Daily Archives: March 25, 2017

సింగర్ గీతా మాధురికి అదృష్టం తలుపు తట్టిందంటా…! కారణం ఏవరో తెలుసా..?

గీతా మాధురి, తన హస్కి వాయిస్ తో ఏటువంటి పాటకు అయినా ఇట్టే ప్రాణం పోయగల ఓ స్టార్ సింగర్. మరి సింగర్ కి ఈ మధ్య అదృష్ట దేవత బాగా దగ్గర అయిందని ఫిలిం నగర్ లో టాక్.
మరి దానికి కారణం ఏవరో తెలుసా..? ఇంకెవరో కాదండి తన ప్రాణానికి ప్రాణం అయిన తన భర్త యాక్టర్ నందు.
బాగా కారం పట్టిన ఊరగాయను వడ్డించకుండా ఊరిస్తున్నటుంది కదూ…!
సరే, అసలు విషయానికి వస్తే, ఈ మధ్య కాలం లో తన సహజ నటనను ప్రదర్శిస్తూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకొని వరుస సినిమాలు వాటి విజయాల పరంపరతో దూసుకు పోతున్న నటుడు మన నందు.
నందు ఈ మధ్య నటిస్తున్న సినిమాల సంఖ్యా చాలానే ఉంది, వాటిలో విడుదలకు సిద్ధమైన ఒక సినిమా రక్షకభటుడు .
సుఖీభ‌వ మూవీస్ బ్యాన‌ర్‌పై వంశీకృష్ణ ఆకెళ్ల ద‌ర్శ‌క‌త్వంలో ఎ.గురురాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నందు కి జోడిగా రిచాప‌నై నటిస్తుండగా, బ్రహ్మానందం, సుప్రీత్, అదుర్స్ రఘు, చిత్రం శ్రీను, జ్యోతి, ధన్ రాజ్, రాం జగన్, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, పృథ్వీ, స‌ప్త‌గిరి, బ్ర‌హ్మాజీ త‌దిత‌రులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి మల్హార్ భట్ట్ కెమెరా మరియు శేఖర్ చంద్ర, అమర్ రెడ్డి ఎడిటింగ్ ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి.
ఈ సినిమా టీం మాట్లాడుతూ ఇది చాలా డిఫ‌రెంట్ క‌థ. సాధార‌ణంగా దేవుడ్ని చూస్తే దెయ్యాలు భ‌యంతో పారిపోతాయి కాని మా సినిమాలో మాత్రం దెయ్యం వెళ్లి దేవుడిని శరణు కోరడం, దెయ్యమైనా సరే దేవుడు తోడుగా నిలవడం అనేది ముఖ్య భూమికగా చూపించాం. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్. అరకు లోయలో సగ భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో ఇంట‌ర్వెల్ వ‌ర‌కు అవుటండ్ అవుట్ ఎంట‌ర్‌టైన్మెంట్‌ ఉంటుంది. సెకండాఫ్‌లో మంచి ఎమోష‌న‌ల్ సీన్స్‌తో పాటు ఎంట‌ర్‌టైన్మెంట్ మిక్స్ అయ్యింటుంది. క్లైమాక్స్ చివ‌రి ప‌దిహేను నిమిషాలు అంద‌రి హృద‌యాల‌ను హ‌త్తుకుంటుంది అని తెలిపారు.
కాగా, భారి తారాగణం తో పాటు సినిమాలో భారి విలవలు కుడా వుండటం తో ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.
కాగా నిలువెత్తు ప్రేమతో అన్యోన్న దంపతులుగా ఇండస్ట్రీ కి బాగా దగ్గరైన నందు అండ్ గీతా మాధురి ఈ సినిమా సక్సెస్ లో ఒక భాగం అయ్యారు అని సిని జనాలు ఈ జంటను పోగిడేస్తున్నారంటా. అయితే వరుస సినిమాలతో దూసుకెళ్తున్న నందు కి మాత్రం ఈ సినిమా ఒక గొప్ప బ్రేక్ అవుంతుంది టీం తన శుభాకాంక్షలు తెలియజేసారు.
అయితే ఈ మధ్యే విడుదల అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి, మోషన్ పోస్టర్ కి ఆశేష ప్రేక్షక జనం నుండి వస్తున్న ప్రశంశలు మరియు ఆధరణ చూసి రక్షక భటుడు టీం ఈ సినిమా ట్రైలర్ ని ఈ వారమే విడుదల చేసి, సినిమా ని ఈ నెల రెండో వారం లో భారిగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుందంట.
ఆంజనేయుడి రక్ష, రాక్షస పోరాటం మీద నడిచే ఈ సినిమా సమ్మర్ తోలి హిట్ గా ఇప్పటికే ప్రజలలో చెరగని ముద్ర వేసుకుంది.IMG-20170325-WA0161IMG-20170325-WA0163IMG-20170325-WA0162

☘ జీవన సూత్రాలు ☘

110 ☀కలువ నేర్పే సౌందర్య సూత్రం ☀

☘ ఇప్పటి మన స్థితిని చూసి ఏనాడూ కృంగిపోవద్దు .ఓపిక వహించి ఎదుగుదలకు ప్రయత్నిస్తే భవిష్య ప్రపంచానికి సౌందర్య నిర్వచనం మనమే అవుతాము .
గుర్తుంచుకోండి …,
☘ తామర పువ్వు (కలువ పువ్వు ) వికసించేది బురద నీటినుండే , కానీ అందానికి చిరునమా అదే ,శ్రీ మహా లక్ష్మీ దేవికి ఇష్టమైన పుష్పం కుడా అదే …..

☀ డా .శివ ప్రసాద శాస్త్రి ☀IMG-20170325-WA0048