Monthly Archives: March 2017

☘ ఉగాది ఉత్సాహం ☘

 

ఈరోజు “హరిహర రుద్రవీణ మాస పత్రిక” మరియు “శ్రీ మహారాజ్ఞి సేవా సంస్థాన్ ” అధ్వర్యంలో ‘ఉగాది ఉత్సహం’ అనే సేవా ప్రాజెక్టు ను చేపట్టి ,చుట్టుప్రక్కల గ్రామాలనుండి వచ్చి నిరాశ్రయులైన వలస కుటుంబాల మహిళలకు యధాశక్తిని అనుసరించి కొత్త చీరల పంపిణి చేయడం జరిగింది . ఉగాది రోజు కడుపునిండా తినడానికి కావలిసిన ధాన్యాన్ని అందజేసి ఆ మాతృ మూర్తుల ఆశీర్వదం పొందడం మాకు దక్కిన మహా భాగ్యం ……
☀ పాఠకుల ఆశీర్వాదాలతో ☀
☘ వుప్పల బాలసుబ్రహ్మణ్యం
హరిహర రుద్రవీణ మాస పత్రిక
(ప్రధాన సంపాదకులు )
&
☘ డా .శివ ప్రసాద శాస్త్రి
వ్యవస్థాపకులు
శ్రీ మహారాజ్ఞి సేవా సంస్థాన్
( హైద్రాబాద్ డెస్క్ ఇంచార్జి )
మరియు
పత్రిక యొక్క ఇతర సిబ్బంది.FB_IMG_1490782456579FB_IMG_1490782467319FB_IMG_1490782464272

ఈ సినిమాలో అందాల ఆరబోత మోతాదు మించలేదు అంటున్న ఆ హాట్ భామ…!

సహజంగానే చిత్రసీమ లో హీరోయిన్ అంటే అందం, అభినయం తో పాటు అందాల ప్రదర్శనకు తారామణులు సిద్దంగా ఉండాలి. సినిమా అంటే నాలుగు గొప్ప మాటలు, నవరసాలు, అన్న మాటను గుర్తు చేస్తూ చాలా మంది హీరొయిన్ లు అందాల ఆరబోతుకి ఓకే అని ముందే చెప్పేస్తారు. అదే బాటలో మంచి నటన తో పాటు సెక్షి హీరొయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న భామ రిచా పనై. తమిళ్ మలయాళం కన్నడ తో పాటు తెలుగు లో కుడా మంచి గుర్తింపు పొందిన ఈ హీరొయిన్ లేటెస్ట్ గా తెలుగు లో నటిస్తున్న సినిమా ‘’రక్షక భటుడు’’.
సుఖీభ‌వ మూవీస్ బ్యాన‌ర్‌పై వంశీకృష్ణ ఆకెళ్ల ద‌ర్శ‌క‌త్వంలో ఎ.గురురాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక డిఫరెంట్ కథ, కథనం తో తెరకెక్కుతుంది. ఇందులో రిచాప‌నై మరియు (మరో స్టార్ హీరో) నటిస్తుండగా, బ్రహ్మానందం, సుప్రీత్, అదుర్స్ రఘు, చిత్రం శ్రీను, జ్యోతి, ధన్ రాజ్, రాం జగన్, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, బ్ర‌హ్మాజీ త‌దిత‌రులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి మల్హార్ భట్ట్ కెమెరా మరియు శేఖర్ చంద్ర సంగీతం, అమర్ రెడ్డి ఎడిటింగ్ ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి.
కాగా, ఈ సినిమా గురించి రిచా పనై మాట్లాడుతూ ఇంతక ముందు చేసిన సినిమాల కంటే చాలా భిన్నమైన సినిమా ఇది, కథ వినిన వెంటనే నేను ఎలాగైనా చేయాలి అని ధృడంగా నిర్ణయం తీసుకున్నాను. కొన్ని సినిమాలలో అందాల ప్రదర్శన ఇస్తేనే హిట్ అవుతాయి, కాని కొన్ని సినిమాలు మాత్రం మంచి అభినయాన్ని, నటనను కనబరిస్తే పెద్ద హిట్ అవుతాయి. ఆర్టిస్ట్ ల నటన తో బిగ్ హిట్ అయ్యే రేంజ్ వున్న సినిమా ఇది. దర్శకులు నా పాత్రను డిజైన్ చేసిన విధానం నన్ను భాగా ఆకట్టుకుంది, విడుదల అయిన తరువాత ప్రతి ప్రేక్షకుడిని అంతే ఆకట్టుకుంటుంది, మా టీం అందరికి అంత నమ్మకం ఉంది, ఇంకా రిచా మాట్లాడుతూ మా నిర్మాత పెట్టిన ప్రతి రూపాయి తెర మీద చాలా గొప్పగా కనపడుతుంది, మిగితా టెక్నిషియన్స్ అందరూ పడ్డ కష్టం మొత్తం సినిమా విడుదల తరువాత గొప్ప విజయంగా మాకు అందుతుంది అన్నారు.
‘’మొదటి సారి చాలా ఫ్రెష్ కథ ఏంచుకున్నాం, సాధార‌ణంగా దేవుడ్ని చూస్తే దెయ్యాలు భ‌యంతో పారిపోతాయి కాని మా సినిమాలో మాత్రం దెయ్యం వెళ్లి ఒక బలమైన కారణం కోసం దేవుడిని శరణు కోరడం, దెయ్యమైనా సరే న్యాయం వుందని దేవుడు తోడుగా నిలవడం అనేది ముఖ్య భూమికగా చూపించాం. ఆ న్యాయం మరియు బలమైన కారణం ఏంటి అనేది సినిమాలో చూడాలి ,ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్. అరకు లోయలో సగ భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో ఇంట‌ర్వెల్ వ‌ర‌కు అవుటండ్ అవుట్ ఎంట‌ర్‌టైన్మెంట్‌ ఉంటుంది. సెకండాఫ్‌లో మంచి ఎమోష‌న‌ల్ సీన్స్‌తో పాటు ఎంట‌ర్‌టైన్మెంట్ మిక్స్ అయ్యింటుంది. క్లైమాక్స్ చివ‌రి ప‌దిహేను నిమిషాలు అంద‌రి హృద‌యాల‌ను హ‌త్తుకుంటుంది అని చిత్ర బృంధం తెలిపారు.
అయితే ఈ మధ్యే విడుదల అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి, మోషన్ పోస్టర్ కి ఆశేష ప్రేక్షక జనం నుండి వస్తున్న ప్రశంశలు మరియు ఆధరణ చూసి రక్షక భటుడు టీం ఈ సినిమా ట్రైలర్ ని ఈ వారమే విడుదల చేసి, సినిమా ని ఈ నెల 7 వ తేదిన భారి భారిగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుందంట.
కాగా, భారి తారాగణం తో పాటు, భారి విలువలు తో నిర్మించిన ఈ సినిమా పై ఇప్పటికే అంచనాలు భారిగా నెలకొన్నాయి.IMG-20170328-WA0113

శ్రీ హేవళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు

ఉగాది పండగ తెలుగు వారి ప్రముఖ పండగ మరియు ఘనంగా అధికారికంగా జరుపుకునే పండగ. ఈ పండగ చైత్ర మాస చైత్ర మాస శుద్ధ పాడ్యమి నాడు వస్తుంది. ఈ పండుగ రోజున పంచాంగ శ్రవణము చేయుట ,షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి ని భుజించుట ప్రశస్త్యమైనది.

ఉగాది’ అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. ‘యుగము’ అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం ‘యుగం’ (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది. తత్రచైత్రశుక్ల చైత్రశుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది ‘ఉగాది’గా ఆచరణీయమని నిర్ణయసింధుకారుడు పేర్కొనియున్నాడు.

“ఉగాది” ఆచరణ విధానం:

ఉగాది పర్వాచరణ విధానాన్ని ‘దర్మసింధు’ కారుడు ’పంచవిధుల సమన్వితం’గా ఇలా సూచించియున్నాడు. తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం, నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం), ధ్వజారోహణం (పూర్ణకుంభదానం), పంచాంగ శ్రవణం…మున్నగు ‘పంచకృత్య నిర్వహణ’ గావించవలెనని వ్రతగంధ నిర్దేశితం.

(1) తైలాభ్యంగనం

తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం ప్రధమ విధి. ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను, ఆవహించి వుండునని ఆర్యోక్తి. కావున నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేసిన లక్ష్మి, గంగా దేవుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అభ్యంగంకారయోన్నిత్యం సర్వేష్వంగేషు పుష్ఠినం (అభ్యంగన స్నానం అన్ని అవయవాలౌ పుష్ట్టిదాయకం) అని ఆయుర్వేదోక్తి దృష్ట్యాఅభ్యంగనం ఆరోగ్యం కూడా. ఆరోగ్యరీత్యా ఆధ్యాత్మికరీత్యా తైలభ్యంగనానికీ రీతిగా విశేష ప్రాధాన్యమీయబడినది.

(2) నూతన సంవత్సర స్తోత్రం

అభ్యంగ స్నానానంతరం సూర్యునికి, ఆర్ఘ్యదీపధూపాధి,పుణ్యకాలానుష్టానం ఆచరించిన పిదప మామిడి ఆకులతోరణాలతో, పూలతోరణాలతో దేవుని గదిలో మంటపాన్ని నిర్మించి, అందు నూతన సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది దేవతను, ఇష్టదేవతారాధనతో బాటు పూజించి ఉగాది ప్రసాదాన్ని (ఉగాది పచ్చడి) నివేదించవలెను.

(3) ఉగాడి పచ్చడి సేవనం

ఉగాది నాటి ఆచారాలలో ఉగాది పచ్చడి సేపనం అత్యంత ప్రధానమైనది. వేపపూత, కొత్త చింతపండు, బెల్లం లేక పంచదార లేక చెరకు ముక్కలు, నేయి, ఉప్పు, మిరియాలు, షడచులు మిళితమైన రసాయనాన్నే ఉగాడి పచ్చడి అంటాం!

అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతమ్‌ భక్షితం పూర్వయామేతు తద్వర్షే సౌఖ్య దాయకమ్‌ అని ధర్మ సింధు గ్రంధం చెబుతున్నది. ఈ ఉగాడి పచ్చడిని ఇంట్లో అందరూ పరగడుపున సేవించవలెను. ఉగాడి నాడు ఉగాడి పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా సౌఖ్యదాయకమని ఈ శ్లోక భావం, పలురుచుల మేళవింపు అయిన ఉగాడి పచ్చడి కేవలం రుచికరమే కాదు ప్రభోదాత్మకం కూడా! తీపి వెనుక చేదు, పులుపు ఇలా పలురుచులకు జీవితాన కష్టాలు, తదితర అనుభూతులు, ప్రతీకలే అనే నగ్న సత్యాన్ని చాటుతూ సుఖాలకు పొంగకు, దు:ఖానికి క్రుంగకు, సుఖదు:ఖాలను సమభావంతో స్వీకరించు అనే ప్రగతిశీల సందేశాన్నిస్తుందీ ఉగాది పచ్చడి. అంతేగాక ఈ పచ్చడి సేవన ఫలంగా వివిధ అనారోగ్య స్థితులు పరిహరించబడి, రోగశాంతి, ఆరోగ్యపుష్టి చేకూరుట గమనార్హం.

(4) పూర్ణ కుంభదానం

ఉగాదినాడు ఇంద్రధ్వజ, బ్రహ్మధ్వజ ప్రతిష్టపన ఆచారంగా ఉన్నది. ఒక పట్టు వస్త్రాన్ని ఒక వెదురు గడకు పతాకం వలె కట్టి దానిపై నారికేళముంచబడిన కలశాన్ని వుంచి, ఆ కర్రకు మామిడి ఆకులు, నింబ పత్రాలు, పూల తోరణాలు కట్టి ఇంటి ప్రాంగణంలో ప్రతిష్టించి ఆరాధించడం ధ్వజావరోహణం. ఇటీవల ఈ ఆచారం చాలావరకు కనుమరుగై దాని స్థానంలో కలశ స్థాపన, పూర్ణకుంభదానం ఆచరణలోకి వచ్చింది. యధాశక్తి రాగి, వెండి, పంచలోహం లేదా మట్టితో చేసిన కొత్తకుండను కలశంలా చేసి రంగులతో అలంకరించి అందులో పంచపల్లవాలు (మామిడి, అశోక, నేరేడు, మోదుగ మరియు వేప చిగుళ్ళు) సుగంధ చందనం కలిపి పుష్పాక్షతలు వేసి ఆవాహనం చేసి, పూజించి కలశానికి ఒక నూతన వస్త్రాన్ని చుట్టి కలశంపై పసుపు కుంకుమ చందనం, పసుపు దారాలతో అలంకరించిన కొబ్బరి బోండాం నుంచి పూజించి పురోహితునకుగాని, గురుతుల్యులకుగానీ, పూర్ణకుంభదానమిచ్చి వారి ఆశీస్సులు పొందడం వల్ల సంవత్సరం పొడవునా విశేష ఫలితం లభిస్తుందని ప్రతీతి.

(5) పంచాంగ శ్రవణం

తిధి, వార, నక్షత్ర, యోగ, కరణములనెడి పంచ అంగాల సమన్వితం పం చాంగం. ఉగాది నాడు దేవాల యంలోగాని, గ్రామ కూడలి ప్రదేశాల్లోగాని, పండితుల, సిద్థాం తుల సమ క్షంలో కందాయఫలాలు స్థూ లంగా తెలుసుకొని తదనుగుణంగా సంవత్సరం పొడవునా నడచుకొనుటకు నాడే అంకురార్పణం గావించవలెనని చెప్పబడియున్నది. ఉగాదినాటి పంచాంగ శ్రవణం వల్ల గంగానదిలో స్నానం చేస్తే అభించేటంత ఫలితం లభిస్తుంది.

ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్రసమాన వైభవాన్ని, కుజుడు శుభాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహువు బాహుబలాన్ని, కేతువు కులాధిక్యతను కలుగచేస్తారని చెప్పబడినది.2017-03-28-12-27-43-014

☘ గురువు పెట్టిన పరీక్షలో ఆంతర్యం ☘ ☀(తపోసిద్ధి పరమావధి )☀

అది చక్కటి నదీ తీరం ,పచ్చటి చెట్లతో, పక్షుల కిలకిలారావాలతో ,చిన్నచిన్న రాళ్లను తడుతూ అందమైన వంపులతో ప్రవహిస్తున్న గంగానది అలల సవ్వడితో ,ప్రశాంతతకు శాశ్వత చిరునమా ఇదేనేమో అనిపించే అత్యద్భుతమైన ,అతి మహిమాన్వితమైన ఋషుల ఆశ్రమం అది .గొప్ప తపోక్షేత్రం .

అప్పుడే సంధ్యానుష్ఠానం ముగించుకొని నది నుండి ఆశ్రమం వైపుకు వస్తున్న గురువుగారి వద్దకి ,సాధనా జిజ్ఞాస గల ఇద్దరు బ్రహ్మచారులు వచ్చి పాదాభివందనం చేసి , వారికి ఉపాసనా మార్గాలు ఉపదేశించి తపోసిద్ధిని ప్రసాదించుమని ప్రాధేయపడతారు . అది గమనించిన గురువుగారు వారిరువురి యోగ్యతను పరీక్షించదలచి ఇద్దరికీ చెరొక బరువుగా ఉన్న మంచినీటి పాత్రను ఇచ్చి అలా నదీతీరం వరకు వెళ్ళి ఆశ్రమానికి రమ్మంటారు .
సరే అంటూ ఇద్దరు అలా వెళ్ళి తిరిగి ఆశ్రమంలో ఉన్న గురువుగారి వద్దకి చేరుతారు .తాను మనో నేత్రంతో చూసి ఎవరి చేతిలోని నీటిపాత్ర ఖాళీగా ఉందో ఆ బ్రహ్మచారికి మంత్రోపదేశం చేసి తపోసిద్ధి మర్గాన్ని అనుగ్రహిస్తారు. అది చూసిన మరొక అబ్బాయి ….!!!!! తాను జాగ్రత్తగా నడుస్తూ ఒక్క చుక్కనీరు కుడా కింద పడకుండా జాగ్రత్తపడి యధాతథంగా వస్తే తనకెందుకు సిద్ధిని ప్రసాదించలేదంటూ విలపిస్తాడు ,
☀ అప్పుడు గురువుగారు ఇలా బోధిస్తారు…
☘ మంత్రోపదేశాన్ని పొందిన ఆ పిల్లవాడు తాను నడిచిన దారిలో ఎండిపోతున్న తులసీ మొక్కకు కొంత నీరును , దాహంతో అలమటిస్తున్న బాటసారికి కొంత నీటిని అందిస్తూ చివరగా మిగిలిన ఆ కొంతనీటిని అశ్రమం బయటనున్న గోమాతకు అందజేసి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు .అందువల్లనే అనుగ్రహించానని చెబుతాడు …..
☀ గురుబోధలో నీతి : తపోసిద్దిని గాని , సాధనా సిద్దిని గాని విశ్వహితానికి వినియోగించడమే అసలు పరమార్థం . అలాంటి గుణం ఎవరికుందో చూసి వారికే సిద్దిని ప్రసాదించాడు గురుదేవుడు .
రచన
డా .శివ ప్రసాద శాస్త్రిIMG-20170325-WA0048

Srikonda Panchangam 2017_2018

sri konda panchangam finalIMG-20170327-WA0109

సింగర్ గీతా మాధురికి అదృష్టం తలుపు తట్టిందంటా…! కారణం ఏవరో తెలుసా..?

గీతా మాధురి, తన హస్కి వాయిస్ తో ఏటువంటి పాటకు అయినా ఇట్టే ప్రాణం పోయగల ఓ స్టార్ సింగర్. మరి సింగర్ కి ఈ మధ్య అదృష్ట దేవత బాగా దగ్గర అయిందని ఫిలిం నగర్ లో టాక్.
మరి దానికి కారణం ఏవరో తెలుసా..? ఇంకెవరో కాదండి తన ప్రాణానికి ప్రాణం అయిన తన భర్త యాక్టర్ నందు.
బాగా కారం పట్టిన ఊరగాయను వడ్డించకుండా ఊరిస్తున్నటుంది కదూ…!
సరే, అసలు విషయానికి వస్తే, ఈ మధ్య కాలం లో తన సహజ నటనను ప్రదర్శిస్తూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకొని వరుస సినిమాలు వాటి విజయాల పరంపరతో దూసుకు పోతున్న నటుడు మన నందు.
నందు ఈ మధ్య నటిస్తున్న సినిమాల సంఖ్యా చాలానే ఉంది, వాటిలో విడుదలకు సిద్ధమైన ఒక సినిమా రక్షకభటుడు .
సుఖీభ‌వ మూవీస్ బ్యాన‌ర్‌పై వంశీకృష్ణ ఆకెళ్ల ద‌ర్శ‌క‌త్వంలో ఎ.గురురాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నందు కి జోడిగా రిచాప‌నై నటిస్తుండగా, బ్రహ్మానందం, సుప్రీత్, అదుర్స్ రఘు, చిత్రం శ్రీను, జ్యోతి, ధన్ రాజ్, రాం జగన్, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, పృథ్వీ, స‌ప్త‌గిరి, బ్ర‌హ్మాజీ త‌దిత‌రులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి మల్హార్ భట్ట్ కెమెరా మరియు శేఖర్ చంద్ర, అమర్ రెడ్డి ఎడిటింగ్ ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి.
ఈ సినిమా టీం మాట్లాడుతూ ఇది చాలా డిఫ‌రెంట్ క‌థ. సాధార‌ణంగా దేవుడ్ని చూస్తే దెయ్యాలు భ‌యంతో పారిపోతాయి కాని మా సినిమాలో మాత్రం దెయ్యం వెళ్లి దేవుడిని శరణు కోరడం, దెయ్యమైనా సరే దేవుడు తోడుగా నిలవడం అనేది ముఖ్య భూమికగా చూపించాం. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్. అరకు లోయలో సగ భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో ఇంట‌ర్వెల్ వ‌ర‌కు అవుటండ్ అవుట్ ఎంట‌ర్‌టైన్మెంట్‌ ఉంటుంది. సెకండాఫ్‌లో మంచి ఎమోష‌న‌ల్ సీన్స్‌తో పాటు ఎంట‌ర్‌టైన్మెంట్ మిక్స్ అయ్యింటుంది. క్లైమాక్స్ చివ‌రి ప‌దిహేను నిమిషాలు అంద‌రి హృద‌యాల‌ను హ‌త్తుకుంటుంది అని తెలిపారు.
కాగా, భారి తారాగణం తో పాటు సినిమాలో భారి విలవలు కుడా వుండటం తో ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.
కాగా నిలువెత్తు ప్రేమతో అన్యోన్న దంపతులుగా ఇండస్ట్రీ కి బాగా దగ్గరైన నందు అండ్ గీతా మాధురి ఈ సినిమా సక్సెస్ లో ఒక భాగం అయ్యారు అని సిని జనాలు ఈ జంటను పోగిడేస్తున్నారంటా. అయితే వరుస సినిమాలతో దూసుకెళ్తున్న నందు కి మాత్రం ఈ సినిమా ఒక గొప్ప బ్రేక్ అవుంతుంది టీం తన శుభాకాంక్షలు తెలియజేసారు.
అయితే ఈ మధ్యే విడుదల అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి, మోషన్ పోస్టర్ కి ఆశేష ప్రేక్షక జనం నుండి వస్తున్న ప్రశంశలు మరియు ఆధరణ చూసి రక్షక భటుడు టీం ఈ సినిమా ట్రైలర్ ని ఈ వారమే విడుదల చేసి, సినిమా ని ఈ నెల రెండో వారం లో భారిగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుందంట.
ఆంజనేయుడి రక్ష, రాక్షస పోరాటం మీద నడిచే ఈ సినిమా సమ్మర్ తోలి హిట్ గా ఇప్పటికే ప్రజలలో చెరగని ముద్ర వేసుకుంది.IMG-20170325-WA0161IMG-20170325-WA0163IMG-20170325-WA0162

☘ జీవన సూత్రాలు ☘

110 ☀కలువ నేర్పే సౌందర్య సూత్రం ☀

☘ ఇప్పటి మన స్థితిని చూసి ఏనాడూ కృంగిపోవద్దు .ఓపిక వహించి ఎదుగుదలకు ప్రయత్నిస్తే భవిష్య ప్రపంచానికి సౌందర్య నిర్వచనం మనమే అవుతాము .
గుర్తుంచుకోండి …,
☘ తామర పువ్వు (కలువ పువ్వు ) వికసించేది బురద నీటినుండే , కానీ అందానికి చిరునమా అదే ,శ్రీ మహా లక్ష్మీ దేవికి ఇష్టమైన పుష్పం కుడా అదే …..

☀ డా .శివ ప్రసాద శాస్త్రి ☀IMG-20170325-WA0048

హరి హర రుద్రవీణ ఉగాది పురస్కారాలు ప్రదానం

శ్రీ శ్రీ శ్రీ గురు మదనానంద సరస్వతి పీఠాదీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి వారి దివ్య శుభ ఆశిస్సులతో,శ్రీ శ్రీ శ్రీ మధుసుదనానంద సరస్వతీ(శ్రీ క్షేత్రం ) స్వామి వారి పర్యవేక్షణ లో
హరి హర రుద్రవీణ మాస పత్రిక ఉగాది పురస్కారాల ను ప్రతి సంవత్సరం  పలువురు ప్రముఖులకు వివిధ విభాగాలలో బహుమతులు ప్రదానం చేస్తుంది.ఈ సంవత్సరం కూడా ఉగాది పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం హైదరాబాదు లో నిర్వహించారు. కార్యక్రమానికి ఆత్మీయఅతిథిలు గా కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి,హైకోర్ట న్యాయవాది వెల్లికంటి జ్యోతిలక్ష్మణ శర్మ పాల్గొన్నారు.
అనంతరం వివిధ రంగల ప్రముఖులకు పురస్కార గ్రహితుల కి సత్కరించి ఉగాది పురస్కారాలు ప్రదానం చేశారు.IMG-20170320-WA0075IMG-20170320-WA0089IMG-20170320-WA0086IMG-20170320-WA0070

బ్రాహ్మణాభ్యుదయ పరిషత్ (రంగారెడ్డి జిల్లా) శ్రీ హేవళంబి నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ

బ్రాహ్మణాభ్యుదయ పరిషత్ (రంగారెడ్డి జిల్లా) శ్రీ హేవళంబి నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు . కర్మనఘాట్ ధ్యానాంజనేయస్వామి
దేవస్థానం లో ఈ రోజు
పంచాంగం ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణాభ్యుదయ పరిషత్ రంగారెడ్డి జిల్లా సంఘం ప్రతినిధులు మరియు యువజన సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.IMG_20170319_164643IMG-20170319-WA0081IMG-20170319-WA0080

గోదావరి ప్రవాహం లాగే మా ప్రయాణం సాగేలా ప్రేక్షకదేవుళ్ళే ధీవిస్తారని మా నమ్మకం… ! నిర్మాత.

గోదావరి అందాలు ఎలా ఉంటాయో, గోదావరి వాసులా నమ్మకాలు, పనులు అంత గొప్పగా ఉంటాయి అని ఆ నిర్మాత ఒక్క మాటలో తేల్చేసాడు.
ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు అత్యంత ఆదరించిన సినిమాగా మిక్షర్ పొట్లం ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ అయ్యింది. కాగా ఈ సినిమా ఆధరణకు ఆశేష ప్రేక్షక మహాశాయలకు అభినందనలు చెప్తూ మిక్షర్ పొట్లం టీం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఆ ప్రెస్ మీట్ లో నిర్మాతలు కలపటపు శ్రీ లక్ష్మి ప్రసాద్, కంటే వీరన్న చౌదరి మరియు లంకపల్లి శ్రీనివాస్ రావులు మాట్లాడతూ సహజంగా పోరాడే ప్రతి మనిషి గెలవాలనుకుంటాడు. మేము ఈ ఇండస్ట్రీ లో నిలబడాలనే వచ్చాం. కాని మా తోలి సినిమాకే ప్రేక్షకులు ఇంతలా ఆదరిస్తారని మాత్రం అనుకోలేదు. ఆడియో నే ఇంత పెద్ద హిట్ చేసారంటే, సినిమాను ఇంకెంత పెద్ద హిట్ చేస్తారో అని గర్వంగా ఫీల్ అవుతున్నాం. ప్రతి ప్రేక్షకుడికి మనఃస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం, మేము గోదావరి వాసులం. ఇక ముందు ముందు కూడా మా గోదావరి ప్రవాహం లాగే మా ప్రయాణం సాగేలా ప్రేక్షకదేవుళ్ళే ధీవిస్తారని మా నమ్మకం అని తెలిపారు.
కాగా, ఈ సినిమాలో కొత్తబంగారు లోకం తో తెలుగు తెరకు పరిచయం అయ్యి, మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న శ్వేతా బసు ప్రసాద్ చాలా కాలం తరువాత తిరిగి మళ్ళి లీడ్ హీరోయిన్ గా చేస్తూ, భానుచందర్ కుమారుడు జయంత్ హీరో గా , మరియు గితాంజలిని మరొక హీరోయిన్ గా పరిచయం చేస్తూ తెరకెక్కిన ఈ సినిమా లో భాను చందర్ , సుమన్ పోసాని, భగవాన్, ఆలి, వంటి భారి తారాగణం నటించగా యం.వి సతీష్ కుమార్ దర్శకత్వం వహించగా, మెలోడి మాస్టర్ శ్రీ మాదవపెద్ది సురేష్ చంద్ర సంగీతం అందించారు.
విడుదల కు ముందే ప్రేక్షకుల వద్ద ఇంత భారి క్రేజే తెచ్చుకున్న ఈ మిక్షర్ పొట్లం ప్రపంచ వ్యాప్తంగా అతి త్వరలో మన ముందుకు రానుంది.IMG-20170309-WA0035