Monthly Archives: March 2017

ఒక్క టిక్కట్టుకు వంద నవ్వులు ;; “నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్ ” సినిమా

శ్రీ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-1 గా రిమ్మ‌ల‌పూడి వీర‌గంగాధ‌ర్ నిర్మిస్తున్ననువ్వు నేను ఒసేయ్ ఒరేయ్‌ నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్‌. ర‌విచంద్ర క‌న్నికంటి ద‌ర్శకుడుగా ప‌రిచ‌యం అవుతున్నారు. అర్జున్ మ‌హి, అశ్విని జంట‌గా న‌టిస్తున్నారు. సుమ‌న్ జూపూడి సంగీతాన్ని సమకూర్చిన ఆడియో ఇటీవ‌ల విడుద‌లై సూప‌ర్ హిట్ గా నిలిచింది.దర్శకులు రవి చంద్ర మాట్లాడుతు,
ఓ చిన్న సంతోషకరమైన వార్త “నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్ ” సినిమాకి ఇటీవల సెన్సారు బోర్డు వారు చూసి ” యు ” సర్టిఫికెట్ ఇచ్చారు.ఇంటిల్ల పాది,అనగా చిన్నా పెద్దా ఆడా మగా అందరూ కలిసి కూర్చుని హాయిగా చూడల్సిన సినిమా మా సినిమా.
మీ అందరి ఆశ్శీస్సులతో మా సినిమాని త్వరలో నే రిలీజ్ చెయ్య బొతున్నాం
మా సినిమా ని అందరు ఆదరించి విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్న అన్నారు.received_151596085361906

జన్మనక్షత్ర రీత్యా ధరించవలసిన రుద్రాక్షలు

నక్షత్రము — ధరించవలసిన రుద్రాక్ష
అశ్వని — నవముఖి
భరణి — షణ్ముఖి
కృత్తిక — ఏకముఖి, ద్వాదశముఖి
రోహిణి — ద్విముఖి
మృగశిర — త్రిముఖి
ఆరుద్ర — అష్టముఖి
పునర్వసు — పంచముఖి
పుష్యమి — సప్తముఖి
ఆశ్లేష — చతుర్ముఖి
మఖ — నవముఖి
పుబ్బ — షణ్ముఖి
ఉత్తర — ఏకముఖి, ద్వాదశముఖి
హస్త — ద్విముఖి
చిత్త — త్రిముఖి
స్వాతి — అష్టముఖి
విశాఖ — పంచముఖి
అనురాధ — సప్తముఖి
జ్యేష్ఠ — చతుర్ముఖి
మూల — నవముఖి
పూర్వాషాఢ — షణ్ముఖి
ఉత్తరాషాఢ — ఏకముఖి లేదా ద్వాదశముఖి
శ్రవణం — ద్విముఖి
ధనిష్ట — త్రిముఖి
శతభిషం — అష్టముఖి
పూర్వాభాద్ర — పంచముఖి
ఉత్తరాభాద్ర — సప్తముఖి
రేవతి — చతుర్ముఖిimages (4)

డిజిటల్ స్నేహం మీద నా అభిప్రాయం

డిజిటల్ స్నేహం మీద నా అభిప్రాయం చెప్పగానే ఒక “మేతావి” ‘ ఎవర్నైనా పట్టుకుంటే తప్ప నీ దూల తీరదా..?’ అంటూ వెటకారాలాడాడు. ఇంకొకరికి ఫోన్ చేస్తే “only text please.” అంటూ ఆటో మెస్సేజ్ వస్తుంది. తను నన్ను “సూటిగా, సుత్తి లేకుండా , సొల్లెయ్యకుండా పాయింట్ చెప్పు ..!” అంటున్నారని అర్ధమైపోతుంది.

ఆలోచనలని, భావాలని యథాతథంగా చెప్పడానికి రాత కన్నా మాటే ముఖ్యమని నేను నమ్ముతాను. ఈ “పాయింటు కి రా..!” అనే లక్షణం మన ఓపిక లేనితనాన్ని గుడ్డలిప్పి ప్రదర్శిస్తుంది. తోటివాళ్ళ ఆలోచనలతో సహగమించలేని అలసత్వాన్ని, మొరటుతనాన్ని నిర్లజ్జగా కళ్ళకు కట్టిస్తుంది. పుష్కరాల వయస్సున్న స్నేహసంబంధాలు instant messenger లోకి కుదింప బడుతున్నాయి. ఇత్తడి గ్లాసు లోని ఫిల్టర్ కాఫీ కాపుచినో కప్పైపోయింది. Social Media అపరిచితుల contacts పెంచింది. సుపరిచితుల connections తుంచింది. మనసు లో శూన్యాన్ని చేర్చింది. మెదడు లో చెత్తని పేర్చింది.

24/7 hyper connectivity మనుషుల మధ్య దూరాన్ని శత సహస్ర యోజనాలుగా పెంచేసింది. దీని విశ్వరూపం ఇంతింతై బ్రహ్మాండాంత సంవర్ధియై, నయాపైసా ఖర్చు లేకుండా ఫ్లోరిడా స్నేహితులతో చాటింగ్ చేయిస్తోంది. కానీ, పక్క ఫ్లాట్ వృద్ధుడిని బాల్కనీ లోనుండి కూడా పలకరించలేనంత మొద్దు బారేలా చేసింది.
Messages పెరిగాయి. Meetings తరిగాయి.చెప్పడం పెరిగింది; వినడం తరిగింది. “I am little pre occupied yaar..! Let’s catch up some time soon..” అనే ముక్తాయింపు వాస్తవమైతే అదో ఎనిమిదో వింత.

పొట్టిక్కలో, పెసరట్లో, మొలక వడలో తింటూనో; ఉదయం కాఫీ మగ్గుతోనో సాయంత్రం విస్కీ పెగ్గుతోనో అప్పుడప్పుడైనా కలిసేవాళ్ళం. ముఖాముఖంగా మాట్లాడుకునే వాళ్ళం.కళ్ళ కలయికలతో సమస్త సృష్టి వర్ణ చిత్రాన్ని ఆవిష్కరించే వాళ్ళం. కొట్టుకునే వాళ్ళం, తిట్టుకునే వాళ్ళం, కౌగిలించుకునే వాళ్ళం, ఏడిచే వాళ్ళం, ఏడిపించే వాళ్ళం, నవ్వే వాళ్ళం, నవ్వించే వాళ్ళం.

అంతా మారిపోతోంది.పెళ్ళిళ్ళకి వచ్చే బంధువులు తగ్గారు. Reception కి వచ్చే సహోద్యోగులు పెరిగారు. యంత్రాలకు మనిషి మేధస్సుని జత కలిపే పనిలో పడ్డ మనిషి యంత్రమై పోయాడు.మన భావాలు emoticons లా మరుగుజ్జు రూపం దాల్చాయి. కప్పెట్టిన వాళ్లకి పెడుతున్న RIP లు చిరాకు తెప్పిస్తున్నాయి.మోక్షానికి విశ్రాంతి ఏంటో నా కోడి (బోడి) బుర్రకి అర్ధం కావడం లేదు.

నిజమే..! ఈ రుద్దబడుతున్న తద్దినానికి మనం మెల్లమెల్లగా అలవాటు పడిపోతున్నాం. కానీ,ఒక sense of relatedness, belongingness, understanding మృగ్యమై పోతున్నాయని దిగులేస్తోంది. నాలాంటివాడు పొరపాటున ఈ విషయం కెలికితే “టైం ఎక్కడుందీ..? “పాత వాగుడు వాగకు…!” అంటూ తిలక్ ఎప్పుడో రాసిన న్యూ సిలబస్ ని ఇప్పటికీ వల్లె వేస్తున్నారు.

నిజమే..! మనది బిజీ టైం. కానీ మనం నెమ్మదించడం అత్యవసరం. సుఖపడేందుకు కుప్పలు కుప్పలుగా మార్కెట్ లో డంప్ అవుతున్న వస్తువుల్లో మనను ఆనందపరచే ఆవిష్కరణలు మైక్రోస్కోపు తో వెదికితే ఒకటో, అరో దొరుకుతాయేమో..! మైథునం మార్కెట్లో కూడా దొరుకుతుంది. కానీ శృంగారపు చిరునామా సందింటి లోనే కదా..!

కొత్తతరపు communications వల్ల సంభాషణా చాతుర్యం, సహానుభూతి లాంటి మానవ సహజ లక్షణాలు అంతర్దానమైపోతున్నాయి. ఎదుటి వ్యక్తి నిజాయితీ తో తో కూడిన మెచ్చుకోలు; నిష్కామ స్నేహం కన్నా మననేవీ సంతృప్తి పరచలేవు. తెలిసిన నాలుగు ముక్కలు తెలిసిన నలుగురితో పంచుకోకుండా లోలోపలే పెట్టేసుకోవడం ఫ్లాట్ బీర్ అంత ; చీకట్లో కన్ను కొట్టడం అంత నిష్ప్రయోజనం.

లింగబేధంతో నిమిత్తం లేకుండా ఎవరి సలహా నన్ను ముందుకు నడిపిస్తుందో; ఎవరి విమర్శ నన్ను ఆపుతుందో; ఎవరి చేతి రుమాలు నా కన్నీటిని తుడుస్తుందో; ఎవరి కలయిక నా దుఃఖాన్ని దునుమాడుతుందో; ఎవరి విరహం నా సంతోషాన్ని మింగేస్తుందో; ఎవరి మాట నన్ను శ్రోతని చేస్తుందో; ఎవరి శ్రద్ధ నన్ను వక్తని చేస్తుందో; ఎవరి కోసం చావాలని అనుకుంటానో; ఎవరి కోసం చంపాలని అనుకుంటానో ఆ రక్త మాంసాలతో నిండి ఉన్న సజీవ మూర్తికి నా పాదాభివందనాలు; ఆత్మీయ ఆలింగనాలు…! Gottimukkula KamalakarFB_IMG_1489294231564

మనస్సును కదిలించే ఆదిశంకరుల మాతృ పంచకం

కాలడి లో ఆది శంకరుల తల్లి ఆర్యా౦బ మరణశయ్యపై వుంది. తనను తలుచుకున్న వెంటనే ఆమె దగ్గరకు వచ్చి ఆమెకు ఉత్తరక్రియలు చేశారు. ఆ సందర్భం లో శంకరులు చెప్పిన ఐదు శ్లోకాలు “మాతృపంచకం” గా ప్రసిద్ధమైనవి.

1 .ముక్తామణిస్త్వం నయనం మమేతి
రాజేతి జీవేతి చిరం సుతత్వం
ఇత్యుక్తవత్యా స్తవవాచి మాతః
దదామ్యహం తండులమేవ శుష్కం.
తా:–అమ్మా! నీవు నా ముత్యానివిరా! నా రత్నానివిరా! నా కంటి వెలుగువురా నాన్నా! నువ్వు చిరంజీవిగా వుండాలి. అని నన్ను ప్రేమగా పిలిచిన నీ నోటిలో ఈనాడు కేవలం
యిన్ని శుష్కమైన బియ్యపు గింజలు వేస్తున్నాను. నన్ను క్షమించు.

2 . అంబేతి తాతేతి శివేతి తస్మిన్
ప్రసూతి కాలే యాదవోచ వుచ్యై :
కృష్ణేతి గోవింద హరే ముకుందే
త్యహో జననై రచితోయమంజలి.

తా:–పంటిబిగువున నా ప్రసవకాలములో వచ్చే బాధను ఆపుకోలేని బాధను “అమ్మా!
అయ్యా! శివా! కృష్ణా! హరా! గోవిందా!” అనుకుంటూ భరించి నాకు జన్మనిచ్చిన తల్లికి నేను నమస్కరిస్తున్నాను.

3 . అస్తాం తావదియం ప్రసూతి సమయే
దుర్వార శూలవ్యథా నైరుచ్యం
తను శోషణం మలమయీ శయ్యాచ
సంవత్సరీ ఏకస్యాపినగర్భభార భరణ క్లేశస్య
యస్యాక్షమః దాతుం నిష్కృతి
మున్నతోసి తనయ:తస్యై జననై నమః

తా:– అమ్మా! నన్ను కన్న సమయం లో నువ్వు ఎంతటి శూల వ్యథను అనుభవించావో కదా! శరీరం కళను కోల్పోయి శుష్కించి వుంటుంది. మలముతో శయ్య మలినమైనా
ఒక సంవత్సరకాలం ఆ కష్టాన్ని ఎలా సహించావో కదా!ఎవరూ అలాంటి బాధను భరించలేరు.ఎంత గొప్ప వాడైనా కుమారుడు తల్లి ఋణాన్ని తీర్చుకోగలడా?నీకు నమస్కారం చేస్తున్నాను

4 . గురుకులముపసృ త్యస్సప్న కాలేతు దృష్ట్వా
యతిసముచితవేషం ప్రారుదోత్వముచ్చె:
గురుకుల మథ సర్వ౦ ప్రారుదత్తే సమక్షం
సపది చరణ యోస్తే మాతరస్తు ప్రణామః

తా:–కలలో నేను సన్యాసి వేషం లో కనబడేసరికి బాధపడి, మా గురుకులానికి వచ్చి ఏడ్చావు. ఆ సమయం లో నీ దుఃఖం అక్కడివారందరికీ బాధ కలిగించింది. అంత గొప్ప దానివైన నీ పాదాలకు నమస్కరిస్తుంన్నాను.

5 . న దత్తం మాతస్తే మరణ సమయే
తోయమపివా న్యథా నా నో దత్తా మరణ దివసే
శ్రాద్ధ విధినా న జప్త్యా మాతస్తే మరణ సమయే
తారకనామ మనురాకాలే సంప్రాప్తే మయి కురు దయాం
మాతురు తులామ్

తా:–అమ్మా! సమయం మించిపోయాక వచ్చాను నీ మరణ సమయంలో కొంచెం నీళ్లు
కూడా నేను గొంతులో పొయ్యలేదు. శ్రాద్ధ విధిని అనుసరించి “స్వధా ను” యివ్వలేదు
ప్రాణము పోయే సమయము లో నీ చెవిలో తారకమంత్రాన్ని చదవలేదు. నన్ను క్షమించి, నాయందు దేనితో సమానము కానీ దయ చూపించుము తల్లీ!images (2)

దుబ్బాక చేనేత సొసైటీలో సమంత

 

తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ సమంత తన బాధ్యతకు న్యాయం చేసే దిశగా కదిలారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో చేనేత సహకార సంఘాన్ని సమంత సందర్శించారు. చేనేత వస్త్రాల తయారీ, మార్కెటింగ్, చేనేత కార్మికుల జీవన స్థితిగతులపై ఆమె ఆరాతీశారు. చేనేత కార్మికులు నేసిన వస్త్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెటింగ్ కోసం తాను మరింత మెరుగైన విధానాలు పరిశీలించి విస్తరించే ఏర్పాట్లు చేస్తానని సమంత వారికి హామీ ఇచ్చారు. వ్యక్తిగతంగా ఆర్డర్లు తీసుకొస్తానని ఆమె భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సమంతకు శాంపిల్ గా దుబ్బాక చేనేత సహకార సంఘంలో తయారు చేసిన చేతిరుమాలు, లెనిన్ క్లాత్ ను కార్మికులు ఇచ్చారు. సమంతను చూసేందుకు దుబ్బాకవాసులు పోటీ పడ్డారు.samanthasiddipeta

గూగుల్ కూడా దొరకము అంటున్న ఆ ఇద్దరు హాట్ భామలు నేడు సోషల్ మీడియా మొత్తం ఏలేస్తున్నారు.. ఏవరు వాళ్ళు..?

అదేంటి అనుకుంటున్నారా…! అది అంతే. కొత్త బంగారు లోకం తో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయిన హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్. ఆ సినిమా హిట్ తరువాత శ్వేతా కి అవకాశాలు వెల్లువలా వచ్చాయి, అయితే ఏ ఒక్క సినిమా కూడా మంచి హిట్ కాకపోవడంతో ఏం చేయాలో అర్ధం కాని శ్వేతా సెక్స్ రాకెట్ లో కి దిగింది అని అప్పట్లో మీడియా లో వచ్చిన వార్త ఇండస్ట్రీ లో పెద్ద సంచలనమే సృష్టించింది.
తన హస్కీ వాయిస్ తో ఏ పాటను అయినా హిట్ చేయగల సింగర్ సుచిత్ర. ఈ మధ్య కాలం లో సుచిత్ర కూడా హాట్ హాట్ ట్వీట్ లు చేసింది. హీరో ధనుష్ అండ్ అనిరుద్ తనకు మత్తు మందు ఇచ్చి సెక్స్ చేశారని, సినిమా ఇండస్ట్రీ లో నడిచే ఇలాంటి భాగోతాలు సామాన్య ప్రేక్షకులకు తెలియాలి అంటూ తన దగ్గర వున్న తరాల రాసలీలల లు అన్ని ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.
మరి విల్లద్దిరిని కలిపిన విషయం ఏంటి అంటే, మిక్షర్ పొట్లం అనే తెలుగు సినిమా. అవును..!
గోదావరి సినిటోన్ బ్యానర్ పై కలపటపు శ్రీ లక్ష్మి ప్రసాద్, కంటే వీరన్న చౌదరి మరియు లంకపల్లి శ్రీనివాస్ రావు కలిసి సంయుక్తంగా నిర్మించిన మిక్షర్ పొట్లం.
తన ముందు సినిమాలతో ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్ గెలుచుకొని, క్రిటిక్స్ నుండి మంచి అభిరుచి కలిగిన దర్శుకుడిగా పేరు తెచ్చుకున్న యం.వి సతీష్ కుమార్ గారు దర్శకత్వం వహించగా, మెలోడి మాస్టర్ శ్రీ మాదవపెద్ది సురేష్ చంద్ర గారు సంగీతం అందించారు.
కొత్తబంగారు లోకం తో తెలుగు తెరకు పరిచయం అయ్యి, మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న శ్వేతా బసు ప్రసాద్ చాలా కాలం తరువాత తిరిగి మల్లి లీడ్ హీరోయిన్ గా చేస్తూ, భానుచందర్ కుమారుడు జయంత్ హీరో గా , మరియు గితాంజలిని మరొక హీరోయిన్ గా పరిచయం చేస్తూ తెరకెక్కిన ఈ సినిమా లో భాను చందర్ , సుమన్ పోసాని, భగవాన్, ఆలి, వంటి భారి తారాగణం తో పాటు మంచి కుటుంబ విలువలు తో పాటు ఫుల్ మాస్ కూడా జోడించి దర్శకుడు ఈ సినిమా తీసినట్టు ఇప్పటికే విడుదల అయి చిన్న సినిమా ఖాతా లో రికార్డు లు క్రియేట్ చేస్తున్న పోస్టర్స్, ట్రైలర్, పాటలు చూస్తుంటే ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
అయితే ఈ సినిమాలో సింగర్ సుచిత్ర హలో బేబీ అంటూ పాడిన పాట కూడా తన అన్ని పాటలు లాగానే చాలా అద్బుతంగా ఉండటం తో పాటు ప్రేక్షకుల వద్ద కూడా భారిగా క్రేజ్ తెచ్చుకుంది. కాగా ఈ పాట లో శ్వేతా బసు ప్రసాద్ నటించారు. ఇప్పుడు ఈ పాట యూత్ ని ఊపేస్తుంది. ఆ రెండు కారణాలతో ఈ ఇద్దరిని కలిపిన సినిమాగా మిక్షర్ పొట్లం నిలబడింది. కాగా ఒక్కసారిగా ప్రేక్షకుల వైపు నుండి ఇంత హైప్ తెచ్చుకున్న ఈ మిక్షర్ పొట్లం ప్రపంచ వ్యాప్తంగా అతి త్వరలో మన ముందుకు రానుంది.IMG-20170309-WA0035

హరి హర రుద్రవీణ ఉగాది పురస్కారాలు

శ్రీ శ్రీ శ్రీ గురు మదనానంద సరస్వతి పీఠాదీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి వారి దివ్య శుభ ఆశిస్సులతో,శ్రీ శ్రీ శ్రీ మధుసుదనానంద సరస్వతీ(శ్రీ క్షేత్రం ) స్వామి వారి పర్యవేక్షణ లో
హరి హర రుద్రవీణ మాస పత్రిక ఉగాది పురస్కారాల ను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేస్తుంది.ప్రతి సంవత్స0 లా నే ఈ సంవత్సరం కూడా ఉగాది పురస్కారాలను అందజేయడానికి సర్వం సిద్ధం చేసింది. అద్యత్మికము,విద్య,సాహిత్యం ఇంకా పలు రంగాల ప్రముఖుల కి ,
ఉగాది పురస్కారాలను ఈ నెల 19 న అందజేయనున్నారు.FB_IMG_1489047324308

సోషల్ మీడియా లో సరికొత్త రికార్డ్ లను పిలుస్తున్న ‘’రారా స్వామి రారా’’ ట్రైలర్.

వెంకట నరసింహ ఫిలిమ్స్ బ్యానర్ పై బి.వెంకట నరసింహ రెడ్డి (పవన్ సింహా) నిర్మిస్తూ, ఆర్.నితిన్ సమర్పించిన చిత్రం ‘’రారా స్వామి రారా’’.
ఆమ్జాత్ మరియు శ్రీని ప్రధాన పాత్రలు పోషించగా, స్వామి రారా ఫేం పూజ రామచంద్రన్ మరియు #నాజర్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా కు రాబర్ట్ రాజ్ దర్శకత్వం వహించగా ప్రకాష్ నిక్కి సంగీతం సమకూర్చారు. ముకేష్.జి. అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి మరియొక ప్రధాన ఆకర్షణ గా నిలుస్తుంది.
ఇది తమిళ్ కి అనువాద చిత్రమైనా సరే విడుదల అయిన ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి సోషల్ మీడియా లో విశేష స్పందన వస్తుంది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా గురించి నిర్మాత బి.వెంకట నరసింహ రెడ్డి మాట్లాడుతూ ఇది ఒక సస్పెన్స్ హార్రర్ థ్రిల్లర్. హార్రర్ కధ, కధనాల నేపధ్యం లో ఇంతకు ముందు వచ్చిన సినిమాల కంటే ఇది చాలా భిన్నంగా ఉంటది, ఆధ్యాంతం ప్రేక్షకుడి ఆలోచనలలో భయం మెదులుతూ ఉంటుంది. క్లైమాక్స్ ని చాలా కొత్తగా చూస్తారు. తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఈ సినిమా విజయం పట్ల మాలో నమ్మకాన్ని ఇంకా బలపరిచింది. పూర్తి సహకారం అందిస్తున్న తెలుగు వెబ్ సైట్ లకు మా టీం ధన్యవాదాలు తెలుపుతుంది.
ఈ సినిమా విజయం లో ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా మా వెన్నంటే వుండి మమ్మల్ని గెలిపిస్తారనే నమ్మకం తోనే మార్చి 17వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా 300లకు పైగా థియేటర్లలో భారిగా మా సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.
కాగా, ఈ ‘’రారా స్వామి రారా’’ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రేండింగ్ గా నిలవడం మాత్రం ఈ సినిమా మీద ప్రేక్షకులలో కూడా అంచనాలను భారీగానే కలగ చేస్తున్నాయి.IMG-20170309-WA0029IMG-20170309-WA0029IMG-20170309-WA0034