Monthly Archives: January 2017

మాఘ పురాణం – 3 అధ్యాయము –

మాఘ పురాణం – 3

3వ అధ్యాయము –

గురుపుత్రికాకథ
మంగళదాయినీ! సర్వమంగళా! మాఘ మాసస్నాన ప్రభావముచే పూర్వమొక బ్రాహ్మణపుత్రిక పాపవిముక్తయై తన భర్తతో హరిసాన్నిధ్యము నందినది.
అని శివుడు పార్వతీ దేవితో పలికెను. అప్పుడు పార్వతీదేవి స్వామీ! ఆ బ్రాహ్మణ పుత్రిక యెవరు. ఆమె చేసిన పాపమేమి!
మాఘస్నానమున పాపవిముక్తి నందిన విధానమేమి? వివరముగ చెప్పగోరుచున్నాననగా శివుడిట్లుపలికెను. దేవి వినుము,
పూర్వము సౌరాష్ట్రదేశమున బృందారకమనే గ్రామంలో సుదేవుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతడు సదాచారవంతుడు, వేదశాస్త్రపండితుడు.
అతనికి శిష్యులు చాలా మంది వుండేవారు. వారు, గురు సేవచేస్తూ విద్యాభ్యాసం చేస్తూవుండే వాళ్లు. ఆ సుదేవునికి
సర్వాంగసుందరి అయిన కుమార్తె వుండేది. పొడవైన కేశములతో, చక్కని ముఖంతో, చక్కని కనుముక్కు తీరులో ఆమె మిక్కిలి మనోహరంగా
వుండేది. ఇట్టి కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయగలనని అతడు విచారిస్తూవుండేవాడు.
ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమిధలు, ధర్భలు మొదలైన వాటికోసం గురువు పంపగా వెళ్ళాడు. బంతితో ఆడుకుంటున్న
గురుపుత్రికకూడా సుమిత్రుని వెంబడించి వెళ్లింది. సుమిత్రుడును చాలాదూరముపోయి ఆ అరణ్యములో ఒక జలాశయాన్ని చూచాడు. ఆ
చెరువుగట్టున యెత్తైన చెట్లున్నాయి. నీరు నిర్మల మనోహరంగా వుంది, పద్మాలు వానిపై వ్రాలే తుమ్మెదలరొద, అనేకవర్ణములలోనున్న
కలువలు, జలసంచారము చేయు జలప్రాణుల విహారము, మొదలైనవానిచే ఆ సరస్సు మనోహరముగనుండెను. కోకిలలుగుంపులు కట్టి
మధురధ్వనులు చేయుచుండెను. చిలుకలు గోరువంకలు నేర్చినమాటలను పలుకుచున్నవి. ఎత్తైన చెట్లతో కప్పబడిన ఆ
ప్రదేశము ఒక ఏకాంతమందిరములా వుంది.
గురుపుత్రిక ఆ చెరువులోని నీరుత్రాగి అచట వృక్షములకున్న పండ్లను తిని ఒకచోట కూర్చుండెను. సుమిత్రునిపై మనసుపడింది.
ఓయీ! మనుష్య సంచారము లేని, యేకాంత ప్రాయమైన యీప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని వున్నది. ఈ
వనము నీకును నాకును నచ్చినది మన మిద్ధరమును పడుచువారము, మన కలయిక సుఖప్రదమగును ఆలసించకనావద్దకు రమ్ము, నా
శరీరము దూదికంటే మెత్తగానున్నది, నీకు మరింత సుఖమిచ్చును, రమ్ము నన్ను మోహములో తనివి దీర కౌగిలించుకొనుము,
రమ్ము రమ్మనిపిలిచెను. సుమిత్రుడు మంచిదానా! నీవిట్లనకుము, నీ మాట దురాచార పూరితము. నీవు వివాహము కాని బాలవు.
నాకు గురుపుత్రికవు మనము సోదరీసోదరులము, నీవు మన్మధ పరవశురాలవై ఇలా అనుచితముగా పలుకుచున్నావు. నేను నీతో
రమింపజాలను. నేనీ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్పుచున్నాను. ఇట్టి పాపము చేసిన
మనమిద్దరము చిరకాలము నరకవాసము చేయవలసియుండును. కావున యింటికి పోదమురమ్ము, గురువుగారు మనకై
ఎదురు చూచుచుందురు. ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును. సమిధలు, దర్భలు మున్నగు వానిని గొనిపోదము రమ్ము అని
పలికెను.
గురుపుత్రిక ఆ మాటలను విని ఓయీ! కన్యారత్నము, సువర్ణము. విద్యాదేవత, అమృతము స్వయముగ
చెంతకు చేరినపుడు వలదన్నవాడు మూర్ఖుడు. ఒకరినొకరము కౌగిలించుకొనక సుఖమునందక నేనింటికిరాను. నేనిచటనే
నాప్రాణములను విడిచెదను. నీవు ఇంటికి తిరిగి వెళ్లి నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును. నేను నీతో సుఖింపని యీ
శరీరమునొల్లను. ఇచటనే యీ శరీరమును విడిచెదను. నీవింటికిపోయి దీని ఫలితము అనుభవింపుము అని నిష్టురముగ
మన్మధావేశముతో మాటలాడెను. సుమిత్రుడును యేమిచేయవలెనో తెలియని స్థితిలోనుండెను. చివరకాతడు గురుపుత్రిక
కోరికను దీర్చుటకంగీకరించెను. వారిద్దరును పద్మములతో పుష్పములతో ఎగురుటాకులతో మన్మధశయ్యను తీర్చుకొని మనోహరమైన ఆ
వాతావరణములో యధేచ్చా సుఖములననుభవించిరి. వారిద్దరును తృప్తిపడిన తరువాత సమిధలు మున్నగువానిని దీసికొని
గ్రామమునకు బయలుదేరిరి. గురువు శిష్యుడు తెచ్చిన సమిధలు మున్నగు వానిని చూచి యానందపడెను. పుత్రికను చూచి నీవు చాల
అలసినట్లున్నావు, మధురాహారమును తిని విశ్రాంతినందుమని లోనికి పంపెను. ఆమెయు అట్లేయనిలోనికెగెను.
తండ్రియామెను కాశ్మీరదేశవాసియగు బ్రాహ్మ్ణునకిచ్చి వివాహము చేసెను. కొంతకాలమునకు ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి నేలపై
బడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడును మిగుల దుఃఖించెను. అయ్యో! సుఖములనందవలసిన వయసులోనే బాధాకరమైన
వైధవ్యము కలిగినదేమి? ఈమెకిట్టి బాధను కల్పించిన ఆ బ్రహ్మయెంత మూర్ఖుడో కదా అని పలువిధములుగా దుఃఖించుచుండెను.
ఇట్లు సుదేవుడు వాని భార్య దుఃఖించుచుండగా దృడవ్రతుడను యోగి ఆ ప్రాంతమున దిరుగుచు సుదేవునిరోదనధ్వనిని విని వాని
వద్దకు వచ్చి ‘జ్ఞానస్వరూపా! నీ దుఃఖమేమియో చెప్పుము. నీ దుఃఖమును పోగొట్టెదనని ధైర్యము చెప్పెను. సుదేవుడు తన
దుఃఖకారణమును చెప్పి మరల దుఃఖించెను. యోగి సుదేవును, భార్యపుత్రికలను చూచి క్షణకాలము ధ్యానయోగము నందియిట్లు పలికెను.
ఓయీ! వినుము నీ కుమార్తే పూర్వజన్మలో క్షత్రియకులమున జన్మించినది. వ్యభిచారిణియై చెడు ప్రవర్తన కలిగియుండెను. సౌందర్యవతి
యౌవన వతి యగు ఆమె తన జారుల మాటలను విని తన భర్తను వధించెను. భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసికొనెను.
ఈమె పతిహత్యను, ఆత్మహత్యను చేసినది. ఆ రోషమువలన నీమెకీ జన్మమున యిట్టి వైధవ్యము కలిగినది. ఇట్టి యీమె పవిత్రమైన నీ
వంశముననెట్లు జన్మించినదాయని నీకు సందేహము రావచ్చును. దానికిని కారణము కలదు వినుము. ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున
సరస్వతీ నదీతీరమున గౌరీవ్రతము నాచరించువారితో కలసి వారు యిసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా నీ
వ్రతమును చూచినది. ఆ పుణ్యము బలమున నీమె పవిత్రమైన వంశమున జన్మించినది. ఈ జన్మయందునుస్వేరిణియై నీ శిష్యులతో
అధర్మముగ రమించెను. ఈ దోషమువలన నీమె తమ కర్మఫలముల యిట్లననుభవించుచున్నది చేసిన కర్మము ననుభవింవింపక
తప్పదు కదా!
సుదేవుడు యోగిమాటలను విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య, ఆత్మహత్యలకు పాల్పడుబదును. ఈ జన్మలో
కన్యయై సోదరుతుల్యుడైన తన శిష్యునితో రమించుటనువిని మరింత దుఃఖించెను. యోగికి నమస్కరించి ‘తండ్రీ! నా కుమార్తే చేసిన
పాపముయేమి చేసిన పోవును? ఆమె భర్త జీవించుటయేట్లు జరుగును? దయయుంచి చెప్పుడని పరిపరివిధముల ప్రార్థించెను.’
అప్పుడా యోగి ‘ఓయీ విద్వాంసుడా! నీ కుమార్తె చేసిన పాపములుపోవుటకు, ఆమె మాంగళ్యము నిలుచునట్లును చేయుటకొక
ఉపాయముకలదు. శ్రద్ధగావినుము మాఘమాసమున ప్రాతఃస్నానముచేసి ఆ నదీతీరమునగాని సరస్సు తీరమున యిసుకతో గౌరీదేవిని జేసి
షోడశోపచారములతో పూజింపవలయును. సువాసినులకు దక్షిణతో నా గౌరీదేవిని సమర్పించవలయును. ఈ విధముగ నీమచే
ప్రతిదినము చేయింపుము. ఈమె భర్త తిరిగి జీవించును. ఈమె పాపములను నశించును. మాఘశుద్ద
తదియనాడు రెండు క్రొత్తచెటలను తెచ్చి వానిలో చీర, రవికలగుడ్డ, ఫలపుష్పాదులు, పసుపుకుంకుమ మున్నగు సువాసిని
అలంకారములనుంచి దక్షిణ తాంబూలములతో వాయనము నుంచి సువాసినీపూజచేసి ముత్తైదువలకిచ్చి ఏడుమార్లు ప్రదక్షిణ నమస్కారముల
నాచరింపజేయుము. ఆ సువాసినికి షడ్రసోపేత భోజనము పెట్టి గౌరవింపవలయును. మాఘమాసమున ప్రాతఃకాలస్నానముల చేతను పైన చెప్పిన
వ్రతాచరణము చేతను ఈమెకు పాపక్షయము కలుగును. భర్త పునర్జీవితుడై ఈమె మాంగళ్యము నిలుచును. మాఘస్నానము చేసిన
విధవరాలు విష్ణులోకమును చేరును. మాఘస్నానము చేసి గౌరివ్రతమాచైంచిన సువాసిని తన మాంగళ్యమును నిలుపుకొని
చిరకాలము సుఖించును. పిచ్చివారు, మూర్ఖులు మాఘస్నానము చేసినచో వారెట్టి వారైనను వారియనుహ్రహమునొంది చిరకాలము సుఖించి
పుణ్యలోకముల నందుదురు. అని యోగి వివరించి తన దారినబోయెను. సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తెచే మాఘస్నానమును,
గౌరీ పూజా విశిష్టమైన కాత్యాయనీ వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించెను. కాత్యాయనీ వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె
పాపములుపోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యెను. ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోను, భర్తతోను కలిసి
దేహాంతమున వైకుంఠమును చేరెను. కావున మాఘమున ప్రాతఃకాల స్నానము నదిలోగాని, సరస్సునగాని, కాలువలోగాని చేసి తీరమున శ్రీహరి
నర్చించినవారు, సుదేవుని పుత్రిక వంటివారైనను యిహమున సర్వసుఖములనంది పరమున వైకుంఠవాసులగుదురు సుమాయని
శివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను వివరించెను.

మాఘ పురాణం – 2 వ అధ్యాయం

దిలీప మహారాజు వేటకు బయలుదేరుట

దిలీపుడను మహారాజు అనేక యజ్ఞయాగాది క్రతువులొనర్చిన గొప్ప పుణ్యాత్ముడు. అతడు తన రాజ్యమందలి ప్రజలను తండ్రివలె అన్ని విధములా కాపాడుచుండెను. ఒకనాడా భూపాలునకు వేట నిమిత్తం అడవికి పోవలెననెడి కోరిక కలిగెను. మనసున కలిగిన కోరికను ఎట్టి వారలకైననూ నెరవేర్చుకొనుట సహజమే కదా! ఆ విధంగానే దిలీప మహారాజు వేటకు పోవ నిశ్చయించి వేటకు కావలసిన సమస్త వస్తువులను సిద్ధం చేసి వేట దుస్తులు ధరించి సైన్యసమేతుడై వెడలెను.
దిలీపుడు వేటకు వెళ్ళిన అడవి కౄరమృగములతో నిండియున్నది. ఆ క్రూర జంతువులు సమీపమందున్న గ్రామములపై పడి పశువులను, మనుష్యులను చంపి నానా భీభత్సములు చేయుచున్నవి.
దిలీపుడు అడవిలో మాటువేసి మృగములను చంపుచుండెను. తన పరివారము కూడా మృగములను మట్టు పెట్టుచుండిరి. ఇలా కొన్ని రోజుల వరకూ అడవియందు వుండి అనేక క్రూర జంతువులను జంపిరి. ఒకనాడొక మృగం పై బాణం వేసెను. ఆ బాణాన్ని తప్పించుకొని ఆ మృగం పారిపోయెను. దిలీపుడు పట్టు విడువక దాని వెంట పరుగెత్తెను. ముందు మృగం, వెనుక దిలీపుడు, ఆతని వెనుక పరివారము పరుగిడుచుండగా ఆ మృగం ఒక కీకారణ్యమున ప్రవేశించెను. అప్పటికి దిలీపుడు అలసిపోయినందున దాహంచే నాలుక ఎందిపోతున్నది. నీటికొరకు పరివారమంతా వెదుకుచుండిరి. అదృష్టం కొలదీ ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించినది. దానిని చూచి సంతోషపడి దిలీపుడు సరస్సును సమీపించెను. ఆ సరస్సు అంతులేని తామరపువ్వులతో నిండి అతి మనోహరముగా నుండెను. దిలీపుడూ అతని పరివారమూ, తృప్తిదీర నీరు త్రాగిరి. గట్టుపైన ఉన్న వట వృక్షం క్రింద అలసట తీర్చుకొనుచుండగా దిలీపుడు వేటలో చెల్లాచెదురుగా తరిమివేసిన పులులు, సింహాలు, అడవి పందులు మొదలగు జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరినవి. దిలీపుడు, అతని పరివారము వాటిని చూచి గురిపెట్టి, బాణములను వేసి చంపిరి. దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించి తన నగరమునకు బయలుదేరి వెళ్ళిపోవుచుండెను.
అటుల ఇంటిముఖం పెట్టి వెళ్ళుచున్న సమయమున మార్గమందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యెను. ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సు గలిగి ప్రకాశించుచుండెను. ఆ విప్రుని చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడియుండెను. ఆ బ్రాహ్మణుడును క్షణమాగి, ఆ రాజును గాంచి “ఈతని ముఖవర్చస్సు చూడగా గుణవంతునివలె నున్నాడు. ఈతని కేదయినా ఉపకారము చేయుట మంచిది” అని మనసులో తలచి – మహారాజా! శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్ననూ అందులో స్నానం చేయకుండా ఇంటికి పోవుచున్నావేమి? మాఘమాస మహాత్మ్యం నీకు తెలియదా!” అని ప్రశ్నించెను.
ఆ బ్రాహ్మణుని మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణుని జూచి – “విప్రోత్తమా! అటుల ప్రశ్నించారేమిటి?” అని ఆశ్చర్యంతో పలికెను.
“పరమ పావనమైన మాఘమాసం కదా!” అని జ్ఞాపకం చేయుచుంటినని బ్రాహ్మణుడు పలికెను.
“చిత్తము స్వామీ! నాకు గుర్తులేదు. రాజప్రసాదమున నున్న పురోహితులు చెప్పియుందురు. నేను మృగయావినోదినై వచ్చి అడవిలో కొద్ది దినములుండుట వలన నాకా విషయం జ్ఞప్తి లేదు. కావున మాఘమాస మహాత్మ్యము నెరింగింప వలసినదిగా ప్రార్థించుచున్నా”నని దిలీపుడు వేడుకొనెను.
ఆ బ్రాహ్మణుడు దిలీపుని దీవించి “రాజా! సూర్యవంశపు గురువైన వశిష్ఠులవారు అప్పుడప్పుడు మీకడకు వచ్చుచుండును గదా! ఆతని వలన మాఘమాస మహాత్మ్యమును గురించి తెలుసుకొనుము. ఆ మహామునికి తెలియనిది ఏదియు లేదు. గాన అటుల చేయుము” అని చెప్పి బ్రాహ్మణుడు తన దారిని తాను పోయెను.
దిలీపుడు వశిష్ఠుని కడకుబోవుట:
దిలీపుడు తన పరివారంతో నగరము జేరెను. పదేపదే బ్రాహ్మణుని మాటలు జ్ఞప్తికి తెచ్చుకొని ఎటులనో ఆ రాత్రి గడిపెను. మరునాడు ప్రాతఃకాలమున లేచి కాలకృత్యములు తీర్చుకొని మంచి ఉడుపులు, సకలాభరణములు ధరించి, మంత్రి, సామంతాదులతో వశిష్ఠుల వారి దర్శనమునకై వారి ఆశ్రమమునకు వెళ్ళెను.
ఆ సమయములో వశిష్ఠుల వారు తపమాచరించుకొనుచున్నారు. శిష్యులు వేదపఠనం గావించుచున్నారు. దిలీపుడు ఆ దృశ్యమును జూచి వారికి తపోభంగము కలుగనీయరాదనీ కొంతతడవు వేచియుండెను. దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు గురుతుల్యులు. అందుచే గురుభక్తి మిక్కుటముగా నుండెను. మరికొంతసేపటికి వశిష్ఠుడు తపస్సునుండి లేచి రాజును కుశల ప్రశ్నలడిగి ఉచితాసనముపై కూర్చుండబెట్టి వచ్చిన రాజును కారణమేమని యడిగెను.
దిలీపుడు వశిష్ఠునితో “ఋషిసత్తమా! తమవలన నేను అనేక రాజధర్మములు పురాణేతిహాసములు విని సంతుష్టుడనైతిని. కానీ మాఘమాస మహాత్మ్యముగాని,దాని ధర్మములు గాని తెలియనందున ఆ విషయములు తమనుండి తెలుసుకొన గోరి తమ వద్దకు వచ్చితిని. గాన పరమ పావనమూ మంగళప్రదమూ అయిన మాఘమాస మహాత్మ్యమును వివరించవలసినదిగా కోరుచున్నాను” అనెను.
అవును మహారాజా. నీవు కోరిన కోరిక సమంజసమైనదే. మాఘమాసము యొక్క మహాత్మ్యము ప్రతి ఒక్కరూ తెలుసుకొని తరించవలసిన యావశ్యకత ఎంతయినా గలదు.
మాఘమాసముయొక్క మహాత్మ్యమును వర్ణింప నాకుకూడా శక్యముగాదు. ఇతర దినములలో చేయు క్రతువులు గాని, యాగములు గాని, ఇవ్వనంత ఫలము కేవలము మాఘమాసములో చేయునదీస్నానమువలన గొప్ప ఫలము కలుగును. అటువంటి ఫలము నిచ్చు మాఘమాసము అన్నివిధముల శుభప్రదమైనది. గాన యీ మాఘమాసమునందు చేయు నదీ స్నానమువలన మనుజుడు పుణ్యాత్ముడు అగుచున్నాడు. అంతియేగాదు. మాఘము అన్నివిధాలా పుణ్యప్రదమైనది.
అంతేకాక పుణ్యకార్యము వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికంగా కలుగును గాని మాఘ మాసములో సంపాదించిన ఫలము వలన శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగును. ఇంతకన్న మహత్తుగలది మరొకటి లేదు.

మాఘ పురాణం – 1 వ భాగం

శుక్లాం బరదరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం|

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే॥

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం|
అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే॥

శౌనకాది మహా మునులు యజ్ఞము చేయుటకు తలపెట్టుట

సకల పురాణములకు నిలయమైన నైమిశారణ్యమందు ఒకప్పుడు శౌనకాది మహాఋషులు లోక కళ్యాణార్థమై, ఒక మహాయజ్ఞమును తలపెట్టిరి. ఆ మహాయజ్ణము పరిసమాప్తమగుటకు ఒక పుష్కరకాలము అనగా పన్నెండు సంవత్సరములు పట్టును. ఎన్ని అడ్డంకులు వచ్చిననూ, ఆ యజ్ఞమును పూర్తీ చేయవలయుననెడి దీక్షతో శౌనకాది మునులు తలపెట్టినారు, యజ్ఞ స్థలముగా నైమిశారణ్యములో ప్రవహించు గోమతీ నదీతీరమును ఎన్నుకొని ఒక శుభ ముహూర్తమున యజ్ఞమును ప్రారంభించిరి. అంత పెద్ద యజ్ఞము చూచి తరింపవలయుననెడి కోరికలతో, భరతఖండము నలుమూలలనుండీ తపోధనులెందరో వచ్చి యజ్ఞస్థల సమీపమునందు నివాసము లేర్పరచుకొనిరి.

అచటికి వచ్చిన మునీశ్వరులలో బ్రహ్మ తేజస్సు గల శతవృద్ధులు, వేదములను పూర్తిగా అవగాహన చేసుకున్న వేదమూర్తులు, సకల శాస్త్రములు అధ్యయన మొనర్చిన మునికుమారులు వచ్చి పాల్గొనిరి.

ఆవిధముగా మునీశ్వరులందరూ తమ తమ శిష్య బృందములతోను, పరివారముల తోను, తండోపతండములుగా యజ్ఞస్థలానికి జేరుకొనిరి. వేలకొలది ఋషి పుంగవులతో ఆ యజ్ఞస్థలము క్రిక్కిరిసి యుండెను. ఆ యాగము సకల లోకములకు శుభకరమైనదియు, పుణ్యప్రదమైనదియు, 12 సంవత్సరములు ఏకధాటిగా జరుగు మహాయాగము అగుటవలన పురాణ పురుషుడగు సూత మహాముని కూడా తన శిష్య బృందముతో వేంచేసి యాగాది కార్యక్రమములో పాల్గొనిరి.

దూర ప్రాంతాలనుండి వచ్చిన ఋషులు సూతులను దర్శన భాగ్యం కలిగినందున అమితానందం చెందిరి. సూతుల వారి ఆశీర్వాదములతో నిర్విఘ్నంగా యాగం జరుగునని అందరూ సంతోషపడిరి.

సూత మహాముని సకల శాస్త్రములు ఆమూలాగ్రముగ తెలిసియున్న మహానుభావుడు. వేదం, పురాణ ఇతిహాసాది సమస్త విషయములందు వారికి తెలియనిది లేదు. అవి అన్నియు వారికి కొట్టిన పిండి వంటివి. వారి ముఖ వర్చస్సు నుండి ప్రకాశించు బ్రహ్మ తేజస్సు, ఎల్లవేళలా నవ్వులొలికించు ముఖారవిందము, మేలిమి బంగారం వలె ప్రకాశించుచున్న శరీరం, వర్ణింప నలవికానిది. అటువంటి పుణ్య పురుషుడగు సూత మహాముని ఆగమనమునకు స్వాగతం పలికి, సాష్టాంగ దండ ప్రణామములాచరించి యజ్ఞం జరుగు ఆ పండ్రెండు సంవత్సరములలో యెన్నియో పురాణ గాధలు విని తరించవలెననెడి కోరికతో ముని పుంగవులందరూ వేచియుండిరి.

సూతుల వారు శౌనకాది మునుల కోరికలను గ్రహించినారు. ఇటువంటి పుణ్య కార్యములందు పురాణ పఠనం గావించి అశేష ముని శ్రేష్టులను తృప్తి పరచుట తన విద్యుక్తధర్మమని తలచి వారి కోరికను తీర్చుటకు సిద్దమైనారు.

ఒక శుభ ముహూర్తమున ఆశ్రమ వాసులందరూ సూతుల వారికి అర్ఘ్య పాద్యములొసంగి ఉచితాసనములపై ఆసీనులను జేసి “మునిశ్రేష్ఠా! మునికుల తిలకా! ఇంతకుముందు ఎన్నో పురాణ గాధలు తమరు తెలియజేయగా విని ఆనందించియున్నాము. అనేక ఇతిహాసములను ఆలకించి, అందలి సారమును గ్రహించి యుంటిమి. సమయము వచ్చినప్పుడు సకల శాస్త్రములలోని నీతికథలు మాకు వినిపించుచునే యున్నారు. అయినను మీబోటి సిద్ధపురుషులు పదునాలుగు లోకములు సంచారము చేసి యున్నందున ఎన్నో విషయములు మీరు అవగాహన చేసుకొనియున్నారు. గాన వినదగు విషయాలేమైనా యున్నయెడల విరామ కాలములో మాకు వినిపించవలయునని శౌనకాది మునులు ప్రార్థించిరి. వారి కోరిక ప్రకారముగా  శౌనకాది మునులు తన వలన క్రొత్త సంగతులు తెలిసికొనవలెనని కుతూహలం కనపరచినందున వారలను జూచి సూత మహాముని  ప్రారంభించెను.

“ముని పుంగవులారా! మీ మనోవాంఛను గ్రహించితిని. మీరు వినదగిన కథను నాకు తెలిసియున్నంత వరకూ విచారించి మీకు తృప్తి కలిగించెదను. ఇటువంటి మహా సమయమున పుణ్య కథలు చెప్పుట వలన నాకున్నూ, వినుట వలన మీకున్నూ పరమార్థము కల్గునని చెప్పెను.

శౌనకాది మునుల కోరికను
సూతమహాముని అడిగినదే తడవుగా వారందులకు అంగీకరించగా “ధన్యులమైతి”మని మునులందరూ అమితానందం నొంది సూతులవారి పాదములను కండ్లకద్దుకొని సూతమహామునితో –

ఆర్యా! పద్మపురాణమందు లీనమైయున్న మాఘమాసం యొక్క మహాత్మ్యంను మరల  వినవలయుననెడి కుతూహలం కలుగుచున్నది. అదియునుగాక రాబోవు మాసం మాఘమాసమే అయినందున ఆ మాస మహాత్మ్యం, ఆచరించవలసిన విధానం, మాకు వివరించవలసిందిగా కోరిరి.

ఆ విధంగా శౌనకాది మునులు ఇతర తపశ్శాలురు కోరుటవలన సూతమహర్షి మిక్కిలి సంతసించి యిట్లు పలికిరి.

ముని పుంగవులారా! మీరందరూ అతిముఖ్యమైన విషయాన్నే అడుగుచున్నారు. మాఘమాసం కూడా ప్రారంభం కాబోవుచున్నది. ఇటువంటి సమయంలో మాఘ పురాణం వినుటవలన కలిగే ఫలము అంతింత కాదు. అదియునుగాక ఈ మహాయజ్ఞం జరుగుచున్న సమయములో మాఘమాసం యొక్క మహాత్మ్యం మీకు వివరించవలసిన భాగ్యము కలిగినందులకు నేను అదృష్టవంతుడనే. కాన సావధాన మనస్కులై వినుడని సూతమహర్షి ఇట్లు వివరించెను.

నేను నా తండ్రి శిష్యుడగు రోమహర్షుని శిష్యుడను. అతడు మహా తపస్వి, జ్ఞాని. నా తండ్రి వద్ద సకల శాస్త్రములు అభ్యసించెను. విష్ణ్వంశ సంభూతుడగు వేదం వ్యాస మహర్షికి ప్రియ పాత్రుడను. వారి దయవలన నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వారడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తి సామర్ధ్యములు కలిగిన వాడనయితిని. నేను తెలియజేయుచున్న నీతిబోధలు సకల లోకములకు శుభములు కలుగును. మీరడిగినటులే పూర్వం దిలీప మహారాజుకు తన కులగురువైన వశిష్ఠమహాముని మాఘమాస మహాత్మ్యమును వివరించినారు. ఆ విషయమునే నేను మీకు వివరించబోవుచున్నాను.
శ్రీకొండ ఉమాకాంత శర్మ సిధ్ధాంతి,

సంచారవాణి: 9440232574.IMG_20170127_204651_491

మాఘ మాస విశిష్టత

“మాఘ మాసం” ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి “శుక్ల పక్ష చవితి” దీనిని “తిల చతుర్థి”అంటారు. దీన్నే “కుంద చతుర్థి” అని కూడా అంటారు. నువ్వులను తింటారు. నువ్వులతో లడ్లు చేసి పంచి పెడతారు. ఈ రోజున “డుంఢిరాజును” ఉద్దేశించి, నక్త వ్రతము పూజ చేస్తారు! డుంఢిని ఈ విధంగా పూజించడం వలన దేవతల చేత  డుంఢిని పూజించిన వారు పూజలందుకుంటారని కాశీ ఖండములో తెలియజేశారు.”కుంద చతుర్థి” నాడు కుంద పుష్పాలతో పరమేశ్వరుని అర్పించి రాత్రి జాగారణ చేసినవారు, సకలైశ్వర్యాలను పొందుతారని కాలదర్శనంలో చెప్పబడింది. అయితే సాయంకాలం చతుర్థి ఉంటే ఉత్తమం అని ఈ సందర్భంలో తెలుసుకోవాలి. మాఘమాసంలో ప్రాత:కాలంలో చేసే స్నాన,జప,తపములు చాలా ఉత్తమమైనవి. ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు “దు:ఖ దారిద్ర్య నాశాయ, శ్రీ విష్ణోతోషణాయచ! ప్రాత:స్నానం కరోమ్య, మాఘ పాప వినాశనం!” అని చేసిన తరువాత “సవిత్రేప్రసవిత్రేచ! పరంధామజలేమమ! త్వత్తేజసా పరిబ్రష్టం,పాపం యాతు సస్రదా!” అని చదవాలి. సూర్య భగవానునికి ఆర్గ్యమివ్వాలి.

ఈ మాసాన్ని కుంభమాసం అని కూడా అంటారు.కొంతమంది ఈ నెల్లాళ్ళు ముల్లంగి దుంపను తినరు.ఈ మాసంలో నవ్వులను, పంచదారను కలిపి తినాలట. నువ్వులను దానమివ్వాలట. రాగి పాత్రలో గోధుమ రంగుగా ఉన్న నువ్వులను పాత్రతో సహా దానమిస్తే మంచిది.ఈ నెలలో మరణించిన వారికి అమృతత్వం సిద్దిస్తుందట. “మాఘశుద్ద పంచమి”ని శ్రీ పంచమి అంటారు.ఈ పంచమి నాడే “సరస్వతీదేవి” జన్మించిందట. ఈనాడు “రతీ మన్మధులను మల్లెపూలతో పూజిస్తారు.ఉత్తర భారతంలో విష్ణుమూర్తిని, సరస్వతీదేవిని కూడా పూజిస్తారు. బ్రహ్మదేవుడు సృష్టి చేయగా చరాచర ప్రపంచం శ్మశాన నిశ్శబ్ధతతో ఉందట. అవేదనతో తన కమండలంలోని నీటిని ప్రపంచంపై చిలకరించగా చెట్లపై ఆ నీటి బిందువులు పడి ఒక శక్తి ఉద్భవించిందట. రెండు చేతులతో వీణను వాయిస్తూ మరో రెండు చేతులతో పుస్తకాన్ని మాలను ధరించి సమగ్ర రూపిణిగా దర్శనమిచ్చిందట. ఆ వగీశ్వరి వీణావాదనం ద్వారా ప్రపంచంలోని స్తబ్థతను ఉదాసీనతను తొలగించి విద్యాబుద్దులకు అదిష్టాత్రి అయింది ఆ దేవి.
అప్పటి నుండి శ్రీ పంచమి రోజును సరస్వతిని పూజించడం జరుగుతుంది. ఇక మాఘశుద్ద సప్తమి ఇదే “సూర్య సప్తమి”అని కూడా పిలువబడుతుంది.ఇదే రథసప్తమి సుర్య గ్రహణదినం వలె ఇది పరమపవిత్రమైనది.ఈ రోజున అరుణోదయకాలంలో ఏడు జిల్లేడు ఆకులను అందులో రేగికాయలను ఉంచుకొని తలాపై పెట్టుకొని స్నానం చేస్తే ఏడు విధాలైన శాపాలు నశిస్తాయట. స్నానికి ముందు చెరకుగడతో నీటిని కదిలిస్తారు. నమస్కారం ప్రియ:సూర్య: అన్న ఆర్య వాక్య ప్రకారం కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృపి చెందుతాడని తెలుస్తుంది.ఈ రోజున  సూర్యునికి ఏదురుగా రథం ముగ్గు వేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు అకులలో పెట్టి సూర్యునికి నివేదన చేయడం ఆచారం.

సూర్యుడు తనను పూజించిన సత్రాజిత్తుకి ఈ రోజునే “శమంతకమణి” ప్రసాదించాడు. హనుమంతునికి వ్యాకరణ శాస్త్రాన్ని యఙ్ఞవాల్క్యునికి యజుర్వేదాన్ని బోధించాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్న వాక్యం ప్రకారం ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయం పారాయణ చెయ్యాలి. రథసప్తమి నాటి స్నానం   “సప్త సప్త మహాసప్త ద్వీపా వసుంధరా! కోటి జన్మార్జితంపాపిం వినశ్యతితత్‌క్షణాత్” అన్నట్లుగా పాప విముక్తి కలిగిస్తుందట. భీష్మాష్టమి “మాఘమానస్యచాష్టమ్యాం శుక్ల పక్షేచ పార్థివ!ప్రాజాపత్యేచ నక్షత్రే మధ్య:ప్రాప్తే దివాకరే!” శోభకృత నామ సంవత్సరంలో మాఘమాసంలో శుక్లపక్షంలో రోహిణి నక్షత్రం ఉన్న అష్టమి తిథినాడు మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో భీష్మ పితామహుడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టాడట. స్వచ్చంద మరణం ఆయనకి వరం. ఆయనకు తర్పణలు విడిచి పెట్టడం నెల రోజుల నుండి పెట్టిన గొబ్బెమ్మలను ఎండబెట్టి దాచి ఆ పిడకలతో పాయసాన్ని వండి నివేదన చేయడం ముఖ్యం. అష్టమినాడే దైవ సాయుజ్యం పొందినా శ్రీ కృష్ణుని సమక్షంలోనే విష్ణుసహస్రనామాలతో ఆయనను కీర్తిస్తూ మోక్షం పొందాడు. కాబట్టి ఏకాదశిని ఆయన పేరుతో ఏర్పాటు చేశారు. భీష్మ ఏకాదశి నాడు విశేష పూజలు చేయడం ఆనవాయితీ. ఇక మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం మహిమాన్వితాలే.ఈ విధంగా మాఘమాసమంతా “శివరాత్రి”వరకూ అన్నీ పర్వదినాలే.
రేపటి నుండి మాఘ పురాణం ప్రారంభం.
శ్రీకొండ ఉమాకాంత శర్మ సిధ్ధాంతి.

సంచారవాణి: 9440232574.

05e4375e96e17e7fe954383a0b23aef0

కళామ్మతల్లి ఒడి లో మెరుస్తున్న నవ నట రత్నం… కిరణ్ రెడ్డి

సినిమా ఎందరికో కళల ప్రపంచం, మరెందరికో ఆశల పల్లకి. అదృష్టం కలిసొస్తే కష్టం కరుణిస్తే సామాన్యుడికి కూడా సెలబ్రటి లైఫ్ ని వరంగా ఇచ్చే ఓ రణరంగం.

అటువంటి రణరంగం అంటే నాకు ప్రేమ అంటూ వచ్చి ఈ రోజు తెలుగు ప్రజల ప్రేమాభిమానాలు, ఆధారాశిస్సులు పొందుతున్న కిరణ్,
చదువు సంధ్యా రాని వాళ్ళు సినిమాల్లో ఉంటారని మాటను అబద్దం చేస్తూ B.tech టాప్ స్కోర్ లో పూర్తి చేసి బెంగుళూరు లో లక్షల రూపాయల శాలరి ఉద్యోగం చేసుకుంటూ మరోవైపు సినిమా అంటే తనకు ఎంత ప్రేమ ఉందో తెలుగు ప్రజలకి చూపిస్తున్నాడు.
నాకు రచించడం అంటే ఇష్టం, నాకు నటించడం అంటే ఇష్టం అని సినిమా పరిశ్రమను ఆశ్రయించిన కిరణ్ తనకు సహజంగా తెలిసిన నటనను ప్రదర్శిస్తూ ఉదయించిన కిరణంలా శ్రీకారం అనే సినిమా తో తన ప్రస్తానానికి శ్రీకారం చుట్టాడు. మన దేశానకి రైతు అవసరం ఎంత ఉందో, వ్యవసాయానికి ఎంత విలువ ఉందో చెప్పిన ఆ ఒక్క చిత్రం తోనే షార్ట్ ఫిలిం మేకర్స్ కి ఫేవరెట్ స్టార్ అయ్యాడు.
ఆ తరువాత వెంట వెంటనే తెరకెక్కిన గచ్చిబౌలి, వానరసైన్యం, ఓ మనసా రా ఇలా, 1991 వంటి చిత్రాలతో తన సహజ నటనతో మాస్ మహారాజ రవి తేజ, నాని, విశాల్ ని తలపించి సిని ప్రముఖుల నుండి ప్రసంశలు సైతం అందుకున్నాడు.
ప్రముఖ సంస్థలు నిర్మిస్తున్న చిన్న సినిమాలలో హీరోగా నటించే అవకాశం దక్కించుకొని కృషి వుంటే మనుషులు ఋషులు అవుతారు అని అన్నగారు పాడిన పాటను జీవిత సత్యంగా ఋజువు చేసాడు మన కిరణ్.
ఈ కళామ్మ తల్లి బిడ్డకు లభిస్తున్న ఆధారభిమానాలు చూసి నిర్మాతలు సైతం నటనా విలువలు వున్న హీరోలతో చిన్న సినిమా లను తెరకెక్కించడం శ్రేయస్కరం అని ఆలోచిస్తునారు అంటే మన కడప కుర్రాడి పాపులారిటి ఏ స్థాయికి చేరిందో మనమే అంచనా వేసుకోవచ్చు.
ఏది ఏమైనా తెలుగు ప్రేక్షలను తమ సహజ నటనతో ఆలరించే హీరోలు మన చిత్రసీమ కు రావటం మన అందరికి ఆనందదాయకం.IMG-20170118-WA0063IMG-20170118-WA0064IMG-20170118-WA0065

**సంక్రాంతి*

*మకరసంక్రాoతి మురిపిoచు మదిని ముదము*॥
*నింపి కొత్త శోభలజిల్గు నింగినంత*॥
*ముగ్గువేయుచు మగువలే సిగ్గుపూలు*॥
*భానుడిదయతో బతుకౌను బంతిపువ్వు*॥

దేశపతి పద్యం

సార్వభౌమగా బాలయ్య, దర్శకుడిగా సత్యదేవా. 101 చిత్రానికి కుదిరిన ముహూర్తం.

నందమూరి బాలకృష్ణ (బాలయ్య ) ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఆరాధ్య దైవంగా కిర్తింపబడుతున్న ఒక పేరు.. తన వందవ చిత్రంగా శాతవాహన కాలం నాటి కథను ప్రతి తెలుగు వాడికి తెలియచేయాలనే బలమైన ఆశయం తో మన బాలయ్య నటించిన చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి. ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుండి ప్రతిది సంచలనమే సృష్టించింది. సోషల్ మీడియా లో సైతం ఏ సినిమా కి లేనంత ప్రేక్షక ఆధరణ పొంది బాలయ్య ఈ వయస్సు లోను స్థాయికి నిదర్శనంగా నిలిచింది.
ఈ సినిమా సంక్రాంతి కి విడుదల కానున్న నేపధ్యం లో సంక్రాంతి బరి లో గెలిచే ధిరుడి గా బాలయ్య కనిపిస్తున్నాడు అన్నది ఫిలిం నగర్ సమాచారం.
కాగా ఇప్పటి నుండి బాలయ్య 101 చిత్రం గురించి అభిమానల్లో, ఇటు సిని వర్గం లో చర్చ మొదలయింది.
ఆ చర్చ కు తెర దించుతూ బాలయ్య తో లయన్ సినిమాను తెరక్కించిన సత్యదేవా
కే మరొక సారి బాలయ్య అవకాశం ఇచ్చాడని బాలయ్య సన్నిహిత వర్గాల సమాచారం.
సార్వభౌమ అనే టైటిల్ తో సత్యదేవ చెప్పిన కథ బాలయ్య కు బాగా నచ్చిందని, అందుకే ఈ సినిమా నే ముందు తెరక్కించాలని బాలయ్య అంఘికారం తేలిపాడంటా. సత్య దేవాను పిలిపించి మరి స్క్రిప్ట్ వర్క్ అంతా త్వరగా సిద్దం చేయమని చెప్పాడని బాలయ్య సన్నిహిత వర్గాలు చెప్తున్నారు.
అయితే త్వరలో మొదలు కానున్న ఈ సినిమాకు సత్యదేవా వక్కపట్లని దర్శకుడిగా స్వయంగా మన నటసింహం ఓకే చేసాడంటా.
మిగతా సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియనున్నాయి.

received_230624267390139received_230623787390187received_230619657390600

 

బహురూప గణపతి ధ్యాన శ్లోకాలు

శ్రీ బాల గణపతి ధ్యానం
కరస్థకదలీచూతపనసేక్షుకమోదకమ్ |
బాలసూర్యమిమం వందే దేవం బాలగణాధిపమ్ || ౧ ||

శ్రీ తరుణ గణపతి ధ్యానం
పాశాంకుశాపూపకపిద్థజంబూ
స్వదంతశాలీక్షుమపి స్వహస్తైః |
ధత్తే సదా యస్తరుణారుణాభః
పాయాత్స యుష్మాం స్తరుణో గణేశః || ౨ ||

శ్రీ భక్త గణపతి ధ్యానం
నాలికేరామ్రకదలీగుడపాయసధారిణమ్ |
శరచ్చంద్రాభవపుషం భజే భక్తగణాధిపమ్ || ౩ ||

శ్రీ వీరగణపతి ధ్యానం
బేతాలశక్తిశరకార్ముకచక్రఖడ్గ
ఖట్వాంగముద్గరగదాంకుశనాగపాశాన్ |
శూలం చ కుంతపరశుధ్వజముద్ద్వహంతం
వీరం గణేశమరుణం సతతం స్మరామి || ౪ ||

శ్రీ శక్తిగణపతి ధ్యానం
ఆలింగ్య దేవీం హరితాంగయష్టిం
పరస్పరాశ్లిష్టకటి ప్రదేశమ్ |
సంధ్యారుణం పాశసృణీ వహంతం
భయాపహం శక్తిగణేశమీడే || ౫ ||

శ్రీ ద్విజగణపతి ధ్యానం
యం పుస్తకాక్ష గుణదండకమండలు శ్రీ
విద్యోతమానకరభూషణమిందువర్ణమ్ |
స్తంబేరమాననచతుష్టయశోభమానం
త్వాం యః స్మరేద్ద్విజగణాధిపతే స ధన్యః || ౬ ||

శ్రీ సిద్ధగణపతి ధ్యానం
పక్వచూతఫలపుష్పమంజరీ
ఇక్షుదండతిలమోదకైస్సహ |
ఉద్వహన్ పరశుమస్తు తే నమః
శ్రీ సమృద్ధియుత హేమపింగళః || ౭ ||

శ్రీ ఉచ్ఛిష్టగణపతి ధ్యానం
నీలాబ్జదాడిమీవీణాశాలీ గుంజాక్ష సూత్రకమ్ |
దధదుచ్ఛిష్టనా మాయం గణేశః పాతుమేచకః ||
ప్రకాంతరేణ సారీయోనిరసాస్వాదలోలుపం కామమోహితమ్ || ౮ ||

శ్రీ విఘ్నగణపతి ధ్యానం
శంఖేక్షుచాపకుసుమేషుకుఠారపాశ
చక్రస్వదంతసృణిమంజరి కాశరౌఘైః |
పాణిశ్రితైః పరిసమీహితభూషణశ్రీ-
-ర్విఘ్నేశ్వరో విజయతే తపనీయగౌరః || ౯ ||

శ్రీ క్షిప్రగణపతి ధ్యానం
దంతకల్పలతా పాశరత్న కుంభాంకుశోజ్జ్వలమ్ |
బంధూకకమనీయాభం ధ్యాయేత్ క్షిప్రగణాధిపమ్ || ౧౦ ||

శ్రీ హేరంబగణపతి ధ్యానం
అభయవరదహస్తః పాశదంతాక్షమాలా
సృణిపరశుదధానో ముద్గరం మోదకం చ |
ఫలమధిగతసింహః పంచమాతంగవక్త్రో
గణపతి రతిగౌరః పాతు హేరంబనామా || ౧౧ ||

శ్రీ లక్ష్మీగణపతి ధ్యానం
బిభ్రాణః శుకబీజపూరకమిలన్మాణిక్యకుంభాకుశాన్
పాశం కల్పలతాం చ ఖడ్గవిలసజ్జ్యోతిస్సుధానిర్ఝరః |
శ్యామే నాత్తసరోరుహేణ సహితం దేవీద్వయం చాంతికే
గౌరాంగో వరదానహస్తసహితో లక్ష్మీగణేశోఽవతాత్ || ౧౨ ||

శ్రీ మహాగణపతి ధ్యానం
హస్త్రీంద్రాననమిందుచూడమరుణచ్ఛాయం త్రినేత్రం రసా-
-దాశ్లిష్టం ప్రియయా సపద్మకరయా స్వాంకస్థయా సంతతమ్ |
బీజాపూరగదేక్షుకార్ముకలసచ్ఛక్రాబ్జపాశోత్పల
వ్రీహ్యగ్రస్వవిషాణరత్న కలశాన్ హస్తైర్వహంతం భజే || ౧౩ ||

శ్రీ విజయగణపతి ధ్యానం
పాశాంకుశస్వదంతామ్రఫలవానాఖువాహనః |
విఘ్నం నిహంతు నస్సర్వం రక్తవర్ణో వినాయకః || ౧౪ ||

శ్రీ నృత్తగణపతి ధ్యానం
పాశాంకుశాపూపకుఠారదంత
చంచత్కరాక్లుప్తవరాంగులీకమ్ |
పీతప్రభం కల్పతరోరధస్థం
భజామి నృత్తోపపదం గణేశమ్ || ౧౫ ||ganapathy

వివాహ ముహుర్తాలు 2017

జ‌న‌వ‌రిలో…
ఈ నెల‌లో కేవ‌లం 29వ తేదీ నాడే వివాహాల‌కు అనుకూలంగా ఉంది. అదే రోజు పెళ్లిళ్లు ఎక్కువ‌గా అయ్యేందుకు అవ‌కాశం ఉంది.
ఫిబ్ర‌వ‌రి…
ఈ నెల‌లో అనేక తేదీలు పెళ్లిళ్ల‌కు అనుకూలంగా ఉన్నాయ‌నే చెప్ప‌వ‌చ్చు. 1,2,3,5,11,12,14,15,16, 18, 19, 20, 22, 28 తేదీలు వివాహాది శుభ‌కార్యాల‌కు అనుకూలంగా ఉన్న‌యి.
మార్చి…
1,2,5,10, 11, 12,14, 15,16,17, 18 తేదీలు ఈ నెల‌లో పెళ్లిళ్ల‌కు అనుకూలంగా ఉన్నాయి.
ఏప్రిల్‌…
ఈ నెలలో 1 నుంచి 12 వ తేదీ వ‌ర‌కు, 13,14, 16 నుంచి 22 వ‌ర‌కు, 27, 31 తేదీల్లో వివాహాల‌కు అనుకూలంగా ఉన్నాయి.
మే…
1,4,6,7 నుంచి 14 వ‌ర‌కు, 16 నుంచి 22 వ‌ర‌కు, 27, 31 తేదీలు పెళ్లిళ్ల‌కు అనుకూలంగా ఉన్నాయి.
జూన్‌…
1,2,3,4,5,7,8,10,12 నుంచి 19 వ‌ర‌కు తేదీలు పెళ్లిళ్ల‌కు అనుకూలంగా ఉన్నాయి.
జూలై…
25,27,28, 29,30,31 తేదీల్లో పెళ్లిళ్లు చేసుకోవ‌చ్చు.
ఆగ‌స్టు…
1,2,3,4,5,6,8,9,11,12, 13,16,17 తేదీలు వివాహాల‌కు అనుకూలం
సెప్టెంబ‌ర్‌…
ఈ నెల‌లో 21, 22, 23, 25, 27, 28, 29, 30 తేదీలు పెళ్లిళ్లకు అనుకూలంగా ఉన్నాయి.
అక్టోబ‌ర్‌…
1,2,4,5,6,7,9,11 తేదీల్లో వ‌ధూవ‌రులు వివాహం చేసుకోవ‌చ్చు.
నవంబ‌ర్‌…
23 నుంచి 27 వ‌ర‌కు, 29, 30 తేదీల్లో పెళ్లిళ్లు చేసుకోవ‌చ్చు.
డిసెంబ‌ర్‌…
ఈ నెల‌లో అస్స‌లు ముహూర్తాలు లేవు.img-20170103-wa0006