Monthly Archives: June 2017

ఆగస్ట్ 13 న హరిహర రుద్రవీణ మాస పత్రిక వార్షికోత్సవం

హరిహర రుద్రవీణ మాస పత్రిక వార్షికోత్సవం ఆగస్ట్ 13 న శ్రీ గురు మదనానంద సరస్వతి పీఠం..రంగంపేట లో నిర్వహించబడతయని హరిహర రుద్రవీణ ప్రధాన సంపాదకులు వుప్పల బాలసుబ్రహ్మణ్యం తెలియచేశారు.IMG-20170630-WA0113

మిస్ వరల్డ్ ఫైనలిస్టులో తెలంగాణ అమ్మాయి

మిస్ వరల్డ్ ఫైనలిస్టులో తెలంగాణ అమ్మాయి

ఆదిలాబాద్: ఈ సంవత్సరం జూలైలో జరిగే మిస్ వరల్డ్ అందాల పోటీల్లో ఫైనలిస్టు విభాగంలో తలపడే కల్యాణపు శ్రావ్య ఖమ్మం జిల్లా అశ్వారావుపేటకు చెందింది. ఆమె తండ్రి కల్యాణపు రవికుమార్ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో 2002 నుంచి 2005 వరకు ఏవోగా పనిచేశారు. అప్పుడు శ్రావ్య ఏడో తరగతి వరకు ఆదిలాబాద్‌లో చదువుకుంది. ఆమె ప్రస్తుతం యూనివర్సిటీ అఫ్ అల్‌బెట్రాలో కెమికల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నది. ప్రస్తుతం మిస్ నార్థ న్ అల్‌బర్‌టా వరల్డ్ టైటిల్ ను శ్రావ్య సొంతం చేసుకున్నది.FB_IMG_1498826152078

ఓం శ్రీ శ్రీ శ్రీ కలియుగ అఖండ ఆదిపరాశక్తి లోక జనని మాత దేవాలయము

ఓం శ్రీ శ్రీ శ్రీ కలియుగ అఖండ ఆదిపరాశక్తి లోక జనని మాత దేవాలయము
బడంగపేట,అల్మాసగుడా,సాహెబ్ నగర్ ముడుర్ల పోలిమేర లో యుగ యుగాల నుండి స్వయంబుపాదలు వెలసి ఉన్నాయి.FB_IMG_1498799949269FB_IMG_1498799945753FB_IMG_1498799952582FB_IMG_1498799955543

జులై 3 నబ్రాహ్మణఅభ్యుదయ పరిషత్,రంగారెడ్డి జిల్లా నూతన భవన శంకుస్థాపన

హైదరాబాద్ నగర శివారు నాదరుగుల్
లో సోమవారం బ్రాహ్మణఅభ్యుదయ పరిషత్,రంగారెడ్డి జిల్లా నూతన
భవనం శంకుస్థాపన జరుగనున్నది. వేద పాఠశాల ఆచార్యులు, ఘనాపాఠీలు, వేద విద్యార్థుల ప్రముఖుల సమక్షంలో శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ,బ్రాహ్మణ భవన నిర్మాణం చేపట్టాలని సత్సంకల్పం తో 3/7/2017 సోమవారం ఉదయం8.30 గంటలకు మన సంఘ నూతన భవన నిర్మాణ శంకుస్థాపన జరుగును కావున బ్రాహ్మణ బందువులు శ్రేయోభిలాషులు అందరు కార్యక్రమాన్ని విజవంతం చేసి సంఘ అభివృద్ధికి తోడ్పడలని తెలియచేసారు.IMG-20170628-WA0074

బ్రాహ్మణఅభ్యుదయ పరిషత్,రంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

బ్రాహ్మణఅభ్యుదయ పరిషత్,రంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్టు సంఘం ప్రతినిధులు తెలిపారు. అధ్యక్షులు గా డేరం భాస్కర శర్మ… గౌరవ అధ్యక్షులు గా పాల రాజశేఖర శర్మ రమణ గురుస్వామి,ఇతర సభ్యులు గా కె. అంబాప్రసాద్ శర్మ. s. అంబాప్రసాద్ శర్మ కే శ్రీధర్ శాస్త్రి ఎల్లికంటి శ్రీనివాస్ శర్మ. లను ఎన్నుకోవడం జరిగినది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ,బ్రాహ్మణ భవన నిర్మాణం వేగవంతం చేయడం, సంఘం అభివృద్ధి కి తమవంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ సమావేశంలో బ్రాహ్మణాభ్యుదయ పరిషత్ రంగారెడ్డి జిల్లా సంఘం ప్రతినిధులు మరియు యువజన సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.IMG-20170628-WA0074

భ్రామరీం లలితాంబికాం

జడాజడప్రకృతిజీవజాలపోషణాభారకర్తవ్యనిర్వాహణాదీక్షాదక్షం
నిమ్నోన్నతరహితసృష్టిస్థితిలయకారకత్రిభువనపాలకదాక్షిణ్యాం
కార్యాకారణకర్తృత్వకార్పణ్యాసూయారహితమహాకాలకాలప్రియాం
భావయామి హృది సంతతం భ్రామరీం లలితాంబికాం ||

జ్ఞానకుమార వేంకట రమణ ప్రసాద్images-1

చక్రభ్రమణం

పుట్టుక శాకాహారిగా ఉంచుతుంది .

స్నేహం మాంసాహారిగా మారుస్తుంది .
ధ్యానం మళ్ళీ శాకాహారిని చేస్తుందేమో…!

***
బతుకేం దువ్వాడ సినిమా కాదు,
అగ్రహారీకుడెంట అందాలబొమ్మ పడదు..
గురజాడ వారెప్పుడో చెప్పినట్టు
వైదీకపాళ్ల పునిస్త్రీలూ,
తలచెడ్డ పూటకూళ్లమ్మలూ
జమిలిగా “చీపురుకట్ట సరసం” ఆడతారు.

***
పిల్లలకు గేమ్ ఆఫ్ థ్రోన్లూ; పీయస్ ఫోర్లూ
అమ్మగారికి 4కె రిసొల్యూషన్ హెచ్ డీ టీవీల కోసం
జగన్నాధాలూ, పరాంకుశాలూ ఆక్టీవాలెక్కాలి.
మధుమేహం మందమవుతుందన్న భయంతో
ఆబ్దీకం పెట్టడానికైనా అన్నం తినే వెళ్లాలి.
నక్తం అంటూ నంగనాచి వేషాలెయ్యాలి.

***
గొట్టిపాటి వారి పిల్లాడికి మున్సబీ అయ్యే ఛాన్సేలేదు..
68% ముందస్తు బుక్కింగైపోగా
దొరల, పటేళ్ల, రాజుల, చౌదర్ల,నాయుళ్ళ, రెడ్ల
వెనక మిగిలిన ముప్ఫైమూడో వాడే
బక్క బాపనోడు…
సమకాలీన సమాజంలో ఆధునిక అస్పృశ్యుడు..
***
అప్ డేట్ ఇవ్వరా అంటే వినడే..
పోనీ శంకరశాస్త్రిగారా..అంటే అదీ కాదు..
పంచె కట్టుకుని ఒప్పుకున్న పూజ చేసి,
ప్యాంటేసుకుని పనికి పరిగెడతాడు.
బక్క ప్రాణంతో “పరశురాముణ్నం”టూ కేకలేస్తాడు.
.
.

కులానికో వీరుడున్నాడ్రా బాబూ..
పాతసొల్లేయమాక,
కుళ్లు కంపు కొడతాంది.
పొద్దున్నే లేచి చదివేది..
ఈనాడా..?? ఈశావానోపనిషత్తా..??
తాత గారి నేతి మూతిని వదిలి,
ఇవాళ మజ్జిగ ఉందా..?లేదా..? చూడు..
రేపటి పాలూ, పెరుగు సంగతాలోచించు
***
చౌదరిగారి ఛానల్లో ఎవడి దినఫలం వాడు చూసుకుంటున్నాడు గానీ,
పురోహితుణ్ని అంటూ పనికిరాని జపం చేయకు..
పురపుహితమును కొంతమానుకు
సొంతహితముకు పాటుపడవోయ్…FB_IMG_1498374850526

డబ్బింగ్ యాంకరింగ్‌ లో శిక్షణ

డ్రమ్స్ & డాలిస్ స్టూడియో ఆధ్వర్యంలో ప్రముఖ రంగస్థల నటులు,దర్శకులు ఫణిప్రకాశ్ పర్యవేక్షణలో శిక్షణ తరగతులు ప్రారంభమవుతున్నాయి. యాంకరింగ్, డబ్బింగ్, దర్శకత్వం తదితర అంశాలపై శిక్షణ ఉంటుందని తెలిపారు. అనంతరం సర్టిఫికెట్‌ను అందిస్తామని పేర్కొన్నారు. వివరాలకు 98660977788సంప్రదించాలని తెలిపారు.IMG-20170624-WA0090

గర్భ రక్షాంభిక స్తోత్రం

ఓం శ్రీ మాధవీ కాననస్థే
గర్భరక్షాంభికే పాహి భక్తమ్ స్తువన్తమ్ ॥
వాపీతఠే వామభాగే
వామదేవస్య దేవస్య దేవీ స్థిత త్వమ్ ।
మాన్యా వరేణ్య వదాన్య
పాహి గర్బస్త్య జన్తూన్ తథా భక్తలోకాన్ ॥
శ్రీ మాధవీ కాననస్థే
గర్భరక్షాంభికే పాహి భక్తమ్ స్తువన్తమ్ ॥
శ్రీ గర్బరక్షాపురే యా
దివ్య సౌందర్య యుక్తా సుమాంగళ్య గాత్రీ ।
ధాత్రీ జనిత్రీ జనానామ్
దివ్యరూపామ్ దయాద్రామ్ మనోః జ్ఞాం భజే తామ్ ॥
శ్రీ మాధవీ కాననస్థే
గర్భరక్షాంభికే పాహి భక్తమ్ స్తువన్తమ్ ॥
ఆషాఢ మాసే సుపుణ్యే
శుక్రవారే సుగన్ధేన గన్దేన లిప్తా ।
దివ్యంభరాకల్పవేషా
వాజపేయాది యోగస్త్య భక్తః సుదృష్టా ॥
శ్రీ మాధవీ కాననస్థే
గర్భరక్షాంభికే పాహి భక్తమ్ స్తువన్తమ్ ॥
కళ్యాణ ధాత్రీ నమస్తేః
వేది కన్గ చ స్త్రీయ గర్భ రక్షాకరీ త్వామ్ ।
బాలై సదా సేవితాంగ్రి గర్భ
రక్షార్ధ మారా ధుపేతై రుపేతామ్ ॥
శ్రీ మాధవీ కాననస్థే
గర్భరక్షాంభికే పాహి భక్తమ్ స్తువన్తమ్ ॥
బ్రహ్మోత్సవే విప్రవిద్యాః
వాద్యఘోషేణ తుష్టామ్ రతే సన్నివిష్ఠామ్।
సర్వార్థధాత్రిం భజేహం
దేవబృంధై రపీఢ్యామ్ జగన్మాతరమ్ త్వామ్ ॥
శ్రీ మాధవీ కాననస్థే
గర్భరక్షాంభికే పాహి భక్తమ్ స్తువన్తమ్ ॥
యే తత్ క్రుతమ్ స్త్రోత్ర రత్నం దీక్షిత
అనంత రామేన దేవ్యా స్తుతుష్ట్యై ।
నిత్యం పఠేయస్తు భక్త్యా పుత్ర పౌత్రాది భాగ్యమ్
భవే తస్య నిత్యమ్ ॥
శ్రీ మాధవీ కాననస్థే
గర్భరక్షాంభికే పాహి భక్తమ్ స్తువన్తమ్ ॥
ఇతి శ్రీ బ్రహ్మ శ్రీ అనంత రామ దీక్షిత విరచితం గర్భరక్షాంభికా స్త్రోత్రం సంపూర్ణం ॥2017-06-24-20-16-37-730

మైథిలీం జనకాత్మజాం

శ్రీరామమనోచిత్తనిరంతరచరఘనచారుభృంగాం
శ్రీలక్ష్మణభరతశత్రుఘ్నసేవితమృదుపాదపద్మాం
అయోధ్యావాససంతతప్రియలవకుశమాతరం
భావయామి హృది సంతతం మైథిలీం జనకాత్మజాం ||images