ఈ సినిమాలో అందాల ఆరబోత మోతాదు మించలేదు అంటున్న ఆ హాట్ భామ…!

సహజంగానే చిత్రసీమ లో హీరోయిన్ అంటే అందం, అభినయం తో పాటు అందాల ప్రదర్శనకు తారామణులు సిద్దంగా ఉండాలి. సినిమా అంటే నాలుగు గొప్ప మాటలు, నవరసాలు, అన్న మాటను గుర్తు చేస్తూ చాలా మంది హీరొయిన్ లు అందాల ఆరబోతుకి ఓకే అని ముందే చెప్పేస్తారు. అదే బాటలో మంచి నటన తో పాటు సెక్షి హీరొయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న భామ రిచా పనై. తమిళ్ మలయాళం కన్నడ తో పాటు తెలుగు లో కుడా మంచి గుర్తింపు పొందిన ఈ హీరొయిన్ లేటెస్ట్ గా తెలుగు లో నటిస్తున్న సినిమా ‘’రక్షక భటుడు’’.
సుఖీభ‌వ మూవీస్ బ్యాన‌ర్‌పై వంశీకృష్ణ ఆకెళ్ల ద‌ర్శ‌క‌త్వంలో ఎ.గురురాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక డిఫరెంట్ కథ, కథనం తో తెరకెక్కుతుంది. ఇందులో రిచాప‌నై మరియు (మరో స్టార్ హీరో) నటిస్తుండగా, బ్రహ్మానందం, సుప్రీత్, అదుర్స్ రఘు, చిత్రం శ్రీను, జ్యోతి, ధన్ రాజ్, రాం జగన్, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, బ్ర‌హ్మాజీ త‌దిత‌రులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి మల్హార్ భట్ట్ కెమెరా మరియు శేఖర్ చంద్ర సంగీతం, అమర్ రెడ్డి ఎడిటింగ్ ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి.
కాగా, ఈ సినిమా గురించి రిచా పనై మాట్లాడుతూ ఇంతక ముందు చేసిన సినిమాల కంటే చాలా భిన్నమైన సినిమా ఇది, కథ వినిన వెంటనే నేను ఎలాగైనా చేయాలి అని ధృడంగా నిర్ణయం తీసుకున్నాను. కొన్ని సినిమాలలో అందాల ప్రదర్శన ఇస్తేనే హిట్ అవుతాయి, కాని కొన్ని సినిమాలు మాత్రం మంచి అభినయాన్ని, నటనను కనబరిస్తే పెద్ద హిట్ అవుతాయి. ఆర్టిస్ట్ ల నటన తో బిగ్ హిట్ అయ్యే రేంజ్ వున్న సినిమా ఇది. దర్శకులు నా పాత్రను డిజైన్ చేసిన విధానం నన్ను భాగా ఆకట్టుకుంది, విడుదల అయిన తరువాత ప్రతి ప్రేక్షకుడిని అంతే ఆకట్టుకుంటుంది, మా టీం అందరికి అంత నమ్మకం ఉంది, ఇంకా రిచా మాట్లాడుతూ మా నిర్మాత పెట్టిన ప్రతి రూపాయి తెర మీద చాలా గొప్పగా కనపడుతుంది, మిగితా టెక్నిషియన్స్ అందరూ పడ్డ కష్టం మొత్తం సినిమా విడుదల తరువాత గొప్ప విజయంగా మాకు అందుతుంది అన్నారు.
‘’మొదటి సారి చాలా ఫ్రెష్ కథ ఏంచుకున్నాం, సాధార‌ణంగా దేవుడ్ని చూస్తే దెయ్యాలు భ‌యంతో పారిపోతాయి కాని మా సినిమాలో మాత్రం దెయ్యం వెళ్లి ఒక బలమైన కారణం కోసం దేవుడిని శరణు కోరడం, దెయ్యమైనా సరే న్యాయం వుందని దేవుడు తోడుగా నిలవడం అనేది ముఖ్య భూమికగా చూపించాం. ఆ న్యాయం మరియు బలమైన కారణం ఏంటి అనేది సినిమాలో చూడాలి ,ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్. అరకు లోయలో సగ భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో ఇంట‌ర్వెల్ వ‌ర‌కు అవుటండ్ అవుట్ ఎంట‌ర్‌టైన్మెంట్‌ ఉంటుంది. సెకండాఫ్‌లో మంచి ఎమోష‌న‌ల్ సీన్స్‌తో పాటు ఎంట‌ర్‌టైన్మెంట్ మిక్స్ అయ్యింటుంది. క్లైమాక్స్ చివ‌రి ప‌దిహేను నిమిషాలు అంద‌రి హృద‌యాల‌ను హ‌త్తుకుంటుంది అని చిత్ర బృంధం తెలిపారు.
అయితే ఈ మధ్యే విడుదల అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి, మోషన్ పోస్టర్ కి ఆశేష ప్రేక్షక జనం నుండి వస్తున్న ప్రశంశలు మరియు ఆధరణ చూసి రక్షక భటుడు టీం ఈ సినిమా ట్రైలర్ ని ఈ వారమే విడుదల చేసి, సినిమా ని ఈ నెల 7 వ తేదిన భారి భారిగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుందంట.
కాగా, భారి తారాగణం తో పాటు, భారి విలువలు తో నిర్మించిన ఈ సినిమా పై ఇప్పటికే అంచనాలు భారిగా నెలకొన్నాయి.IMG-20170328-WA0113