Monthly Archives: December 2016

ఒంటరి జీవితంతో ఎంతకాలం పోరు సలుపుతావు ఓ నిరంతర బాటసారి!

ఆలుపెరుగని నీ పయనంలో మజిలీలు ఎన్నో! కాసింత విశ్రాంతి పిమ్మట నీ పయనం సాగనీ …. ప్రతి పయనం ఇస్తుంది ఒక అనుభవం ; ఆనుభవాల సారమే జీవితం … చేదు అనుభవాలు ఎదురు అయితే వెన్ను చూపకు; మనసులోని బాధ ఎప్పుడూ తెలియనివ్వకు ; గుండెనిండా సాహసమనే వూపిరి నింపుకో ; ఆకాశంలో ఎగిరే విహంగం నీ ఆదర్శం ; రేపు అన్న ఆశ నిలుపుతుంది శ్వాస ; పెదవి మీద చిరునవ్వు లోకానికే వెలుగు ; మానసిక దృఢత్వం మనిషికి పెట్టని కవచం ; ఎదుగుతున్నకొద్దీ ఒదిగుండాలి అని మరచినవారికి జీవితం నరకప్రాయం ; చేసిన మేలు మరవకు; చేసిన సహాయం తలవకు, ఈ మాయలోకంలో మోసాల సాలెగూళ్ళు ఎన్నో ;తెలివితొ ఛేదించి విజయాన్ని సాధించి కన్నవారికి ఎనలేని కీర్తి తెచ్చి ఆత్మవిశ్వాసాన్ని నీ నీడలా ఉంచుకో ; నీదే జయం, నీదే జయం, ఇది తధ్యం, ఇది తధ్యం … నూతన సంవత్సర శుభాకాంక్షలు.

జ్ఞానకుమార వేంకట రమణ ప్రసాద్

img_20161231_210250_158

వేంకటేశ అష్టకం

వేంకటేశో వాసుదేవః ప్రద్యుమ్నోఽమితవిక్రమః |
సంకర్షణోఽనిరుద్ధశ్చ శేషాద్రిపతిరేవ చ || ౧ ||

జనార్దనః పద్మనాభో వేంకటాచలవాసనః |
సృష్టికర్తా జగన్నథో మాధవో భక్తవత్సలః || ౨ ||

గోవిందో గోపతిః కృష్ణః కేశవో గరుడధ్వజః |
వరాహో వామనశ్చైవ నారాయణ అధోక్షజః || ౩ ||

శ్రీధరః పుండరీకాక్షః సర్వదేవస్తుతో హరిః |
శ్రీనృసింహో మహాసింహః సూత్రాకారః పురాతనః || ౪ ||

రమానాథో మహీభర్తా భూధరః పురుషోత్తమః |
చోళపుత్రప్రియః శాంతో బ్రహ్మాదీనాం వరప్రదః || ౫ ||

శ్రీనిధిః సర్వభూతానాం భయకృద్భయనాశనః |
శ్రీరామో రామభద్రశ్చ భవబంధైకమోచకః || ౬ ||

భూతావాసో గిరివాసః శ్రీనివాసః శ్రియః పతిః |
అచ్యుతానంత గోవిందో విష్ణుర్వేంకటనాయకః || ౭ ||

సర్వదేవైకశరణం సర్వదేవైకదైవతం |
సమస్తదేవకవచం సర్వదేవశిఖామణిః || ౮ ||

ఇతీదం కీర్తితం యస్య విష్ణోరమితతేజసః |
త్రికాలే యః పఠేన్నిత్యం పాపం తస్య న విద్యతే || ౯ ||

రాజద్వారే పఠేద్-ఘోరే సంగ్రామే రిపుసంకటే |
భూతసర్పపిశాచాదిభయం నాస్తి కదాచన || ౧౦ ||

అపుత్రో లభతే పుత్రాన్ నిర్ధనో ధనవాన్ భవేత్ |
రోగార్తో ముచ్యతే రోగాద్బద్ధో ముచ్యేత బంధనాత్ || ౧౧ ||

యద్యదిష్టతమం లోకే తత్తత్ప్రాప్నోత్యసంశయః |
ఐశ్వర్యం రాజసమ్మానం భుక్తిముక్తిఫలప్రదం || ౧౨ ||

విష్ణోర్లోకైకసోపానం సర్వదుఃఖైకనాశనం |
సర్వైశ్వర్యప్రదం నౄణాం సర్వమంగళకారకం || ౧౩ ||

మాయావి పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం |
స్వామిపుష్కరిణీతీరే రమయా సహ మోదతే || ౧౪ ||

కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే |
శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం || ౧౫ ||

ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే బ్రహ్మనారదసంవాదే వేంకటగిరిమాహాత్మ్యే శ్రీ వేంకటేశ అష్టకం సంపూర్ణం ||received_10154389037529561

శ్రీ లక్ష్మీస్తోత్రం (ఇంద్రరచితం)

నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః |
కృష్ణప్రియాయై సతతం మహాలక్ష్మై నమో నమః || ౧ ||

పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమో నమః |
పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమో నమః || ౨ ||

సర్వసంపత్స్వరూపిణ్యై సర్వరాధ్యై నమో నమః |
హరిభక్తిప్రదాత్ర్యై చ హర్షదాత్ర్యై నమో నమః || ౩ ||

కృష్ణవక్షఃస్థితాయై చ కృష్ణేశాయై నమో నమః |
చంద్రశోభాస్వరూపాయై రత్నపద్మే చ శోభనే || ౪ ||

సంపత్యధిష్ఠాతృదేవ్యై మహాదేవ్యై నమో నమః |
నమో వృద్ధిస్వరూపాయై వృద్ధిదాయై నమో నమః || ౫ ||

వైకుంఠే యా మహాలక్ష్మీః యా లక్ష్మీః క్షీరసాగరే |
స్వర్గలక్ష్మీరింద్రగేహే రాజలక్ష్మీః నృపాలయే || ౬ ||

గృహలక్ష్మీశ్చ గృహిణాం గేహే చ గృహదేవతా |
సురభిస్సాగరే జాతా దక్షిణా యజ్ఞకామనీ || ౭ ||

అదితిర్దేవమాతా త్వం కమలా కమలాలయే |
స్వాహా త్వం చ హవిర్ధానే కన్యాదానే స్వధా స్మృతా || ౮ ||

త్వం హి విష్ణుస్వరూపా చ సర్వాధారా వసుంధరా |
శుద్ధసత్వస్వరూపా త్వం నారాయణపరాయాణా || ౯ ||

క్రోధహింసావర్జితా చ వరదా శారదా శుభా |
పరమార్థప్రదా త్వం చ హరిదాస్యప్రదా పరా || ౧౦ ||

యయా వినా జగత్సర్వం భస్మీభూతమసారకం |
జీవన్మృతం చ విశ్వం చ శశ్వత్సర్వం యయా వినా || ౧౧ ||

సర్వేషాం చ పరా మాతా సర్వబాంధవరూపిణీ |
ధర్మార్థకామమోక్షాణాం త్వం చ కారణరూపిణీ || ౧౨ ||

యథా మాతా స్తనాంధానాం శిశూనాం శైశవే సదా |
తథా త్వం సర్వదా మాతా సర్వేషాం సర్వరూపతః || ౧౩ ||

మాతృహీనస్స్తనాన్ధస్తు స చ జీవతి దైవతః |
త్వయా హీనో జనః కోఽపి న జీవత్యేవ నిశ్చితమ్ || ౧౪ ||

సుప్రసన్నస్వరూపా త్వం మాం ప్రసన్నా భవాంబికే |
వైరిగ్రస్తం చ విషయం దేహి మహ్మం సనాతని || ౧౫ ||

అహం యావత్త్వయా హీనా బంధుహీనశ్చ భిక్షుకః |
సర్వసంపద్విహీనశ్చ తావదేవ హరిప్రియే || ౧౬ ||

రాజ్యం దేహి శ్రియం దేహి బలం దేహి సురేశ్వరి |
కీర్తి దేహి ధనం దేహి యశో మహ్యం చ దేహి వై || ౧౭ ||

కామం దేహి మతిం దేహి భోగాన్దేహి హరిప్రియే |
జ్ఞానం దేహి చ ధర్మే చ సర్వసౌభాగ్యమీప్సితమ్ || ౧౮ ||

ప్రభావ చ ప్రతాపం చ సర్వాధికారమేవ చ |
జయం పరాక్రమం యుద్ధే పరమైశ్వర్యమైవ చ || ౧౯ ||IMG_20160805_091500_386

Srikonda dina darshini


12-pages

శ్రీలక్ష్మీనృసింహపఞ్చరత్నమ్

త్వత్ప్రభుజీవప్రియమిచ్ఛసి చేన్నరహరిపూజాం కురు సతతం

ప్రతిబిమ్బాలంకృతిధృతికుశలో బిమ్బాలంకృతిమాతనుతే ।

చేతోభృఙ్గ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం

భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరన్దమ్ ॥ ౧॥

శుక్త్తౌ రజతప్రతిభా జాతా కతకాద్యర్థసమర్థా చే-

ద్దుఃఖమయీ తే సంసృతిరేషా నిర్వృతిదానే నిపుణా స్యాత్ ।

చేతోభృఙ్గ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం

భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరన్దమ్ ॥ ౨॥

ఆకృతిసామ్యాచ్ఛాల్మలికుసుమే స్థలనలినత్వభ్రమమకరోః

గన్ధరసావిహ కిము విద్యేతే విఫలం భ్రామ్యసి భృశవిరసేస్మిన్ ।

చేతోభృఙ్గ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం

భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరన్దమ్ ॥ ౩॥

స్రక్చన్దనవనితాదీన్విషయాన్సుఖదాన్మత్వా తత్ర విహరసే

గన్ధఫలీసదృశా నను తేమీ భోగానన్తరదుఃఖకృతః స్యుః ।

చేతోభృఙ్గ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం

భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరన్దమ్ ॥ ౪॥

తవ హితమేకం వచనం వక్ష్యే శృణు సుఖకామో యది సతతం

స్వప్నే దృష్టం సకలం హి మృషా జాగ్రతి చ స్మర తద్వదితి।

చేతోభృఙ్గ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం

భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరన్దమ్ ॥ ౫॥

ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య

శ్రీ గోవిన్ద భగవత్పూజ్యపాద శిష్యస్య

శ్రీమచ్ఛంకర భగవతః కృతౌ

లక్ష్మీనృసింహ పఞ్చరత్నమ్ సమ్పూర్ణమ్ ॥

 

తిరుప్పావై రెండవరోజు పాశురం

 

2.పాశురము :

 

వైయత్తు వాళ్ వీర్ గళ్! నాముమ్ నమ్బావైక్కు

శేయ్యుం కిరిశైగళ్ కేళీరో, పాఱ్కడలుళ్

పైయ త్తుయిన్ఱ పరమనడిపాడి

నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి

మైయిట్టెళుదోమ్ మలరిట్టు నామ్ ముడియోమ్

శెయ్యాదన శెయ్యోమ్ తీక్కుఱళైచ్చెన్ఱోదోమ్

ఐయముమ్ పిచ్చైయుంఆన్దనై యుంకైకాట్టి

ఉయ్యుమాఱెణ్ణి యుగన్దేలో రెమ్బావాయ్.

 

భావము : భూలోకంలోని గోకులంలో పుట్టిన భాగ్యవతులారా! మనం చేయబోయే వ్రతానికి ముఖ్యంగా ఆచరించవలసిన కృత్యముల వినుడు. శ్రీ మన్నారాయణుని పాదారవిందాలకు కీర్తిస్తాము. అతనితో కల్గిన విశ్లేష సమయాన ఇతరములైన ఎట్టి భోగ్య విషయాలను తలచము. పాలను త్రాగము. కన్నుల కాటుక నుంచము. నేతిని భుజింపము. సిగలో పూలను దాల్చము. అనగా శాస్త్ర విరుద్దములైన ఎట్టి పనులను చేయము. ఒకరిపై చాడీలను చెప్పము. సత్పాత్రదానము చేతము. సన్యాసులకును, బ్రహ్మచారులకును సత్పత్రదానము చేతుము. ఇంకను ఉజ్జీవించు మార్గములేవైన యున్న వాని నెరిగి సంతోషముతో నాచరింతుము. ఇట్లు యీ ధనుర్మాస కాలమంతయు కొనసాగింతుము. ఇదియే మన వ్రతము.

 

అవతారిక :

 

ఈ మాలికలో గోదాదేవి వ్రతమును చేయటానికి కొన్ని నియమాలను వివరిస్తోంది. శ్రీ కృష్ణునికి అంకితంకావటమే ముఖ్యమైన నియమం. భక్తిలేనిదే వ్రతం చేసినా ఫలం దక్కదు. శ్రీకృష్ణునికి అంకితం కావటం ఆయన అనుగ్రహం మాత్రమే కోరటం, ఇవే ముఖ్యం. ప్రత్యేకమైన విధులూ, నియమాలూ అంటూ ఏమీలేవు. శ్రీ కృష్ణుని యందు ప్రీతితో యేది చేస్తే అవేనియమాలు అంటుంది గోద.

 

2వ మాలిక

 

(మధ్యమావతి రాగము – ఆదితాళము)

 

ప..    వినుడోయమ్మ! వినుడు

భూమిని సుఖముల బడయ దలచిన

భాగ్యవతులార! వినుడు

వినుడోయమ్మ!వినుడు

అ..ప..    మన నోముకుచేయదగిన కృత్యముల మేము చెప్పెదము వినుడు

వినుడోయమ్మ వినుడు

1. చ..    పాలకడలిపై పవళించిన స్వామి – పరమాత్ముని పాదముల కామించి

పాడిపాడి ఉజ్జీవించు విధమెరిగి – పరమ పవిత్రులె కావలె వినుడు

2. చ…    పూజ్యులకు భిక్ష, పేదకు దానము – పొసగ జేయవలె నిరతమును

సృతమానము, పాలను ద్రావము – పగటుగా కనుక కాటుక దీర్పము

3 చ..    ప్రాతఃకాలము నీరాడుదుము – పగటుగా కనుక కాటుక దీర్పము

పూవులతోడ కురులనే ముడువము

పెద్దలు చేయని పనులను చేయము

మిత్రం చేయగరాని పనలనే చేయము

చేటు మాటలను చెప్పగబోము

చేరదలచు నా గమ్యము వీడము

చేరగ శ్రీ పతి వేడుకొందుము

వినుడోయమ్మ! వినుడు

 

 

శ్రీకొండ ఉమాకాంత శర్మ సిథ్థాంతి.

 

చరవాణి:9440232574.

గౌరీదశకం

లీలాలబ్ధస్థాపితలుప్తాఖిలలోకాం – లోకాతీతైర్యోగిభిరంతశ్చిరమృగ్యామ్
బాలాదిత్యశ్రేణిసమానద్యుతిపుంజాం – గౌరీమంబామంబురుహాక్షీమహమీడే || ౧ ||

ప్రత్యాహారధ్యానసమాధిస్థితిభాజాం – నిత్యం చిత్తే నిర్వృతికాష్ఠాం కలయంతీమ్
సత్యజ్ఞానానందమయీం తాం తనురూపాం – గౌరీమంబామంబురుహాక్షీమహమీడే || ౨ ||

చంద్రాపీడానందితమందస్మితవక్త్రాం – చంద్రాపీడాలంకృతనీలాలకభారామ్ |
ఇంద్రోపేంద్రాద్యర్చితపాదాంబుజయుగ్మాం – గౌరీమంబామంబురుహాక్షీమహమీడే || ౩ ||

ఆదిక్షాంతామక్షరమూర్త్యా విలసంతీం – భూతే భూతే భూతకదంబప్రసవిత్రీమ్ |
శబ్దబ్రహ్మానందమయీం తాం తటిదాభాం – గౌరీమంబామంబురుహాక్షీమహమీడే || ౪ ||

మూలాధారాదుత్థితవీథ్యా విధిరంధ్రం – సౌరం చాంద్రం వ్యాప్య విహారజ్వలితాంగీమ్ |
యేయం సూక్ష్మాత్సూక్ష్మతనుస్తాం సుఖరూపాం – గౌరీమంబామంబురుహాక్షీమహమీడే || ౫ ||

నిత్యః శుద్ధో నిష్కల ఏకో జగదీశః – సాక్షీ యస్యాః సర్గవిధౌ సంహరణే చ |
విశ్వత్రాణక్రీడనలోలాం శివపత్నీం – గౌరీమంబామంబురుహాక్షీమహమీడే || ౬ ||

యస్యాః కుక్షౌ లీనమఖండం జగదండం – భూయో భూయః ప్రాదురభూదుత్థితమేవ |
పత్యా సార్ధం తాం రజతాద్రౌ విహరంతీం – గౌరీమంబామంబురుహాక్షీమహమీడే || ౭ ||

యస్యామోతం ప్రోతమశేషం మణిమాలాసూత్రే యద్వత్కాపి చరం చాప్యచరం చ |
తామధ్యాత్మజ్ఞానపదవ్యా గమనీయాం – గౌరీమంబామంబురుహాక్షీమహమీడే || ౮ ||

నానాకారైః శక్తికదంబైర్భువనాని – వ్యాప్య స్వైరం క్రీడతి యేయం స్వయమేకా |
కళ్యాణీం తాం కల్పలతామానతిభాజాం – గౌరీమంబామంబురుహాక్షీమహమీడే || ౯ ||

ఆశాపాశక్లేశవినాశం విదధానాం – పాదాంభోజధ్యానపరాణాం పురుషాణామ్ |
ఈశామీశార్ధాంగహరాం తామభిరామాం – గౌరీమంబామంబురుహాక్షీమహమీడే || ౧౦ ||

ప్రాతఃకాలే భావవిశుద్ధః ప్రణిధానాద్భక్త్యా నిత్యం జల్పతి గౌరిదశకం యః |
వాచాం సిద్ధిం సంపదమగ్ర్యాం శివభక్తిం – తస్యావశ్యం పర్వతపుత్రీ విదధాతి || ౧౧ ||images

ధనుర్మాసము విశిష్టత- కర్తవ్యములు

 

సూర్యుడు వృశ్చికరాశి నుండీ ధనుస్సు రాశికి వచ్చు సమయము నుండీ ధనుర్మాసము మొదలవుతుంది. *ఆగ్నేయ (అగ్ని) పురాణము* ప్రకారము ఈ మాసము శ్రీ మహావిష్ణువు కు అత్యంత ప్రీతిపాత్ర మైనది. ధనుర్మాస వ్రతమును ఆచరించు వారికి ఈ నెల అత్యంత ప్రాముఖ్యమైనది.

శ్రీమహావిష్ణువు పుష్ప, శ్రీగంధమాల్య, మణి మౌక్తిక, పీతాంబర అలంకార ప్రియుడు అని ప్రతీతి. ఈ ధనుర్మాసములో ప్రతి దినమూ సూర్యోదయమునకు ముందే శ్రీమహావిష్ణువును సహస్ర నామార్చనతో పూజింప వలెను అని శాస్త్రములు నిర్దేశిస్తున్నాయి. ఈ మాసములో ఏ దేవాలయములో చూసినా బ్రాహ్మీముహూర్తములోనే పూజలుమొదలవుతాయి. అనేక విష్ణు దేవాలయములలో పెసర పప్పుతో చేసిన పులగమును ఆ పరమాత్మునికి నైవేద్యముగా సమర్పించి ప్రసాదంగా భక్తులకు ఇస్తారు.

ధనుర్మాస వ్రత కథ
పురాణము ప్రకారము ఒకసారి బ్రహ్మదేవుడు హంస రూపములో లోక సంచారము చేస్తున్నాడు. అప్పుడు సూర్యునికి అకారణముగా గర్వము పొడుచుకు వచ్చి కావాలని, ఆ హంసపైన తన తీక్షణమైన కిరణాలతో తాపమును కలిగించాడు. అందుకు నొచ్చుకుని బ్రహ్మ, సూర్యుడికి తన తప్పు తెలిసిరావలెనని, *నీ తేజో బలము క్షీణించు గాక* యని శపించినాడు. వెంటనే సూర్యుడు తేజోహీనుడై, తన ప్రకాశమునంతటినీ పోగొట్టుకున్నాడు.
దానితో  మూడులోకాలూ  అల్లకల్లోలమైనవి. సూర్యుడి తేజము చాలినంత లేక, జపములు, తపములు, హోమములు అన్నీ నిలచిపోయినాయి. దేవతలకు, ఋషులకే గాక, సామాన్య జనాలకు కూడా నిత్యకర్మలలో ఇబ్బందులుమొదలైనాయి. పరిస్థితి మరింత క్షీణించడముతో,దేవతలు అనేక సంవత్సరములు బ్రహ్మను గూర్చి తపము చేసినారు. బ్రహ్మ ప్రత్యక్షము కాగానే, సూర్యుని శాపాన్ని తొలగించమని వేడుకున్నారు.

సూర్యుడు తాను ధనూరాశిని ప్రవేశించగనే ఒక మాసము పాటు శ్రీ మహా విష్ణువును పూజిస్తే  అతడి శాప విమోచనము అవుతుంది.అని బ్రహ్మ తెలిపినాడు. బ్రహ్మ చెప్పిన విధముగా సూర్యుడు పదహారు సంవత్సరముల పాటు ధనుర్మాస విష్ణు పూజను చేసి తిరిగి తన తేజస్సును ప్రకాశమునూ పరిపూర్ణముగా పొందినాడు. సూర్యుడి నుండీ మొదలైన ఈ పూజ తదనంతరము మిగిలిన దేవతలూ మరియూ ఋషులలో ప్రాచుర్యము పొంది, తమ కర్మానుష్ఠానములు నిర్విఘ్నముగా విజయ వంతంగా జరుగుటకు వారుకూడా ధనుర్మాస పూజ సూర్యోదయపు మొదటి జాములో ఆచరించుట మొదలు పెట్టినారు.

అగస్త్య మహర్షి, విశ్వామిత్రుడు,గౌతముడు, భృగువు వంటి మహర్షులే కాక, అనేక దేవతలు, ఉపదేవతలు కూడా ఈ ధనుర్మాస వ్రతమునుఆచరించినారని వివిధ పురాణములలో ఉంది.

ధనుర్మాసము అత్యంత మంగళకరమైన మాసమే అయినా ఇది శుభకార్యములు జరప కూడని శూన్య మాసము. ఈ నెలలో శుభకార్యము లైన వివాహ, గృహ ప్రవేశ, ఉపనయనము మొదలగు కార్యములు చేయు పద్దతి లేదు. ఏమి చేసిననూ ఈ మాసము సంపూర్ణముగా మహావిష్ణువు సంప్రీతి కొరకే కేటాయించవలెను. వైకుంఠ ఏకాదశి కూడా ఈ మాసములోనే వచ్చును.

ముద్గాన్న నైవేద్యము
ఈ ధనుర్మాసములో మహావిష్ణువుకు ముద్గాన్నమును నైవేద్యముగా సమర్పిస్తారు. [పెసర పప్పుతో చేసిన పులగము] దీని గురించి *ఆగ్నేయ పురాణము* లో ఇలాగుంది,

ధనూరాశిలో సూర్యుడు ఉండగా పులగమును ఒక్క దినమైనా విష్ణువుకు సమర్పించిన మనుష్యుడు ఒక వేయి సంవత్సరముల పాటు పూజ చేసిన ఫలాన్ని పొందుతాడు అని వివరిస్తుంది

ఈ నైవేద్యమును పాకము చేయు విధమును కూడా పురాణమే తెలుపుతుంది. దాని ప్రకారము,

బియ్యమునకు సమానముగా పెసర పప్పును చేర్చి వండు పులగము ఉత్తమోత్తమము. బియ్యపు ప్రమాణములో సగము పెసరపప్పు చేర్చితే అది మధ్యమము. బియ్యపు ప్రమాణములో పావు వంతు పెసరపప్పు చేర్చితే అది అధమము. అయితే, బియ్యపు ప్రమాణమునకు రెండింతలు పెసరపప్పు చేర్చితే అది పరమ శ్రేష్టమైనది. భక్తులు తమకు శక్తి ఉన్నంతలో శ్రేష్ట రీతిలో పులగము వండి పరమాత్మునికి నివేదించవలెను. ఎట్టి పరిస్థితిలోనూ పెసర పప్పు ప్రమాణము, బియ్యమునకంటే  సగము కన్నా తక్కువ కాకుండా చూసుకోవలెను.

అంతే కాదు పెసర పప్పు, పెరుగు, అల్లము, బెల్లము, కందమూలములు, ఫలములతో కూడిన పులగమును భగవంతునికి సమర్పిస్తే సంతుష్టుడై భక్త వత్సలుడైన మహావిష్ణువు తన భక్తులకు సకల విధములైన భోగములను మోక్షమును కూడా ప్రసాదిస్తాడు అని పురాణము తెలుపుతుంది.
అందుకే, ధనుర్మాసమనగానే విష్ణు పూజ మరియు పులగము [పొంగల్] తప్పని సరియైనాయి. శ్రద్ధాళువులు తమ తమ శక్తి మేరకు ధనుర్మాసములో శ్రీ మహా విష్ణువును పూజించి కృతార్థులై, ఆయన కృపకు పాత్రులు కాగలరు.
తిరుప్పావై అంటే ఏమిటి …..?
తిరుప్పావై ఒక అద్భుత వేదాంత గ్రంధం. భగవంతుని సులభంగా అందించగలిగే సాధనా మార్గం. ”తిరు” అంటే శ్రీ అని, ”పావై” అంటే పాటలు లేక వ్రతం అని అర్ధం. కలియుగంలో మానవ కన్యగా జన్మించి గోదాదేవిగా ప్రఖ్యాతమైన ఆండాళ్ భగవంతుడినే తన భర్తగా భావించి, ఆయన్ను చేపట్టడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై వ్రతం. తిరుప్పావై లో పాశురాలు ఉంటాయి. పాశురం అంటే ఛందోబద్ధంగా ఉన్న పాటలు. ఆండాళ్ అపురూప భక్తి పారవశ్యాన్నే శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యద అనే గ్రంథంగా అందించారు.

తిరుప్పావై వ్రతానికి కొన్ని విధివిధానాలు ఉన్నాయి. వేకువజామునే నిద్ర లేచి స్నానం చేయాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా స్వామి కీర్తనలను, తిరుప్పావై పాశురాలను ఆలపించాలి. పేదలకు దానాలు, పండితులకు సన్మానాలు చేయాలి. స్వామికి, ఆండాళ్ కు ఇష్టమైన పుష్ప కైంకర్యం చేయాలి. ప్రతిరోజూ స్వామివారికి పొంగలి నివేదించాలి.

సృష్టిలో భగవంతుడొక్కడే పురుషుడు, మానవులందరూ స్త్రీలు అనే ఉద్దేశంతోనే విష్ణుమూర్తిని శ్రీవారు అని సంబోధిస్తుంటారు. అటువంటి విష్ణుమూర్తిని భర్తగా పొందాలనే తలపుతో గోదాదేవి ధనుర్మాసంలో చేసిన ఈ వ్రతాన్ని నేటికీ మనం ఆచరిస్తున్నాం. ధనుర్మాసం మొదటిరోజున ఈ వ్రతాన్ని ఆరంభించి, భోగి రోజున ఆండాళ్, శ్రీరంగనాథుల కల్యాణం జరిపించడంతో ఈ వ్రతం ముగుస్తుంది.

శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రకారం భక్తిసాగరంలో మునిగి తేలినవారిని ”ఆళ్వారులు” అంటారు. పన్నెండుమంది ఆళ్వారుల్లో విష్ణుచిత్తుడు మొదటివాడు. ఆయన గోదాదేవికి భక్తిసంపదలను వారసత్వంగా ఇచ్చారు. నిజానికి భూదేవియే ఆండాళ్ అని చెప్తారు. జనకమహారాజు భూమిని దున్నే సమయంలో సీతామాత దొరికింది. అలాగే శ్రీరంగనాథునికి పుష్ప కైంకర్యం కోసం విష్ణుచిత్తులవారు తులసితోట సాగుచేస్తుండగా ఆండాళ్ దొరికింది.

భగవంతుని తప్ప ఇతరులను సేవించడానికి వినియోగం కాని తులసివనంలో ఆండాళ్ దొరకదాన్ని గమనిస్తే సీతాదేవి ఆండాళ్ భూదేవి అంశయే అన్న సంగతి అర్ధమౌతుంది. ఆండాళ్ అసలు పేరు కోదై. ”కోదై” అంటే మాలిక. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది. ఆ గోదాదేవి రచించిన 30 పాశురాలలో ఏయే అంశాలు ఉన్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. 30 పాశురాలలోని అంశాలు స్థూలంగా మంచిని ప్రబోధిస్తాయి. మంచి అలవాట్లతో జీవించమని, తోటివారికి సాయపడమని, భగవంతుని తప్పనిసరిగా ఆరాధించమని ఈ ప్రబోధాలు సూచిస్తాయి. ప్రతి పాశురంలోనూ ఇలాంటి సదాచరణే ఉంటుంది.
తిరుప్పావై మొదటిరోజు పాశురం

తిరుప్పావై

1.    పాశురము :

*మార్గళిత్తింగళ్ మది నిఱైన్ద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్ గు మాయ్ ప్పాడి చ్చెల్వచ్చిఱుమీర్ కాళ్
కూర్ వేల్ – కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్
ఏరార్ న్దకణ్ణి యశోదై యిళ శింజ్గమ్
కార్ మేని చ్చెంగళ్ కదిర్ మదియమ్బోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱై దరువాన్
పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్ !

భావము : సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలారా~ మార్గశీర్ష మాసం ఎంతో మంచిది. వెన్నెలలు కురిపిస్తుంది. చాలా మంచి రోజులివి. శూరుడైన నందగోపుని కుమారుడును, విశాల నేత్రియగు యశోదకు బాల సింహము వంటి వాడును, నల్లని మేఘము వంటి శరీరిమును, చంద్రునివలె ఆహ్లాదకరుడును, సూర్యునివలె తేజోమయుడును యైన నారాయణునే తప్పు, యితరములను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కాలవసినవిచ్చుటకు సిద్ధపడినాడు. కావున మీరందరూ యీ వ్రతములో ప్రవేశించి లోకము ప్రకాశించునట్లుగ దాని కంగమైన మార్గళి స్నానము చేయు కోరికగల వారందరును ఆలసింపక శ్రీఘ్రముగ రండని శ్రీ గోదాదేవి గొల్ల కన్నియలందరను ఆహ్వానించుచున్నది.

తిరుప్పావైగీతమాలిక

అవతారిక:

వ్రతము చేయుటకు అనువైన సమయము, మాసము – మార్గశీర్షమాసము. కనుక భాగత్సంశ్లేషము కోరే భక్తులందరను వ్రతము చేయగా మార్గళి స్నానం చేదురు, రండీ! అని గోదాదేవి ఆహ్వానిస్తున్నది.

1వ మాలిక

(రేగుప్తి రాగము -ఆదితాళము)

ప..    శ్రీ గోకుల వాసులారా! – సిరికన్నియలార!
భావతాపము దీర్చుకొనగ – వ్రతము చేయరండి!

అ.ప..    మార్గశీర్ష మాసమెంతో – మంచిది కద! రండి!
మనసు పడిన వారెల్లరు -మార్గళి నీరాడ రండి!

1. చ..    ఆపద శంకించి కాచు – ఆనందుని తనయుని
యశోదమ్మ యొడి యాడెడు – ఆ  బాల సింహుని
నీలమేఘశ్యాముని – ఇన శశి సమవదమని
నారాయణు గొలువనిపుడు – నరుల బొగడ రండి

2. ఛ.    ఈ నోమును నోచు మనము – ఇతరములను కోరము
పర సాధన మొసగెడి మన – పరమాత్ముడే, సర్వము
లోకమంత పొగడగ నీ – నోము మనము నోచెదము
మనసు పడిన వారెల్లరు – మార్గళి నీ రాడరండి.

శ్రీకొండ ఉమాకాంత శర్మ సిథ్థాంతి.

చరవాణి:9440232574%e2%80%aa91-94402-32574%e2%80%ac-20161215_121502

దేశ భాషలందు తెలుగు భాష లెస్స

దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు 4వ శతాబ్దం లోనే శ్రీ శ్రీనాథుల వారు చెప్పారు.అలాంటి మహానుభావులు చెప్పిన మాటలను మనం విస్మరిస్తున్నాం.  నిద్ర లేచిన దగ్గరి నుండి మృత భాష మాట్లాడుతాము.మనం మాట్లాడే మాట సత్యం అగుగాక అని దీవిస్తుంటారు (శ్రవణులు) తథాస్తు దేవతలు తథాస్తు అంటారు.దీని వలన మనం ప్రతి రోజు ఏన్నో బాధలు కలుగుతున్నాయి.అందుకే విదేశీయులు సైతం మన భాష,సంస్క్రతుల గోప్పదనం తెలుసుకొని వారు మనకంటే ముందు వరుసలో వున్నారు. కనుక మనం ఇప్పటికైన మనకు పెద్దలు ఇచ్చిన సంపదను కాపాడుదాం…….
మనం బ్రతకడానికి తెలుగు మాట్లాడుదాము — మన జీవనానికి ఇంగ్లీషును వాడుదాం….
మనం మాట్లాడే కొన్ని అర్థాలు తెలుసుకుందాం.

* అమృతాన్ని వర్షించు *అమ్మ* యను మాట మరచి,
మృతశరీరాన్ని స్ఫురింపజేసే *మమ్మీ* యను మాట నేర్చిరి! అమ్మను అమృత వాణిని కాస్త జీవం లేనిదానిగా చేస్తిరి..?

* *నాన్నా!* యనగ, ప్రేమమీరగ విశ్వమంతను చూపే తండ్రిని,
*డ్యాడ్* అంటూ బ్యాడ్ గా డమ్మీని చేసిరి! నాన్నను సంస్కారం లేని వానిగా చేస్తిరి..?

* అమ్మా నాన్నల ప్రేమ కలగలపిన *అన్న* ను,
*(బ్రో) దర్*అంటూ బరువూ బాధ్యత లేనివానిగ మార్చి! బ్రో(ద) కర్ గా చేస్తిరి..?

* *తమ్ముడూ!* అను మురిపాల పిలుపునకు కూడా, *(బ్రో) దర్ ఒకటే పదం* అంటూ సెలవిచ్చి! జోకర్ గా చేస్తిరి..?

* *అక్కా!* యనగ, అవ్యాజానురాగమైన ప్రేమను అనంతంగా కురిపించు
అమృతమూర్తిని, *(సిస్ )టర్* అంటూ మిస్ చేసి! సిస్ అంటు అక్కను మాయం చేస్తిరి..?

* *చెల్లీ!* యనగా,  కష్టాల్లో నాకంటూ తోడుగా నా అన్న వున్నాడంటూ
భ్రమించే చెల్లికి కూడా, *(సిస్ )టర్ ఒకటే పదమే* అంటూ సొద పెట్టి! చెల్లిని వ్యర్థానికి సూచిక చేస్తిరి..?

* సంస్కారాన్ని తెలిపే *నమస్కారాన్ని*,
*హెలో!, హాయ్!* అంటూ జాయ్‌గా ఎంజాయ్‌గా మార్చిరి ! నమస్కారానికి సంస్కారం లేకుండ చేస్తిరి..?

* యుగానికే ఆది తెలుగు *ఉగాది*, సంస్కృతీ సంబరాలను మరచి, *తల్లుల(దినం) రోజు, తండ్రుల (దినం)రోజు, ప్రేమికుల (దినం)రోజు,ఆంగ్ల సంవత్సరాది* విందుల మత్తులో మునిగితేలిరి? బ్రతికి వుండగానే దినం పెట్టేస్తిరి..?

* *సుమతి* లోపించి, *వేమన* ను మరచి, తెలుగున సంభాషించు వాడిని చిన్నచూపు జూచి,
ఆంగ్లము అరకొరగా, అస్తవ్యస్తముగా పలికినా, చిలక పలుకులని భ్రమించ సాగిరి? చిలుక పలుకులని కాకి పలుకులు పలికిస్తిరి..?

* వేయి మాటలేల, అత్తకు పిన్నమ్మకు *ఆంటీ*, మామకు పెద్దయ్యకు *అంకుల్*,అంటూ
బోడిగుండుకు మోకాలికి ముడి వేసినట్లుగా, ఒక్కొక్కటే పదమనిరి! అందరిని అంట్టి ముట్టనట్లుగా వ్యవహరించిరి..? ఇదా మన తెలుగు……..!

* అక్షరాలు తక్కువై, ఇఛ్ఛానుసారం పదాలను పొందుజేసి,
పెంపొందింపజేసిన ఎంగిలిభాష, విశ్వభాష యెట్లయ్యనో?

*సుధామధురిమలొలుకు పరిపూర్ణ అమృతఘటము వంటి తేట తెనుగు*,
*విశ్వము నుండి కనుమరుగు యెట్లు కాజొచ్చెనో?*
*యెంత ఆలోచించినను, అవగతం కాకుండె వినర తెనుగు రాయుడా!!*
తెలుగు మాన్యులారా నా చిరు ప్రయత్నం….
తెలుగులోనే మాట్లాడుదాం పరాయి భాష మనకొద్దు తెలుగు భాషే ముద్దు.
జై తెలుగు భాష….  జై జై తెలుగు భాష…….

*తెలుగుభాషాభిమానులైన మాన్యులందరకీ వందనం, శుభాభినందనం.*

శ్రీకొండ ఉమాకాంత శర్మ సిథ్థాంతి

చరవాణి:9440232574.%e2%80%aa91-94402-32574%e2%80%ac-20161215_121502

శ్రీ గణాధిప పంచరత్నం

సరాగిలోకదుర్లభం విరాగిలోకపూజితం
సురాసురైర్నమస్కృతం జరాపమృత్యునాశకమ్ |ganapathy
గిరా గురుం శ్రియా హరిం జయంతి యత్పదార్చకాః
నమామి తం గణాధిపం కృపాపయః పయోనిధిమ్ || ౧ ||

గిరీంద్రజాముఖాంబుజ ప్రమోదదాన భాస్కరం
కరీంద్రవక్త్రమానతాఘసంఘవారణోద్యతమ్ |
సరీసృపేశ బద్ధకుక్షిమాశ్రయామి సంతతం
శరీరకాంతి నిర్జితాబ్జబంధుబాలసంతతిమ్ || ౨ ||

శుకాదిమౌనివందితం గకారవాచ్యమక్షరం
ప్రకామమిష్టదాయినం సకామనమ్రపంక్తయే |
చకాసతం చతుర్భుజైః వికాసిపద్మపూజితం
ప్రకాశితాత్మతత్వకం నమామ్యహం గణాధిపమ్ || ౩ ||

నరాధిపత్వదాయకం స్వరాదిలోకనాయకం
జ్వరాదిరోగవారకం నిరాకృతాసురవ్రజమ్ |
కరాంబుజోల్లసత్సృణిం వికారశూన్యమానసైః
హృదాసదావిభావితం ముదా నమామి విఘ్నపమ్ || ౪ ||

శ్రమాపనోదనక్షమం సమాహితాంతరాత్మనాం
సుమాదిభిః సదార్చితం క్షమానిధిం గణాధిపమ్ |
రమాధవాదిపూజితం యమాంతకాత్మసంభవం
శమాదిషడ్గుణప్రదం నమామి తం విభూతయే || ౫ ||

గణాధిపస్య పంచకం నృణామభీష్టదాయకం
ప్రణామపూర్వకం జనాః పఠంతి యే ముదాయుతాః .
భవంతి తే విదాం పురః ప్రగీతవైభవాజవాత్
చిరాయుషోఽధికః శ్రియస్సుసూనవో న సంశయః || ౬ ||