Monthly Archives: February 2018

పొలిటిక‌ల్ ఎంట్రీకి ఏ రోజు మంచిది?

 

స‌మాజ‌సేవ చేయాల‌నుకున్న చాలామంది రాజ‌కీయ రంగాన్నే ఎంచుకుంటారు. రాజకీయ రంగంలోకి చాలా మంది వస్తుంటారు. పోతుంటారు. కాని కొందరే రాణిస్తారు. కార్యకర్తల స్తాయి నుంచి పెద్ద నాయకుడిగా ఎదుగుతారు. దానికి కారణం ఏంటి అని చూస్తే వారి గ్రహబలం. వారు రాజకీయరంగ ప్రవేశం చేసిన ముహూర్తం. అన్నింటికంటే ముందుగా చూసుకోవాల్సింది ముహూర్తం. తప్పనిసరిగా ఏ రోజున రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందో చూసుకోవాలి. దాని ప్రకారమే రాజకీయాల్లోకి రావాలి. అయితే, రాజకీయ నాయకులు రాజకీయరంగ ప్రవేశం చేయడానికి అనువైన రోజు శుక్రవారం. శుక్రవారానికి శుక్రగ్రహం అధిపతిగా ఉంటాడు. శుక్రుడికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు, శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. ఇక లక్ష్మీదేవి మహావిష్ణువు భార్య. ఎప్పుడు ఆమె మహావిష్ణువు హృదయంలో ఉంటుంది. మహావిష్ణువు హృదయం కమలస్వరూపం.

రాజకీయాల్లోకి రావాలి అనుకునే వారు శుక్రవారం రోజున రాజకీయరంగ ప్రవేశం చేస్తే అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఇంటి ముందు అష్టకమలదళం ముగ్గును వేసి గడపకు పసుపు రాసి లక్ష్మీదేవికి పూజ చేయాలి. అలా చేసిన తరువాత ఇంటి నుంచి మొదట ఉత్తర దిశగా నడిచి అక్కడి నుంచి అనుకున్న లక్ష్యం వైపు వెళ్ళాలి. ఇలా చేస్తే తప్పకుండా రాజకీయాల్లో రాణిస్తారు….

చింతా గోపి శర్మ సిద్ధాంతి ….

స్ర్తి జాతకం

‘స్ర్తిణాం జన్మ ఫలం నృయోగ్య ముదితం యత్తత్వత్ యోజయేత్’
ఒక స్ర్తి యొక్క జాతక ఫలమందు ఏఏ యోగములు చెప్పబడిఉన్నవో అవి అన్నియు భర్తకు వర్తించుతాయి, స్ర్తి జాతక ప్రభావం దంపతుల ఇద్దరి మీదా ఆదారపడి వుంటుంది, సౌభాగ్య స్థానంగా అష్టమ స్థానం, పుత్రులు నవమ స్థానం, సంపద భాగ్యస్థానం మొదలగునవి1.అష్టమాధిపతి స్థితి నవాంశాధిపతి పాపగ్రహం అయిన యెడల వైధవ్యం చేకూరుతుంది. 2.అష్టమంలో వున్న గ్రహం నవాంశలో ఎవరి ఇంట ఉంటుందో అనవాంశాధిపతి గ్రహదశ సమయంలో వైధవ్యం వచ్చే అవకాసము వున్నది.భాగ్యస్థానంలో శుభ గ్రహములు ఉండి సప్తమ అష్టమ భావములలో పాప గ్రహములు వున్ననూ జాతకురాలు భర్తతో చిరంజీవియై ఉంటుంది. వివాహ పొంతన విషయాలు జాతకాలు పరిశీలించే అంశంలో తగు జాగ్రత్త తప్పని సరి. వివాహ పొంతనలు చూసేటప్పుడు అతి జాగ్రత్తగా ఆడవారి జాతకాలు పరిశీలించాలి. తొందరపడి ఏ విధంగాను పొరపాటు మాటలు మాటలాడరాదు. జాతకం బాగా లేదు… జాతకం దోష నక్షత్రంలో జననం అయినది… అష్టమం సౌభాగ్య స్థానం అందులో పాప గ్రహాలు ఉన్నాయి అనే పిచ్చి మాటలు చాలా ఎక్కువమంది తొందరపాటుగా చెబుతూంటారు. కానీ ఆడవారి జాతకంలో ఎనిమిది గ్రహాలు బాగుండక, కేవలం భాగ్యస్థానమే బాగా ఉండి మంచి జీవనం చేస్తున్న జాతకాలు అనేకం పరిశీలింపవచ్చు. వారి జాతకంలో భాగ్యస్థాన ప్రభావం అంత విశేషంగా ఉంటుంది. భాగ్యస్థాన ప్రభావం మర్మగర్భంగా దాగిన అంశం. మగవారి జాతకంలో యోగాలు సరిగా లేకపోయినా ఆడవారి జాతకంలో భాగ్యస్థానం బాగుంటే భర్త ఏదో రూపంగా కష్టించి డబ్బులు ఇంటికి తెచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ప్రాచీనులు పిల్ల జాతకంలో భాగ్య స్థానమునకు ప్రాధాన్యం ఇచ్చేవారు. అలాగే భాగ్యస్థానం బాగుండని స్ర్తి జాతకం ప్రభావం చేత, భర్త ఎంత సంపాదించినా ఇంటికి ధనం చేరదు. ఏదో మంచికో చెడుకో డబ్బు బయట ఖర్చవుతుంది. దీనిని అపార్థం చేసుకోవద్దు. అందుకే వివాహ పొంతన విషయంలో బాగా శోధించి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబం, భాగ్యం, సౌభాగ్యం బాగా వున్న ఆడవారి జాతకాలు మన ఇంటి కోడలు రావాలి అని తత్ప్రభావంగా మగపిల్లల స్థిరము, స్థిర లక్ష్మీ అన్నీ తీర్చిదిద్దబడతాయి అని పెద్దలు ఆశించేవారు. జ్యోతిష్కులు కూడా అదే రీతిగా చూసేవారు. కానీ నేటి సమాజంలో కేవలం నక్షత్రాలు పాపగ్రహాలు విషయంగా పరిశీలన పూర్తి చేసి ‘అబ్బే జాతకం బాగా లేదు’ అని చెప్పేవారు ఎక్కువయ్యారు. స్ర్తి జాతకాధ్యాయం ప్రత్యేకంగా ఇవ్వబడింది. అలా ఇవ్వడానికి గల కారణం ‘స్ర్తిణాం జన్మ ఫలం నృయోగ్య ముదితం యత్తత్వత్ యోజయేత్’ స్ర్తి జాతక ఫలమందు ఏ యోగములు చెప్పబడినవో అవి అన్నియు భర్తకు వర్తిస్తాయి. అనగా ఒక స్ర్తి జాతక ప్రభావంగా ఒక దంపతుల జీవనం ఆధారపడింది కావుననే స్ర్తి జాతక పరిశీలన చాలా ప్రశాంతంగా చేయాలి. కుటుంబ జీవనానికి మంచి చెడుల ప్రభావం స్ర్తి జాతకం మీదనే ఎక్కువ ఆధారం. ‘స్ర్తిణాం జన్మని లగ్న శీతకర వోర్మధ్సే బలీయస్త్వతః సంపద్రూప బలాన్వితన్నమతః పుత్రాయ వృద్ధిం వదేత్’ పుత్రులు సంపద మొదలగునవి నవమ స్థానం భాగ్యస్థానం వలన గ్రహించాలి. అలాగే సౌభాగ్య స్థానంగా అష్టమ స్థానం చెబుతారు. అష్టమంలో పాపగ్రహం వుండగానే ఈ జాతకం పనికిరాదు అనే వారు వున్నారు. అయితే మనం బహు గ్రంథాలు పరిశీలిస్తే ‘రంధ్రే శాంగపతే ఖలేచ విధవా నిస్సంశయం భామినీ సౌమ్యేరంధ్రగతైః సమేత తరుణీ ప్రాగేవపమృత్యుం పతే’. 1.అష్టముఖవాధిపతి స్థితి నలాంశాధిపతి పాపగ్రహం అయిన యెడల వైధవ్యం చేకూరుతుంది. 2.అష్టమంలో వున్న గ్రహం నవాంశలో ఎవరి ఇంట ఉంటుందో అనవాంశాధిపతి గ్రహదశ సమయంలో వైధవ్యం వస్తుంది. ఇలా సౌభాగ్య స్థానం గురించి ఎన్నో పాఠాలు వున్నాయి. భాగ్యస్థానంలో శుభ గ్రహములు ఉండి సప్తమ అష్టమ భావములలో పాప గ్రహములు వున్ననూ జాతకురాలు భర్తతో చిరంజీవియై ఉంటుంది. సంతతి సౌఖ్యము వైభవములతో కూడి వుంటుంది. చూశారా మరి మిగిలిన గ్రహాలను పక్కనబెట్టి భాగ్య భావం గూర్చి ఏ విధంగా చెప్పారో. అందువలన వివాహ పొంతన విషయాలు జాతకాలు పరిశీలించే అంశంలో ఒకటికి రెండుసార్లు స్ర్తి జాతకాధ్యాయం పరిశీలించడం అవసరం. తొందరపడి దోషాలు చెప్పవద్దు…చింతా గోపి శర్మ సిద్ధాంతి … 9866193557

బ్రాహ్మణాభ్యుదయ పరిషత్ (రంగారెడ్డి జిల్లా) శ్రీ విళంబి నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ

బ్రాహ్మణాభ్యుదయ పరిషత్ (రంగారెడ్డి జిల్లా) శ్రీ విళంబి నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు . నాదరుగుల్ లో బ్రాహ్మణాభ్యుదయ పరిషత్ వేద పాఠశాల ప్రాంగణంలో
పంచాంగం ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో “వేదశాస్త్ర విశారద”అభినవశుక,””తర్కవేదంతవిషారద”కృష్ణ యజుర్వేద పండితులు బ్రహ్మశ్రీ మాడుగుల శంకరశాస్త్రి గారు,సంస్కృత జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు
రంగి సత్యనారాయణ శర్మ గారు,హిందూ టీవీ సీఈఓ సంకేపల్లి భరత శర్మ,గారు, వర్గాల్ వేద పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉప్పల అనంతగిరి శర్మ గారు,
హరిహర రుద్రవీణ ప్రధాన సంపాదకులు వుప్పల బాలసుబ్రమణ్యశర్మగారు, భారత బ్రాహ్మణ సంస్థాన్ అధ్యక్షులు కళ్ళే గిరిప్రసాద్ శర్మగారు, ప్రముఖ న్యాయవాది గుండెపుడి రమశంకర్ శర్మగారు ,స్థానిక కౌన్సిలర్ శ్రీశైలం యాదవ్ గారు మరియు బ్రాహ్మణాభ్యుదయ పరిషత్ రంగారెడ్డి జిల్లా సంఘం ప్రతినిధులు మరియు యువజన సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.FB_IMG_1518844380017IMG-20180217-WA0008