Daily Archives: September 10, 2016

1.తేలు లాంటి విష కీటకాలు కుట్టినప్పుడు ఆందోళనకు గురికాకూడదు. మనం ఆందోళనకు గురైన కొద్దీ విషం రక్తప్రవాహంలోకి మరింత పాకే అవకాశాలు ఎక్కువ.

2.విష కీటకం కుట్టిన చోట సబ్బు నీటితో శుభ్రంగా కడగాలి.

3.ఐస్ గడ్డలను ఒక గుడ్డలో చుట్టి కాపడం పెట్టినట్లు ప్రతి పది నిమిషాలకు ఒకసారి కుట్టిన చోట అద్దాలి. కీటకం కుట్టిన మొదటి రెండు గంటల్లో ఇలా చేయడం చాలా ముఖ్యం. దీనివల్ల కుట్టిన చోట ఉపశమనం కలగడంతో పాటు, విషం పైకి వేగంగా పాకకుండా ఉంటుంది.

4.కుట్టిన ప్రదేశాన్ని కదలకుండా చూడాలి. ఆ అవయవాన్ని గుండె కంటే తక్కువ ఎత్తులో ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. అంటే ఉదాహరణకు కాలిపై తేలు కుడితే, కాలిని తలగడపై ఉంచకూడదన్నమాట.

5.ఏదైనా కీటకం కుట్టినప్పుడు… కుట్టిన ప్రదేశానికి పైన ఒక కట్టు కట్టాలి. విషం పైకి పాకడం అనే ప్రక్రియ నెమ్మదిగా జరగడం కోసమే ఈ కట్టు అని గుర్తుంచుకోవాలి. అయితే ఆ కట్టు రక్తప్రవాహాన్ని, లింఫ్ ప్రవాహాన్ని అడ్డుకునేంత గట్టిగా ఉండకూడదని గుర్తుంచుకోవాలి.

తిథులు ఫలితాలు

పాడ్యమి – మధ్యాహ్న అనంతరం జయమవుతాయి
విదియ – ఏ విదమైన పని చేసిన సంతోషాన్ని ఇస్తుంది
తదియ – సౌక్యం, కార్య సిద్ధి
చవితి – మధ్యాహ్న అనంతరం జయమవుతాయి
పంచమి – ధన ప్రాప్తం, శుభ యోగం
షష్టి – కలహం, రాత్రి కి శుభం
సప్తమి – సౌక్యకరం
అష్టమి -కష్టం
నవమి – వ్యయ ప్రయాసలు
దశమి – విజయ ప్రాప్తి
ఏకదశి – సామాన్య ఫలితములు
ద్వాదశి – భోజన అనంతరం జయం
త్రయోదశి -జయం
చతుర్దశి -రాత్రి కి శుభం
పౌర్ణమి – సకల శుభకరం
అమావాస్య- సాయంత్రం నుండి శుభకరం
షష్టి – శనివారం, సప్తమి – శుక్రవారం, అష్టమి – గురువారం, నవమి – భుదవారం, దశమి – మంగళవారం, ఏకాదశి – సోమవారం, ద్వాదశి – ఆదివారం ,ఇట్లు వచ్చిన ఏ విధమైన శుభకార్యాలు చేసుకోనరాదు.
వీటిని దగ్ధయోగాలు అంటారు.

శ్రీ రామచంద్ర మమ దేహి కరావలంబం

చక్రీకృతచండకార్ముకధరఖరదూషణత్రిశిరాదిదానవభంజనకాలాగ్నితత్త్వం
అఖండమండలపరిపాలనదక్షణాదీక్షసుశిక్షితధర్మాధర్మవిచక్షణాశీలతత్త్వం
సామీరిసతతసంస్తుతభవబంధమోచనసుజ్ఞానప్రదాయకభవతారకమంత్రం
శ్రీ రామచంద్ర మమ దేహి కరావలంబం ||images