☘ గురువు పెట్టిన పరీక్షలో ఆంతర్యం ☘ ☀(తపోసిద్ధి పరమావధి )☀

అది చక్కటి నదీ తీరం ,పచ్చటి చెట్లతో, పక్షుల కిలకిలారావాలతో ,చిన్నచిన్న రాళ్లను తడుతూ అందమైన వంపులతో ప్రవహిస్తున్న గంగానది అలల సవ్వడితో ,ప్రశాంతతకు శాశ్వత చిరునమా ఇదేనేమో అనిపించే అత్యద్భుతమైన ,అతి మహిమాన్వితమైన ఋషుల ఆశ్రమం అది .గొప్ప తపోక్షేత్రం .

అప్పుడే సంధ్యానుష్ఠానం ముగించుకొని నది నుండి ఆశ్రమం వైపుకు వస్తున్న గురువుగారి వద్దకి ,సాధనా జిజ్ఞాస గల ఇద్దరు బ్రహ్మచారులు వచ్చి పాదాభివందనం చేసి , వారికి ఉపాసనా మార్గాలు ఉపదేశించి తపోసిద్ధిని ప్రసాదించుమని ప్రాధేయపడతారు . అది గమనించిన గురువుగారు వారిరువురి యోగ్యతను పరీక్షించదలచి ఇద్దరికీ చెరొక బరువుగా ఉన్న మంచినీటి పాత్రను ఇచ్చి అలా నదీతీరం వరకు వెళ్ళి ఆశ్రమానికి రమ్మంటారు .
సరే అంటూ ఇద్దరు అలా వెళ్ళి తిరిగి ఆశ్రమంలో ఉన్న గురువుగారి వద్దకి చేరుతారు .తాను మనో నేత్రంతో చూసి ఎవరి చేతిలోని నీటిపాత్ర ఖాళీగా ఉందో ఆ బ్రహ్మచారికి మంత్రోపదేశం చేసి తపోసిద్ధి మర్గాన్ని అనుగ్రహిస్తారు. అది చూసిన మరొక అబ్బాయి ….!!!!! తాను జాగ్రత్తగా నడుస్తూ ఒక్క చుక్కనీరు కుడా కింద పడకుండా జాగ్రత్తపడి యధాతథంగా వస్తే తనకెందుకు సిద్ధిని ప్రసాదించలేదంటూ విలపిస్తాడు ,
☀ అప్పుడు గురువుగారు ఇలా బోధిస్తారు…
☘ మంత్రోపదేశాన్ని పొందిన ఆ పిల్లవాడు తాను నడిచిన దారిలో ఎండిపోతున్న తులసీ మొక్కకు కొంత నీరును , దాహంతో అలమటిస్తున్న బాటసారికి కొంత నీటిని అందిస్తూ చివరగా మిగిలిన ఆ కొంతనీటిని అశ్రమం బయటనున్న గోమాతకు అందజేసి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు .అందువల్లనే అనుగ్రహించానని చెబుతాడు …..
☀ గురుబోధలో నీతి : తపోసిద్దిని గాని , సాధనా సిద్దిని గాని విశ్వహితానికి వినియోగించడమే అసలు పరమార్థం . అలాంటి గుణం ఎవరికుందో చూసి వారికే సిద్దిని ప్రసాదించాడు గురుదేవుడు .
రచన
డా .శివ ప్రసాద శాస్త్రిIMG-20170325-WA0048