Monthly Archives: September 2016

list of Alankarams of Goddess Kanaka Durga during Dasara Sharan Navarathri

Navarathris are starting from tomoro. .Here is the list of Alankarams of Goddess Kanaka Durga during Dasara Sharan Navarathri 2016:

Saturday, 1 October 2016 – Sri Swarna Kavachalankrita Durga Devi – Ashwayuja Shuddha Padyami – Swarna Kavacham Sari – Gold Colour Saree pulihora nivedhyam

Sunday, 2 October 2016 – Sri Balatripura Sundari Devi – Ashwayuja Shuddha Vidiya – Light Pink Colour Saree.pongali nivedhyam

Monday, 3 October 2016 – Sri Gayathri Devi – Ashwayuja Shuddha Vidiya (Vruddhi) – Orange Colour Saree.pulihora nivedhyam

Tuesday, 4 October 2016 – Sri Annapoorna Devi Ashwayuja Shuddha Thadiya – Sandalwood Yellow Colour Saree. Kobbari annam nivedhyam

Wednesday, 5 October 2016 – Sri Katyayani Devi – Ashwayuja Shuddha Chavithi – Blue Colour Saree.paramannam nivedhyam

Thursday, 6 October 2016 – Sri Lalitha Tripura Sundari Devi – Ashwayuja Shuddha Panchami – Pure Gold Colour Saree.allam garelu nivedhyam

Friday, 7 October 2016 – Sri Mahalakshmi Devi – Ashwayuja Shuddha Shashti – Pink Colour Saree.ravva kesari nivedhyam

Saturday, 8 October 2016 – Sri Saraswati Devi – Moola Nakshatra Pooja – Ashwayuja Shuddha Saptami – White Colour Saree .Dhadhojanam Naivedhyam

Sunday, 9 October 2016 – Sri Durga Devi – Ashwayuja Shuddha Ashtami – Red Colour Saree. Shakhannam (pulav with out onions)nivedhyam

Monday, 10 October 2016 – Sri Mahishasuramardhini Devi – Ashwayuja Shuddha Navami (Mahanavami) – Brown or Red colour hand-loom saree.bellam paramannam nivedhyam

Tuesday, 11 October 2016 – Sri Rajarajeshwari Devi – Ashwayuja Shuddha Dashami (Vijayadashami) – Green Colour Saree.payasam (kheer)nivedhyamimages

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు రంగి సత్యనారయణ కి ఘనంగా సన్మానం

సనాతన నాగరికత  ప్రతీకగా చెప్పుకునే భాష… ప్రపంచంలో అతిపురాతనమైన భాషల్లో ఒకటిగా గుర్తింపు పొందిన భాష. విశ్వభాషలకు మూలం సంస్కృతభాషా.
సంస్కృతం అంటేనే సంస్కరించబడిన, ఎలాంటి లోపాలు లేని భాష. ప్రపంచవ్యాప్తంగా అనేక భాషలలో సంస్కృత మూలాలు కనిపిస్తుంటాయి. అతి పురాతనమైన సంస్కృతభాష ఒక విజ్ఞాన భాండాగారం. మానవ జీవన విధానం, విజ్ఞానానికి సంబంధించిన అపారమైన సాహిత్యం మాత్రమే కాదు, మనిషిలోని సంస్కారాలను తట్టిలేపి, అంతరంగాలను ఆవిష్కరించి, ఆధ్యాత్మిక వికాసానికి దోహదం చేసే వేదాంతం సంస్కృతాన్ని ప్రపంచంలోనే అత్యున్నత భాషగా, దేవ భాషగా నిలిపాయి. అలాంటి సర్వ లక్షణ శోభితమైన అమృతభాష సంస్కృతభాష లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయునిగా రంగి సత్యనారాయణ ఇటీవల  భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.ఈ సందర్బంగా బ్రాహ్మణాభ్యుదయ పరిషత్ (రంగారెడ్డి జిల్లా) రంగి సత్యనారాయణ గారికి అభినందన సన్మానం కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమం కర్మనఘాట్ ధ్యానాంజనేయస్వామి
దేవస్థానం లో జరిగింది. ఈ సందర్బంగా ఈ కార్యక్రమంలో బ్రాహ్మణాభ్యుదయ పరిషత్ రంగారెడ్డి జిల్లా సంఘం ప్రతినిధులు మరియు యువజన సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.img-20160929-wa0101img_20160929_214403_279img-20160929-wa0080img-20160929-wa0078

అరుదైన అక్టోబర్ గా వచ్చే నెల

863 సంవత్సలా తరవాత మళ్ళీ అలాంటి నెల వస్తుంది.
వచ్చే నెల అక్టోబర్ అని అందరికి తెలుసు కానీ వచ్చే అక్టోబర్ చాలా స్పెషల్ అంటున్నారు పండితులు. గొప్ప విశేషం ఏమిటంటే పౌర్ణమి, అమావాస్యలు ఒకే నెలలో రావడం. ఈ నెలలోనే మూడు పండుగలు రానున్నాయి.
ఈ నెల మరో ప్రత్యేకత ఏమిటంటే ఐదు ఆదివారాలు, సోమవారాలు, శనివారాలు ఉండటం. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు, కాలేజ్, స్కూల్,ఐటి వారికి సెలవుల మీద సెలవులు రానున్నాయి. ఈ నెల అంటే లెక్కవేస్తే దసరా సెలవులతో కలిపి 15 రోజులు ఇంటి పట్టునే ఉండవచ్చు.
ఎలాంటి నెల చాలక అరుదుగా వస్తుందట! ఈ నెల 8 శతాబ్దాల తరువాత రావడం విశేషం. అంటే ఓరుగల్లును పాలించిన కాకతీయుల కాలం నాటి నెల ఇప్పుడు మళ్ళీ రాబోతుంది. దాదాపు 1153 వ సంవత్సరంలో వచ్చిన నెల 2016 లో రావడం నిజంగానే అద్భుతం.

అక్టోబర్ నెల ప్రత్యేకత :
పండుగలు : బతుకమ్మ పండుగ అన్ని రోజులు, దసరా (11 వ తేదీ), దాని మరుసటి రోజు పీర్ల పండగ (12 వ తేదీ), దీపావళి (30 వ తేదీ).
మరో ప్రత్యేకత :
పౌర్ణమి (16 వ తేదీ), అమావాస్య (30 వ తేదీ)

ఆది, సోమా,శని వారాలు ఐదు సార్లు రానున్నాయి :
ఆదివారం : 2,9,16,23,30.
సోమావారాలు : 1,8,15,22,29.img_20160928_124746_876

హౌస్ చిత్రం ఆడియో విడుదల

జై,వసుంధర జంటగా నటుడు ఉత్తేజ్ శిశ్యుడు రాజుశెట్టి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న హారర్ కామెడీ ఎంటర్ టైనర్ “హౌస్ ” .బోయిన క్రిష్ణంరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో రిలీజ్ హైద్రాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. శాశంక్ బాస్కరుని సంగీతం అందించిన ఈ చిత్రం బిగి సీడిని నిర్మాత దాము ఆవిష్కరించారు..ఈ కార్యక్రమానికి దర్శకుడు క్రాంతి మాధవ్ , నటుడు ఉత్తేజ్ , నిర్మాత ముత్యాల రాందాస్ , పద్మిని ,హీరో మానస్ ముఖ్యఅతిధులుగా హాజరై చిత్రయూనిట్ ను అభినందించారు.fb_img_1474955888129

ఎంఎస్.ధోనీ ఆడియో విడుదల

టీమిండియా కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఎమ్ఎస్ ధోనీ’ ది అన్ టోల్డ్ స్టోరీ… ఆడియో రిలీజ్ కార్యక్రమం శనివారం జరిగింది.
ఈ ఆడియో వేడుకకు చిత్ర బృందంతో పాటు ఎంఎస్ ధోనీ కూడా హాజరయ్యారు. ఆడియో రిలీజ్ కార్యక్రమానికి దర్శకు ధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరై ధోనీతో కలిసి ఆడియో రిలీజ్ చేసారు.1474714690_indias-limited-overs-skipper-mahendra-singh-dhoni-director-ss-rajamouli-m-s-dhoni-untold

వరద బాధితులకు ‘మా’ చేయూత

భారీ వర్షాలకు హైదరాబాద్
నగరంలోని వరద బారిన పడిన ప్రాంతాల్లో అధికారులు, స్వచ్ఛంద సేవ సంస్థల సహాయక చర్యలు చేపడుతున్నారు. వారికి మూవీ ఆర్టీస్ట్ అసోసియేషన్ కూడా జత కలిసింది.వరద ప్రభావిత ప్రాంతాల్లో ‘మా’ ఆధ్వర్యంలో ఆహారం, తాగునీటిని పంపిణీ చేస్తున్నారు. మా అధ్యక్షుడు, నటకిరీటి రాజేంద్రప్రసాద్, సభ్యుడు శివాజీరాజా కూకట్ పల్లి ఆల్విన్ కాలనీలో వరద బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు.fb_img_1474727506164

ప్రాచీన గ్రంధాలలో పుష్పాల ప్రాముఖ్యత

భక్తి పూర్వకంగా మంచి మనసు తో  ఎవరైతే పుష్పాన్నిగాని, పండును గాని, కొంచెం జలాన్ని గాని సమర్పిస్తారో అలాంటివారి భక్తి నైవేద్యాన్ని తృప్తిగా విందారగిస్తానని శ్రీకృష్ణ భగవానుడు ‘గీత’లో చెప్పాడు.
శ్లో!! మధ్యమానామికా మధ్యే పుష్పం సగృహ్య పూజాయేత్!
అంగుష్ట తర్జన గ్రాభ్యాం నిర్మాల్యమపనోదయేత్!!
పువ్వులను మధ్యవేలికి, ఉంగరపు వేలికీ మధ్యలోకి తీసుకొని పూజ చేయాలి. అంతకు ముందురోజు ఉపయోగించి పూజ చేసిన పువ్వులను (నిర్మాల్యం) బొటనవేలు, చూపుడు వేళ్ళతో తీసివేయాలి. వాడిపోయినవి, ముళ్ళుతో కూడుకున్నవి, అపరిశుభ్రమైనవి, దుర్గంధ పూరితమయిన పుష్పాల వినియోగం శ్రేయస్కరం కాదని శాస్త్రాలు చెబుతున్నాయి.
తామర పువ్వులు, కలువ పువ్వులు, జాజులు, చామంతి, నందివర్ధనములు, మందారము, నీలాంబరాలు, కనకాంబరాలు, మాలతి, పారిజాతాలు, పద్మాలు, మంకెన, మునిగోరింట, ఎర్రగన్నేరు, గరుడవర్ధనము, నిత్యమల్లి పుష్పాలు పూజలకు పవిత్రమైనవిగా చెబుతారు.
పుష్పాలతో పూజ అలాగే కంఠాన గంధాన్ని, చెవిలో పుష్పాన్ని ధరించాలట. జుట్టు ముడిలో తులసిదళాన్ని ధరించరాదట.
సూర్యభగవానుడ్ని, విఘ్నేశ్వరుని తెల్లజిల్లేడు పుష్పాలతో పూజించాలట. విష్ణుభగవానుడిని తులసి దళాలతో, శ్రీమహాలక్ష్మిని తామర పువ్వులతో, గాయత్రిదేవిని ‘మల్లిక’, ‘పొగడ’, ‘కుశమంజరి’, ‘మందార’, ‘మాధవి’, జిల్లేడు, ‘కదంబ’, ‘పున్నాగ’, ‘చంపక’, గరిక పుష్పాలతో పూజించాలిట. అలాగే ‘శ్రీచక్రాన్ని’ తామరపువ్వులు, తులసి దళాలు, కలవ పూలు, జాజి, మల్లె, ఎర్రగన్నేరు, ఎర్ర కలువపూలు, గురువింద పుష్పాలతో పూజించాలి.img-20160924-wa0011

లలితాంబికాం

జడాజడప్రకృతిజీవజాలపోషణాభారకర్తవ్యనిర్వాహణాదీక్షాదక్షం
నిమ్నోన్నతరహితసృష్టిస్థితిలయకారకత్రిభువనపాలకదాక్షిణ్యాం
కార్యాకారణకర్తృత్వకార్పణ్యాసూయారహితమహాకాలకాలప్రియాం
భావయామి హృది సంతతం భ్రామరీం లలితాంబికాం ||

జ్ఞానకుమార వేంకట రమణ ప్రసాద్images

“అరకురోడ్ లో” ట్రైలర్కు సూపర్ రెస్పాన్స్

వాసుదేవ్ దర్శకత్వంలో సాయిరామ్ శంకర్, నికీషా పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం’ అరకు రోడ్ లో’. సస్పెన్స్, థ్రిల్లర్ తో పాటు వినోద నేపధ్యంలో తేరక్కేకుతున్న ఈ చిత్రం లో
సాయిరాం శంకర్ జోడీగా నికీషా పటేల్ నటిస్తోంది. ఈ సినిమా ఆడియో విడుదల అయ్యి ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. మేకా బాలసుబ్రమణ్యం,ప్రసాద్ రాజు వేగిరాజు,బచు భాస్కార్, నక్కా రామేశ్వరి సంయుక్తంగా- నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.fb_img_1474449525871

శ్రీ నీలకంఠ మమ దేహి కరావలంబం ||

శివాశ్లిష్టవపుర్ధరయోగీంద్రగణహృత్కమలస్థితయోగీశ్వరేశ్వరం
నందీశ్వారదిప్రమధగణసంతతపూజనీయమృదుపల్లవాంఘ్రిం
సహస్రరవిశశాంకద్యుతిసన్నిభవిభ్రమభ్రమవిస్తారజటాజూటం
శ్రీ నీలకంఠ మమ దేహి కరావలంబం ||

జ్ఞానకుమార వేంకట రమణ ప్రసాద్IMG_20160803_081822_140