” తక్కువే కదా మరి “

 

ముభావమెక్కువై ఎండి ఎడారైపోయిన నా ముఖం,
తడిసిన ముంగిరులు నీ ముఖంపై రాల్చే ముత్యదారలకి మెల్లగా జీవతడిని నింపుకుంటుంది..

మరింత ఎడబాటు తప్పదేమోనని
మందగించిన కణాలన్నీ
ఒక్కొక్కటిగా
వేగానికి బానిసలవుతున్నపుడే తెలుస్తుంది
నీ ఛాయకీ, నా చూపుకీ సఖ్యత కుదిరిందని…

నిన్ను చూస్తుండిపోయినప్పుడు
ఉనికి కోల్పోయిన కాలం
నన్ను బ్రతిమాలుకుంటుంది,
నువ్వు చూపులు సడలిస్తేనే
నా కర్తవ్యానికి నేను న్యాయం చేయగలనని..మిగిలిన లోకంపై ముసిగేసి
నీ అందంతెచ్చిన ఈ అంధకారంలో
ఎదురయ్యే రంగులుతో పోటీపడాలనుకునే
హరివిల్లులపై ఎంత జాలిపడినా తక్కువే మరి…

Satish sisti

received_1032034370251083