దుబ్బాక చేనేత సొసైటీలో సమంత

 

తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ సమంత తన బాధ్యతకు న్యాయం చేసే దిశగా కదిలారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో చేనేత సహకార సంఘాన్ని సమంత సందర్శించారు. చేనేత వస్త్రాల తయారీ, మార్కెటింగ్, చేనేత కార్మికుల జీవన స్థితిగతులపై ఆమె ఆరాతీశారు. చేనేత కార్మికులు నేసిన వస్త్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెటింగ్ కోసం తాను మరింత మెరుగైన విధానాలు పరిశీలించి విస్తరించే ఏర్పాట్లు చేస్తానని సమంత వారికి హామీ ఇచ్చారు. వ్యక్తిగతంగా ఆర్డర్లు తీసుకొస్తానని ఆమె భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సమంతకు శాంపిల్ గా దుబ్బాక చేనేత సహకార సంఘంలో తయారు చేసిన చేతిరుమాలు, లెనిన్ క్లాత్ ను కార్మికులు ఇచ్చారు. సమంతను చూసేందుకు దుబ్బాకవాసులు పోటీ పడ్డారు.samanthasiddipeta