Monthly Archives: July 2016

కలాం సాంగ్ విడుదల

భారత మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలాం ప్రథమ వర్థంతి సంధర్భంగా ప్రముఖ సినీ రచయిత,దర్శక నిర్మాత
పులి అమృత్ స్వయంగా రాసి, కంపోజ్ చేసి పాడిన కలాం సాంగ్ ని Golkonda TV Channel ద్వార విడుదల చేసినట్లు పులి అమృత్ తేలియచేసారు.IMG-20160727-WA0006

శ్రీ ” అబ్దుల్ కలాం ” గారి వర్ధంతి సందర్భంగా ఒక చిరు నివాళి

“అ” ద్భుతమైన మేధస్సు అవిరళ కృషి మీకే సొంతం…
“భ్దు” (బు) ద్ది, మానవత్వం, మనిషి జీవితం అంటే ఏమిటో తెలియజేసిన భావి జీవిత భవిష్యత్తుకి చుక్కాని మీరు…
“ల్” (ల) క్షాన్ని యువతకి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తిత్వం మీది….
“క” లలని సాకారం చేసుకునే శక్తిని అందరికీ నేర్పించిన నేర్పరితనం మీది…
“లా” జిక్కులకి మేజిక్కులకి అందని అసమాన మేధో సంపత్తిని సొంతం చేసుకున్న నేత మీరు……
“మ్” (మా) మాననీయ కోణానికి మరో రూపు మీరు…

ఈ రోజుకి మీరు మధ్యనుంచి తప్పుకుని ఒక ఏడాది గడచి పోయింది..కానీ మీ జ్ఞాపకాలు మా మధ్యనే వున్నాయి సార్. మీ ఆత్మకు శాంతి కలగాలని మానసారా,ఆ దేవుడిని ప్రార్ధిస్తూ …
మీ బోయనపల్లి రమణ, రచయిత.images

 

తమిళంలోకి ‘బాబు బంగారం’

విక్ట‌రీ వెంక‌టేష్‌, న‌య‌న‌తార
కాంబినేష‌న్లో న్లో సితార‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్లో నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ (చిన‌బాబు) స‌మ‌ర్ప‌ణ‌లో, మారుతి ద‌ర్శ‌కుడిగా సూర్య‌దేవ‌ర నాగవంశి, పి.డి.వి. ప్ర‌సాద్‌లు సంయుక్తంగా నిర్మించిన‌ చిత్రం ‘బాబు బంగారం’.తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతాన్నందిస్తున్నారు. ఈ సినిమా ఆగష్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల కానుంది. తమిళనాట నయనతారకి గల క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ఈ సినిమాను ‘సెల్వి’ పేరుతో అక్కడ రిలీజ్ చేయనున్నారు.

IMG-20160727-WA0003

భజే నారసింహం భజే భక్తవరదం

చిదానందమానందసానందకందం
ఋగ్యజుస్సామఛ్ఛందాంసిపూజ్యం
సుకారుణ్యతేజోమయఃకాంతిపుంజం
భజే నారసింహం భజే భక్తవరదం ||

జ్ఞానకుమార వేంకట రమణ ప్రసాద్

images

నాలో ఎలాంటి మార్పూ ఉండదు…

” కాలి మువ్వలపట్టీ మడమకి కట్టుకున్నా మెడకి చుట్టుకున్నా…

దాని శబ్దంలో భేదముండదు…

కానీ బలంగా మోదేకొద్దీ మోత పెరుగుతుంది…

మృదువుగా మీటేకొద్దీ మధురంగా మారుతుంది…”

అలాగే నన్ను అధముడనుకున్నా, అధికుడనుకున్నా…

నాలో ఎలాంటి మార్పూ ఉండదు…”

#నీ_బంగారం
#Vaalee

IMG-20160726-WA0002

Dr abdul kalam song by puli amruth

భారత మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలాం ప్రథమ వర్థంతి సంధర్భంగా ప్రముఖ సినీ రచయిత,దర్శక నిర్మాత
పులి అమృత్ స్వయంగా రాసి, కంపోజ్ చేసి పాడిన కలాం సాంగ్ ఈ నెల 27/7/2016 న Golkonda TV Channel ద్వార విడుదల చేస్తున్నట్లు పులి అమృత్ తేలియచేసారు.received_931493530307302

 

లలితాంబికాం

సద్యోజాతప్రియభామినీం పరశివాం శ్రీవిద్యతత్త్వాత్మికాం
వ్యక్తావ్యక్తతత్త్వాత్మికాం పరశివాం శ్రీచక్రయంత్రాత్మికాం images
అభయానందదాయినీం పరశివాం కామ్యార్ధసిద్ధిప్రదాం
భావయామి హృది సంతతం భ్రామరీం లలితాంబికాం ||

 జ్ఞానకుమార వేంకట రమణ ప్రసాద్

కలం

రసప్రవాహమాలికలను ఏర్చి కూర్చే పట్టుదారం
నేతలు తలరాతలు సైతం మార్చిరాసే ఆయుధం
అక్షరాలకు రూపానిచ్చే శ్రీ సరస్వతి రూపం
ఒక్క పోటుతో జీవితాలను తారుమారుచేసే సుదర్శనం
తన్నుకుని వస్తున్న ఆలోచనల మణిహారం
అజ్ఞానపు చీకటులను తొలగించే మార్తాండం
ఆధ్యాత్మికకోణాన్ని ఆవిష్కరించే కుసుమం
అద్వైతబోధనందించిన గురుమండలస్వరూపం
నిస్త్రాణను తొలగించి సత్వర ఉత్సహాన్నిచ్చే బలం
గాయపడిన హృదయాలకు గొపీచందన లేపనం
అమ్మ ప్రేమను ఆవిష్కరించే మృదుమాధుర్యరూపం
తిక్కన మహభారతరచనాప్రావీణ్యానికి నిలువుటద్దం
శ్రీనాధ కవిసార్వభౌముని ప్రౌఢ పద్యరచనాప్రావీణ్యం
అడవి బాపిరాజు కొలిచిన వాలుజడ వయ్యారం
రమణ చేతిలొ ఒదిగిన కమనీయ హాస్యప్రపంచం
గురజాడ పూరించిన చైతన్యశంఖారావం
విశ్వనాధుని వేయిపడగల బృహదావిష్కారం
శ్రీ శ్రీ నుంచి జాలువారిన మహాప్రస్థానం
సంగీత రస సాహితీ జగత్తుకు ఆలవాలం
జయదేవ అష్టపదుల కమనీయ శృంగారం
పదకవితా పితామహుని వేంకటేశ్వర విలాసం
త్యాగయ్య పలికిన రామలీలావైభవం
ముత్తుస్వామి శ్యామశాస్త్రులు పలికించిన భావాతీతభక్తిసంగీతం
ఎన్నని చెప్పగలము కలాన్ని గురించి .. కవికే తెలుస్తుంది దాని తత్త్వసారం …

జ్ఞానకుమార వేంకట రమణ ప్రసాద్

IMG_20160725_195421_122

ఈశ్వర పూజకు మారేడు దళాలు

“ఏకబిల్వం శివార్పణం” అని మారేడు దాళలలతో శివుని పూజిస్తారు. మూడు దళములు కలపి ఒక్క అండముగా పిలవబడును కావున, దీనికి బిల్వము అని పేరు వచ్చింది. ఈ మూడు రేకులకు ఆధ్యాత్మికంగా, “పూజకుడు -పూజ్యము -పూజ”, “స్తోత్రము -స్తుత్యము – స్తుతి”, “జ్ఞాత -జ్ఞేయము -జ్ఞానము”.పవిత్రమగు ఈశ్వర పూజకు ఈ “బిల్వపత్రము” సర్వశ్రేష్ఠమైనది మరియు అతి పవిత్రమైనది. శివార్చన లకు మూడు రేకులతోనున్న పూర్తి బిల్వదముననే ఉపయోగించవలెను. ఒకసారి కోసిన బిల్వపత్రములు, సుమారు 15 రోజులవరకు పూజార్హత కల్గియుండును. వాడిపోయినను దోషములేదు, కాని మూడురేకులు మాత్రము తప్పనిసరిగా ఉండవలెను.

ఏకబిల్వ పత్రంలోని మూడు రేకులలో ఎడమవైపునది బ్రహ్మ అనియు, కుడీవైపునది విష్ణువనియు, మధ్యనున్నది సదాశివుడనియు, పురాణములలో తెలియుచున్నది. మరియు బిల్వదళములోని ముదుభాగమునందు అమృతమును, వెనుక భాగమున యక్షులును వుండుటచేత, బిల్వపత్రము యొక్క ముందుభాగమును శివునివైపు వుంచి పూజించాలి.

IMG_20160724_184545_879

‘బంతిపూల జానకి’ ఆడియో రిలీజ్‌ డేట్ ఫిక్స్

‘ ఉజ్వల క్రియేషన్స్ ‘ పతాకం పై, నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వం లో కల్యాణి-రాం
నిర్మాతలుగా నిర్మించిన “బంతిపూల జానకి”.ఇటీవల విడుదలైన థియేటర్ ట్రైలర్ కి అనూహ్య స్పందన లభిస్తోంది.ఈ చిత్ర ఆడియోను ఈనెల 29న గ్రాండ్‌గా రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు.ధనరాజ్, దీక్షాపంత్ హీరో, హీరోయిన్ లగా నటించిన ఈ చిత్రం లో, అదుర్స్ రఘు,
చమ్మక్ చంద్ర, షకలక శంకర్, వేణు, రాకెట్ రాఘవ, డా. భరత్ రెడ్డి, సుడిగాలి సుధీర్,
జీవన్, అవినాష్, ఫణి, నాగి, కోమలి తదితరులు నటించారు.
ఈ చిత్రానికి కెమెరా : జి.ఎల్. బాబు, సంగీతం : భోలే, ఎడిటింగ్ : డా. శివ వై. ప్రసాద్,
పాటలు : కాసర్ల శ్యాం, కథ – మాటలు : శేఖర్ విఖ్యాత్, ఫైట్లు : సూపర్ ఆనంద్,
ఆర్టు డైరెక్టర్ : విజయ్ కృష్ణ, పబ్లిసిటీ డిసైనేర్ : వివ, కో-డైరెక్టర్ : బోయనపల్లి రమణ.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : తేజ, నిర్మాతలు : కల్యాణి – రాం.
స్క్రీన్ ప్లే – దర్శకత్వం : నెల్లుట్ల ప్రవీణ్ చందర్.

FB_IMG_1469339554929