుంటారు. ప్రతి తెలుగు సంవత్సరానికి ఓ అధిష్టాన దేవత వుంటారు. అలాగే ఉగాది ఏ వారం ప్రారంభమవుతుందో ఆ సంవత్సరానికి ఆ వారం గ్రహం రాజవుతాడు.

 

ఇది విళంబి నామ సంవత్సరం కనుక ” ఓం విళంబి సంవత్సర దేవతాం సవిత్రే నమః” అని నమస్కారం చేసుకోవాలి. ఈ కొత్త తెలుగు సంవత్సరాది ఆదివారంతో ప్రారంభమవుతుంది కనుక ఈ సంవత్సరానికి సూర్యుడు. కాబట్టి సూర్యాష్టకం తదితర శ్లోకాలు చదువుతూ పూజ చేయాలి. అలాగే ఇష్ట దైవాన్ని పూజించుకోవాలి. షడ్రుచులు కలిగిన పులుపు, చేదు, తీపి, ఉప్పు, కారం, వగరుతో చేసిన ఉగాది పచ్చడి చేసి దేవునికి నివేదన ఇవ్వాలి.2018-03-17-20-55-20-964

వివాహము విధాలు – వివాహ లగ్నము

 

వివాహము అంటే సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు, బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. యువతీ-యువకుడు పెద్దల సమక్షంలో.. అగ్నిసాక్షిగా వేద మంత్రాల నడుమ పెళ్లాడటమన్నది సంప్రదాయం. పెండ్లి, వివాహం, పాణిగ్రహణం, కన్యాదానము, కళ్యాణము, సప్తాపది అనే పలు విధములుగా అర్థాలు ఉన్నాయి.

వివాహము అనేది మన శాస్త్ర, పురాణాల్లో 8 రకాలుగా ఉన్నాయి. అందులో.. బ్రహ్మం, దైవం, ఆర్షం, ప్రాజాపత్యం, అసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచం అని పేర్లు ఉన్నాయి.

వీటిలో మొదటిది బ్రహ్మ వివాహం. వేదం చదివిన సచ్ఛీలవంతునికి పూజించి ఇచ్చే కన్యాదానాన్ని బ్రహ్మ వివాహం అంటారు. కన్యను అలంకరించి వరునికి ఇచ్చి జరిపించే వివాహం ఇది.

2వది దైవ వివాహం. యజ్ఞంలో రుత్విక్‌‌కు అలంకరించిన కన్యాదానంగా చెబుతారు. గోమిధునాన్ని వరుని నుంచి స్వీకరించి కన్యాదానం చేస్తే దాన్ని అర్ష (అర్షం) వివాహంగా చెబుతారు. మీరిద్దరు కలిసి ధర్మాచరణ చేయండి అని వరుడుని పూజించి కన్యాదానం చేస్తే దాన్ని ప్రాజాపత్య వివాహం అని పిలుస్తారు.

అదేవిధంగా.. జ్ఞానులు కన్యకు తన శక్తిమేరకు డబ్బిచ్చి వివాహం చేసుకుంటే దాన్ని అసుర వివాహంగా చెబుతారు. వధూవరులు పరస్పరం ఇష్టపడి స్వయంగా వివాహం చేసుకుంటే దాన్ని గాంధర్వ వివాహంగా చెబుతారు. బలవంతంగా తనంటే ఇష్టం లేని కన్యను అపహరించి వివాహం చేసుకుంటే అది రాక్షస వివాహం. నిద్రిస్తున్న మత్తులో ఉన్న స్త్రీని రహస్యంగా సంగమించుట ద్వారా వివాహమాడినట్లయితే అది పైశాచిక వివాహం.

వివాహ లగ్నము – వైవాహిక జీవితం
కుండలి స్థితిలో ఉన్న గ్రహములు వైవాహిక జీవితాన్ని సుఖమయంగా, కలహపూర్ణంగా చేయగలదని శాస్త్రం చెబుతోంది. అయితే ఈ తత్వములు ప్రమాణికమైనవి. యది వైవాహిక లగ్నమును సరైన రీతిలో విచారణ చేస్తే, వివాహం తర్వాత దాంపత్య జీవితంలో కలిగే సమస్యలు తగ్గుతాయి. వైవాహిక జీవితం సుఖమయమవుతుంది.

వివాహ సంస్కారములను వ్యక్తి రెండవ జీవితంగా గుర్తిస్తారు. దీని ప్రకారం వివాహ సమయములో శుభ లగ్నము.. మహత్యం కలిగి ఉండును, జన్మ కుండలిలో లగ్న స్థానములో శుభ గ్రహములు స్థితిలో ఉండును. వివాహం కొరకు లగ్నమును నిశ్చయించు సమయములో వధువు, వరుని కుండలిని గమనించి వివాహ లగ్నమును నిశ్చయించవలసి ఉంటుంది. కుండలి లేకపోతే గనక వరుడు, కన్య పేరులో ఉన్న రాశికి అనుగుణంగా లగ్నమును గుర్తించాలి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. జన్మ లగ్నము, రాశి నుంచి అష్టమ లగ్నం అశుభ ఫలదాయకముగా ఉండును. అంటే ఈ లగ్నంలో వివాహము గురించి ఆలోచించరాదు.

జన్మ లగ్నం, జన్మరాశి నుంచి 4వ, 12 వ రాశి గుణములను లెక్కించుటలో శ్రేష్టంగా ఉంటే గనక ఈ లగ్నంలో వివాహం సంభవము. అన్యతా జన్మ లగ్నము నుంచి చతుర్ధ, ద్వాదశ రాశితో లగ్నంలో వివాహం దోష పూరితంగా ఉండును. ఎవరి కుండలిలో లగ్నం నుంచి కేంద్ర స్థానములో శుభ గ్రహములు ఉండునో వారికి వివాహ లగ్న దోషం కలుగదు.

కుజ లగ్నం నుంచి బుధుడు, గురువు, శుక్రుడు యది కేంద్రంలో లేదా త్రికోణంలో ఉంటే గనక వివాహ లగ్నములో అనేక విధాలైన దోషములు.. అంటే దగ్దతిధి, గుడ్డి, చెవిడు కలుగవు. వివాహ లగ్నము సందర్భంను లెక్కించు సమయంలో రాహువు శనికి సరిసమమైన ప్రభావకారిగా ఉండును. ఇంకా కుజుడు కేతువుకు సమానంగా ఉండునని చెప్పదగ్గది….. చింతా గోపి శర్మ సిద్ధాంతి … 986619557

దశమ స్థానము – జీవన స్థానము

 

అర్ధాంగి భాగములో కేంద్రమైన దశమ స్థానమున పాపపుణ్యములు రెండూ గలవు. ఈ స్థానమున పుణ్యమును అందించు శుభగ్రహము ఉన్నట్లయితే, జీవనోపాదులైన ఉన్నత వృత్తిగానీ, పెద్ద ఉదోగ్యముగానీ, మంచి వ్యాపారము గానీ కల్గునట్లు శుభగ్రహము చేయును. రాజకీయమే వృత్తిగాయున్న వానికి పాలనాశక్తినీ, దానికి కావలసిన యుక్తినీ జాతకునకు శుభగ్రహము ఇచ్చును. యుక్తితో పనిగానీ, వ్యాపారముగానీ, రాజకీయము గానీ చేయువానికి కీర్తి గౌరవప్రతిష్ఠలు కల్గునట్లు చేయును. చేయు వృత్తిలో గౌరవము లభించుట వలన ప్రజలు సన్మానింతురు. అలాగే ప్రభుత్వము వారు కూడా సన్మానింతురు. ఓర్పు, నిగ్రహశక్తి కల్గియుండును. సకల సంపదలు దిన దినాభివృద్ధి చెందును. మంచి భవనములు నిర్మించుకొనును. దేవతా మందిరములు, మండపములు కట్టించును. దైవకార్యములను చేయించుట, పాల్గొనుట జరుగును. స్వంత సంపాదన పెరిగి జీవనమునకు ఆటంకము లేకుండ జరుగును. ముద్రణావిషయములో చొరవకల్గి గృహములను నిర్మించినట్లు గ్రంథములను తయారు చేయగలడు, వ్రాయ గలడు. దీనితో ప్రజాధరణ పెరుగును. అష్టభోగములను అనుభవించుచూ, ఎదురులేని జీవితము గడుపును. ఈ స్థానములో సూర్యుడుగానీ, చంద్రుడు గానీ శుభులైయుండిన ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగియై (కలెక్టరై) ప్రజాపాలన చేయును. ఉద్యోగి కాకుండ, ఉద్యోగమును వదలి రాజకీయములో ఉండి నట్లయితే మంత్రిపదవి కల్గి ప్రజలను పాలన చేయును. దశమ స్థానములో కుజగ్రహము శుభగ్రహమైయుంటే అతడు ప్రభుత్వ డాక్టరుగా మంచి ఆపరేషన్లు చేయు డాక్టరుగా ప్రజలలో మంచి పేరు తెచ్చును. కుజ గ్రహముతో పాటు సూర్యుడో, చంద్రుడో పదవ స్థానమున ఉండుట వలన జాతకుడు మిలిటరీలో పెద్ద డాక్టరుగా ఉండును. ఇదే స్థానములో శుక్ర గ్రహముంటే జీవితము మొత్తము సుఖమయమైపోవును. అన్ని సుఖములతో అష్టఐశ్వర్యములతో జీవితము గడచిపోవును. ఈ విధముగా గ్రహమునుబట్టి జరుగుచుండును. ఒకవేళ దశమస్థానములో పాప గ్రహముండిన పైన చెప్పిన వాటికి భిన్నముగా, వ్యతిరేఖముగా జరుగును. కర్మచక్రములోని పదవ స్థానములోని పాపమునుబట్టి పాపగ్రహములు అక్కడ చేరునట్లు ప్రకృతిద్వారా దేవుడు చేయించాడు. పాపగ్రహములుండుట వలన జీవితమే వృథా అనిపించినట్లుండును. జీవనమునకై నిరంతరము బాధపడుచూ బ్రతుకవలసివచ్చును.

ఏకాదశ స్థానము – లాభ స్థానము

కర్మచక్రములో పదకొండవ స్థానము పాపకోణములో చివరిదగును. ఈ స్థానములో కేవలము పాపము మాత్రముండును. అక్కడ చేరిన శుభ గ్రహముల వలన ఎదురు స్థానములోని పుణ్యము ఉపయోగపడుట వలన కొంతవరకు మంచి జరుగును. పాపగ్రహముండిన ధనార్జనలో కష్టము, లాభములో నష్టము, జయములో అపజయము కల్గును. విద్య లేకుండ పోవును. తండ్రి ఆస్తిని పోగొట్టుకోవలసి వచ్చును. జీవితము దుఃఖమయ మగును. సప్త వ్యసనములలో కొన్నిటికి అలవాటుపడిపోవును. ఈ విధముగా అక్కడ చేరు పాపగ్రహములనుబట్టి దుష్ఫలితములుండును. ఒకవేళ పదకొండవ స్థానములో ఒక శుభగ్రహముండినా లేక తాకినా జాతకునికి గ్రహమునుబట్టి మంచి జరుగును. ఈ స్థానమును లాభస్థానమని పెద్దలు చెప్పారు కనుక ఇక్కడున్న గ్రహమునుబట్టి కట్నరూపములో ఒక్కమారు డబ్బువచ్చునట్లు ఆ గ్రహము చేయును. బుధగ్రహముంటే కట్నకానుకల రూపములో మంచి లాభమును చేకూర్చును. తొమ్మిదవ స్థానాధిపతియుండిన, వానికి లాటరీవలన లాభము వచ్చును. లగ్నాధిపతి యుండిన ఎల్లప్పుడు లంచము రూపములోనో లేక కమీషన్‌ రూపములోనో డబ్బు వచ్చునట్లు చేయును. పంచమాధిపతియుండిన మెడికల్‌ కాలేజ్‌ లాంటిది కల్గించి దానిద్వారా డొనేషన్లరూపములో డబ్బు విపరీతముగా వచ్చునట్లు చేయును. ఈ స్థానములో ఇద్దరు లేక ముగ్గురు శుభ గ్రహములు ఉండిన ఉన్నట్లుండి కోట్లలో డబ్బు వచ్చు లాటరీలు తగులును. వ్యాపారములో విపరీతముగా లాభములు వచ్చును. అన్న, అక్కగారి ఆస్తులు లభించును. ఒక రూపముగా కాకుండా అనేక రూపములలో అనేక లాభములు వచ్చునట్లు అమరిపోవును. ఇది పదకొండవ స్థానమగుట వలన పాపకార్యములు చేయుట చేత జాతకుడు ధనమార్జించును. లేఖన వృత్తి అయిన విలేఖరిగాయుంటూ ధనమును బాగా సంపాదించగలుగును. ఐదవ స్థానమునకు ఎదురుగా ఉన్నందున అందులోని విద్యనూ, ప్రతిభనూ, గ్రాహితశక్తిని, శిల్పకళ విద్యను నేర్వగలుగును. ఎన్నో ఆదాయములు గల స్థానము కావున దీనిని లాభస్థానమని అన్నారు. అంతేకాక వృత్తిలోకంటే ఎక్కువ లాభము వచ్చుట వలన ప్రవృత్తి స్థానమన్నారు. పైకి కనిపించుటకు ఇది ప్రవృత్తి స్థానముగాయున్నా ముందే ఇది పాపస్థానమైయుండి, దీనిలో చేయునదంతా ఇతరులది లాగుకొని లాభము పొందడము తప్ప ఏమీలేదు. దానివలన పాపము రావడము తప్ప పుణ్యమొచ్చు అవకాశము లేదు. అందువలన కొందరు ఇది ప్రవృత్తి స్థానమనినా మేము మాత్రము దీనిని నీచ వృత్తి స్థానమేగానీ ఇందులో ప్రవృత్తి లేదని చెప్పుచున్నాము.

ద్వాదశ స్థానము – వ్యయ స్థానము

మొదటి స్థానము జనన స్థానమగుట వలన, జననములో శరీరము లభించుట వలన దానిని తను (శరీర) స్థానమన్నారు. చివరిదైన పన్నెండవ స్థానము వచ్చిన శరీరము నాశనమైపోవునది కావున దానిని వ్యయ (నాశన) స్థానమన్నారు. జీవిత చివరి భాగము ఈ స్థానములోనే ఉండును. ఇది జీవితమునకు చివరి కాలము యొక్క విధి విధానమును తెల్పునది. కావున వయస్సు ముదిరిన తర్వాత వృద్ధాప్యములో జరుగు విషయములు ఇక్కడ తెలియును. ప్రారబ్ధకర్మ ప్రారంభమగునది మొదటి స్థానములోకాగా ప్రారబ్ధ కర్మ అయిపోవునది పన్నెండవ స్థానములో, కనుక ప్రారంభమగు ప్రథమ స్థానమును జనన స్థానమని అన్నారు. అయిపోవు స్థానమును మరణ స్థానము అన్నారు. పన్నెండవ స్థానములో కర్మ అయిపోవుచున్నది. కావున అతని (జాతకుని) ఆయుష్షు ఇంతయని చెప్పవచ్చును. అయితే ఇక్కడ ఒక చిక్కు సమస్య ఉండడము వలన ఈ విషయములో సత్యము చెప్పుటకు వీలు పడడములేదు. ఆ చిక్కు సమస్యను తర్వాత చెప్పగలను. ఇప్పుడు ద్వాదశ స్థానమును గురించి చెప్పుకొంటే ఇది పాపపుణ్యముల మిశ్రమ స్థానము. మిశ్రమము అంటే కలిసిపోయాయని కాదు, రెండూ ఒకే స్థానములో ఉన్నాయని అర్థము. అందువలన ఇక్కడ ఒక పుణ్య గ్రహమైన శుభగ్రహముంటే ఇక్కడ ఏదైనా దుర్వినియోగముకాదు. డబ్బుగానీ, ధాన్యము గానీ, నీరుగానీ ఖర్చు చేయు ఏదైనా దుర్వినియోగముకాదు. చెడు ఉపయోగములకు కాకుండా మంచిగా ఉపయోగపడును. కేతుగ్రహముంటే (శుభగ్రహముగా) ఆధ్యాత్మిక చింతనకలుగజేసి హిందువును భగవద్గీతను, ముస్లీమ్‌ను ఖుర్‌ఆన్‌ను, క్రైస్తవుడైతే బైబిల్‌ను చదువునట్లు చేయును. గురువు గ్రహమున్న జ్ఞాన విషయములని పేరుపెట్టిన దానిని చదువును. మిగతా నాలుగు గ్రహములలో ఏదొక్కటియున్నా సద్గ్రంథములను చదువునట్లు చేయును. సద్గ్రంథ పఠనముచే దైవభక్తి చేకూరి ముక్తికొరకు ప్రయత్నించును. ప్రయత్నించకపోయినా ముక్తి ఒకటున్నదని తెలిసిపోవును. తర్వాత శుభ గ్రహము ఏదున్నా పాపభీతిని కల్గించి, నరకలోకమును తప్పించి స్వర్గ లోక ప్రాప్తి కల్గించునని తెలియుచున్నది. అంతేకాక అంతవరకున్న మనిషిలోని పశుత్వమును మాన్పించి మానవత్వమును గల్పించును. అంత వరకు చేయుచున్న జంతువధను మాన్పించి అక్కడ ఖర్చయ్యే డబ్బును ఇతరులకు ఉపయోగపెట్టి, దానిద్వారా తర్వాత మంచి జన్మ పొందుటకు అవకాశము కల్గించును. మరణ సమయములో ఎక్కువ కష్టములు లేకుండా నిశ్చింతగా ఉండునట్లు చేయును. జాతకుడు మరణించినప్పుడు ప్రజలు ఎక్కువ మంది వచ్చి అతనిని గురించి చెప్పుకొనునట్లు చేయును. అతడు చనిపోయిన చోట అన్ని అనుకూలతలు ఉండి శవయాత్ర బాగా జరుగు నట్లు చేయును. ఒకవేళ ద్వాదశ స్థానమున జనన సమయములో పాప గ్రహమున్న (శత్రువర్గములోని గ్రహమున్న) జాతకుడు ఎంత గొప్పవాడైనా, ఎంత ధనికుడైనా చనిపోవు సమయమునకు బంధుమిత్రులు, భార్యా పిల్లలు లేనిచోట చావు లభించును. అతను ఫలానా వ్యక్తి అని కూడా బయటికి తెలియకపోవడము వలన అనాధశవము క్రింద జమకట్టి ఏ సంబంధమూ లేనివారు ఏమీ బాధపడకుండ అంతిమ సంస్కారములు చేయుదురు. అటువంటి చావులు ఎంతోమందికి కల్గినవి. అప్పుడు వారికి వారి జాతకము లోనే పన్నెండవ స్థానమున పాపగ్రహమున్నదని తెలియవచ్చును. ఎప్పుడో ఎనభై సంవత్సరములప్పుడు పుట్టిన సమయములో ఉన్న గ్రహములను బట్టి ఎనభై సంవత్సరముల వరకు జీవితము సాగడమేకాక మరణ సమయములో కూడా జాతకములోని (జనన సమయములోని) గ్రహముల ప్రాబల్యమునుబట్టియే జరుగును. కావున జీవితమును శాసించి నడుపునది జాఫతకము (జాతకము). జాఫతకము లేని జీవితమును గురించి అంచనా వేయుటకు సాధ్యపడదు. అందువలన జన్మనుండి చావువరకు దిక్సూచిలాగ యున్న జాతకమును అందరూ వ్రాసుకొనియుండడము మంచిది…. చింతా గోపి శర్మ సిద్ధాంతి ….

ఆయుర్దాయం

 

“శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి” అనేది వేద పురుష ఆశీర్వచనం. మనలను నిండా నూరేళ్లు బ్రతకమని వేదం ఆశీర్వదిస్తోంది. వేద మంత్రానికి ఉన్న శక్తి గొప్పది కాబట్టి వేదజ్ఞులైన పెద్దలకు నమస్కరించి వారిచే ఈ ఆశీర్వచనం పొందుతూ ఉంటాం. అలాగే నిత్యం చేసుకొనే సూర్యోపస్థానంలో “పశ్యేమ శరదశ్శతం, జీవేమ శరదశ్శతం, నందామ శరదశ్శతం, మోదామ శరదశ్శతం” అని చెప్పబడించి. “నిండు నూరేళ్లు ఆ సూర్యుని చూడగలగాలి. నిండా నూరేళ్ళు జీవించాలి. ఆది కూడ ఆనందంగా జీవించాలి” అని ఆకాంక్షిస్తాం. ఇలా ఆకాంక్షించటంలో ఎంతో విలువ ఉంది. “గుడ్ మార్నింగ్” అని చెప్పడం, “గుడ్ నైట్” చెప్పటంలోనూ లౌకికంగా కూడ అట్టి ఆకాంక్షలు ఆధునిక కాలంలోనూ అనుసరిస్తూనే ఉన్నాం. మంచి మనస్సు నుండి వచ్చే శుభాశీస్సుకు, శుభాకాంక్షాలకు కూడ శక్తి ఉంది. దాని వలన మేలూ జరుగుతుంది. ఇది పూర్వకాలపు విషయమే కాదు, నేటి విషయం కూడా అని అర్థం చేసుకొనగలం.

“బ్రతికి యుండిన శుభములు బడయవచ్చు” కాబట్టి బ్రతికి ఉండటం అంటే ఆయుర్దాయం మొదట కోరదగినది. అందుకే ఏ పూజ చేసినా సంకల్పంలో ఆయురారోగ్య భోగభాగ్యాలు కాంక్షిస్తాం. అందులో ముందు కోరేది ఆయుర్దాయాన్నే. కోట్ల సంపద లభించినా అయుర్దాయం లేక మరుసటి రోజే మరణించే వానికి ఈ కోట్ల సంపద వలన ప్రయోజనమేమిటి? అందువలనే మొదట కోరదగినది ఆయుర్దాయం. నిజమే. ఆయుర్దాయమనేది కోరుకొంటే వచ్చేదా? అనేది ప్రశ్న. “దీర్ఘాయుష్మాన్ భవ” అని దీవించటం వల్ల ఆయుర్దాయం పెరుగుతుందా? ఆని సందేహం.

ఆయుః కర్మ చ విత్తం చ విద్యా నిధన మేవ చ|

పంచైతా న్యపి సృజ్యంతే గర్భస్థస్తైవ దేహినః||

అని చెప్పబడింది. అంటే “ఆయుష్షు, వృత్తి, ధనం, విద్య, చావు అనేవి ఐదూ జీవి గర్భంలో ఉండగానే నిర్ణయింపబడుతూ ఉంటా”యని దాని అర్థం. ఆయుర్దాయం, మరణం అనేవి ముందే నిర్ణయింపబడితే ఇంకా ఈ ఆశీస్సుల వల్ల కాని, మరే జాగ్రత్తల వల్ల కాని ప్రయోజనమేమిటని ప్రశ్న. “లలాట లిఖితా రేఖా పరిమార్ట్షుం న శక్యతే” నుదుట వ్రాసిపెట్టినది ఎవరూ తుడవలేరని, మార్చలేరని, జరిగి తీరుతుందని మరికొందరి మాట. “ఏది నిజం” మనేది సామాన్యునకు వచ్చే ప్రశ్న. ఆయుష్షుకు వృద్ధి, క్షీణతలు ఉంటాయా? ఉంటేనే దాని విషయంలో జాగ్రత్తలు తీసుకొనటం అవసరం తప్ప అదేమీ లేనప్పుడా యత్నమే వ్యర్థం కదా! ఆయుర్వేదం అనే వైద్య విధానం పేరులోనే ఆయువు ఉన్నది. ఆయుర్వేదమనేది ఊసుపోక చెప్పిన సామాన్యపు మాట కాదు. వేదాలలో మొదటిదైన ఋగ్వేదానికి సంబంధించిన ఉపవేదమే ఆయుర్వేదం. అంటే ఆయువును గూర్చి తెలిసికొనదగిన విజ్ఞానం అది. అందువల్ల ఆయువునకు సంబంధించి వృద్ధి క్షయాలు కూడ పరిగణింపదగినవే అని తెలుస్తుంది.

లలాట లిఖితమైన ఆయుర్దాయాన్ని ఎవ్వరూ మార్చలేరనేది యదార్థమైనా మార్కండేయుడు, శంకరాచార్యుల వారు మొదలైన వారు దైవానుగ్రహం వలన ఆయుర్దాయాన్ని పెంచుకొనటం చూస్తాం. అంతే కాదు హనుమంతుడు, విభీషణుడు మొదలగు వారు చిరంజీవులుగా పరమందటమూ చూస్తాం. ఇంకా విశేషం ద్వాపర యుగంలో చనిపోయిన సాందీపని గురువు యొక్క పుత్రుని శ్రీకృష్ణుడు బ్రతికించినట్లు, త్రేతాయుగంలో చనిపోయిన వానర వీరుడు గంధమాదనుని హనుమంతుడు బ్రతికించి తెచ్చినట్లు కూడ ఇతిహాసాల ద్వారా తెలిసికొన్నాం. కాబట్టి దైవానుగ్రహం వలన కాని, అమోఘవచనులైన ఋష్యాదుల ఆశీర్వచనాల వల్ల కాని ఆయుర్దాయం పెంచుకొనటం సాధ్యమే అని తెలుస్తుంది. కాబట్టే మన పూర్వజులు “ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం” అని సంకల్పంలో చెప్పుకొనటంలో అనౌచిత్యం లేదని, “శతమానం భవతి” అంటూ మహనీయుల ఆశీస్సులు పొందటం శ్రేయస్కరమే అని తెలుస్తుంది. అందుకే అట్టి ఆశీర్వచనాల కోసం పెద్దల యెడ వినయ విధేయతలతో ఉండాలి…..చింతా గోపి శర్మ సిద్ధాంతి …