Monthly Archives: November 2017

గృహములోకి సూర్యకిరణాలు పడితే మంచిదా..?

 

గృహము నిర్మిస్తే మంచిగా గాలి, వెలుతురు వచ్చే విధంగా నిర్మించుకోవడం ఆరోగ్యకరం. గాలి వెలుతురు రావడానికి ఏర్పాటు చేసే కిటికీలు చిన్నవిగా వుంచడం, ఆ కిటికీలకు వెలుతురు రాకుండా కర్ర లేదా పేడ్ అద్దాలు బిగిచిండడం, కర్టెన్లు వేయడం దోమలు రాకుండా మెషన్ కిటికీలకు ఏర్పాటుచేయడం ఇన్ని ఏర్పాట్లు చూస్తే అసలు కిటికీలు ఎందుకో అనిపిస్తుంది. బయటి నుంచి చక్కటి గాలి వెలుతురు వచ్చే విధంగా కిటికీలు ఏర్పాటు చేసుకోవడంలో వాస్తుశాస్ర్తం చాలా సహకరిస్తుంది. ఈ మధ్య కాలంలో నైరుతి గదికి కిటికీలు వద్దని కొందరు శాస్ర్తవేత్తలు తెలియక చెబుతున్నారు. నైరుతి తెరపిగా వుండకూడదేగాని కిటికీలు వుండటంలో తప్పులేదు. తూర్పు, ఉత్తరాలలో పెద్దవిగా వుండే ఫ్రెంచ్ విండోస్ దక్షిణ పశ్చిమాలలో సాధారణ కిటికీలు పెట్టుకోవడం వాస్తుకు మంచిదే.

ఇంటిలోకి సూర్యకిరాణాలు వస్తే మంచిదని కొందరు తూర్పువైపు విపరీతమైన పెద్ద కిటికీలు ఏర్పాటు చేస్తున్నారు. ఏదైనా అతి పనికి రాదు. కిటికీ ఎలా వుండాలో అలా వుండి సమగ్రస్వరూపం కలిగి వుండాలేగాని రూపం చెడి వికృతంగా తయారు కాకూడదు.

ఇంటిలోకి సూక్యకిరాణాలు వస్తే మంచిదే కాని రాకపోయినా తప్పేమిలేదు. కిరాణాల కన్నా వెలుతురు రావడమే మంచిది….. Gopi Sarma Siddhanthi ..2017-11-30-08-54-19-558

ప్రశ్న జ్యోతిష్యం – ప్రశ్న ఫలించు యోగాలు

 

మానవుడి మనసే ప్రశ్నల పుట్ట. నిత్యం ఎన్నో ప్రశ్నలు వేదిస్తాయి. ఉద్యోగం వస్తుందా? పెళ్లవుతుందా? సమస్యలు తొలగిపోతాయా? ఆరోగ్యం ఎప్పుడు కుదుట పడుతుంది? వంటి ప్రశ్నలెన్నో మనసుల్ని తొలుస్తుంటాయి. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పేదెవరు? ‘ప్రశ్న’ లేనిదే జవాబు లేదు. కానీ, జవాబు లేని ప్రశ్నలు ఎన్నో ఉంటాయి. వీటికి సమాధానం చెప్పేందుకు ఉద్ధేశించిందే ‘ప్రశ్న జ్యోతిష్యం’. జ్యోతిష్య శాస్త్రానికి అనుబంధంగా ఈ ‘ప్రశ్న’ విధానాన్ని మన మహర్షులు ఎప్పుడొ రూపొందించారు.

జ్యోతిష్యశాస్త్రం సిద్ధాంత, హోరా, సంహిత, ప్రశ్న, శకునం అను పంచస్కందాత్మకంగా వివరించబడింది. ఒక వ్యక్తి ప్రశ్నించు సమయానికి గల గ్రహముల స్ధితి ఆ ప్రశ్న గురించిన వివరాలు, ఆ ప్రశ్న భవిష్యత్తును తెలుపగలవు అనే ప్రాతిపదికతో ప్రశ్న శాస్త్రం వృద్ధిచెందింది. జాతకంలోని ఒక అంశానికి సంబంధించిన సూక్ష్మ కాల నిర్ణయము ప్రశ్న ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. రెండు అంశాలలో దేనిని ఎన్నుకోవాలి అనే సంశయం కలిగినప్పుడు ప్రశ్న ఉపయోగ పడుతుంది. ప్రశ్నించని వానికి ఫలాదేశం చెప్పకూడదు. ప్రశ్నకు ప్రశ్నాశాస్త్రం ద్వారానే జవాబు చెప్పగలరు.

జాతకుడు ఈ జన్మలో చేసిన పుణ్య పాపముల ప్రభావాలు పరిశీలించవలసిన అవసరం ఉంటుంది. జాతకం గత జన్మ కర్మ ఫలాలను నిర్దేశించేదైతే ప్రశ్న జ్యోతిష్యం ఈ క్షణం వరకు మనం చేసిన పుణ్య పాపాలను కూడా పరిగణలోకి తీసుకొని ఫలిత నిర్దేశం చేస్తుంది. జాతకం అనుకూలంగా ఉండి ,ప్రశ్న వ్యతిరేకంగా వస్తే ఈ జన్మలో ఎక్కువ పాపాలు చేశాడని, జాతకం వ్యతిరేకంగా ఉండి ప్రశ్న అనుకూలంగా వస్తే ఈ జన్మలో పుణ్యాలు ఎక్కువగా చేసినట్లు గుర్తించమన్నాడు.రెండు సమానంగా వస్తే పుణ్య పాపాలు సమానంగానే చేసినట్లు గుర్తించమన్నాడు. దీనిని బట్టి జాతకం పరీక్షించే ప్రతి సందర్భంలోనూ ప్రతి అంశానికి ప్రత్యేకంగా ప్రశ్నను కూడా పరీక్షించి చూడాల్సిందే.

జాతకుడు జాతక సహకారంతో పాటు, ప్రశ్నా శాస్త్రాన్ని కూడా పరిశీలించి, పరిశీలన చేయటానికి అవకాశం లేని తక్కిన అంశాలను తపశ్శక్తితో గమనించే శక్తిని సంపాదించి ప్రశ్న శాస్త్రం ద్వారా దాన్ని నిర్ధారించుకొని ఆ తరువాత ఫలితాన్ని చెప్పినట్లయితే ఎక్కువశాతం వాస్తవానికి దగ్గరగా, జాతకుడికి ఉపయుక్తమయ్యే సలహాలను జాతకుడు ఇవ్వగలడు.

చంద్రుడు లగ్నంలో శని కేంద్రంలో ఇంకా బుదుడు అస్తంగత్వం చెందిన లేక లగ్నములోని చంద్రునిపై బుధ,కుజుల దృష్టి ఉన్న జాతకుడు ప్రశ్నించు విధానం మంచిది కాదు అని అర్ధం. అనగా జాతకుని నిజాయితీలో లోపమును సూచించును. జ్యోతిష్యున్ని పరీక్షించటానికి ప్రశ్న అడిగే సూచనలు ఉన్నాయి.

ప్రశ్నించకూడని సమయాలు
నక్షత్రాలు: భరణి, కృత్తిక, ఆరుద్ర, ఆశ్లేష, మఖ, విశాఖ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాడ, పూర్వాభాద్ర, ఇంకా గండాంత నక్షత్రాలు (ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి చివరి పాదాలు, అశ్వని, మఖ, మూల మొదటి పాదాలు)
తిధులు: అష్టమి, విదియ, సప్తమి, ద్వాదశి, చవితి, నవమి, చతుర్దశి ఇంకా అమావాస్య.
యోగములు: వ్యతీపాత, వైదృతి యోగాలు.
కరణము: శకుని, చతుష్పాద, నాగ, కింస్తుఘ్న కరణాలు.
వారములు: మంగళ, శనివారములు.
సూర్య, చంద్ర గ్రహణముల 3 రోజులు. గుళిక లగ్నంలో ఉన్నప్పుడు, లగ్నంపై పాపగ్రహాల దృష్టి ఉన్నప్పుడు, సంక్రమణ జరిగిన రోజులలో జాతకుడు జ్యోతిష్యుడిని ప్రశ్నించరాదు. పై సమయాలు జాతకుడి కంటే జ్యోతిష్యునికే గుర్తించే అవకాశాలు ఎక్కువ కాబట్టి జ్యోతిష్కుడు ఆ సమయాలలో ప్రశ్న ఫలితం చెప్పరాదు.

ప్రశ్న ఫలించు యోగాలు
పృష్టోదయ రాశులు: మేషం, వృషభం, కర్కాటకం, ధనస్సు, మకరం.
శీర్షోదయ రాశులు: మిధునం, సింహం,కన్య, తుల, వృశ్చికం, కుంభ.
ఉభయోదయ రాశులు: మీనం.
శీర్షోదయ రాశులు ప్రశ్న లగ్నమైతే శుభం, పృష్టోదయ రాశులు ప్రశ్న లగ్నమైతే ప్రశ్న ఫలించదు. ఉభయోదయ రాశులు ప్రశ్న లగ్నమైతే మధ్యమ ఫలితాన్ని ఇస్తాయి.

చరరాశులు ప్రశ్న లగ్నమైతే ప్రస్తుత పరిస్ధితులలో మార్పు కనబడుతుంది. స్దిర రాశులు ప్రశ్న లగ్నమైతే మార్పు కనబడదు. ద్విస్వభావ రాశులు ప్రశ్న లగ్నమైతే ఆలస్యం, కష్టంతో ఫలితం కనిపిస్తుంది.

లగ్నాధిపతికి,కారక భావాదిపతికి సంబంధం ఉంటే ప్రశ్న ఫలిస్తుంది. లగ్నాధిపతి చంద్రుడు శుభ భావాలలో ఉండాలి. కేంద్రాలలో శుభగ్రహాలు, త్రిషడాయులలో పాప గ్రహాలు ఉండాలి. చంద్రుడు ఉపచయాలలో ఉంటే మంచిది. ప్రశ్నాచక్ర లగ్నం, జన్మ లగ్నం ఒకదానికొకటి ద్విద్వాదశాలు, షష్టాకాలలో ఉండరాదు.

ప్రశ్న చక్రంలో వక్రగ్రహం ఏ భావంలో కలదో ఆభావానికి సంబందించిన అంశములలో అడ్డంకులు కలుగుతాయి. వక్రించిన శుభగ్రహాలు 6, 8, 12 భావాలకు ఆదిపతులైతే శుభపలితం రావటం కష్టం. పాపగ్రహాలు వక్రించి 6,8,12 భావాలకు అధిపతులైతే శుభ ఫలితం రాకపోగా అడ్డంకులు ఎదురవుతాయి….Chinta Gopi Sarma siddhanthi2017-11-29-04-12-51-653

శకునాలు – వాటి ఫలితాలు

 

మానవ ఆచారవ్యవహారాల విషయంలో, శకునాల పాత్ర ఎక్కువగా కనిపిస్తూ వుంటుంది. అయితే శకునాలు రెండు రకాలుగా భావించవచ్చు. శుభ శకునాలు, అశుభ శకునాలు. ఏ పని ప్రారంభించినా శుభ శకునం చూసుకొని ప్రారంభించాలి. అశుభ శకునం ఎదురైతే ఆ పని అసంపూర్ణంగా ముగుస్తుందని పూర్వ కాలం నుంచి ఆధునిక కాలం వరకు నమ్మకం ఉంది.

మంచి శకునం ఎదురు రావడం వలన, తలపెట్టినకార్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుంద పురాతన కాలం నుంచి ఉన్న విశ్వాసం ఇప్పటికీ కొనసాగుతోంది. శకునం విషయంలో చాలామంది తమ పెద్దల మార్గాన్నే అనుసరిస్తూ ఉంటారు. వ్యాపార వ్యవహారాల నిమిత్తమైనా.. శుభకార్యాల నిమిత్తమైనా బయలుదేరుతూ వున్నప్పుడు మంచి శకునం చూసుకుంటూ ఉండాల్సిందే. మంగళప్రదమైన ధ్వనులు … శుభప్రదమైన వస్తువులు ఎదురైనప్పుడు మంచి శకునాలుగా భావించి అడుగుబయటికి పెట్టాలి.

అలాగే కొన్ని శకునాలు కార్యహానిని కలిగించేవిగా చెప్పబడుతున్నాయి. ఇంట్లో నుంచి అడుగు బయటికి పెడుతూ వుండగా ఎక్కడి నుంచైనా ఒక్కసారిగా ఏడుపులు వినిపించినా, ఏదో ఒక కారణంగా ఎవరైనా ఏడుస్తూ ఎదురుగా పరిగెత్తుకు వచ్చినా అది కార్య హానిని కలిగించే శకునంగా చెప్పబడుతోంది. అందుకే అలాంటి శకునం ఎదురైనప్పుడు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని శాస్త్రం చెప్పబడుతోంది.

శుభ శకునాలు
పెళ్ళి ఊరేగింపు, మంగళవాయిద్యములు, ఇద్దరు బ్రాహ్మణులు, దండధరుడగు శూద్రుడు, కన్య, ముతైదువు, పండ్లు, పువ్వులు, ఛత్రచామరములు, ఏనుగు, గుఱ్ఱము, పూర్ణకుంభము, చెఱుకు, పాలు, అన్నము, పెరుగు, ఆవు, బియ్యము, కల్లుకుండ, మాంసము, పొగలేని నిప్పు, తేనె, చలువ వస్త్రాలు, అక్షతలు, వీణ, మృదంగం, శంఖం, నల్లకోతి, భ్రమరము, తెల్లని వస్తువులు, కుక్క చెవి విదల్చుట, వధూవరులు, ఘంటానాదం, జయశబ్దము, మంగళ వస్తువులు, ఎదురుగా మృదువైన శీతల వాయువులు వీచుట లేదా వెనుక నుంచి ప్రయాణానికి అనువైన గాలులు వీచుట, తెల్లని వృషభము, అద్దం మొదలైనవి ఎదురుపడిన శుభప్రదం.

పశుపక్ష్యాదుల్లో నెమలి, కోడి, చిలుక, కొంగ, కుందేలు, నక్క, గ్రద్ద, ఆవు, జింక, ఉడుత, చిరుత వంటివి ఎడమ నుంచి కుడి వైపుగా వెళ్ళాయంటే వీటన్నిటిని శుభ శకునాలుగా గుర్తించవచ్చు.

అశుభ శకునాలు
ఏడుపు వినుట, అకాల వర్షము, ముక్కు చీదుట, బల్లిపడుట, వితంతువులు, జుట్టు విరబోసుకున్నవారు, జుట్టులేనివారు, ఒకే తుమ్ము, ఊక, కలహము, చెడుమాట, ముగ్గురు వైశ్యులు, జంటశూద్రులు, కషాయబట్టలు కట్టినవారు, పాము, కొత్తకుండ, నూనె, కట్టెలమోపు, ముష్టివాడు, కుంటికుక్క, ముక్కులేనివాడు, గుడ్డివాడు, రోగి, కుంటివాడు, రజస్వల, గర్భిణీస్ర్తీ, ఉప్పు, బొగ్గులు, రాళ్ళు, ఆమేధ్యం, నువ్వులు, మినుములు, గొఱ్ఱెలు, నపుంసకులు, పిల్లి, పంది, దూది, మజ్జిగ, బూడిద, కురూపి, చెడు జంతువులు, ఆయుధమును ధరించినవాడు, విరోధి, వెళ్ళవద్దని కోరుట, భోజనము చేయమని అడుగుట, సిద్ధవస్తువులు, జారుట, దెబ్బతగులుట, తొట్రుపడుట, మనసు కీడు శంకించుట, ఆరోగ్యము లేకుండుట, గుడ్లగూబ అరచుట.. వంటి పరిణామాలు ఎదురుపడినా ఇవన్నీ అశుభాలే.

అశుభ శకునాలు ఎదురైన వెంటనే ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని 12 పర్యాయాలు నీళ్ళు పుకిలించి ఊయవలెను. తలపై నీరు చల్లుకొని.. కళ్ళు నీళ్ళతో తుడుచుకొని కూర్చుని కాసిన్ని నీళ్లు తాగి ఇష్టదైవంను ప్రార్థించి, తర్వాత మరొక శుభ శకునమును చూసుకొని ప్రయాణం చేయవలెను. ప్రయాణాలకు బయలుదేరునప్పుడు ‘ఎక్కడికి?’ అని గానీ, ‘ఎప్పుడు వస్తావు?’ అని గానీ, ‘నేనూ రానా?’ అని గానీ ఎవరూ అడుగరాదు. ప్రయాణమై వెళ్ళిన వెంటనే ఇల్లు కడుగుట, ఇల్లాలు తలస్నానం చేయుట దరిద్రానికి కారణాలు. అందుకే ఇలాంటి విషయాల్లో తగిన రీతిలో ఉండటమే మంచిది….. Chinta Gopi sarma Siddhanthi..2017-11-27-22-21-23-980

శ్రీ శివరక్షాస్తోత్రం

అస్య శ్రీ శివరక్షాస్తోత్రమంత్రస్య యాజ్ఞవల్క్య ఋషిః | శ్రీ సదాశివో దేవతా | అనుష్టుప్ ఛందః | శ్రీ సదాశివప్రీత్యర్థం శివరక్షాస్తోత్రజపే వినియోగః ||

చరితం దేవదేవస్య మహాదేవస్య పావనమ్ |
అపారం పరమోదారం చతుర్వర్గస్య సాధనమ్ || ౧ ||

గౌరీవినాయకోపేతం పంచవక్త్రం త్రినేత్రకమ్ |
శివం ధ్యాత్వా దశభుజం శివరక్షాం పఠేన్నరః || ౨ ||

గంగాధరః శిరః పాతు భాలం అర్ధేన్దుశేఖరః |
నయనే మదనధ్వంసీ కర్ణో సర్పవిభూషణః || ౩ ||

ఘ్రాణం పాతు పురారాతిః ముఖం పాతు జగత్పతిః |
జిహ్వాం వాగీశ్వరః పాతు కంధరం శితికంధరః || ౪ ||

శ్రీకంఠః పాతు మే కంఠం స్కంధౌ విశ్వధురన్ధరః |
భుజౌ భూభారసంహర్తా కరౌ పాతు పినాకధృక్ || ౫ ||

హృదయం శంకరః పాతు జఠరం గిరిజాపతిః |
నాభిం మృత్యుంజయః పాతు కటీ వ్యాఘ్రాజినాంబరః || ౬ ||

సక్థినీ పాతు దీనార్తశరణాగతవత్సలః |
ఊరూ మహేశ్వరః పాతు జానునీ జగదీశ్వరః || ౭ ||

జంఘే పాతు జగత్కర్తా గుల్ఫౌ పాతు గణాధిపః |
చరణౌ కరుణాసింధుః సర్వాంగాని సదాశివః || ౮ ||

ఏతాం శివబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్ |
స భుక్త్వా సకలాన్కామాన్ శివసాయుజ్యమాప్నుయాత్ || ౯ ||

గ్రహభూతపిశాచాద్యాః త్రైలోక్యే విచరంతి యే |
దూరాదాశు పలాయంతే శివనామాభిరక్షణాత్ || ౧౦ ||

అభయంకరనామేదం కవచం పార్వతీపతేః |
భక్త్యా బిభర్తి యః కంఠే తస్య వశ్యం జగత్త్రయమ్ || ౧౧ ||

ఇమాం నారాయణః స్వప్నే శివరక్షాం యథాఽదిశత్ |
ప్రాతరుత్థాయ యోగీంద్రో యాజ్ఞవల్క్యః తథాలిఖత్ || ౧౨ ||

ఇతి శ్రీయాజ్ఞవల్క్యప్రోక్తం శివరక్షాస్తోత్రం సంపూర్ణం ||

గృహాన్ని ఎక్కడ ఎలా నిర్మించుకోవాలి..?

‘గృహమే కదా స్వర్గసీమ’ అన్నారు పెద్దలు. జీవితాంతం నివసించడానికి కావాల్సిన గృహాన్ని నిర్మించుకోవడంలో చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. అయితే గ్రామాల్లోగానీ, పట్టణాల్లో, నగరాల్లో నిర్మించుకునే గృహం ఎలా ఉండాలో వాస్తుశాస్త్రం చెబుతుంది. నిజానికి గ్రామంలోగానీ, పట్టణాల్లో గానీ నైరుతి మూల ధనవంతులు, అధికారవంతులు నివసించడం, ఆగ్నేయ మూలలో చిన్న జీవితాలను గడిపే వారు వుండటం అనేక ప్రాంతాల్లో మీరు గమనించవచ్చు. ఊరికి ఆగ్నేయంలో శాస్త్రసమ్మతంగా గృహము నిర్మించిన ఐశ్వర్యవంతులుగా వుందురేగాని.. నైరుతి మూల గలవారిపై పెత్తనం చేయుట కష్టతరము. ఇటీవల పట్టణాల వైశాల్యం పెరిగిపోవటం వలన, పట్టణానికి ఎక్కడ, ఏ మూలో గమనించి చెప్పడం కష్టతరమే. అందుకని పట్టణవాసులు వారు గృహము నిర్మించు ప్రాంతాన్ని మాత్రం పరిగణనలోకి తీసుకోవాలి. మరో ముఖ్యవిషయం.. ఊరికి ఈశాన్యం ఎత్తైన కొండలుండిగాని, ఊరికి ఈశాన్యం తెగిపోవటం వలన గాని, ఈశాన్యం భ్రస్టు పట్టిన యెడల ఆ ఊరికి నైరుతి ఉచ్ఛము అవుతుంది. ఇటువంటి ఊళ్లలో కొత్తగా గృహము నిర్మించదలుచుకొన్నచో మొత్తం ఊరికి దక్షిణ, పశ్చిమ భాగాల వైపు ఏదైతే ప్రధాన వీధిచే గాని కాలువచేగాని వేరు చేయబడి వుంటుందో ఆ భాగం ఊరికి ఉచ్ఛం అని గ్రహించండి. అంటే మొత్తం ఊరిని వదిలి, పూరిని వేరు చేసిన కాలువకు, ప్రధాన వీధికి రెండవ వైపు (ఊరి వైపు కాకుండా) గృహాన్ని నిర్మించుకోవాలి. అయితే ఈ ప్రాంతం కూడా దక్షిణ, పశ్చిమాలు వాలుగా పల్లంగా వుండకూడదు. ఆ విధంగా వున్న వాయవ్య ఈశాన్యాలలో తూర్పు, ఉత్తరాలు పల్లంగా వున్న స్థలాలు రాణిస్తాయి.

ఈశాన్యం భ్రస్టు అయిన గ్రామంలో కొత్తగా గృహము నిర్మించదలచుకొన్న ఒక మంచి వాస్తు శాస్త్రవేత్త సలహాలను పొందడం ఉత్తమమైన పద్ధతి. ….Chinta Gopi Sarma Siddhanthi…2017-11-26-09-00-52-579

ఏ రోజు ఏ అభరణాలు ధరిస్తే శుభం..?

 

మహిళలు నిత్యం అభరణాలు ధరిస్తారు. సందర్భాన్ని బట్టి అవి మారుతూ ఉంటాయి. అయితే గ్రహాలను అనుసరించి ఆభరణాలు ధరించాల్సి ఉంటుంది. ఏ రోజు ఏ రకమైన నగలు ధరిస్తే మంచిదో తెలుసుకోవడం ముఖ్యం.

వారంలో రోజుకో గ్రహాధిపతి ఉంటాడు. ఆదివారానికి సూర్యుడు అధిపతి అయితే, శుక్రవారానికి శుక్రుడు అన్నట్టు.. ఆయా వారాలన్ని బట్టి ఆ రోజుకి ఉండే గ్రహాదిపతిని అనుసరించి ఏ నగలు ధరించాలో తెలుసుకోవాలి. నిత్యం నవగ్రహాలను అనుసరించి ఆభరణాలు ధరించడం ద్వారా శుభఫలితాలుంటాయి.

అయితే బంగారంతో పొదిగించిన ఆభరణాలు లేకపోయినా.. తమ తమ స్థోమతకు తగినట్లు ఇప్పుడు దుకాణాల్లో అమ్మబడే ఆభరణాలతో ప్రతిరోజూ అలంకరణ చేసుకోవడం మంచిది.

ఇక ఏ వారంలో ఎలాంటి ఆభరణాలు ధరించాలో తెలుసుకుందాం.

* ఆదివారం (సూర్యగ్రహానికి ప్రీతికరమైన రోజు) కెంపులతో చేసిన నగలు.. చెవిపోగులు, హారాలు మొదలగునవి ధరించడం శుభప్రదం. దీనిద్వారా నేత్ర సంబంధిత వ్యాధులు, శరీర తేజస్సు, ప్రకాశవంతం పొందవచ్చును.

* సోమవారం (చంద్రగ్రహానికి ప్రీతికరమైన రోజు) ముత్యాలతో తయారు చేసిన ఆభరణాలు.. హారాలు, గాజులను వేసుకోవడం మంచిది. ముత్యాలతో తయారయ్యే గాజులను, చెవిపోగులను వాడటం ద్వారా మనశ్శాంతి, అనుకున్న కార్యములో విజయం చేకూరుతుంది.

* మంగళవారం (కుజ గ్రహానికి ప్రీతికరమైన రోజు) పగడాలతో చేసిన ఆభరణాలు.. దండలు, ఉంగరాలను వాడటం మంచిది. పగడాలతో తయారైన ఉంగరాలను, దండలను వాడటం ద్వారా కుటుంబ సంక్షేమం చేకూరటం, ఈతిబాధలు తొలగిపోవడం వంటి ఫలితాలుంటాయి.

* బుధవారం (బుధ హానికి ప్రీతికరమైన రోజు) పచ్చల పతకాలు, గాజులు మొదలగునవి వాడటం మంచిది. విద్యాకారకుడైన బుధునికి ప్రీతికరమైన ఈ రోజున విద్యార్థులు పచ్చని రంగుతో కూడిన ఉంగరాలు, స్త్రీలతే హారాలు వినియోగించడం మంచిది. దీంతో బుద్ధికుశలతలు పెరగడం, ధనలాభం, కార్యసిద్ధి చేకూరుతుంది.

* గురువారం బృహస్పతి (గురుభగవానుడు) కోసం పుష్యరాగముతో తయారైన చెవిపోగులు, ఉంగరాలు వంటి ఆభరణాలు ధరించడం మంచిది. దీంతో గురుగ్రహ ప్రభావంతో అవివాహితులకు కళ్యాణం జరగడం, వ్యాపారాభివృద్ధి, కార్యసిద్ధివంటి ఫలితాలుంటాయి.

* శుక్రవారం శుక్రుని (శుక్రగ్రహం) కోసం వజ్రాల హారాలు, ముక్కుపుడక వాడటం ద్వారా స్త్రీలకు సౌభాగ్యం, ఆర్థిక సమస్యలు తొలగిపోవడం, పదోన్నతులు, అనుకున్న కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి. లక్ష్మిదేవి అనుగ్రహం కూడా పొందినవారవుతారు.

* శనివారం (శనిగ్రహం) శనికోసం నీలమణి, మణిహారాలు వంటి ఆభరణాలు ధరించడం మంచిది. దీనిద్వారా శనిగ్రహ ప్రభావంతో తలెత్తే సమస్యలు కొంతవరకు సమసిపోతాయి. నీలమణితో తయారైన హారాలు చెవిపోగులు, ఉంగరాలు ధరించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది……..Chinta Gopi SaramaFB_IMG_1511321009351

ఆఫీసుకు లక్ష్మీకళ రావాలంటే..?

 

సాధారణంగా గృహానికి సంపూర్ణ వాస్తు ఉంటే సరిపోతుందనుకుంటారు. అయితే ఆఫీసుకు కూడా వాస్తు అవసరమన్న విషయం తెలుసుకోవాలి. ఉద్యోగులు పనిచేసే ఆఫీసులు లక్ష్మీకళతో కళకళలాడుతుండాలంటే కళ్లు చెదిరే విపరీతమైన లైట్లు, తళతళలాడే అత్యాధునిక విదేశీ ఫర్నిచర్ ఉండగానే సరిపోదు. ఆ ఆఫీసుల్లో వాస్తు శాస్త్ర ప్రకారం దిశాదిశలు, సరైన దిశలో పెట్టాల్సిన బరువైన వస్తువులు, తీసేయాల్సిన అనవసర వస్తువులు ఇలా చాలా చాలా ఉంటాయి. వీటన్నిటినీ సరిగా నిర్దేశించిన స్థలాల్లో వాస్తు ప్రకారం ఉంచితే ఆయా ఆఫీసులు బాగా అభివృద్ధి చెందుతాయి

వస్తువులు ఏ దిశగానైనా అమరిస్తే ఏమిటి? ఏ దిక్కుకైనా కూర్చుంటే ఏమిటి? అని అనుభవం ఉన్న వారు ప్రశ్నలు వేస్తుంటారు. వీటిని పట్టించుకోకూడదు. ఆఫీసు తూర్పుకేసి ఉంటే ఫ్లోరింగ్‌ పశ్చిమం నుంచి తూర్పుకేసి గానీ దక్షిణం నుంచి ఉత్తరానికి గానీ ఉండాలి. తూర్పువైపు తాకకుండా గోడకు తాకకుండా ఆగ్నేయంలో దక్షిణ దిక్కుకు ఆనుకొని ఆఫీసు బాసు కూర్చోవాలి. బాసు ఉత్తర దిక్కుకేసి కూర్చోవాలి. గల్లాపెట్టె లేక అలమారు తన ఎడం వైపు పెట్టుకోవాలి.

ఒకవేళ బాసు తూర్పున అదే దిక్కుకేసి కూర్చుంటే గల్లాపెట్టె లేక అలమారు కుడిచేతివైపు పెట్టుకోవాలి. ఈ దిక్కున ఎలాంటి రణగొణధ్వని ఉండకూడదు. ఆఫీసు విషయంలో వాస్తు పాటించినట్లయితే ఆఫీసు పనులు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులు సమర్థవంతంగా ఫలప్రదంగా పనిచేస్తారు. వారు ఆఫీసుకు ఉపయోగపడేవారని, భారం కారనీ రుజువు చేస్తారు. ఆఫీసుకు తగిన చోటు, ఆకృతి, ఏటవాలు తదితరమైనవి, ఆఫీసులో వివిధ విభాగాలు, రిసెప్షన్‌ ఉన్న దిక్కులు వివిధ ఎలక్ట్రానిక్‌ పరికరాల అమరిక ఇలా ఎన్నో అంశాలను ఆఫీసుకు సంబంధించిన వాస్తు సూత్రాలు పరిగణనలోకి తీసుకుంటాయి. చక్కగా అలంకరించిన ప్రవేశం, సున్నితమైన సంగీతం వినిపిస్తూ ఉంటే కస్టమర్లను ఆకర్షిస్తుంది. ఇవి వాస్తుకంటే ప్రాధాన్యం ఉన్న విషయాలు.

ఇటీవల కూడా కార్పోరేట్ ఆఫీసులు, బ్యాంకులు ఇలాంటి మెళకువలను పాటిస్తున్నాయి. అవసరంలేని సామగ్రి అక్కర్లేని కుర్చీలు బల్లలు, అపరిశుభ్రమైన చీకటి, ఇరుకుగా ఉండే ప్రవేశం వ్యాపారానికి చెడు చేస్తాయి. కస్టమర్లు, స్నేహితులు, లాభాలు, అవసమైన వారు దూరమవుతారు. ఒక ఎక్వేరియం లేక ఫౌంటెన్‌ ఉంటే కస్టమర్లను అతిథులను శాంతపరుస్తుంది. ప్రధాన ద్వారం ఇరుకైన దానికంటే విశాలమైనదిగా ఉండడం మంచిది. బాగా నగిషీ చెక్కిన పాతకాలపు చెక్కతలుపు ఉంటే ఎంతో హుందాగా గౌరవప్రదంగా ఉంటుంది. స్థిరత్వాన్ని సూచిస్తుంది. వ్యాపారం మెరుగుపడుతుంది. పాతదైపోయి ఏవగింపుపుట్టించే తలుపు, అందులోనూ నాబ్‌ లేనిది, సరిగా తెరుచుకోనిది వెంటనే మరమ్మత్తులు చేయించాలి. ప్రవేశం వద్ద విండ్‌ చైమ్‌, వినాయకుడిని ఉంచితే సానుకూలమైన శక్తి పెంపొందుతుంది.

పనికి సంబంధించిన ఒత్తిడి తగ్గుతుంది. అడ్డంకులు జొరబడేవారి నుంచి విముక్తి కలుగుతుంది. ఒకసారి వచ్చిన కస్టమర్లు మళ్ళీమళ్ళీ వస్తారు. శబ్దాలు చేసే తలుపులు కిటికీలు ఉండకూడదు. ఒకవేళ అలాంటివి కంటపడితే వెంటనే తైలం వేసి శబ్దం చేయకుండా జాగ్రత్త తీసుకోండి. ఆఫీసులో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పండి. ఇది అత్యంత ప్రధానమైంది. సరైన వెలుతురు, తాజా పూలు, సుకుమారమైన రంగులు, అందమైన అలంకరణ, శబ్దం రానీయని ఫ్లోరింగ్‌, సన్నగా వినవచ్చే సంగీతం వినియోగించి ఆశించిన శాంత వాతావరణాన్ని సృష్టించండి. కంపెనీకి సంబంధించిన ఉత్పత్తులు, వాటి ఫోటోలు, లేక మీ సేవలను వివరించే బ్రోచర్లు లాబీలో ప్రదర్శించండి. ఫోకస్‌ ఉన్న లైట్ల వెలుగులో వీటిని ఉంచాలి.

రిసెప్షన్‌లోకి అడుగుపెట్టగానే కస్టమర్‌ వీటివైపు ఆకర్షితుడవ్వాలి. రిసెప్షన్‌ను ఈశాన్యం దిక్కుగా అమర్చండి. కానీ ఆఫీసులో ఈశాన్యం మూలను మాత్రం దేవతా విగ్రహానికి కేటాయించండి. ఏమీ లేకపోతే లైట్లతో పూలతో అలంకరించడండి. ఆఫీసు ఈశాన్యం మూల అతిథి గదులు ఉండకూడదు. అలా వున్నట్లయితే ప్రమాదకర పరిణామాలు తలెత్తుతాయి. నిజజీవితంలో ఉద్యోగ రంగంలో ఎదుగుదలను సంతోషాన్ని అడ్డుకుంటుంది. ఆఫీసు చైర్మన్‌ లేక నరల్‌ మేనేజర్‌ గది నైరుతిలోగానీ దక్షిణ భాగంలో గానీ ఉండాలి.

అతడు ఆఫీసు నైరుతి మూలన తూర్పుకేసి కూర్చోవడం మంచిది. బాస్‌ నైరుతి మూలన బరువైన సేఫ్టీ లార్‌ ఉంచడం మంచిది. ఇందులో ముఖ్యమైన పత్రాలు కంపెనీ స్థిరచిరాస్తులకు సంబంధించిన పత్రాలు ఉంచాలి. ఈ సేఫ్‌ను గోడలోనే అమర్చడం మంచిది. అలాగే ఇతరులు చూడవలసి ఫైళ్ళు ఉంచడానికి గదిలో వాయువ్య దిశగా కొంత జాగా వుంచండి. మధ్యస్థాయి సిబ్బందిని ఉత్తరాన కానీ తూర్పున గానీ కూర్చునే ఏర్పాటు చేయాలి. ఆఫీసులో కేంద్ర ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచేందుకు కృషిచేయాలి. ఈచోటును ఖాళీగా ఉంచి నేలపై పూల మోటిఫ్‌ను గానీ ఓ కళాకృతినిగానీ పెట్టండి. లేక ఓ దేవతావిగ్రాహాన్ని ఉంచండి. చోటు శుభ్రంగా ఉంటుంది.

నిప్పు లేక వేడిపుట్టించే పరికరాలను ఆగ్నేయం మూల వుంచాలి. జెనరేటర్లు, ఇన్వర్టర్లు, ఎలక్ట్రిక్‌ మీటర్‌, మెయిన్‌ కరెంటు స్విచ్చు, కంప్యూటర్‌ సర్వర్లు, ఆఫీసు టీ గది ఆగ్నేయం మూల నుంచాలి. ఎవ్వరూ దూలం కింద కూర్చోకుండా జాగ్రత్త తీసుకోవాలి. అలా ఉన్నట్లయితే పనిచేసే టేబులును మరోచోటికి తర లించండి. ఈ నియమం కంప్యూటర్లకు ఇతర ఆఫీసు పరికరాలకు కూడా వర్తిస్తుంది. పార్కింగ్‌, టాయిలెట్లకు, గిడ్డంగుకు, కస్టమర్లు కూర్చోడానికి చోటు, మెట్లు, లిఫ్టులు, వెలుపల పరిసరాలు, బిల్డింగ్‌ ప్రధాన ప్రవేశ ద్వారం ఇలా ప్రతి అంశానికి నిర్దిష్టమైన నియమాలున్నాయి.

ఆఫీసులో ఫ్లోరింగ్ తూర్పువైపునకుగాని, ఉత్తరంవైపుకుగాని, ఈశాన్యం వైపునకుగాని కాస్తంత స్లోప్‌గా వుండాలి. ఈ స్లోప్ ఆఫీసు ప్రధాన ద్వారంవైపు ఉండకూడదు. ఇలా పొరపాటున ఉంటే ఆఫీసుకు వ్యాపారంలో రావాల్సిన లాభాలు రావు. ఆఫీసు బిల్డింగ్ ఎత్తులో అన్ని దిక్కులు సరిసమానంగా ఉండాలి. తూర్పు ఎత్తుగా, ఉత్తరం ఎత్తుగా వుంటే ఆ ఆఫీసులో దరిద్రం తాండవిస్తుంటుంది. లాభాలు నష్టాలతో కలిసిపోతుంటాయి. అనారోగ్య వాతావరణంలా వున్న ఆఫీస్ కళ మారాలంటే నీటి బానల్లో పుష్పాలను వేసి ఈశాన్య దిశగా ఉంచండి. కాని ప్రతిరోజు వాటిలో నీరుని, పుష్పాలను క్రమం తప్పక మార్చాలి.

నెలకొకసారి ఆఫీసు సింహద్వారానికి బూడిద గుమ్మడి కాయ ఎర్రని రంగు వస్త్రంలో వేలాడదీయడం మంచిది. మతాలను బట్టి కనీసం వారానికి ఒకసారన్నా సాంబ్రాణి ధూపం ఆఫీసు అంతా వేయండి. నరదృష్టి తొలిగిపోతుంది…..Chinta Gopi Sarma SiddhanthiFB_IMG_1510986380148

కార్తీక మాసం ఈరోజు చివరి రోజు.30 వ అధ్యాయము

*కార్తీక పురాణం*

 

*కార్తీకవ్రత మహిమ్నా ఫలశ్రుతి*

నైమిశారణ్య ఆశ్రమములో శౌనకాదిమహామునుల కందరకు సూతమహాముని తెలియజేసిన విష్ణుమహిమను, విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి, వేయినోళ్లకొనియాడిరి. శౌనకాది మునులకు యింకను సంశయములు తీరనందున, సూతునిగాంచి, “ఓ ముని తిలకమా! కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై, అత్యాచారపరులై జీవించుచు సంసారసాగరము తరింపలేకున్నారు. అటువంటివారు సులభముగా ఆచరించు తరణోపాయమేదైనా కలదా? ధర్మములన్నింటిలో మోక్షసాధనకుపకరించు వుత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తినొసంగు వుత్తమదైవమెవరు? మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రూపు మాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల వుపాయమేమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతోనున్నాము. కాన దీనిని వివరించి తెలియజేయు”మని కోరిరి.

అంత సూతుడా ప్రశ్న నాలకించి “ఓ మునులారా! మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి. కలియుగమందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసారసాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్షసాధనము కాగలవు. కార్తీకవ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటె ఘనమైనదని శ్రీహరి వరించియున్నాడు. ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతియేకాదు, సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యముకాదు. అయినను సూక్షముగా వివరించెదను.

కార్తీకమాసమందు ఆచరించవలసిన పద్ధతులను జెప్పుచున్నాను. శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీకమాసమున సూర్యభగవానుదు తులారాశియందున్నప్పుడు శ్రీహరి ప్రీతికొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగ నదీస్నానము చేయవలెను. దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజింపవలెను. తనకున్న దానితో కొంచమైనా దీపదానం చేయవలయును. ఈ నెలరోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమునగాని, శివాలయమునగాని ఆవునేతితో దీపారాధన చేయవలెను. ప్రతి దినము సాయంకాలము పురాణపఠనము చేయవలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వసౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులారాశియందున్న నెలరోజులు యీ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తివుండికూడా ఆచరించకగాని, లేక, ఆచరించువారలను యెగతాళి చేసినగాని, వారికి ధనసహాయము చేయువారికి అడ్డుపడిన వారును మందు అనేక కష్టముల పాలగుటయేగాక వారి జన్మాంతర మందు నరకములో యమకింకరుల చేత నానా హింసలపాలుకాగలరు. అంతియేగాక అట్తివారు నూరుజన్మలవరకు ఛండాలాది హీన జన్మలెత్తుదురు.

కార్తీక మాసములో కావేరి నదిలోగాని, గంగా నదిలోగాని, అఖండ గౌతమినదిలోగాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్టతో ఆచరించిననూ యిహమందు సర్వసుఖములను అనుభవించుటయేగాక, జన్మాంతరమున వైకుంఠవాసులగుదురు.

సంవత్సరములోవచ్చు అన్ని మాసములకన్నా కార్తీకమాసము వుత్తమోత్తమమైనది అధికఫలదాయకమైనది. హరి హరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీకమాస వ్రతము వలన జన్మజన్మలనుండి వారలకున్న సకలపాపములు హరించి, మరుజన్మలేక, వైకుంఠమందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే యీ వ్రతమాచరించవలెననెది కోరిక పుట్టి దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీకమాసమన్న కార్తీక వ్రతమన్నా అసహ్యము కలుగును.

కాన, ప్రతిమానవుదు ఈ పరమ సత్యమును గ్రహించి యిటువంటి పుణ్యమును చేతులారా విడువక ఆచరించవలెను. ఇటుల నెలరోజులు చేయలేని వారు కార్తీకశుద్ద పౌర్ణమినాడు అయినను తమశక్తి కొలదీ వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి, జాగరణము వుండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెలరోజులు చేసిన ఫలముతో సమానఫలము కలుగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో యెప్పటికినీ తరగని పుణ్యము లభించును. ఈ నె,అరోజులు ధనవంతుడైనను, బీదవాడైనను మరెవ్వరైనను సరే శ్రీహరినామస్మరణ చేయుచు, పురాణములు వింటూ, పుణ్యతీర్థములను సేవిస్తూ దానధర్మములు చేయుచున్న యెడల వారికి పుణ్యలోకమబ్బును. ఈ కథను చదివిన వారికిని వినిన వారికిని శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు యిచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగచేయును.

*ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్థప్రోక్త కార్తిక మహాత్మ్యమందలి త్రింశోధ్యాయము- ముప్పదవ(ఆఖరి రోజు) పారాయణము సమాప్తము.*
🙏🙏🙏🙏🙏

కార్తీక మాసం 29 వ రోజు 29 వ అధ్యాయము

 

*అంబరీషుడు దుర్వాసుని పూజించుట – ద్వాదశి పారణము*

అత్రి మహాముని అగస్త్యులవారితో యీ విధముగా – సుదర్శన చక్రము అంబరీషునక భయమిచ్చి వుభయులను రక్షించి, భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నుడువ నారంభించెను.

ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదముల ఫైబడి దండ ప్రణామములాచరించి, పాదములను కడిగి, ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకొని, “ఓ మునిశ్రేష్టా! నేను సంసార మార్గమందున్న యొక సామాన్య గృహస్తుడను. నా శక్తి కొలది నేను శ్రీ మన్నారాయణుని సేవింతును, ద్వాదశశీ వ్రతము జేసుకోనుచు ప్రజలకు యెట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడనై రాజ్యమేలుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్ని౦పుడు. మీ యెడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకు ఆతిథ్యమివ్వవలయునని ఆహ్వానించితిని. కాన, నా అతిధ్యమును స్వీకరించి నన్నును, నా వంశమును పావనము జేసి కృతార్దుని చేయుడు, మీరు దయార్ద్ర హృదయులు, ప్రధమ కోపముతో నన్ను శపించినను మరల నా గృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యుడనైతిని. మీరాక వలన శ్రీమహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది. అందులకు నేను మీ వుపకారమును మరువలేకున్నాను.

మహానుభావా! నా మనస్సంతోషముచే మిమ్మెట్లు స్తుతింపవలయునో నా నోట పలుకులు రాకున్నవి. నా కండ్ల వెంటవచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను. తమకు యెంత సేవచేసినను యింకను ఋణపడియుందును. కాన, ఓ పుణ్యపురుషా! నాకు మరల నర జన్మ రాకుండా వుండేటట్లును, సదా, మీ బోటి మునిశ్రేష్ఠుల యందును – ఆ శ్రీ మన్నారాయుణుని యందును మనస్సు గలవాడనై యుండునట్లును నన్నాశీర్వదించు”డని ప్రార్ధించి, సహాప౦క్తి భోజనమునకు దయ చేయుమని ఆహ్వానించెను.

ఈ విధముగా తన పాదముల పైబడి ప్రార్ధించుచున్న అంబరీషుని ఆశీర్వదించి “రాజా! ఎవరు ఎదుటి వారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి. నీవు నాకు యిష్టుడవు. తండ్రితో సమానుడవైనావు.

నేను నీకు నమస్కరించినచో నా కంటె చిన్న వాడగుట వలన నీకు అయుక్షిణము కలుగును.అందుచేత నీకు నమస్కరించుట లేదు. నీవు కోరిక యీ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చెదను. పవిత్ర యేకాదశి వ్రతనిష్టుడవగు నీకు మనస్థాపమును కలుగ జేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించితిని, నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నివే దిక్కయితివి. నీతో భోజనము చేయుట నా భాగ్యము గాక, మరొకటి యగునా?” అని దుర్వాస మహాముని పలికి, అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష్యపరమాన్నములతో సంతృప్తిగా విందారగించి, అతని భక్తిని కడుంగడు ప్రశంసించి, అంబరీషుని దీవించి, సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను.

ఈ వృత్తాంతమంతయు కార్తిక శుద్ధ ద్వాదశీదినంబున జరిగినది. కాన ఓ అగస్త్య మహామునీ!5 ద్వాదశీ వ్రతప్రభావమెంతటి మహాత్మ్యము గలదో గ్రహించితివిగదా! ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై వుండును. కనుకనే, ఆరోజుకంతటి శ్రేష్టతయు, మహిమ గలిగినది. ఆ దినమున చేసిన పుణ్యము యితర దినములలో పంచ దానములు చేసినంత ఫలమును పొందును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ యేకాదశి రోజున శుష్కోపవాసము౦డి పగలెల్ల హరి నామ సంకీర్తనచే గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ, లేక, వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశినాడు తన శక్తి కొలది శ్రీమన్నారయణునకు ప్రీతీకొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో గూడి భోజనము చేయునో అట్టి వాని సర్వ పాపములు యీ వ్రత ప్రభావము వలన పటాపంఛలై పోవును. ద్వాదశీ దినము శ్రీమన్నానరయుణుకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశిఘడియలు తక్కువగా యున్నను. ఆ ఘడియలు దాటకుండగానే భుజింపవలెను.

ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసమేర్పరచుకొని వుండాలని కోరిక వుండునో, అట్టి వారు ఏకాదశి వ్రతము, ద్వాదశి వ్రతము రెండునూ చేయవలెను. ఏ యొక్కటియు విడువకూడదు. శ్రీహరికి5 ప్రీతీకరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది. దాని ఫలితము గురించి యెంత మాత్రము సంశయింపకూడదు. మఱ్ఱి చెట్టు విత్తనము చాల చిన్నది. అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగ జేసిన యే కొంచము పుణ్యమైనను, అది అవసానకాలమున యమదూతల పాలు కానీయక కాపాడును. అందులకే యీ కార్తీకమాస వ్రతము చేసి దేవతలే గాక సమస్త మానవులు తరించిరి.

ఈ కథను యెవరు చదివినను లేక వినినను సకలైశ్వర్యములు సిద్దించి సంతాన ప్రాప్తి కూడా కలుగును – అని అత్రిమహాముని అగస్త్యనకు బోధించిరి.

*ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఏకోనత్రి౦శోధ్యాయము – ఇరవై తొమ్మిదో రోజు పారాయణము సమాప్తము.*2017-10-20-22-06-50-793

కార్తీక మాసం 28 వ రోజు 28 వ అధ్యాయము

 

*🌿విష్ణు సుదర్శన చక్ర మహిమ🌿*

జనక మహారాజా! వింటివా దుర్వాసుని అవస్ధలు! తాను యెంతటి కోపవంతుడైనను, వెనుక ముందు లాలోచింపక ఒక మహాభక్తుని శుద్దిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున, ఎంతటి గొప్ప వారైనాను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోనవలెను.

అటుల దుర్వాసుడు శ్రీ మన్నారాయణుని కడ సెలవుపొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచూ తిరిగి మళ్లి భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి “అంబరీషా, ధర్మపాలకా! నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము, నీకు నాపై గల అనురాగముతో ద్వాదశీ పారాయణమునకు నన్నాహ్వనించితివి, కాని నిన్ను కష్టములు పాలుజేసి వ్రతభంగము చేయించి నీ పుణ్య ఫలమును నాశనము చేయతల పెట్టితిని. గాని నా దుర్బద్ది నన్నే వెంటాడి నాప్రాణములు తీయుటకే సిద్దమైనది. నేను విష్ణువు కడకేగి యా విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్ధి౦చితిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీవద్ద కేగమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను యెంతటి తపశ్శాలినైనను, యెంత నిష్టగలవాడనైనను నీ నిష్కళంక భక్తి ముందవియేమియు పనిచేయలేదు. నన్నీ విపత్తునుండి కాపాడు”మని అనేక విధాల ప్రార్ధఒచగా, అంబరీషుడు శ్రీ మన్నారాయణుని ధ్యానించి,”ఓ సుదర్శన చక్రమా! నీకివే నా మన:పూర్వక వందనములు. ఈ దూర్వాస మహాముని తెలిసియో, తెలియకయో తొందరపాటుగా యీ కష్టమును కొని తెచ్చుకొనెను. అయినను యీతడు బ్రాహ్మణుడు గాన, ఈతనిని చంపవలదు, ఒక వేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలచితివేని, ముందు నన్నుచంపి, తర్వాత ఈ దుర్వాసుని జంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి, నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు యిలవేల్పు, దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్దములలో , అనేక మంది లోకకంటకులను చంపితివిగాని శరణుగోరువారిని యింత వరకు చంపలేదు. అందువలననే యీ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతనిని వెంటాడుచునే యున్నావు గాని చంపుటలేదు. దేవా! సురాసురాది భూతకోటులన్నియు ఒక్కటిగా యేకమైననూ నిన్నేమియు చేయజాలవు, నీ శక్తికి యే విధమైన అడ్డునూలేదు. ఈ విషయము లోకమంతటికి తెలియును. అయినను మునిపుంగవునికి యే అపాయము కలుగకుండ రక్షింపుమని ప్రార్థించుచున్నాను.

నీ యుందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి యిమిడియున్నది. నిన్ను వేడుకోనుచున్న నన్నును, శరణు వేడిన యీ దుర్వాసుని రక్షింపుము” అని అనేక విధముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణుచక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి “ఓ భక్తాగ్రేశ్వరా ! అంబరీషా! నీ భక్తిని పరీక్షించుట కిట్లు చేసితినిగాని వేరుగాదు. అత్యంత దుర్మార్గులు, మహాపరాక్రమవంతులైన మధుకైటభులను – దేవతలందరు యెకమైకూడ – చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదువు కదా! ఈ లోకములో దుష్టశిక్షణ, శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్దాపించుచుండును. ఇది యెల్లరకు తెలిసిన విషయమే, ముక్కోపియగు దుర్వాసుడు నీపైల్ పగబూని నీవ్రతమును నశింపజేసి, నానా యిక్కట్లు పెట్టవలెనని కన్ను లెఱ్ఱజేసి నీ మీద జూపిన రౌద్రమును నేను తిలకించితిని. నిరపరాధివగు నిన్ను రక్షించి, యీ ముని గర్వమణచవలెనని తరుముచున్నాను.

ఈతడు కూడా సామాన్యుడు గాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు. బ్రహ్మతేజస్సు గలవాడు. మహాతపశ్శాలి. రుద్రతేజము భులోకవాసుల నందరను చంపగలదుగాని, శక్తిలో నా కంటె యెక్కువేమియుగాదు. సృషి కర్తయగు బ్రాహ్మతేజస్సు కంటెను, కైలాసవతియగు మహేశ్వరుని తేజశ్శక్తి కంటెను యెక్కువయైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని , క్షత్రియ తేజస్సుగల నీవు గాని తులతూగరు. నన్నెదుర్కొనజాలరు. తనకన్న యెదుటి వాడు బలవంతుడై యున్నప్పుడు అతనితో సంధి చేసుకోనుట యుత్తమము. ఈ నీతిని ఆచరించువారలు యెటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకోనగలరు.

ఇంత వరకు జరిగినదంతయు విస్మరించి, శరణార్థియై వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపు” మని చక్రాయుధము పలికెను. అంబరీషుడా పలుకులాలకించి, ” నేను దేవ గో, బ్రాహ్మణాదులయుందును, స్త్రీలయందును, గౌరవము గలవాడను. నా రాజ్యములో సర్వజనులూ సుఖిముగా నుండవలెననియే నా యభిలాష. కాన, శరణుగోరిన ఈ దుర్వాసుని, నన్నూ కరుణించి రక్షింపుము. వేలకొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్య మండలములు యేక మైననూ నీ శక్తీకి, తేజస్సుకూ సాటి రావు. నీవు అట్టి తేజోరాశివి మహా విష్ణువు లోకనిందితులపై, లోకకంటకులపై, దేవ – గో – బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి, వారిని శిక్షించి, తనకుక్షియుందున్న పధ్నాలుగు లోకములను కంటికి రెప్పవలె కాపాడుచున్నాడు. కాన, నికివే నామన:పూర్వక నమస్కృతులు” అని పలికి చక్రాయుధపు పాదములపై పడెను. అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాడాలింగన మొనర్చి “అంబరీషా! నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము మూడు కాలములయుందు నెవరు పఠింతురో, యెవరు దానదర్మములతో పుణ్యఫలమును వృద్ది చేసుకొందురో, యెవరో పరులను హింసించక – పరధనములను ఆశపడక – పరస్త్రీలను చెరబెట్టిక – గోహత్య – బ్రాహ్మణహత్య – శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టివారి కష్టములు నశించి, యిహమందును పరమందును సర్వసాఖ్యములతో తులతూగుదురు. కాన, నిన్నూ దుర్వాసుని రక్షించుచున్నాను, నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాల గొప్పది. నీ పుణ్యఫలము ముందు యీ మునిపుంగవుని తపశ్శక్తి పని చేయలేదు.” అని చెప్పి అతని నాశీర్వదించి, అదృశ్యమయ్యెను.

*ఇట్లు స్కాంద పురాణా౦తర్గ్హత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్య మందలి అష్టావింశోధ్యాయము – ఇరవయ్యెనిమిదో రోజు పారాయణము సమాప్తము.*2017-10-20-22-06-50-793