Monthly Archives: April 2017

మా సినిమాకు ఆంజనేయ స్వామి హీరో, మా విజయానికి ఆయన ఆశిర్వాధమే కారణం అంటున్న ఆ నిర్మాత…!

ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు, కాని సిని ప్రేక్షకులు ఇది ఈ వేసవికి పెద్ద విజయం అవుతుంది అని అప్పుడే నిర్ణయించేసారు. సినిమా అభిమానులే ఆ సినిమాని ప్రమోట్ చేయడం మొదలు పెట్టేశారు. జనం ఇంతలా ఒక సినిమాని ప్రేమించాలంటే ఆ సినిమా సూపర్ స్టార్ లు నటించి ఉండాలి, కోట్లు ఖర్చు పెట్టి ఆ సినిమా తెరకెక్కించి ఉండాలి. కాని అవి ఏమి మా సినిమాలో లేవు, కాని ప్రేక్షకులు మమ్మల్ని ఆధరించారు, దీవించారు. రేపు విడుదల అయిన తరువాత మంచి విజయం అందించి గెలిపిస్తారు అంటున్న ఆ నిర్మాతే సుఖీభవ మూవీస్ బ్యానర్ పై రక్షక భటుడు సినిమాని నిర్మించిన ఏ గురు రాజ్.
మా టెక్నిషియన్స్ ఏ నా బలం వాళ్ళు ఈ సినిమా కోసం పడ్డ కష్టమే మాకు ఈ రోజు ఈ విధంగా అందుతున్న ప్రేక్షకాధరణకు ముఖ్య కారణం అంటున్న నిర్మాత గురు రాజ్ ది ఈ రోజు పుట్టిన రోజు సందర్భంగా మీడియా ఆయన కాసేపు సరదాగా ముచ్చటించారు, అవి మీ కోసం.
‘’నాకు మొదటి నుండి సినిమా అంటే చాలా ఇష్టం, ఎందరో మహానుభావులు పేర్లు తెర మీద అలా చూస్తూ పెరిగాను, కష్టపడి తే ఏదైనా సాధించుకోవచ్చు అని నమ్మే నేను ఏదోక రోజు నా పేరు తెర మీద చూసుకోవాలనే బలమైన కాంక్షతో సిని ఇండస్ట్రీ ప్రయాణం మొదలు పెట్టాను. అప్పటికే నా వ్యాపారాలలో నాకు మిత్రులుగా ఉన్న వాళ్ళకి ఇండస్ట్రీ లో మంచి పరిచయాలు ఉండటం వలన నాకు అవి కొంత ఉపయోగ పడ్డాయి. వాటి ద్వారా ఒక సినిమా లో నటుడి గా అవకాశం వచ్చినా పెద్దగా గుర్తింపు రాలేదు, ఆ తరువాత ఆడపా దడపా అవకాశాలు వచ్చినా సరైన సినిమా ఏది రాలేదు. నేను మొదటి నుండి వ్యాపారిని కావటంతో కొంతకాలం మళ్ళి తిరిగి వ్యాపారంలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నాను. నా కస్టమర్ దేవుళ్ళు ఆశీర్వదించారు. లాభాలు చూపించారు. నన్ను పెద్ద స్థాయి లో నిలిపారు. ఆ ఉత్సాహం తోనే మనం కష్టపడితే సిని పరిశ్రమ కూడా మనల్ని ధివిస్తది అని నమ్మి నిర్మాత గా మారి తోలి సినిమాగా రక్షక భటుడు తీశాను. కాని ఇక్కడ నేను అనుకున్న దాని కంటే ప్రేక్షకులు ఏక్కువుగా ఆధరణ చూపించారు, దానికి ప్రతి తసిని ప్రేక్షక దేవుళ్ళకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.
మరి ముఖ్యంగా ఇక్కడ నా టీం కి అభినందనలు తెలపాలి, దర్శకుడు వంశీ కృష్ణా ఇది నాకోసం తీసిన సినిమా, తనకు నేను అంటే చాలా ఇష్టం. ఒక మంచి కథ చెప్పారు. మా సినిమాలో కథ హీరో. ఆ కథ వెనక ఉన్న ఆంజనేయ స్వామి మా సినిమాకు రక్ష. ఈ సినిమా థ్రిల్ తో పాటు పూర్తీ వినోదాత్మకంగా ఉంటుంది. ఈ సినిమాకు మేం జత చేసిన ప్రతి అంశం కొత్తగా ఉంటుది. నేను నటనలో ఒడుదుడుకులు చవి చూసినా నిర్మాణ రంగంలో మాత్రం గెలవాలనే కసితో ఈ సినిమా తీసా, ఈ రోజు మీ అందరి సహకారంతోనే మా సినిమా మీద ఇంతటి భారీ అంచనాలు నెలకొన్నాయి.’’ అంటూ మీడియా తో తన ఆనందాన్ని పంచుకున్నారు.
అయితే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న దృశ్యా నిర్మాత విడుదల కార్యక్రమాలు అన్ని పూర్తీ చేసుకొని మే మొదటి వారంలో భారీ ఏత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడంటా..!
మరి ఈ సినిమా పై ఆ ఆంజనేయుడి రక్ష ఉండాలని, సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుందాం.IMG-20170411-WA0026

టెక్నిషియన్స్ టాలెంట్ ను చూపించగలగే మంచి సినిమా ఇది… ! ఎడిటర్ అమర్ రెడ్డి.

ఒక సినిమాకు టెక్నికల్ విలువలు బలంగా ఉంటే ఆ సినిమాకి ఏంత మంచి గుర్తింపు అండ్ పబ్లిసిటీ వస్తదో ఆ ఎడిటర్ చూపించాడు. కథ ను చెప్పకుండా కథనంతో థ్రిల్ చేస్తూ తను కట్ చేసిన సినిమా ట్రైలర్ రక్షక భటుడు. తనే ప్రఖ్యాత ఎడిటర్ అమర్ రెడ్డి. తన ప్రతిభ వలనే ఈ మధ్య కాలం లో అత్యధిక మంది వీక్షించిన ట్రైలర్ గా ఇప్పుడు రక్షక భటుడు ట్రైలర్ రికార్డ్ లు తిరగ రాస్తుంది.
సుఖీభ‌వ మూవీస్ బ్యాన‌ర్‌పై వంశీకృష్ణ ఆకెళ్ల ద‌ర్శ‌క‌త్వంలో ఎ.గురురాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక డిఫరెంట్ కథ, కథనం తో తెరకెక్కుతుంది. ఇందులో రిచాప‌నై మరియు (మరో స్టార్ హీరో) నటిస్తుండగా, బ్రహ్మానందం, సుప్రీత్, అదుర్స్ రఘు, చిత్రం శ్రీను, జ్యోతి, ధన్ రాజ్, రాం జగన్, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, బ్ర‌హ్మాజీ త‌దిత‌రులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి మల్హార్ భట్ట్ కెమెరా మరియు శేఖర్ చంద్ర సంగీతం, అమర్ రెడ్డి ఎడిటింగ్ ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి
ఎడిటర్ అమర్ రెడ్డి మాట్లాడుతూ ‘’మా లాంటి టెక్నిషియన్స్ కి మంచి గుర్తింపు తెచ్చే సినిమా లలో ఈ సినిమా ఒకటిగా నిలుస్తుంది. నేను దాదాపు 25 సినిమాలకు ఎడిటింగ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాను, సోలో ఎడిటర్ గా చేసిన కుమారి 21F తో మంచి గుర్తింపు తో పాటు చాలా సినిమాలు వచ్చాయి. టెక్నికల్ గా సినిమాను ప్రేమిస్తే గొప్పగా వర్క్ చేయొచ్చు, దర్శక నిర్మాతల అంచనాలకు తగ్గకుండా ఎడిటింగ్ చేయొచ్చు అని నేను నమ్ముతాను. నేను చేసే ప్రతి సినిమా గొప్పగా రావాలి, నిర్మాత బాగుండాలి అని కోరుకుంటాను. ఈ సినిమాను నిర్మించిన గురు రాజ్ గారికి పెట్టిన ప్రతి రూపాయికి లాభం రావాలి అని, మా టీం కృషి కి మంచి ఆధరణ దక్కాలని మనఃస్పురిగా కోరుకుంటున్నాను.’’ అని అన్నారు.
కాగా, కథ ను దాచేస్తూ ఎడిటర్ అమర్ రెడ్డి ఈ సినిమా ట్రైలర్ కట్ చేసిన విధానంకు సిని ఇండస్ట్రీ నుండి మంచి ప్రసంశలు అందుతున్నాయి. ప్రేక్షకులలో పెరిగిన భారీ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ఉండబోతుంది అని ఇప్పటికే మనకు అర్దమైంది కదూ.
మరి అతి త్వరలో మన ముందుకు రాబోతున్న ఈ సినిమా ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం అందుకోవాలని ఆశిద్దాం.IMG-20170406-WA0116IMG-20170406-WA0117IMG-20170406-WA0115