Monthly Archives: December 2017

నూతన నటీనటులకు అవకాశం

 

మశనీర్ ప్రొడక్షన్ హౌస్ పతాకం పై వీడు మాములోడు కాదు,జలక్ చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రేక్షకులకు ఎంతో దగ్గర అయిన దర్శకుడు రవి శర్మ . ఇప్పుడు నూతన చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమా మీద మంచి అభిరుచి ఉన్న ఈ దర్శక నిర్మాత లు చిత్ర నిర్మాణం కోసం అవసరమైన నూతన నటుల ఎంపికకు కూడా శ్రీకారం చుట్టారు. నటన పట్ల ఆసక్తి ఉన్న యువకులు తమ లేటెస్ట్ ఫోటోలను వారి వివరాలతో కలిపి ఈ దిగువ పేర్కొంటున్న ఈ మెయిల్ అడ్రెస్ కి పంపించవలసినదిగా ఈ సినిమా దర్శక నిర్మాత లు కోరుతున్నారు.received_10215337073842770

శ్రీ ఆదిశంకర విరచిత బాల కృష్ణాష్టకం

శ్రీ ఆదిశంకర విరచిత బాల కృష్ణాష్టకం
🕉లీలయ  కుచేల  మౌని  పాలితం  కృపాకరం  నీల  నీల  మింద్ర నీల నీలకాంతి మోహనం
బాలనీల  చారు  కొమలాలకం  విలాసగోపాలబాల జార  చోర బాలక్రిష్ణమాశ్రయే   ||

🕉ఇందుకుంద  మందహాస  మిందిరా  ధరధారం  నందగోపనందనం సనందనాది  వందితం  |
నందగోధనం   సురారి  మర్ధనం  సమస్త గోపాలబాల జార  చోర బాలక్రిష్ణమాశ్రయే   ||

🕉వారి  హార  హీరా  చారు  కీర్తితం  విరాజితం  ద్వారకా  విహారమంబుజారి  సూర్య  లోచనం  |
భురిమేరు  ధీరమాది  కారణం  సుసేవ్య   గోపాలబాల జార  చోర బాలక్రిష్ణమాశ్రయే   ||

🕉శేషభోగ   సాయినం విశేష  భూషనొజ్వలమ్  ఘోషమాన కింకిణి  విభీషనాది పోషణం|
శోశనాక్రుథామ్బుధిమ్  విభీషనార్చితం పదం  గోపాలబాల జార  చోర  బాలక్రిష్ణమాశ్రయే  ||

🕉పండితాఖిలస్తుతం  పుండరీక  భాస్వరం  కుండలప్రభాసమాన తున్డగండమండలం |
పుండరీక  సన్నుతం  జగన్నుతం  మనోగ్న్యకం గోపాలబాల జార  చోర  బాలక్రిష్ణమాశ్రయే  ||

🕉ఆంజనేయ  ముఖ్య  పాల  వానరేంద్ర  కృంతనం  కుంజరారి భంజనమ్  నిరంజనం  శుభాకరం  |
మంజు  కంజ  పత్ర నేత్ర  రాజితం  విరాజితం గోపాలబాల జార  చోర  బాలక్రిష్ణమాశ్రయే  ||

🕉రామనీయ యజ్ఞధామ భామిని  వరప్రదం  మనోహరం  గుణాభిరామ మున్నతోన్నతం  గురుం  |
సామ  గాన  వేణు  నాద లొలమర్చితాశ్టకమ్ గోపాలబాల జార  చోర  బాలక్రిష్ణమాశ్రయే  ||

🕉రంగ  డింఢి రాంగమంగళాంగ   సౌర్యభాసదా  సంగదాసురోత్తమాంగా భంగక  ప్రదాయకం  |
తుంగవైర  వాభిరమ  మంగళామృతమ్  సదా   – గోపాలబాల జార  చోర  బాలక్రిష్ణమాశ్రయే  ||

🕉బాలకృష్ణ  పుణ్యనామ లాలితం శుభాస్తకం  యే పఠన్తి  సాత్వికోత్తమాసదా  ముధాచ్యుతం  |
రాజమాన  పుత్ర సంపాదాది శోభనానితే సాధయంతి  విష్ణులోకమవ్యయం  నరాష్టతే ||

ఇంట్లో దేవుని ప‌టాలు ఉండ‌గా గుడికి వెళ్లి పూజచేయడం ఎందుకు?

ఇంట్లో దేవతారాధన చేస్తాం. అలాంటప్పుడు ‘గుడికి వెళ్లి పూజచేయడం ఎందుకు?’ అనే సందేహం చాలా మందికి వ‌స్తుంది. దేవాలయంలో మూలవిరాట్టు ఉన్న చోట బీజాక్షర యంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు. యంత్రాన్ని రాగితో చేస్తారు. దానిమీద బీజాక్షరాలు ఉంటాయి. చక్రాలు వేసి ఉంటాయి. చక్రం బోలెడు కోణాల కలయిక. ఒకసారి ఇందులోకి ప్రవేశించిన ఏ శక్తైనా ప్రతి కోణానికీ తాడనం చెందుతూ పెద్దదిగా మరింత బలమైనదిగా మారుతుంది. రాగి మంచి వాహకం. భూమిలోపల ఉండే విద్యుదయస్కాంత తరంగాల శక్తిని ఒక దగ్గరికి తీసుకురావడంలో యంత్రం గొప్పగా పనిచేస్తుంది. అందువల్ల అక్కడ శక్తిక్షేత్రం ఏర్పడుతుంది.

నిజానికి స్వయంభూ దేవాలయాలన్నింటి దగ్గరా ఇలాంటి శక్తి తరంగాలు అత్యధికంగా ఉంటాయి. అలా దేవుడు వెలసిన చోటును రుషులు గుర్తించి దేవాలయాల్ని నిర్మించేవారు. ఇక, మంత్రబలంతో ఆలయాల్లో విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు. గుళ్లొ నిరంతరం అర్చన జరుగుతూనే ఉంటుంది. దేవాలయంలో ఎన్ని పూజలు జరిగితే ఆ విగ్రహానికి అంత శక్తి వస్తుంది. ఆ విధంగా ఏళ్లతరబడి ఆ విగ్రహానికి శక్తి ఆపాదన జరుగుతుంది. అందుకే పురాతన ఆలయాలకు వెళ్లడం గొప్పవిషయంగా చెబుతారు…. చింతా గోపి శర్మ సిద్ధాంతి …. 21-pujaroom

సర్వరక్షక ఆంజనేయ స్తోత్రం

 

శ్రీ రామదాస! అంజనా గర్భ సంభూత ఆదిత్య కబళనోద్యోగి వజ్రాంగ! సర్వదేవతా స్వరూప! మహాపరాక్రమ! రామదూత! సీతాన్వేషణ తత్పర! లంకాపురీ దాహన! రాక్షస మర్దన! రావణ గర్వ నివారక! సముద్రోల్లంఘన దక్ష! మైనాక పర్వ తానుగ్రహకారణ! సురసా నివారక! సింహికా ప్రాణభంజన! మహాకాయ! వీరరస స్వరూప! కనక శైల సమ సుందరాకార! మహాబల పరాక్రమ! భక్తరక్షణ దీనాదక్ష! లక్ష్మణ ప్రాణదాత! సంజీవరాయ! సర్వగ్రహ వినాశన! యక్షరాక్షస శాకినీ ఢాకినీ బ్రహ్మరాక్షస బాధా నివారణ! అనుపమతేజ! భాస్కరశిష్య! శని గర్వ నివారణ! శాంతస్వరూప! మహాజ్ఞానీ! ప్రతిగ్రామ నివాసీ! లోకరక్షక! కామిత ఫలప్రదాత! రామమంత్ర ప్రదాత! పింగాక్ష! భీమ పరాక్రమ! ఆనంద ప్రదాత! రమణీయహార! బాధా నివారక! సర్వరోగ నివారక! అఖండ బలప్రదాత! బుధ్ధి ప్రదాత! నిర్భయ స్వరూప! ఆశ్రిత రక్షక! సుగ్రీవ సచివ! పంపాతీర నివాస! నతజన రక్షక! ఏహి ఏహి, మాం రక్షరక్ష మమ శత్రూన్ నాశయ నాశయ, మమ బంధూన్ పోషయ పోషయ, ఐశ్వర్యాన్ దాపయ దాపయ, మమ కష్టాన్ వారయ వారయ, భక్తిం ప్రయచ్ఛ, రామానుగ్రహం దాపయ దాపయ, సర్వదా రక్షరక్ష హుం ఫట్ స్వాహా!

ఓమ శాంతిః శాంతిః శాంతిఃunnamed

జ్యోతిష రహస్యము

 

మానవజాతి అవతరించిన తర్వాత ఎన్నో శాస్త్రాలు పుట్టాయి. మన ఋషులు ప్రజా శ్రేయసు కోసం అందించిన శాస్త్రాలలో అన్నిటికంటే అతి ప్రాచీనమైనది జ్యోతిష్యం. జీవి జీవితంలో జరిగింది, జరగబోతుంది, జరగబోయేది జననకాల గ్రహస్థితి ప్రకారము, శరీర లక్షణాలు, అర చేతులు, మొదలైన అంశాలను ఆధారం చేసుకుని చెబుతుంది జ్యోతిష్యం.

జ్యోతి అన్న పదానికి సంస్కృతం లో వెలుగు, నక్షత్రము, నేత్రం,సూర్యుడు అనే అర్ధాలు ఉన్నాయి. అనంత విశ్వంలో మన కంటికి ఆకాశంలో కనిపించే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, కొన్ని గ్రహాలు, తోకచుక్కలు, గ్రహణాలు ఇవన్నీ ఆకాశంలో చూసి ఆనందించటంతో పాటు పూర్వకాలం వారికీ ఆశ్చర్యం కూడా కలిగేది, ఎంతో ఉత్సాహంగా కూడా ఉండేది.

కాంతి గోళాలైన నక్షత్రాలు, గ్రహాలు, సూర్య, చంద్రులు భూ వాతావరణంపై, ప్రాణులపై చూపించే ప్రభావాలను, మానవ జీవితంతో వాటికున్న సంబంధాలను అధ్యయనం చేసేదే జ్యోతిష శాస్త్రం. అయితే ఈ కాంతి రెండు రకాలు. 1. నక్షత్రాలు, సూర్య, చంద్రులకు సంబంధించిన బయటి కాంతి, 2. ఆత్మకు సంబంధించిన లోపలి కాంతి. బయటి కాంతి స్పష్టం అవుతున్న కొద్ది లోపలి జ్యోతి స్వరూపమైన ఆత్మ తత్వం బోధపడుతుంది. కాబట్టి జ్యోతిష్య శాస్త్ర ముఖ్య లక్ష్యం భవిష్యత్తు గురించి తెలుసుకోవడమే కాక మానవుల ఆధ్యాత్మిక పరిణామం కోసమని కూడా తెలుస్తోంది. అందుకే జ్యోతిష్య శాస్త్రాన్ని ‘వేద చక్షువు’ అంటారు. అంటే జ్ఞాన నేత్రం అని అర్థం.

భూమి గుండ్రంగ ఆఉందని గ్రీకు శాస్త్రవెత్త టాలెమి కనిపెట్టడానికి ఎన్నో వేల సంవత్సరాల పూర్వం నుంచే మన దేశంలో ఖగోళం అనే పదము వాడుకలో ఉంది. జ్యోతిష్య శాస్త్రం పూర్తిగా భారతీయ విద్య. గ్రీకులు, బాబిలోనియా వారు మన దేశంలో జ్యోతిష్య శాస్త్రాన్ని ప్రవేశపెట్టారనే విదేశీయుల వాదన పూర్తిగా సత్యదూరమైంది. ఆయా దేశాలు కళ్లు తెరవక ముందే రుగ్వేదం, యజుర్వేద, సామ, అధర్వణ వేదాదులలో జ్యోతిష్య శాస్త్ర విషయాలు, రహస్యాలు అనేక చోట్ల ప్రస్తవించడం జరిగింది. ఇంతటి విశేషఖ్యాతి వహించిన జ్యోతిష్య శాస్త్రం బ్రహ్మ దేవునిచే నిర్మించబడినదిగా తెలుస్తోంది. ఆ తర్వాత ఈ శాస్త్రానికి సూర్యుడు, నారదుడు, కశ్యప, అత్రి, గర్గ, మరీచి, మనువు, అంగీరస, పౌలిష, చ్యవన, శైనక, వశిష్ఠుడు, పరాశరుడు, వ్యాసుడు మొదలైన గురు తుల్యులైన మహర్షి పరంపర ప్రవర్తకులుగా నిలిచారు. ప్రవర్తకులు అంటే శాస్త్ర విషయాలు నిత్య జీవితంలో ఆచరణ స్థానాన్ని కల్పించి ప్రజా బాహుళ్యానికి అందుబాటులో ఉంచిన వారు అని అర్థం.

ప్రస్తుత ఆధునిక కాలంలో టెలిస్కోప్, ఇంటర్నెట్ లో అన్ని విషయాలు సులువుగా తెలుసుకుంటున్నాం కాబట్టి మనకు విశ్వ విషయాలు అద్భుతంగా అనిపించక పొవచ్చు. కానీ పూర్వ కాలం లో వారికీ అన్ని వింతగా, విశేషంగా అందరిని ఆకర్షించి తెలుసుకోవాలన్న కుతూహలాన్ని పెంచేవి. ఆ గ్రహాల గురించి కుతూహలం పరిశీలనా, ప్రాణులపై వాటి ప్రభావం వాతావరణంలో క్రమబద్ధమైన మార్పులు, వాటికీ మనవ జీవితంతో వున్నా సంబంధము మొదలైనవి జ్యోతిష్య శాస్త్ర ఆవిర్భావానికి కారణం అయ్యాయి.

భారతీయ జ్యోతిష్యానికి మూలం 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 12 రాశులు, 108 పాదాలు, పుట్టుక కాలం.

జ్యోతిష్యంతోనే వేద కార్యకలాపాలు
జ్యోతిష్యం వేదాంగాలలో చివరిది. వేదాన్ని అనుసరించి మనం చేసే యజ్ఞ, యాగాదికాలు ఉంటాయి. వాటిని నిర్వహించడానికి కొన్ని ప్రత్యేక సమయాలు ఉంటాయి. వాటినే శుభ సమయం లేదా ముహూర్తం అంటారు. ఈ ముహుర్తాలను అనుసరించి, వైదిక కార్యకలాపాలు చేస్తుంటారు. శుభ సమయాలు సౌరకుటుంబంలోని గ్రహాలు, నక్షత్రాల గమనం మీద ఆధారపడి వుంటాయి. నక్షత్ర, గ్రహ సంబంధమైన విషయాలను అధ్యయనం చేసి వివరించేదే జ్యోతిష్యశాస్త్రం. ఇది లేకుండా వేద కార్యకలాపాలు నిర్వహించడం కుదరదు.

జ్యోతిష్యం కర్మసిద్ధాంతము
భవిష్యత్తులో జరుగబోయే పరిణామాల గురించి ముందుగానే చెప్పి, మనం మానసికంగా వాటిని ఎదుర్కోడానికి తగిన ఉపాయాలను సూచిస్తూ జ్యోతిషశాస్త్రం సహాయకారిగా ఉంటుంది. జ్యోతిష శాస్త్రం మనకు మార్గదర్శకమై బాధల నుంచి విముక్తి పొందే మార్గాన్ని సూచిస్తుంది. కర్మ సిద్థాంతం 3 రకాలైన కర్మలను గురించి చెబుతోంది. అవి..

1. ప్రారబ్దకర్మ
గత జన్మలో మానవుడు చేసిన కర్మల ఫలితాన్ని ఈ జన్మలో అనుభవించడామే ప్రారబ్ద కర్మ.

2. సంచితకర్మ
గతజన్మలో మిగిలిపోయిన కర్మఫలాలను ఈ జన్మలో అనుభవించడమే సంచితకర్మ.

3. ఆగామికర్మ
ఈ జన్మలో మానవుడు చేస్తున్న కర్మల ఫలాన్ని వచ్చే జన్మలో అనుభవించేదిగా మారడమే ఆగామికర్మ.

అంటే మానవునికి తాను చేసిన కర్మల ఫలితాన్ని అనుభవించడానికి ఒక జన్మచాలదు. మానవుడు చేసే ఏ కర్మ అయినా తనకు అంటకుండా, భగవంతునికి సమర్పణ భావంతో చేయాలని, దీనివల్ల మానవునికి తక్కువ జన్మలలో మోక్షప్రాప్తి సుగమమై, జనన మరణ చక్రాల నుంచి తప్పుకోవడం జరుగుతుందని శ్రీకృష్ణ భగవానుడు చెబుతాడు.

గడిచిన జన్మలో చేసిన పాప కర్మల ఫలితాల ప్రభావాన్ని పూర్తిగా తుడిచి వేయడానికి జపం, ధర్మం, హోమం వంటి మార్గాలను జ్యోతిష శాస్త్రము సూచించింది. ఈ జన్మలో మనం చేసే మంచి కర్మల ఫలితాలు గత జన్మలో చేసిన పాపకర్మల ప్రభావాన్ని తగ్గించి మానవుడికి తక్కువ దు:ఖాన్ని కలుగజేస్తుంది. భగవంతుని ప్రగాఢంగా నమ్ముకున్నట్లయితే జ్యోతిష్య శాస్త్ర జ్ఞానం అనాయాసంగా మనిషిని చేరుతుంది.

బ్రహ్మరాత మన పూర్వ జన్మ కర్మను అనుసరించే ఉంటుంది. ఆ పూర్వ కర్మ మనం చేసిందే, దాని మీద అధికారం కూడా మనదే. కర్మ సంకల్పం నుంచి పుడుతుంది.ఆ సంకల్పం కూడా మనదే కదా! సత్కర్మల ద్వారా దోషాన్ని ఎలా పరిహరించాలో జ్యోతిష శాస్త్రం తెలుపుతుంది. పూర్వ జన్మలో చేసిన శుభ, పాప కర్మల యొక్క ఫలానుభవ కాలాన్ని జ్యోతిష శాస్త్రం సూచిస్తుంది. చీకటిలోని వస్తువులను దీపం సహాయంతో చూసినట్లుగా జ్యోతిష శాస్త్ర సహాయంతో జీవితంలో జరుగబోయే శుభాశుభ సంఘటనలను ముందుగా గుర్తించి.. దాంతో మంత్ర, ఔషధ, జప, దాన, హోమ, రత్న ధారణాది శాంతి ప్రక్రియల ద్వారా వ్యతిరేక ఫలితాలను నివారించుకోవచ్చని వరాహమిహిరుల వారి సందేశం మనకు లఘు జాతకం అనే గ్రంథంలో కనిపిస్తోంది.FB_IMG_1512623945598

పూజా గది అలంకారణ

 

మన సాంప్రదాయం ప్రకారం మన ఇంటిలో పూజకి ప్రత్యేక స్థానం ఉంది. దేవుడిని ఆరాదించడానికి ఇంటిలో ప్రత్యేకంగా ఒక పూజ గదిని ఏర్పాటు చేసుకుంటారు. ఉదయం లేవగానే స్నానపానాదుల ఆచరించిన తర్వాత చాలా మంది ఇళ్లలోనే పూజ గదిలో కొద్ది నిమిషాలు గడపడడం చాలా మందిలో ఆనవాయితీ. దీని వల్ల మనశ్శాంతి, ఆయురారోగ్యాలు, సంతోషం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. అయితే పూజ గదిని శుభ్రంగా, మరింత అందంగా తీర్చిదిద్దుకోవడం చాలా అవసరం.

అలంకారం
పూజ గది గోడలకు మీ ఎంపిక చేసుకునే రంగలు మాత్రం లైట్‌ కలర్‌ షెడ్‌ లు ఉండే విధంగా ఎంచుకోవాలి. గోడలకు వేసిన రంగుల వల్ల మనస్సు ప్రశాంతత చేకూర్చే విధంగా ఉండాలి. పూజ గదికి వేసే రంగులు ముఖ్యంగా తెలుపు రంగుతో పాటు పసుపు, లేత గులాబి, లేత నీళం రంగులను వాడుకోవచ్చు.

ఇక పూజ గదికి ఏర్పాటు చేసే మండపాన్ని చక్కగా అలంకరించాలి. ఈ మండపాన్ని సంప్రదాయబద్ధంగా ఉండే విధంగా చక్కటి కలపను వాడాలి. ప్రస్తుతం మార్కెట్‌ లో మార్బల్‌, ఇత్తడితో పాటు గ్రైనేట్‌ మండపాలు కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఈ మండపాలకు పూలతో చక్కగా అలంకరించాలి.

ఆ తర్వాత, సరైన విగ్రహాలను ఎంపిక చేసుకోవాలి. విగ్రహాల ఎంపికకు తేలికపాటి విగ్రహాలను ఎంపిక చేసుకోవాలి. చక్కతో చేసిన విగ్రహాలైతే మేలు. లేదా లోహంతో తయారు చేసినవ కూడా ఫర్వాలేదు. బంకమట్టితో చేసిన విగ్రహాలు కూడా వాడవచ్చు.

పూజ గదిలో వెండి, రాగి లేదా ఫ్రేమ్‌ తో తయారు చేసిన ఫోటోలను పూజ గది గోడలకు అందంగా అలంకరించవచ్చు. పూజ గదిలో వెండి, లేదా ఇత్తడి దీప స్తంభాలు మార్కెట్లో వివిధ ఆకారాల్లో లభిస్తాయి. వాటిని పూజ గదిలో ఏర్పాటు చేసుకుంటే పూజ గదికి మరింత అందం చేకూరుతుంది.

వెండితో తయారు చేసిన పళ్లాలు కూడా వాడవచ్చు. వాటిలో కర్పూరం, చందనం, పూలు తదితర పూజ సామగ్రిని ఉంచుకోవచ్చు. కాలాన్నిబట్టి మార్కెట్లో వివిధ రకాల పూలు దొరుకుతాయి. రోజుకో రకం పూలను వాడుకోవచ్చు. అయితే పూజకు వాడే పూలను దేవునిపై విసిరివేయకుండా చరణాలకు సమర్పించవలెను. మూర్తి దూరంగా ఉంటే వాటిని దేవుని ఎదుట ఉండే పళ్ళెంలో ఉంచకూడదు.

పూజగదిలో పువ్వులు, దీపాలు పెట్టడానికి నువ్వుల నూనె, ఆవునెయ్యి, వత్తులూ, మట్టిప్రమిదలూ, కుందులూ, అగరొత్తులూ, అగ్గి పెట్టెలూ, పసుపూ, కుంకుమా, గంధమూ, సిందూరమూ, విభూతిపండు, జపమాల, అక్షింతలూ, కర్పూరం, కొబ్బరికాయ, తమలపాకులూ, వక్కముక్కలూ, ముగ్గూ, కలకండ, గంట, ఏకారతి, కూర్చోవడానికి చాపలూ/ పీటలూ/ మృగచర్మమూ, పారాయణ పుస్తకాలు పెట్టుకోవడానికి తగిన స్థలం, మందిరాన్ని శుభ్రం చేసే ప్రత్యేకమైన చీపురూ, దేవుణ్ణి శుభ్రం చేయడానికి ఒక ప్రత్యేకమైన వస్త్రం, వస్తువుల్ని తుడవడానికి మరో ప్రత్యేకమైన మసిగుడ్డ – ఇవన్నీ ఏర్పరుచుకోవాలి. వీటిల్లో నిత్యపూజకి కొన్నీ, ప్రత్యేక సందర్భాలకి మరి కొన్ని ఉపయోగపడతాయి. ఇవన్నీ చవగ్గా దొరికే వస్తు ద్రవ్యాలే. అయినా పూజాద్రవ్యాల మీద ఖర్చుచేయడానికి లోభించకూడదు. లోభించేవారికి ఫలితమివ్వడానికి దేవుడు కూడా లోభిస్తాడని మర్చిపోరాదు. తగుమాత్రం ఖర్చుపెట్టాలి. ఎంత చేసుకుంటారో అంతే ప్రాప్తం.

ప్రతిరోజూ పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ఈ పనిని కూడా గృహస్థుడు గానీ, గృహిణి గానీ స్వయంగా చేయాలి. పనివారికి అప్పగించకూడదు.

ఎటువైపు ఉండాలి..?
పూజ గది ఈశాన్య లేదా తూర్పు లేదా ఉత్తర దిక్కున ఏర్పా టు చేయాలి. ఉదయమే సూర్యుడు ఇంటికి ఈశాన్య దిక్కున ఉంటాడు. హిందువుల ఎవరి ఇంట్లోనైనా దేవీ-దేవతల ఫోటోలు వుంటాయి. కొందరి ఇళ్ళల్లో ప్రత్యేకంగా పూజాగది ఉంటుంది. మరికొందరి ఇంట్లో గోడలకు మాత్రమే దేవీ-దేవతల ఫోటోలు వ్రేలాడుతూ కనబడతాయి. అయితే దేవీ-దేవతల విగ్రహాలను కానీ, ఫోటోలు కానీ వరుసక్రమంలో పెట్టుకోవాలి.

వినాయకుడి విగ్రహం లేదా చిత్రము మధ్యలో అమర్చుకోవాలి. పురుష దేవతలు గణపతి విగ్రహానికి కానీ ఫోటోకి కాని కుడి వైపున (ఉదా: హనుమంతుడు, శ్రీకృష్ణుడు). స్త్రీ దేవతలు(ఉదా : అన్నపూర్ణదేవి) గణపతికి ఎడమ వైపున వచ్చే విధంగా అమర్చుకోవాలి. కొన్ని ఫోటోలలో దేవీదేవతల కలిసిన ఫోటోలు (ఉదా: సీతారాముడు, లక్ష్మి నారాయణుడు) వుంటాయి. అలాంటి ఫోటోలను గణపతి దేవునికి కుడి వైపు వచ్చే విధంగా అమర్చుకోవాలి. ఎవ్వరికైనా ఆధ్యాత్మిక గురువు ఉండి, కేవలము ఒక్కరే నివసిస్తుంటే అతను కేవలం గురువుల ఫోటోను మాత్రమే అమర్చుకోవాలి. ఒక్కవేళ కుటుంబ సభ్యులు వుంటే గురువుల ఫోటోను గణపతి దేవునికి కుడి వైపున వచ్చే విధంగా అమర్చుకోవాలి.
…………………..చింతా గోపిశర్మ సిద్ధాంతి21-pujaroom

మీ లక్కీ నంబర్ ఇదే.. !!

మీ లక్కీ నంబర్ ఇదే.. !!

ఏ పని మొదలుపెట్టడానికి.. బిజినెస్ స్టార్ట్ చేయడానికి.. బైక్, కార్లు కొనేటప్పుడు నెంబర్ ప్లేట్స్ కి లక్కీ నంబర్ ఉండేలా జాగ్రత్త పడతారు. లక్కీ నంబర్ ఇంత స్పెషల్ ప్లేస్ సంపాదించింది. అయితే ఏదీ ల‌క్కినంబ‌రో తెలియ‌ని వాళ్లు ఎంతో మంది ఉన్నారు.

మీ రాశిని బట్టి మీకు ఏ నంబర్ అదృష్టం తీసుకొస్తుందో తెలుసుకోవడం మంచిది. ఈ నంబర్స్ మీకు మంచి ఫలితాలు తీసుకొస్తాయి. మీ పర్సనాలిటీకి తగ్గట్టు మీరు అదృష్టవంతులయిపోవచ్చు. సో మీ రాశిని బట్టి మీ అదృష్ట సంఖ్య ఏదో ఇప్పుడే తెలుసుకోండి.

మేష రాశి మేషరాశి వాళ్లకు మార్స్ రూలింగ్ ప్లానెట్. కాబట్టి వీళ్లు చాలా విభిన్నంగా, ఎనర్జిటిక్ గా, ధైర్యంగా, క్యూరియస్ గా ఉంటారు. వీళ్లకు 9 మరియు 1 అదృష్టాన్ని తీసుకొచ్చే సంఖ్యలు. ఈ రెండు నెంబర్లు మీకు ఇబ్బందులున్న సమయంలో కూడా శ్రేయస్సు తీసుకొస్తాయి.

వృషభ రాశి వృషభ రాశి వాళ్లు రొమాంటిక్ గా ఉంటారు. అలాగే చాలా ఓర్పు కలిగి ఉంటారు. లాజికల్ గా ఆలోచించే గుణం ఉంటుంది. వీళ్లకు 2, 8 సంఖ్యలు చాలా అనుకూలంగా ఉంటాయి.

మిథున రాశి మిధున రాశివాళ్లకు ఈ ఏడాది చాలా శ్రేయస్కరమైనది. మీరు ఎక్కువగా ఆధ్యాత్మిక భావనలు కలిగి ఉంటారు. మీకు అదృష్టం తీసుకొచ్చే సంఖ్యలు 3, 7. మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఈ నంబర్స్ ని ఫాలో అయితే.. విజయం సాధిస్తారు.

కర్కాటక రాశి ఎవరైతే కర్కాటక రాశి కింద పుట్టి ఉంటారో వాళ్లకు సిక్త్ సెన్స్ చాలా స్ర్టాంగ్ గా ఉంటుంది. అలాగే వీళ్లకు ఇమాజినేటివ్ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది. కర్కాటక రాశివాళ్లకు కలిసొచ్చే నెంబర్లు 4 మరియు 6.

సింహ రాశి సింహరాశి వాళ్లు నమ్మకానికి, ధానదర్మాలకు పెట్టింది పేరు. వీళ్లకు ఈ ఏడాది కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు 1, 4, 6. ఈ సంఖ్యలు మీరు ఎదురుచూస్తున్న పాజిటివ్ రిజల్ట్స్ తీసుకొస్తాయి.

కన్యా రాశి కన్యారాశి వాళ్లకు సహాయం చేసే గుణం ఉంటుంది. వీళ్లు చాలా అందంగా ఉంటారు. మోడల్స్ అయ్యే అవకాశాలు కన్యారాశి వాళ్లకు ఎక్కువ. వీళ్ల జీవితంలో శ్రేయస్సును, మంచి అదృష్టాన్ని తీసుకొచ్చే నంబర్లు 2, 5, 7.

తుల రాశి తులా రాశి వాళ్లు ఆదర్శవాదులుగా ఉంటారు. వీళ్లకు సోషల్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే వీళ్లు అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. 1,2,7 సంఖ్యలు వీళ్లకు ఊహించని విధంగా అదృష్టాన్ని తీసుకొస్తాయి.

వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్లు రహస్య స్వభావం, సహజమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వీళ్లకు కలిసొచ్చే నెంబర్లు 2, 7, 9.

ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్లు చాలా ధైర్యవంతులు. ఆశావాదులు. అలాగే కాస్త మతిమరుపు కూడా ఉంటుంది. వీళ్ల లైఫ్ లోకి అదృష్టం తీసుకొచ్చే సంఖ్యలు 3, 8, 5. ఇవి మీ లక్కును సూచిస్తాయి.

మకర రాశి మకర రాశి వాళ్లు తమ లక్ష్యాలను చేరుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. వీళ్లు చాలా నమ్మకస్తులు, నిజాయితీపరులు. ఈ సంవత్సరం వీళ్లకు విజయాలు తీసుకొచ్చే అదృష్ట సంఖ్యలు 6, 8, 9.

కుంభ రాశి కుంభరాశి వాళ్లు చాలా సైలెంట్. అలాగే చాలా తెలివైన వాళ్లు. ఫ్రెండ్లీ నేచర్ కూడా కలిగి ఉంటారు. ఈ సంవత్సరం వీళ్లకు 2, 3 ,7 అదృష్ట సంఖ్యలు. ఇవి మీకు మ్యాజిక్ లా పనిచేస్తాయి.

మీన రాశి మీన రాశి వాళ్లకు చాలా ఆలోచనా శక్తి ఉంటుంది. వీళ్లకు కలిసొచ్చే, అనుకూలమైన సంఖ్యలు 1, 3, 4, 9. ఈ నంబర్లు మీకు లక్కీగా పనిచేస్తాయి.chinta Gopi Sarma Siddhanthiimages (1)

శ్రీ సాంబసదాశివభుజంగప్రయాత స్తోత్రం

కదా వా విరక్తిః కదా వా సుభక్తిః
కదా వా మహాయోగి సంసేవ్య ముక్తిః |
హృదాకాశమధ్యే సదా సంవసన్తం
సదానందరూపం శివం సాంబమీడే || ౧ ||

సుధీరాజహంసైస్సుపుణ్యావతంసైః
సురశ్రీ సమేతైస్సదాచారపూతైః |
అదోషైస్సురుద్రాక్ష భూషావిశేషై-
రదీనైర్విభూత్యంగరాగోజ్జ్వలాంగైః || ౨ ||

శివధ్యానసంసక్త శుద్ధాంతరంగైః
మహాశైవపంచాక్షరీ మంత్రసిద్ధైః |
తమో మోచకై రేచకైః పూరకాద్యైః
సముద్దీపితాధార ముఖ్యాబ్జషట్కైః || ౩ ||

హఠల్లంబికా రాజయోగ ప్రభావా-
ల్లుఠత్కుండలీ వ్యక్త ముక్తావకాశామ్ |
సహస్రారపద్మస్థితాం పారవారాం
సుధామాధురీం సాధురీత్యా పిబద్భిః || ౪ ||

సదానంద కందైర్మహాయోగిబృందైః
సదాసేవ్యమానం సముజ్జృంభమాణమ్ |
మహాపుణ్యపాకే పునఃపుండరీకే
సదా సంవసన్తం చిదానందరూపమ్ || ౫ ||

తటిత్పుంజ చంచజ్జటాజూట వాటీ
నటజ్జహ్నుకన్యా తటిన్యా సమేతమ్ |
మహానర్ఘ మాణిక్య కోటీరహీర
ప్రభాపూరితార్ధేందురేఖావతంసమ్ || ౬ ||

ఫణాభృన్మణీ కుండలాలోలకర్ణ
ద్వయీ చారుతా దర్పణాద్గండభాగమ్ |
సునేత్రాళికం సాదర భ్రూవిలాసం
సమన్దస్మితాఽఽస్యారవిన్దం శ్రయంతమ్ || ౭ ||

లసత్పీవరాఽంసద్వయం నీలకంఠం
మహోరస్స్థలం సూక్ష్మ మధ్యప్రదేశమ్ |
వళిద్యోతమానోదరం దివ్యనాభిం
కుఠారైణ శాబాఽంచితాభ్యాం కరాభ్యామ్ || ౮ ||

ముఖాబ్జైస్స్తువన్తం కరాబ్జైర్నమన్తం
విధిం మానయన్తం మునీన్లాలయన్తమ్ |
గణాన్పోషయన్తం మృదూక్తీర్వదన్తం
గుహం చైకదన్తం కరేణ స్పృశంతమ్ || ౯ ||

మహాదేవమన్తర్భజేఽహం భజేఽహం
సదా పార్వతీశం భజేఽహం భజేఽహమ్ |
సదానందరూపం భజేఽహం భజేఽహం
చిదానందరూపం భజేఽహం భజేఽహమ్ || ౧౦ ||

భుజంగప్రయాతస్తవం సాంబమూర్తే-
రిమం ధ్యానగమ్యం తదేకాగ్రచిత్తః
పఠేద్యస్సుభక్తస్సమర్థః కృతార్థః
సదా తస్య సాక్షాత్ప్రసన్నశ్శివస్స్యాత్ || ౧౧ ||

ఇతి శ్రీ శంకరభగవత్పాద విరచితం శ్రీ సాంబసదాశివభుజంగప్రయాత స్తోత్రం ||IMG_20160803_081822_140 (1)

ద్వాదశార్యా సూర్య స్తుతి

ఉద్యన్నద్యవివస్వానారోహన్నుత్తరాం దివం దేవః |
హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాఽఽశు నాశయతు || ౧ ||

నిమిషార్ధేనైకేన ద్వే చ శతే ద్వే సహస్రే ద్వే |
క్రమమాణ యోజనానాం నమోఽస్తు తే నళిననాథాయ || ౨ ||

కర్మ-జ్ఞాన-ఖ-దశకం మనశ్చ జీవ ఇతి విశ్వసర్గాయ |
ద్వాదశధా యో విచరతి స ద్వాదశమూర్తిరస్తు మోదాయ || ౩ ||

త్వం హి యజూ ఋక్ సామః త్వమాగమస్త్వం వషట్కారః |
త్వం విశ్వం త్వం హంసః త్వం భానో పరమహంసశ్చ || ౪ ||

శివరూపాత్ జ్ఞానమహం త్వత్తో ముక్తిం జనార్దనాకారాత్ |
శిఖిరూపాదైశ్వర్యం త్వత్తశ్చారోగ్యమిచ్ఛామి || ౫ ||

త్వచి దోషా దృశి దోషాః హృది దోషా యేఽఖిలేంద్రియజదోషాః |
తాన్ పూషా హతదోషః కించిద్ రోషాగ్నినా దహతు || ౬ ||

ధర్మార్థకామమోక్షప్రతిరోధానుగ్రతాపవేగకరాన్ |
బందీకృతేంద్రియగణాన్ గదాన్ విఖండయతు చండాంశుః || ౭ ||

యేన వినేదం తిమిరం జగదేత్య గ్రసతి చరమచరమఖిలం |
ధృతబోధం తం నళినీభర్తారం హర్తారమాపదామీడే || ౮ ||

యస్య సహస్రాభీశోరభీశు లేశో హిమాంశుబింబగతః |
భాసయతి నక్తమఖిలం భేదయతు విపద్గణానరుణః || ౯ ||

తిమిరమివ నేత్రతిమిరం పటలమివాఽశేషరోగపటలం నః |
కాశమివాధినికాయం కాలపితా రోగయుక్తతాం హరతాత్ || ౧౦ ||

వాతాశ్మరీగదార్శస్త్వగ్దోషమహోదరప్రమేహాంశ్చ |
గ్రహణీభగంధరాఖ్యా మహతీస్త్వం మే రుజో హంసి || ౧౧ ||

త్వం మాతా త్వం శరణం త్వం ధాతా త్వం ధనం త్వమాచార్యః |
త్వం త్రాతా త్వం హర్తా విపదామర్క ప్రసీద మమ భానో || ౧౨ ||

ఇత్యార్యాద్వాదశకం సాంబస్య పురో నభఃస్థలాత్పతితం |
పఠతాం భాగ్యసమృద్ధిః సమస్తరోగక్షయశ్చ స్యాత్ || ౧౩ ||

రేపు అనగా 3/12/2017 మార్గశిర పౌర్ణమి – దత్తాత్రేయ జయంతి

 

అత్రిమహర్షి భార్య అనసూయాదేవి. తన పాతివ్రత్య మాహాత్మ్యం చేత ఆ మాట బ్రహ్మవిష్ణుమహేశ్వరులను శిశువులుగా చేసి ఆడించింది, పాలిచ్చింది. ముగ్గురుమూర్తులూ ఆ దంపతులకు కొడుకులయ్యారు.త్రిమూర్తుల సమిష్టిరూపంగా అత్రి,అనసూయల బిడ్డడైన శ్రీదత్తాత్రేయుడు అనాదిగా హైందవ జాతీయుల పూజలందుకుంటున్నాడు. విష్ణువు దత్తాత్రేయుడని శివుడే దుర్వాస మహర్షి అని, బ్రహ్మదేవుడు చంద్రుడనీ భావించడం కూడా సనాతన సంప్రదాయం. శ్రీ దత్తాత్రేయుణ్ణి పూజించడం త్రిమూర్తులను పూజించడమే. తెల్లవారు ఝామున స్నానం చేసి సంధ్యావందనాది నిత్యకృత్యాలను ఆచరించిన తరువాత శ్రీ దత్తాత్రేయుడిని షోడశోపచారాలలో అర్చించడం సంప్రదాయం.
పవిత్ర నదులలో ఈ రోజున స్నానం చేసి ఆతరిని అనసూయను శ్రీదత్తాత్రేయుడిని పూజించడం విశేష వ్రాత. శ్రీ దత్తాత్రేయుని చెంత నిలబడి ఉండే గోమాత సకల చరాచర సృష్టికి ప్రతీక. ఆయనను పరివేష్టించి ఉండే శునక చతుష్టం – నాలుగు కుక్కలు – నాలుగు వేదాలకు ప్రతిరూపాలు. శునకం కాలభైరవుడు.

శ్రీ  దత్తాత్రేయ స్తోత్రం

జటాధరం పాండురంగం   శూలహస్తం కృపానిధిం |
సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే ||

జగదుత్పత్తికర్త్రే చ స్థితిసంహారహేతవే |
భవపాశవిముక్తాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧ ||

జరాజన్మవినాశాయ దేహశుద్ధికరాయ చ |
దిగంబరదయామూర్తే దత్తాత్రేయ నమోఽస్తుతే || ౨ ||

కర్పూరకాంతిదేహాయ బ్రహ్మమూర్తిధరాయ చ |
వేదశాస్త్రపరిజ్ఞాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౩ ||

హ్రస్వదీర్ఘకృశస్థూలనామగోత్రవివర్జిత |
పంచభూతైకదీప్తాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౪ ||

యజ్ఞభోక్తే చ యజ్ఞాయ యజ్ఞరూపధరాయ చ |
యజ్ఞప్రియాయ సిద్ధాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౫ ||

ఆదౌ బ్రహ్మా మధ్యే విష్ణుః అంతే దేవః సదాశివః |
మూర్తిత్రయస్వరూపాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౬ ||

భోగాలయాయ భోగాయ యోగయోగ్యాయ ధారిణే |
జితేంద్రియజితజ్ఞాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౭ ||

దిగంబరాయ దివ్యాయ దివ్యరూపధరాయ చ |
సదోదితపరబ్రహ్మ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౮ ||

జంబుద్వీపే మహాక్షేత్రే మాతాపురనివాసినే |
జయమానసతాం దేవ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౯ ||

భిక్షాటనం గృహే గ్రామే పాత్రం హేమమయం కరే |
నానాస్వాదమయీ భిక్షా దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౦ ||
బ్రహ్మజ్ఞానమయీ ముద్రా వస్త్రే చాకాశభూతలే |
ప్రజ్ఞానఘనబోధాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౧ ||
అవధూతసదానందపరబ్రహ్మస్వరూపిణే |
విదేహదేహరూపాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౨ ||

సత్యరూపసదాచారసత్యధర్మపరాయణ |
సత్యాశ్రయపరోక్షాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౩ ||

శూలహస్తగదాపాణే వనమాలాసుకంధర |
యజ్ఞసూత్రధరబ్రహ్మన్ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౪ ||

క్షరాక్షరస్వరూపాయ పరాత్పరతరాయ చ |
దత్తముక్తిపరస్తోత్ర దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౫ ||
దత్త విద్యాఢ్యలక్ష్మీశ దత్త స్వాత్మస్వరూపిణే |
గుణనిర్గుణరూపాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౬ ||

శత్రునాశకరం స్తోత్రం జ్ఞానవిజ్ఞానదాయకమ్ |
సర్వపాపం శమం యాతి దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౭ ||

ఇదం స్తోత్రం మహద్దివ్యం దత్తప్రత్యక్షకారకమ్ |
దత్తాత్రేయప్రసాదాచ్చ నారదేన ప్రకీర్తితమ్ || ౧౮ ||

2017-12-02-19-42-54-284