సోషల్ మీడియా లో సరికొత్త రికార్డ్ లను పిలుస్తున్న ‘’రారా స్వామి రారా’’ ట్రైలర్.

వెంకట నరసింహ ఫిలిమ్స్ బ్యానర్ పై బి.వెంకట నరసింహ రెడ్డి (పవన్ సింహా) నిర్మిస్తూ, ఆర్.నితిన్ సమర్పించిన చిత్రం ‘’రారా స్వామి రారా’’.
ఆమ్జాత్ మరియు శ్రీని ప్రధాన పాత్రలు పోషించగా, స్వామి రారా ఫేం పూజ రామచంద్రన్ మరియు #నాజర్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా కు రాబర్ట్ రాజ్ దర్శకత్వం వహించగా ప్రకాష్ నిక్కి సంగీతం సమకూర్చారు. ముకేష్.జి. అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి మరియొక ప్రధాన ఆకర్షణ గా నిలుస్తుంది.
ఇది తమిళ్ కి అనువాద చిత్రమైనా సరే విడుదల అయిన ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి సోషల్ మీడియా లో విశేష స్పందన వస్తుంది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా గురించి నిర్మాత బి.వెంకట నరసింహ రెడ్డి మాట్లాడుతూ ఇది ఒక సస్పెన్స్ హార్రర్ థ్రిల్లర్. హార్రర్ కధ, కధనాల నేపధ్యం లో ఇంతకు ముందు వచ్చిన సినిమాల కంటే ఇది చాలా భిన్నంగా ఉంటది, ఆధ్యాంతం ప్రేక్షకుడి ఆలోచనలలో భయం మెదులుతూ ఉంటుంది. క్లైమాక్స్ ని చాలా కొత్తగా చూస్తారు. తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఈ సినిమా విజయం పట్ల మాలో నమ్మకాన్ని ఇంకా బలపరిచింది. పూర్తి సహకారం అందిస్తున్న తెలుగు వెబ్ సైట్ లకు మా టీం ధన్యవాదాలు తెలుపుతుంది.
ఈ సినిమా విజయం లో ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా మా వెన్నంటే వుండి మమ్మల్ని గెలిపిస్తారనే నమ్మకం తోనే మార్చి 17వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా 300లకు పైగా థియేటర్లలో భారిగా మా సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.
కాగా, ఈ ‘’రారా స్వామి రారా’’ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రేండింగ్ గా నిలవడం మాత్రం ఈ సినిమా మీద ప్రేక్షకులలో కూడా అంచనాలను భారీగానే కలగ చేస్తున్నాయి.IMG-20170309-WA0029IMG-20170309-WA0029IMG-20170309-WA0034