Monthly Archives: November 2016

** సాయంత్రాలు రాత్రులు, సీతాకోకచిలుక **

 

రంగుల్లో మునిగి
నామీద నుండి
యెగిరెళ్ళిపోతుంది
సీతాకోకచిలుక

సాయంత్రపు సూర్యుడి వైపు మరలి
ఎరుపద్దుతుంది

కొంచం కొంచెంగా
రాత్రికి నలుపద్దుతుంది

కనబడదు
అది

కొంత సమయానికి
చుక్కలను రెక్కలనుండి
విముక్తి చేసి
చీకటాకాశానికి బొట్లు పెడుతుంది

ఆకాశమప్పుడు
రంధ్రాలుపడ్డ
నల్లగొంగళిపురుగు

నేనింకా
తను పూసెళ్ళిన
రంగులో మేలుకునుంటాను

తెల్లారుతుంది

సీతాకోకచిలుక
ఉండదు

అదీ
సాయంత్రపు మాయా
రాత్రికి రంగుల జన్మనిచ్చే వింత
భూమ్యాకాశాల మధ్య గడప

విజయ్ కుమార్ ఎస్వీకే

fb_img_1480312168489

శివనామావల్యష్టకం

హే చంద్రచూడ మదనాంతక శూలపాణే – స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో |

భూతేశ భీతభయసూదన మామనాథం – సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || ౧ ||

హే పార్వతీహృదయవల్లభ చంద్రమౌళే – భూతాధిప ప్రమథనాథ గిరీశచాప |
హే వామదేవ భవ రుద్ర పినాకపాణే – సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || ౨ ||

హే నీలకంఠ వృషభధ్వజ పంచవక్త్ర – లోకేశ శేషవలయ ప్రమథేశ శర్వ |
హే ధూర్జటే పశుపతే గిరిజాపతే మాం – సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || ౩ ||

హే విశ్వనాథ శివ శంకర దేవదేవ – గంగాధర ప్రమథనాయక నందికేశ |
బాణేశ్వరాంధకరిపో హర లోకనాథ – సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || ౪ ||

వారాణసీపురపతే మణికర్ణికేశ – వీరేశ దక్షమఖకాల విభో గణేశ |
సర్వజ్ఞ సర్వహృదయైకనివాస నాథ – సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || ౫ ||

శ్రీమన్మహేశ్వర కృపామయ హే దయాళో – హే వ్యోమకేశ శితికంఠ గణాధినాథ |
భస్మాంగరాగ నృకపాలకలాపమాల – సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || ౬ ||

కైలాసశైలవినివాస వృషాకపే హే – మృత్యుంజయ త్రినయన త్రిజగన్నివాస |
నారాయణప్రియ మదాపహ శక్తినాథ – సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || ౭ ||

విశ్వేశ విశ్వభవనాశక విశ్వరూప – విశ్వాత్మక త్రిభువనైకగుణాధికేశ |
హే విశ్వనాథ కరుణామయ దీనబంధో – సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || ౮ ||

గౌరీవిలాసభవనాయ మహేశ్వరాయ – పంచాననాయ శరణాగతకల్పకాయ |
శర్వాయ సర్వజగతామధిపాయ తస్మై – దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౯ ||IMG_20160803_081822_140

ఎక్కల మాస్టారు ప్రేమలేఖ

 

పల్లవి:
లెక్కల్లో లేని కోణం నీ కన్నుల్లో చూశానే…
దిక్కుల్లో లేని దిశను నీ వైపుకు మార్చావే..
మబ్బుల్లో ఉన్న చుక్కకు… లెక్కల్లో ఉన్న చుక్కకు..
అర్ధం నీ రూపం.. అంటుందే నా ప్రాణం…
రంగులకే కలలిచ్చావె… పువులకే పరిమళ మద్దావే..
నా గుండెల్లో దాగిన గుడికి గోపురమే నువ్వయ్యావె..
ఆ గుడిలో మన ప్రేమను నేను దేవతగా కొలువుంచానే..
నీ చెక్కిలి… నాలోగిలి… ఈ మక్కువ నీ కొరకే..
ఏ చీకటి.. రేచీకటి.. ఈ వెన్నెల నీ వలనే…
చరణం1:
లెక్కల్లో రూట్లెన్నో సాల్వ్ చూశానే..
నీ ప్రేమ పొందడానికి ఏ రూట్లో తిరగాలే..
ప్లస్సులను, మైనస్సులను పక్కాగా చేశానే..
నా ప్లస్సులు, మైనస్సులు ఏమున్నాయో చెప్పేవె..
విభజనులు లెక్కల్లో విడి విడిగా చేశానే..
భజనెంతో చేస్తున్నా విడి విడిగా చూస్తావే..
నీ లెక్కేంటో.. నా లెక్కేంటో..
సరిచేస్తా నా ప్రేమను బాణం లా దించి..
చనిపోతా నా ప్రేమను నీలో దాచి…

రచన
శ్రావణ్ కుమార్fb_img_1479796198778

శ్రీమన్నారాయణాష్టాక్షరీ స్తుతి

ఓం ఓం నమః ప్రణవార్థార్థ స్థూలసూక్ష్మ క్షరాక్షర

వ్యక్తావ్యక్త కళాతీత ఓంకారాయ నమో నమః || ౧ ||

న నమో దేవాదిదేవాయ దేహసంచారహేతవే
దైత్యసంఘవినాశాయ నకారాయ నమో నమః || ౨ ||

మో మోహనం విశ్వరూపం చ శిష్టాచారసుపోషితమ్
మోహవిధ్వంసకం వందే మోకారాయ నమో నమః || ౩ ||

నా నారాయణాయ నవ్యాయ నరసింహాయ నామినే
నాదాయ నాదినే తుభ్యం నాకారాయ నమో నమః || ౪ ||

రా రామచంద్రం రఘుపతిం పిత్రాజ్ఞాపరిపాలకమ్
కౌసల్యాతనయం వందే రాకారాయ నమో నమః || ౫ ||

య యజ్ఞాయ యజ్ఞగమ్యాయ యజ్ఞరక్షాకరాయ చ
యజ్ఞాంగరూపిణే తుభ్యం యకారాయ నమో నమః || ౬ ||

ణా ణాకారం లోకవిఖ్యాతం నానాజన్మఫలప్రదమ్
నానాభీష్టప్రదం వందే ణాకారాయ నమో నమః || ౭ ||

య యజ్ఞకర్త్రే యజ్ఞభర్త్రే యజ్ఞరూపాయ తే నమః
సుజ్ఞానగోచరాయాఽస్తు యకారాయ నమో నమః || ౮ ||img_20161108_201020_221

గోవత్స ద్వాదశి

భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో ప్రతిమాసానికి విశిష్టత ఉంది. ఇందులో కార్తీక మాసం మహా మహిమాన్వితమైనది. ఈ మాసం శివ, వైష్ణవ, శక్తి ఆరాధనకే కాక గో ఆరాధనకు చాలా ముఖ్యమైనది. ఈ కార్తీక మాసంలో పౌర్ణమి ముందు ఉండే అష్టమిని గోపాష్టమని, పౌర్ణమి తరువాత వచ్చే ద్వాదశిని గోవత్సద్వాదశి అని మన ఋషూలు గోమాతకు సంబంధించి ఈ తిధుల్ని విశేషంగా చెప్పారు.
గోపాష్టమి రోజున గోవుకు పూజ చేసి దానికి ధాన్యం లేదా పండ్లను తినిపించడం వల్ల విశేషమైన పుణ్యం వచ్చి చేసిన పాపాలు అన్నీ పోతాయని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. గోవత్స ద్వాదశి రోజున దూడతో కూడిన ఆవుకు పూజ చేసి గోవు యొక్క పృష్ఠ భాగంలో తోకను నమస్కరించి దానికి చివరకు ధాన్యం పెట్టకపోయినా, రెండు పండ్లు తినిపించినా ఆ సంవత్సరంలో పొందవలసిన ప్రయోజనములన్నీ పొందుతారని మన పురాణాలు చెబుతున్నాయి. గోవును తల్లిగా భావించడం మన హిందూ సంస్కృతి. గోవులను పూజించడం మన ఆచారం. ఋగ్వేదంలో “ఋక్కులు” పశువుల యొక్క ప్రాముఖ్యతను వివరించాయి.  ఋగ్వేద  కాలమునాటి ఆర్యులు పశు సంపద మీద ఎక్కువగా ఆధార పడ్డారు కాబట్టి ఆవుకు అతి పవిత్రమైన స్థానమిచ్చి చాలా ప్రాముఖ్యతను ఆపాదించారు.  ఈ కాలంలో పశువులను “గోధనముగా”భావించడమే కాకుండా, ఎవరికి ఎక్కువ పశు సంపద వుంటుందో, వారిని “గోమతులు” అని పిలిచేవారు.  img_20161125_204629_606

గాయత్ర్యష్టకం

విశ్వామిత్రతపఃఫలాం ప్రియతరాం విప్రాలిసంసేవితాం

నిత్యానిత్యవివేకదాం స్మితముఖీం ఖండేందుభూషోజ్జ్వలామ్ |
తాంబూలారుణభాసమానవదనాం మార్తాండమధ్యస్థితాం
గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననామ్ || ౧ ||

జాతీపంకజకేతకీకువలయైః సంపూజితాంఘ్రిద్వయాం
తత్త్వార్థాత్మికవర్ణపంక్తిసహితాం తత్త్వార్థబుద్ధిప్రదామ్ |
ప్రాణాయామపరాయణైర్బుధజనైః సంసేవ్యమానాం శివాం
గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననామ్ || ౨ ||

మంజీరధ్వనిభిః సమస్తజగతాం మంజుత్వసంవర్ధనీం
విప్రప్రేంఖితవారివారితమహారక్షోగణాం మృణ్మయీమ్ |
జప్తుః పాపహరాం జపాసుమనిభాం హంసేన సంశోభితాం
గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననామ్ || ౩ ||

కాంచీచేలవిభూషితాం శివమయీం మాలార్ధమాలాదికా-
న్బిభ్రాణాం పరమేశ్వరీం శరణదాం మోహాంధబుద్ధిచ్ఛిదామ్ |
భూరాదిత్రిపురాం త్రిలోకజననీమధ్యాత్మశాఖానుతాం
గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననామ్ || ౪ ||

ధ్యాతుర్గర్భకృశానుతాపహరణాం సామాత్మికాం సామగాం
సాయంకాలసుసేవితాం స్వరమయీం దూర్వాదలశ్యామలామ్ |
మాతుర్దాస్యవిలోచనైకమతిమత్ఖేటీంద్రసంరాజితాం
గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననామ్ || ౫ ||

సంధ్యారాగవిచిత్రవస్త్రవిలసద్విప్రోత్తమైః సేవితాం
తారాహారసుమాలికాం సువిలసద్రత్నేందుకుంభాంతరామ్ |
రాకాచంద్రముఖీం రమాపతినుతాం శంఖాదిభాస్వత్కరాం
గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననామ్ || ౬ ||

వేణీభూషితమాలకధ్వనికరైర్భృంగైః సదా శోభితాం
తత్త్వజ్ఞానరసాయనజ్ఞరసనాసౌధభ్రమద్భ్రామరీమ్ |
నాసాలంకృతమౌక్తికేందుకిరణైః సాయంతమశ్ఛేదినీం
గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననామ్ || ౭ ||

పాదాబ్జాంతరరేణుకుంకుమలసత్ఫాలద్యురామావృతాం
రంభానాట్యవిలోకనైకరసికాం వేదాంతబుద్ధిప్రదామ్ |
వీణావేణుమృదంగకాహలరవాన్దేవైః కృతాంఛృణ్వతీం
గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననామ్ || ౮ ||

హత్యాపానసువర్ణతస్కరమహాగుర్వంగనాసంగమా-
న్దోషాంఛైలసమాన్ పురందరసమాః సంచ్ఛిద్య సూర్యోపమాః |
గాయత్రీం శ్రుతిమాతురేకమనసా సంధ్యాసు యే భూసురా
జప్త్వా యాంతి పరాం గతిం మనుమిమం దేవ్యాః పరం వైదికాః || ౯ ||img_20161125_060700_857

భరత మాత రక్తాశ్రువులు ………..!

పరపాలన దాస్యశృంఖలాలు తెంచుకోడానికి
ఎందరో వీరుల ఆత్మ బలిదానానికి
మరెందరో మహానుబావుల త్యాగ నిరతికి
స్వాతంత్ర్య సముపార్జనలో ప్రాణాలోదిలిన ప్రతి అమరునికి

భరత మాత రక్తాశ్రువులు ………..!
స్వాతంత్ర్యం వచ్చినా మారని పరిస్థితికి
మతోన్మాద హింసా ప్రపృత్తికి
మానవత్వానికి మరిచిన మనుషులకి
మనుషులుగా చలామణీ అవుతున్న మృగాలకి

భరత మాత రక్తాశ్రువులు ………..!
మనిషిని మనిషే దోచే దుస్థితికి
పడతిని గౌరవించలేని దౌర్భాగ్యానికి
అబలను ఆట బొమ్మగా మార్చిన నీచత్వానికి
తెరచాటున మరుగు పడిన నిజాయితీకి

భరత మాత రక్తాశ్రువులు ………..!
శ్రమను దోచే అరాచకత్వానికి
దేశాన్ని నాశనం చేసే దుర్మార్గానికి
ఎన్నెల్లైన మారని దుస్థితికి
భరత మాత రక్తాశ్రువులు ………..!

||సోమ సుందర్ ||img-20161115-wa0035

Writers Needed For Comedy Web Series

looking for new and emerging writers who have a passion for writing quality comedy scripts for upcoming web series.
Contact :Santosh Kumar Gujjeti
Contact : 9010896583
Location: Hyderabadfb_img_1479902738678

” మం ” దార మకరందం ఆ గానం…
” గ ” (గం)ధర్వ స్వరం ఆయన సొంతం…
” ళం ” (ల)లితం సలలితం ఆ భావం…
” ప ” రవశం ఆయన పల్లవం…
” ల్లి ” (లి)ప్తకాలమైన తడబడని చరణం…

మీ గానం అజరామరం…
మీ ఆత్మకి శాంతి కలగాలని ఆశిస్తూ
బోయినపల్లి రమణ
సినీ రచయిత.fb_img_1479828529937

గణనాయకాష్టకం

ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్ |
లంబోదరం విశాలాక్షం వందేఽహం గణనాయకమ్ || ౧ ||

మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతినమ్ |
బాలేందుశకలం మౌళౌ వందేఽహం గణనాయకమ్ || ౨ ||

చిత్రరత్నవిచిత్రాంగచిత్రమాలావిభూషితమ్ |
కామరూపధరం దేవం వందేఽహం గణనాయకమ్ || ౩ ||

గజవక్త్రం సురశ్రేష్ఠం కర్ణచామరభూషితమ్ |
పాశాంకుశధరం దేవం వందేఽహం గణనాయకమ్ || ౪ ||

మూషకోత్తమమారుహ్య దేవాసురమహాహవే |
యోద్ధుకామం మహావీర్యం వందేఽహం గణనాయకమ్ || ౫ ||

యక్షకిన్నరగంధర్వసిద్ధవిద్యాధరైస్సదా |
స్తూయమానం మహాబాహుం వందేఽహం గణనాయకమ్ || ౬ ||

అంబికాహృదయానందం మాతృభిఃపరివేష్టితమ్ |
భక్తప్రియం మదోన్మత్తం వందేఽహం గణనాయకమ్ || ౭ ||

సర్వవిఘ్నకరం దేవం సర్వవిఘ్నవివర్జితమ్ |
సర్వసిద్ధిప్రదాతారం వందేఽహం గణనాయకమ్ || ౮ ||

గణాష్టకమిదం పుణ్యం యః పఠేత్సతతం నరః |
సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్ || ౯ ||ganapathy