గోదావరి ప్రవాహం లాగే మా ప్రయాణం సాగేలా ప్రేక్షకదేవుళ్ళే ధీవిస్తారని మా నమ్మకం… ! నిర్మాత.

గోదావరి అందాలు ఎలా ఉంటాయో, గోదావరి వాసులా నమ్మకాలు, పనులు అంత గొప్పగా ఉంటాయి అని ఆ నిర్మాత ఒక్క మాటలో తేల్చేసాడు.
ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు అత్యంత ఆదరించిన సినిమాగా మిక్షర్ పొట్లం ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ అయ్యింది. కాగా ఈ సినిమా ఆధరణకు ఆశేష ప్రేక్షక మహాశాయలకు అభినందనలు చెప్తూ మిక్షర్ పొట్లం టీం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఆ ప్రెస్ మీట్ లో నిర్మాతలు కలపటపు శ్రీ లక్ష్మి ప్రసాద్, కంటే వీరన్న చౌదరి మరియు లంకపల్లి శ్రీనివాస్ రావులు మాట్లాడతూ సహజంగా పోరాడే ప్రతి మనిషి గెలవాలనుకుంటాడు. మేము ఈ ఇండస్ట్రీ లో నిలబడాలనే వచ్చాం. కాని మా తోలి సినిమాకే ప్రేక్షకులు ఇంతలా ఆదరిస్తారని మాత్రం అనుకోలేదు. ఆడియో నే ఇంత పెద్ద హిట్ చేసారంటే, సినిమాను ఇంకెంత పెద్ద హిట్ చేస్తారో అని గర్వంగా ఫీల్ అవుతున్నాం. ప్రతి ప్రేక్షకుడికి మనఃస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం, మేము గోదావరి వాసులం. ఇక ముందు ముందు కూడా మా గోదావరి ప్రవాహం లాగే మా ప్రయాణం సాగేలా ప్రేక్షకదేవుళ్ళే ధీవిస్తారని మా నమ్మకం అని తెలిపారు.
కాగా, ఈ సినిమాలో కొత్తబంగారు లోకం తో తెలుగు తెరకు పరిచయం అయ్యి, మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న శ్వేతా బసు ప్రసాద్ చాలా కాలం తరువాత తిరిగి మళ్ళి లీడ్ హీరోయిన్ గా చేస్తూ, భానుచందర్ కుమారుడు జయంత్ హీరో గా , మరియు గితాంజలిని మరొక హీరోయిన్ గా పరిచయం చేస్తూ తెరకెక్కిన ఈ సినిమా లో భాను చందర్ , సుమన్ పోసాని, భగవాన్, ఆలి, వంటి భారి తారాగణం నటించగా యం.వి సతీష్ కుమార్ దర్శకత్వం వహించగా, మెలోడి మాస్టర్ శ్రీ మాదవపెద్ది సురేష్ చంద్ర సంగీతం అందించారు.
విడుదల కు ముందే ప్రేక్షకుల వద్ద ఇంత భారి క్రేజే తెచ్చుకున్న ఈ మిక్షర్ పొట్లం ప్రపంచ వ్యాప్తంగా అతి త్వరలో మన ముందుకు రానుంది.IMG-20170309-WA0035