Monthly Archives: May 2017

జూన్ 5న సామూహిక ఉపనయనాలు

నిస్వార్థంగా మన బ్రాహ్మణ బంధువులకు సేవ చేయాలని సంకల్పించి సామూహిక ఉచిత ఉపనయన మహోత్సవ కార్యక్రమం జూన్ 5 వ తేదీ న సోమవారం శ్రీ హరిహర క్షేత్ర అయ్యప్పస్వామి దేవాలయం కర్మనుఘాట్ హైదరాబాద్ లో బ్రాహ్మణ అభ్యుదయ పరిషత్ కర్మనుఘాట్ శాఖ ఆధ్వర్యంలో ఎర్పాటుచేశారు.కావున బ్రాహ్మణోత్తములు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోగలరని కోరుతున్నారు.IMG-20170522-WA0107IMG-20170522-WA0110

జూన్ 5న సామూహిక ఉపనయనాలు

IMG-20170522-WA0107IMG-20170522-WA0110

శ్రీ నీలకంఠ మమ దేహి కరావలంబం

కందర్పదర్పహరసుందరనాగాభరణభూషితం
వారిజభవేంద్రాదిసురకోటిసముదాయపూజితం
భక్తమార్కండేయరక్షణదక్షాదీక్షయమాంతకం
శ్రీ నీలకంఠ మమ దేహి కరావలంబం ||

జ్ఞానకుమార వేంకట రమణ ప్రసాద్IMG_20160803_081822_140 (1)

అదరగొట్టే హాస్యం తో, అద్భుత రుచిని పంచిన మిక్షర్ పొట్లం

సినిమా :మిక్షర్ పొట్లం.
విడుదల తేది: 19 -05 – 2017 (శుక్రవారం)
తారాగణం : శ్వేతా బసు ప్రసాద్, జయంత్, గితాంజలి, భాను చందర్, సుమన్, పోసాని మురళి కృష్ణ, భగవాన్, ఆలి, భద్రం.. తదితరులు.
బ్యానర్ : గోదావరి సినిటోన్
నిర్మాతలు : డాక్టర్ కలపటపు శ్రీ లక్ష్మి ప్రసాద్, లంకపల్లి శ్రీనివాస్ రావు, కంటే వీరన్న చౌదరి.
సంగీతం : మాధవ పెద్ది సురేష్ చంద్ర.
ఎడిటింగ్ : యం ఆర్ వర్మ.
కెమెరా : కళ్యాణ్ సమి.
రచన, దర్శకత్వం : యం.వి సతీష్ కుమార్.
టాక్: కామెడీ ఎంటర్టైన్మెంట్. చాలా బాగుంది.
రేటింగ్ : 3.75 / 5
ఈ మధ్య కాలం లో అత్యదిక అంచనాలతో విడుదల అయిన ఒకే ఒక్క చిన్న సినిమా మిక్షర్ పొట్లం. ట్రైలర్ కి, పాటలకి ప్రేక్షకుల నుండి విశేష స్పందన రావటంతో ఇండస్ట్రీ వర్గాలలో సైతం ఈ సినిమా కాస్త ఇంట్రెస్టింగ్ న్యూస్ అయిందనే చెప్పాలి. మరి అటువంటి సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి అసలు ఈ సినిమా కథ ఏంటో, ఏంత వరకు అభిమానులను ఆకట్టుకుందో, ఇప్పుడు చూద్దాం.
కథ: సువర్ణ సుందరి (శ్వేతా బసు ప్రసాద్ ) సుందరి ట్రావెల్స్ సంస్థ పేరు తో అమలాపురం నుండి షిరిడి వరకూ స్పెషల్ యాత్రను నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఒకసారి విభిన్న మనసత్వాలు కలిగిన ప్రయాణికులతో షిరిడి బయలు దేరిన సుందరి ట్రావెల్స్ బస్సు హాయి హాయి గా చూసే ప్రేక్షకులను సైతం కడుపుబ్బా నవ్వించేలా ప్రయాణం సాగిస్తున్న తరుణం లో కొన్ని ప్రతీకార, ప్రతిఘటన కారణాల వాళ్ళ ఉగ్రవాద కార్య కలపాలా దళం నాయకుడు భాను చందర్ తన సైన్యం తో ఆ బస్సు ను కిడ్నాప్ చేసి రాష్ట ప్రభుత్వానికి తన డిమాండ్ లతో సవాల్ విసురుతాడు.
ఒకానొక టైం లో ఉగ్రవాదుల డిమాండ్ లు తీర్చటం రాష్ట ప్రభుత్వానికి కూడా కట్టి మీద సాములా మారటం తో, ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు అన్ని మారిపోతాయి. సి.యం రాజీనామా చేసే వరకూ కథ వెళ్తుందంటే ఉగ్రవాదుల డిమాండ్ లు ఏ రేంజ్ లో ఉన్నాయో మనమే అర్ధం చేసుకోవచ్చు.
ఈ ఒక్క మలుపు తో సెకండ్ హాఫ్ లో దర్శకుడు కథ ను నడిపించిన విధానం, ప్రతి ఆడియన్ ని అలా కుర్చోపెట్టేస్తుంది అంటే అది అతిశయోక్తి కాదు.
ఇంటర్వెల్ లోనే ప్రేక్షకుల మదిలో ఏన్నో సందేహాలు పరిగెడతాయి…!
అసలు భాను చందర్ ఉగ్రవాదిగా ఏందుకు మారాడు..? సి.యం కి భాను చందర్ కి మధ్య వ్యక్తిగత వైరం ఏంటి అనేది ఈ సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలుస్తుంది.
ఉగ్రవాదుల డిమాండ్ లలో ఒకటి ముఖ్యంగా స్త్రీ కి అన్యాయం జరిగితే ఏలా శిక్షించాలి అనే అంశాన్ని దర్శకుడు అత్యద్బుతంగా తెరకెక్కించాడు.
కోర్టు సిన్ చాలా వరకు మహిళలను బాగానే ఆకట్టుకుంటుంది.
చిరంజీవి కోసం కథ రాసిన నవ రచయత ఆ కథను చివరికి చిరంజీవికి ఏలా వినిపించాడు..?
ప్రేమ కథలను సినిమాగా తెరకెక్కించే ఈ రోజుల్లో ఒక ప్రేమ కథను ఉప కథగా చూపించటం లో దర్శకడు తనదైన శైలిని కనబరిచారా? లేదా..?
సేవ చేస్తాం అని రౌడి మూకలు, రాజకీయాల్లోకి వచ్చి.. పదవిని తమ తమ కుటుంబ పోషణకు, ఆస్తి అంతస్తు రక్షణకు, వాడుకునే నాయకులకు సేవ, న్యాయం, ధర్మం, కలిగిన రాజ్యంగ ఓనమాలు ఏవరు దిద్దించాలి.?
కార్పోరేట్ సిస్టం లో కామం, చేరితే కుటుంబ ఆకళి తీర్చటం కోసం ఉపాది మార్గం గా సాప్ట్ వేర్ రంగాన్ని ఏంచుకునే నేటి కాలపు మన ఆడ బిడ్డ ఆ మృగాల మధ్య ఏ విధంగా జీవనం సాగించాలి..?
ఈ ప్రశ్న లన్నిటికీ సమాధానం దొరకాలంటే ప్రతి ప్రేక్షకుడు ఈ మిక్షర్ పొట్లం సినిమా తప్పక చూడాలి.

హైలెట్ విశేషాలు.. : చాలా కాలం తరువాత శ్రోతల్ని అలరిస్తున్న మెలోడి సాంగ్స్.
నిర్మాణ విలువలు.
సెకండ్ హాఫ్ కథ, కథనం.
ఉగ్రవాదిగా భాను చందర్ నటన.
భగవాన్ అండ్ కంటే వీరన్న చౌదరి కామెడీ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ గా నిలబడింది.
బాలు గారు పాడిన పాట, బ్యాగ్రౌండ్ మ్యూజిక్.
ప్రేమ కథ.
శ్వేతా బసు ప్రసాద్ నటన అండ్ గ్లామర్.
బైక్ రేస్ మరోక హైలెట్.

సమగ్ర విశ్లేషణ: ఈ మధ్య రెగ్యులర్ సినిమాలు చూసి చూసి విసిగి వేసారి పోయిన జనాలకు బాహుబలి తరువాత అంతే స్తాయికి కొంచెం అటు ఇటుగా అదే ఊపు తో ప్రేక్షకులను ఉత్సాహా పరిచే సినిమాగా అయ్యేందుకు మిక్షర్ పొట్లం కు అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి.
బస్సు ప్రయాణంలో ప్రయాణికులందరి జీవిత సమస్యలు అండ్ లక్ష్యాలు దర్శకుడు చక్కగా తీర్చిదిద్దాడు. చేపల వ్యాపారిగా భగవాన్ పాత్ర, ఆ భగవాన్ పక్కన శుద్ధ బ్రాహ్మణుడిని కూర్చో పెట్టి కడుపుబ్బా నవ్వించాడు. మొత్తంగా చెప్పాలంటే ఈ మండు వేషవి లో హాయి హాయి ఆహ్లాదాన్ని పంచె సినిమాగా మిక్షర్ పొట్లం ను పరిగణలోకి తీసుకోవచ్చు. టెక్నికల్ గా దర్శకుడు సమర్ద వంతమైన టీం ని ఏంచుకున్నప్పుడే సగం విజయం ఈ సినిమాకు దక్కింది అని చెప్పాలి. కొత్త దర్శకుడు అయినా తన చక్కటి ప్రతిభ తో రెండు గంటలు పాటు ప్రేక్షకులని దియేటర్ లో నవ్వించ గాలిగాడు అంటే దర్శకుడికి కథ కథనం పట్ల ఉన్న నైపుణ్యత మనకు కనపడుతుంది. ఏది ఏమైనా విడుదల అయిన ప్రతి చోట మిక్షర్ పొట్లం, ఈ హీట్ సమ్మర్ లో హాట్ హిట్ట్, సూపర్ హిట్ట్ అనే టాక్ తో దూసుకెళ్ళిపోతుంది.IMG-20170519-WA0073

శ్రీ దక్షిణామూర్తి మమ దేహి కరావలంబం

మహాకాలకాలస్వరూపత్రిభిర్వేదవేదాంతపూజితమృదుపల్లవాంఘ్రిం

ఆత్మానాత్మవివేకదేహాత్మభ్రాంతివివర్జితస్థితిప్రదకేవలజ్ఞానమూర్తిం

యోగీంద్రహృత్కమలగతసహస్రభానుతేజజాజ్జ్వల్యకాంతిపుంజం

శ్రీ దక్షిణామూర్తి మమ దేహి కరావలంబం ||

జ్ఞానకుమార వేంకట రమణ ప్రసాద్IMG_20160811_081531_973

శ్రీ నీలకంఠ మమ దేహి కరావలంబం

కందర్పదర్పహరసుందరనాగాభరణభూషితం
వారిజభవేంద్రాదిసురకోటిసముదాయపూజితం
భక్తమార్కండేయరక్షణదక్షాదీక్షయమాంతకం
శ్రీ నీలకంఠ మమ దేహి కరావలంబం ||

జ్ఞానకుమార వేంకట రమణ ప్రసాద్IMG_20160803_081822_140