Monthly Archives: September 2017

కె .రాఘవేంద్ర రావు గారి మన్ననలను పొందిన ” జీవన సూత్రాలు

🌻 హిమాలయాల్లో పుట్టిన గంగానది అనేక మలుపుల గుండా ప్రయాణిస్తూ యావత్ ఆస్తిక మహాశయులను పునీతం చేస్తున్నట్టు, శారదాంబ కటాక్షంతో నిరాటంకంగా సాగుతున్న జీవన సూత్రాల రచనా ప్రయాణం కుడా పాఠకుల జీవితాల్లో నూతనోత్తేజం నింపుతూ నేడు ఒక గొప్ప మజిలీ చేరింది .
🌻 శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకేంద్రుడు కె .రాఘవేంద్ర రావు గారు , శతాధిక జీవన సూత్రాల ప్రయాణాన్ని అభినందిస్తూ , పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ నా కలను నెరవేర్చి ,నాలో ఉన్న కళను మరోమారు తట్టిలేపి , నా చేతి కలానికి కొత్త పరుగులు నేర్పి వెన్ను తట్టడం నిజముగా ఒక వరంగా భావిస్తున్నాను .
🌻మీ అందరూ నాపై చుపిస్తున్న అభిమానం అక్షయం కావాలని ఆశిస్తూ ……
మీ
డా .శివ ప్రసాద శాస్త్రిFB_IMG_1506577624440FB_IMG_1506577629919

సోషల్ మీడియా లో సరికొత్త రికార్డ్ లు పలుకుతున్న పి.ఎస్.వి గరుడ వేగ..! నెం.1 ఇన్ ట్రేండింగ్.

యాంగ్రీ యంగ్ మాన్, విలక్షణ నటుడు డా రాజశేఖర్ నటిస్తున్న సినిమా పి.ఎస్.వి గరుడ వేగ. శివాని శివాత్మిక మూవీస్ సమర్పిస్తుండుగా, జ్యో స్టార్ ఎంటర్ప్రైజెస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు జాతీయ స్థాయి అవార్డు గ్రహిత ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తుండగా ఏం. కోటేశ్వర్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య విడుదల అయిన ఈ సినిమా టిజర్ సోషల్ మీడియా లో అతి తక్కువ వ్యవధి లో మూడు మిలియన్ లకు (3M) పైగా వీక్షించిన టిజర్ గా రికార్డ్ సృష్టించి నెం.1 ట్రేండింగ్ లో గత రెండు రోజులుగా కొనసాగుతుంది.
అద్భుతమైన కథ, అత్య అద్భుతమైన స్క్రీన్ ప్లే మరియు హైలి హాలీవుడ్ టెక్నికల్ వ్యాల్యుస్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా పై ప్రేక్షకులలో భారి అంచనాలు నెలకొన్నాయి. వరల్డ్ ఫేమస్ స్టార్ సన్నీ లియోన్ ఒక ప్రత్యేక సాంగ్ కి స్టెప్ లు వేయడం మరొక ఆకర్షణ.
రాజశేఖర్ కి సరిజోడి గా విశ్వరూపం ఫేం పూజా కుమార్ నటిస్తుండగా, కిషోర్, ఆలి, శ్రద్దా దాస్, నాజర్, అవసరాల శ్రీనివాస్, పృథ్వి మరియు ఇతర భారి తారాగణం నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం శ్రీ చరణ్ పాకాల మరియు భిమ్స్, సినిమాటోగ్రఫీ అంజి, గికా చేలిడ్జే, బకూర్ చికోబావా, సురేష్ రగుతు, శ్యాము, ఏడిటింగ్ ధర్మేంద్ర కాకరాల. భారి అంచనాలతో అతి త్వరలో మన ముందుకు రానున్న ఈ సినిమాకు నిర్మాత కోటేశ్వర్ రాజు, రచన దర్శకత్వం ప్రవీణ్ సత్తారు.
కెవి కుమార్ కావూరి.IMG-20170925-WA0037

సాగర్ దర్శకత్వంలో “నితీష్ రెడ్డి” హీరోగా “ప్రభాస్” చిత్రం ప్రారంభం.

నితీష్ రెడ్డి హీరోగా సీనియర్ డైరెక్టర్ సాగర్ దర్శకత్వంలో ఫార్చ్యూన్ మూవీస్ వారు నిర్మిస్తున్న”ప్రభాస్” చిత్రం 22 వ తేదీ ఉదయం అన్నపూర్ణ స్టూడియో లో వైభవంగా ప్రారంభం అయ్యింది. హీరో నితీష్ రెడ్డి, హీరోయిన్స్ నందిని, అమృత లపై ఫస్ట్ షాట్ చిత్రీకరించారు. ఈ ఫస్ట్ షాట్ కి ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు కెమెరా స్విచ్ ఆన్ చెయ్యగా,మరో సీనియర్ నిర్మాత,తెలంగాణ

ఎఫ్.డి.సి ఛైర్మెన్ పీ. రామ్మోహన్ రావ్ క్లాప్ కొట్టారు.ప్రముఖ దర్శకులు ఎస్.వి. కృష్ణా రెడ్డి తొలి షాట్ కి
దర్శకత్వం వహించారు. పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు
సాగర్ మాట్లాడుతూ…1983 లో రాకాసి లోయ సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించాను. మావారి గోల,
స్టువర్టుపురం దొంగలు, అమ్మ దొంగ, అమ్మానా కోడలా వంటి డిఫరెంట్ సినిమాలకు దర్శకత్వం వహించాను అన్నారు.
నిర్మాతలు అశోక్ , సతీష్ రెడ్డి మాట్లాడుతూ… ఖర్చుకు వెనకాడకుండా భారీగా ఈ సినిమాను నిర్మిస్తున్నాం,
తెలుగు , హిందీ, తమిళ,కన్నడ భాషలకు చెందిన నటీనటులు ముఖ్య పాత్రలు పోషించబోతున్నారు.
చిత్ర ప్రారంభానికి విచ్చేసిన చిత్ర రంగ ప్రముఖులకు దర్శక , నిర్మాతలు హీరో కృతజ్ఞతలు తెలిపారు.FB_IMG_1506081590843FB_IMG_1506081594602

ప్రతీ కవికి ఈ “అక్షర హారం” అంకితం 🌷 కవి – కర్షకుడు 🌷

కవి ఓ నిత్య కర్షకుడు ,

🔥”ప్రతి పంటకు ప్రసవించేవాడు కర్షకుడు …
ప్రతి అక్షరానికి ప్రసవించేవాడు కవి ….”
🔥 కవియే కర్షకుడై కలం అనే హలంతో అక్షర సేద్యం చేస్తాడు .నాగలి తలక్రిందులై నడిస్తే గాని నాగరికత నిలువజాలదు , కవి చేతి కలం తలక్రిందులై కాగితాన్ని కదిలిస్తేగాని భావం బ్రతుకజాలదు .
🔥 కండను కరిగించి అన్నాన్ని పండించి ఆకలి అన్నవారికి అండగా నిలిచే రైతులాగా, కవి తన కలాన్ని కదిలించి అక్షరాలను అందించి భావ దారిద్య్రంలో మునిగిన వారికి బాసటగా నిలుస్తాడు .

🔥 ఆకలితో డొక్క పాతాళానికి చేరినా పట్టించుకోక దుక్కి దున్ని పాతాళంనుండి పరమాన్నము ప్రసాదించే రైతు లాగా ,కవి యొక్క కడుపు కరువుకు శాశ్వత చిరునామాగా మారినా పట్టించుకోక శ్రమించి , తన మేధస్సును పదును చేసి పదాలను పరిగెత్తిస్తూ పరమాత్మ తత్త్వం యొక్క పరమార్థాన్ని ప్రసాదిస్తాడు .
అందుకే ….
” కర్షకుడిని ఆదుకోండి , కవిని ఆదరించండి ……”
🌻 డా .శివ ప్రసాద శాస్త్రి 🌻FB_IMG_1505882403905

నూతన నటీనటులకు అవకాశం

క్రిస్టో లైట్ మీడియ క్రియేషన్స్ పతాకం పై శ్రీ వర్ధన్ దర్శకత్వం లో ఒక నూతన చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా మీద మంచి అభిరుచి ఉన్న ఈ దర్శక నిర్మాత లు చిత్ర నిర్మాణం కోసం అవసరమైన నూతన నటుల ఎంపికకు కూడా శ్రీకారం చుట్టారు. నటన పట్ల ఆసక్తి ఉన్న యువకులు తమ లేటెస్ట్ ఫోటోలను వారి వివరాలతో కలిపి ఈ దిగువ పేర్కొంటున్న ఈ మేల్ అడ్రెస్ కి పంపించవలసినదిగా ఈ సినిమా దర్శక నిర్మాత లు కోరుతున్నారు.received_1637826802936796

శ్రీ ఆంజనేయ మంగళాష్టకం

వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే |
పూర్వాభాద్రప్రభూతాయ మంగళం శ్రీహనూమతే || ౧ ||

కరుణారసపూర్ణాయ ఫలాపూపప్రియాయ చ |
మాణిక్యహారకంఠాయ మంగళం శ్రీహనూమతే || ౨ ||

సువర్చలాకళత్రాయ చతుర్భుజధరాయ చ |
ఉష్ట్రారూఢాయ వీరాయ మంగళం శ్రీహనూమతే || ౩ ||

దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ చ |
తప్తకాంచనవర్ణాయ మంగళం శ్రీహనూమతే || ౪ ||

భక్తరక్షణశీలాయ జానకీశోకహారిణే |
జ్వలత్పావకనేత్రాయ మంగళం శ్రీహనూమతే || ౫ ||

పంపాతీరవిహారాయ సౌమిత్రిప్రాణదాయినే |
సృష్టికారణభూతాయ మంగళం శ్రీహనూమతే || ౬ ||

రంభావనవిహారాయ గంధమాదనవాసినే |
సర్వలోకైకనాథాయ మంగళం శ్రీహనూమతే || ౭ ||

పంచాననాయ భీమాయ కాలనేమిహరాయ చ |
కౌండిన్యగోత్రజాతాయ మంగళం శ్రీహనూమతే || ౮ ||

( కేసరీపుత్ర దివ్యాయ సీతాన్వేషపరాయ చ |
వానరాణాం వరిష్ఠాయ మంగళం శ్రీహనూమతేunnamed

శ్రీ నటరాజ స్తోత్రం(పతంజలిముని కృతం)

(చరణశృంగరహిత శ్రీ నటరాజ స్తోత్రం)

సదంచిత-ముదంచిత నికుంచిత పదం ఝలఝలం-చలిత మంజు కటకం |
పతంజలి దృగంజన-మనంజన-మచంచలపదం జనన భంజన కరమ్ |
కదంబరుచిమంబరవసం పరమమంబుద కదంబ కవిడంబక గళమ్
చిదంబుధి మణిం బుధ హృదంబుజ రవిం పర చిదంబర నటం హృది భజ || ౧ ||

హరం త్రిపుర భంజన-మనంతకృతకంకణ-మఖండదయ-మంతరహితం
విరించిసురసంహతిపురంధర విచింతితపదం తరుణచంద్రమకుటమ్ |
పరం పద విఖండితయమం భసిత మండితతనుం మదనవంచన పరం
చిరంతనమముం ప్రణవసంచితనిధిం పర చిదంబర నటం హృది భజ || ౨ ||

అవంతమఖిలం జగదభంగ గుణతుంగమమతం ధృతవిధుం సురసరిత్-
తరంగ నికురుంబ ధృతి లంపట జటం శమనదంభసుహరం భవహరమ్ |
శివం దశదిగంతర విజృంభితకరం కరళసన్మృగశిశుం పశుపతిం
హరం శశిధనంజయపతంగనయనం పర చిదంబర నటం హృది భజ || ౩ ||

అనంతనవరత్నవిలసత్కటకకింకిణిఝలం ఝలఝలం ఝలరవం
ముకుందవిధి హస్తగతమద్దల లయధ్వనిధిమిద్ధిమిత నర్తన పదమ్ |
శకుంతరథ బర్హిరథ నందిముఖ భృంగిరిటిసంఘనికటం భయహరమ్
సనంద సనక ప్రముఖ వందిత పదం పర చిదంబర నటం హృది భజ || ౪ ||

అనంతమహసం త్రిదశవంద్య చరణం ముని హృదంతర వసంతమమలమ్
కబంధ వియదింద్వవని గంధవహ వహ్నిమఖ బంధురవిమంజు వపుషమ్ |
అనంతవిభవం త్రిజగదంతర మణిం త్రినయనం త్రిపుర ఖండన పరమ్
సనంద ముని వందిత పదం సకరుణం పర చిదంబర నటం హృది భజ || ౫ ||

అచింత్యమళివృంద రుచి బంధురగళం కురిత కుంద నికురుంబ ధవళమ్
ముకుంద సుర వృంద బల హంతృ కృత వందన లసంతమహికుండల ధరమ్ |
అకంపమనుకంపిత రతిం సుజన మంగళనిధిం గజహరం పశుపతిమ్
ధనంజయ నుతం ప్రణత రంజనపరం పర చిదంబర నటం హృది భజ || ౬ ||

పరం సురవరం పురహరం పశుపతిం జనిత దంతిముఖ షణ్ముఖమముం
మృడం కనక పింగళ జటం సనక పంకజ రవిం సుమనసం హిమరుచిమ్ |
అసంఘమనసం జలధి జన్మకరలం కవలయంత మతులం గుణనిధిమ్
సనంద వరదం శమితమిందు వదనం పర చిదంబర నటం హృది భజ || ౭ ||

అజం క్షితిరథం భుజంగపుంగవగుణం కనక శృంగి ధనుషం కరలసత్
కురంగ పృథు టంక పరశుం రుచిర కుంకుమ రుచిం డమరుకం చ దధతం |
ముకుంద విశిఖం నమదవంధ్య ఫలదం నిగమ వృంద తురగం నిరుపమం
స చండికమముం ఝటితి సంహృతపురం పర చిదంబర నటం హృది భజ || ౮ ||

అనంగపరిపంథినమజం క్షితి ధురంధరమలం కరుణయంతమఖిలం
జ్వలంతమనలం దధతమంతకరిపుం సతతమింద్ర సురవందితపదమ్ |
ఉదంచదరవిందకుల బంధుశత బింబరుచి సంహతి సుగంధి వపుషం
పతంజలి నుతం ప్రణవ పంజర శుకం పర చిదంబర నటం హృది భజ || ౯ ||

ఇతి స్తవమముం భుజగపుంగవ కృతం ప్రతిదినం పఠతి యః కృతముఖః
సదః ప్రభుపద ద్వితయదర్శనపదం సులలితం చరణ శృంగ రహితమ్ |
సరః ప్రభవ సంభవ హరిత్పతి హరిప్రముఖ దివ్యనుత శంకరపదం
స గచ్ఛతి పరం న తు జనుర్జలనిధిం పరమదుఃఖజనకం దురితదమ్ || ౧౦ ||

స్తోత్రం)

స గచ్ఛతి పరం న తు జనుర్జలనిధిం పరమదుఃఖజనకం దురితదమ్ || ౧౦ ||2017-09-04-08-11-42-708

జీవన సూత్రాలు ” భక్తి – భావం “

🌷నేను శాక్తేయుడను , శక్తిని ఆరాధిస్తాను .
“అందుకే విద్యుచ్ఛక్తిని ఆదాచేస్తాను , ఒకరి ఆత్మశక్తిి వృద్ధి చెందేలా ధైర్యంతో కూడిన మాటలు మాట్లాడతాను” .
🌷నేను వైష్ణవుడను , విష్ణును పూజిస్తాను .
“అందుకే , ఎదుటివారి ముఖం పైన చిరునవ్వు అలంకారమవడానికి కారణమవుతాను” .(అలంకారప్రియుడు విష్ణు )
🌷నేను శైవుడను , శివుణ్ణి అభిషేకిస్తాను .
“అందుకే , ఎదుటివారి మనస్సుని శివలింగం గా భావించి మమకారపు మధుర జల్లులతో అభిషేకిస్తాను” .(అభిషేక ప్రియుడు శివుఁడు )
🌷నేను గణాపత్యుడను , గణపతిని ప్రార్థిస్తాను .
“అందుకే , అందరి ముందుంటూ , అందరి బాధ్యతలను స్వీకరిస్తూ , ఎవరి జీవితాల్లో విఘ్నాలు సంభవించకుండా చూసుకుంటాను”. (గణేశుడే విఘ్నేశ్వరుడు )
🌷 డా .శివ ప్రసాద శాస్త్రి 🌷FB_IMG_1504244665373