ప్రవాహం

1
దుర్మార్గాన్ని  ఎంతని ఎదిరించినా
ఒక చెడ్డ పని మరో చెడ్డ మనికి దారులు వేస్తుంది
ఏటిగట్టు మీద నడకలా

2
కోసిన ధాన్యం కంటికి మురిపమే ఆ పూటకి
నాగలి మోసిన సంచులన్నీ ఇల్లు చేరకముందే
నిర్జీవంగా వ్రేళ్ళాడుతున్న కొడవళ్ళు

3
నిత్యం హోలీ ఆడుతున్న గ్రీజు మొహాలు
నవ్వు అంటే ఆగని మోటారు చక్రమే !

4
అందరు చేసేది వ్యాపారమే
తల్లి చేతిలో పెరిగి
ఆ తల్లి చావును వెతుకుట ధౌర్భాగ్యమే !

5
మతాలని మోస్తూ
హితాలని మరచి
భూతాలను పెంచుతూ
దేవుడు మావాడని బుద్ధిజీవుల అల్లరి !
ఆ నీటిలో చేపకు
కొండ మీద కోతికి
మరి ! ఆ చెట్టుపైన పక్షికి దేవుడేవరు ?

కృష్ణ మణి

IMG-20160712-WA0001