గృహాన్ని ఎక్కడ ఎలా నిర్మించుకోవాలి..?

‘గృహమే కదా స్వర్గసీమ’ అన్నారు పెద్దలు. జీవితాంతం నివసించడానికి కావాల్సిన గృహాన్ని నిర్మించుకోవడంలో చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. అయితే గ్రామాల్లోగానీ, పట్టణాల్లో, నగరాల్లో నిర్మించుకునే గృహం ఎలా ఉండాలో వాస్తుశాస్త్రం చెబుతుంది. నిజానికి గ్రామంలోగానీ, పట్టణాల్లో గానీ నైరుతి మూల ధనవంతులు, అధికారవంతులు నివసించడం, ఆగ్నేయ మూలలో చిన్న జీవితాలను గడిపే వారు వుండటం అనేక ప్రాంతాల్లో మీరు గమనించవచ్చు. ఊరికి ఆగ్నేయంలో శాస్త్రసమ్మతంగా గృహము నిర్మించిన ఐశ్వర్యవంతులుగా వుందురేగాని.. నైరుతి మూల గలవారిపై పెత్తనం చేయుట కష్టతరము. ఇటీవల పట్టణాల వైశాల్యం పెరిగిపోవటం వలన, పట్టణానికి ఎక్కడ, ఏ మూలో గమనించి చెప్పడం కష్టతరమే. అందుకని పట్టణవాసులు వారు గృహము నిర్మించు ప్రాంతాన్ని మాత్రం పరిగణనలోకి తీసుకోవాలి. మరో ముఖ్యవిషయం.. ఊరికి ఈశాన్యం ఎత్తైన కొండలుండిగాని, ఊరికి ఈశాన్యం తెగిపోవటం వలన గాని, ఈశాన్యం భ్రస్టు పట్టిన యెడల ఆ ఊరికి నైరుతి ఉచ్ఛము అవుతుంది. ఇటువంటి ఊళ్లలో కొత్తగా గృహము నిర్మించదలుచుకొన్నచో మొత్తం ఊరికి దక్షిణ, పశ్చిమ భాగాల వైపు ఏదైతే ప్రధాన వీధిచే గాని కాలువచేగాని వేరు చేయబడి వుంటుందో ఆ భాగం ఊరికి ఉచ్ఛం అని గ్రహించండి. అంటే మొత్తం ఊరిని వదిలి, పూరిని వేరు చేసిన కాలువకు, ప్రధాన వీధికి రెండవ వైపు (ఊరి వైపు కాకుండా) గృహాన్ని నిర్మించుకోవాలి. అయితే ఈ ప్రాంతం కూడా దక్షిణ, పశ్చిమాలు వాలుగా పల్లంగా వుండకూడదు. ఆ విధంగా వున్న వాయవ్య ఈశాన్యాలలో తూర్పు, ఉత్తరాలు పల్లంగా వున్న స్థలాలు రాణిస్తాయి.

ఈశాన్యం భ్రస్టు అయిన గ్రామంలో కొత్తగా గృహము నిర్మించదలచుకొన్న ఒక మంచి వాస్తు శాస్త్రవేత్త సలహాలను పొందడం ఉత్తమమైన పద్ధతి. ….Chinta Gopi Sarma Siddhanthi…2017-11-26-09-00-52-579