జీవన సూత్రాలు ” భక్తి – భావం “

🌷నేను శాక్తేయుడను , శక్తిని ఆరాధిస్తాను .
“అందుకే విద్యుచ్ఛక్తిని ఆదాచేస్తాను , ఒకరి ఆత్మశక్తిి వృద్ధి చెందేలా ధైర్యంతో కూడిన మాటలు మాట్లాడతాను” .
🌷నేను వైష్ణవుడను , విష్ణును పూజిస్తాను .
“అందుకే , ఎదుటివారి ముఖం పైన చిరునవ్వు అలంకారమవడానికి కారణమవుతాను” .(అలంకారప్రియుడు విష్ణు )
🌷నేను శైవుడను , శివుణ్ణి అభిషేకిస్తాను .
“అందుకే , ఎదుటివారి మనస్సుని శివలింగం గా భావించి మమకారపు మధుర జల్లులతో అభిషేకిస్తాను” .(అభిషేక ప్రియుడు శివుఁడు )
🌷నేను గణాపత్యుడను , గణపతిని ప్రార్థిస్తాను .
“అందుకే , అందరి ముందుంటూ , అందరి బాధ్యతలను స్వీకరిస్తూ , ఎవరి జీవితాల్లో విఘ్నాలు సంభవించకుండా చూసుకుంటాను”. (గణేశుడే విఘ్నేశ్వరుడు )
🌷 డా .శివ ప్రసాద శాస్త్రి 🌷FB_IMG_1504244665373