Daily Archives: July 30, 2016

” తక్కువే కదా మరి “

 

ముభావమెక్కువై ఎండి ఎడారైపోయిన నా ముఖం,
తడిసిన ముంగిరులు నీ ముఖంపై రాల్చే ముత్యదారలకి మెల్లగా జీవతడిని నింపుకుంటుంది..

మరింత ఎడబాటు తప్పదేమోనని
మందగించిన కణాలన్నీ
ఒక్కొక్కటిగా
వేగానికి బానిసలవుతున్నపుడే తెలుస్తుంది
నీ ఛాయకీ, నా చూపుకీ సఖ్యత కుదిరిందని…

నిన్ను చూస్తుండిపోయినప్పుడు
ఉనికి కోల్పోయిన కాలం
నన్ను బ్రతిమాలుకుంటుంది,
నువ్వు చూపులు సడలిస్తేనే
నా కర్తవ్యానికి నేను న్యాయం చేయగలనని..మిగిలిన లోకంపై ముసిగేసి
నీ అందంతెచ్చిన ఈ అంధకారంలో
ఎదురయ్యే రంగులుతో పోటీపడాలనుకునే
హరివిల్లులపై ఎంత జాలిపడినా తక్కువే మరి…

Satish sisti

received_1032034370251083

బంతిపూల జానకి ఆడియో విడుదల

‘ ఉజ్వల క్రియేషన్స్ ‘ పతాకం పై, నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వం లో కల్యాణి-రాం
నిర్మాతలుగా నిర్మించిన “బంతిపూల జానకి”. ధనరాజ్, దీక్షాపంత్ హీరో, హీరోయిన్ లగా నటించారు.
బోలె సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ జరిగింది.ఈ వేడుక శుక్రవారం రాత్రి శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. తొలి సీడీని హీరో రామ్ ఆవిష్క‌రించి..ఆకాష్ పూరి, నందిని రెడ్డిలకు అందించారు.
సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ సాంగ్స్ అన్నీ బావున్నాయి. బోలెగారు మంచి సంగీతం అందించారు.ధ‌న‌రాజ్ ఇలాంటి సినిమాల‌ను చాలా చేయాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.
దర్శ‌కురాలు నందినిరెడ్డి మాట్లాడుతూ ధ‌న‌రాజ్ చాలా క‌ష్ట‌ప‌డ‌తాడు. ఇంకా మ‌రిన్ని సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

కాసర్ల శ్యామ్‌ మాట్లాడుతూ, చాల కాలం  నుంచి నేను బోలె గారు మంచి స్నేహితులం.ఆయన సంగీతం చేసిన అన్ని  చిత్రలకి నేను పాటలు రాస్తున్నాను.ఈ చిత్రానికి అన్ని పాటలు రాసే అవకాశం కల్పించిన చిత్ర దర్శక నిర్మాత ల కి ధ‌న్య‌వాదాలు. ఆడియోలానే సినిమా కూడా హిట్‌ కావాలని కోరుకుంటున్నాను అని చెప్పారు.
ధ‌న్‌రాజ్ మాట్లాడుతూ
చిరంజీవి గారిపై వున్న అభిమానంతో తాడేప‌ల్లిగూడెం నుండి పారిపోయి హైద‌రాబాద్ వ‌చ్చాను. ఇక్క‌డికి వ‌చ్చాక‌ డ‌బ్బులు అయిపోవడంతో హోట‌ల్‌లో ప‌ని చేశాను. డైరెక్ట‌ర్ తేజ‌ జై సినిమాలో నాకు అవ‌కాశం ఇచ్చారు. సుకుమార్‌గారి ద‌ర్శ‌క‌త్వంలో జ‌గ‌డం చిత్రంలో ఓ క్యారెక్ట‌ర్ చేశాను. అప్పుడే రామ్‌ ప‌రిచ‌య‌మ‌య్యారు. నా కొడుకుకి ఎనిమిదోనెల డ‌బ్బులు లేవు ఎవ‌రినీ అడ‌గాలో తెలియ‌లేదు. రామ్‌గారిని అడిగితే ప‌దివేలిచ్చారు. త‌ర్వాత నా పెళ్లిరోజు వ‌చ్చిన‌ప్పుడు సుకుమార్‌గారు కొంత డ‌బ్బులిచ్చారు. అందుకే నాకొడుక్కి సుక్‌రామ్ అనే పేరు పెట్టాను. అదే ప‌రిచ‌యంతో నేను నిన్న రామ్ ద‌గ్గ‌ర‌కు వెళ్ళి ఆడియో ఫంక్ష‌న్‌కు ర‌మ్మ‌ని పిలిచాను. ఆయ‌న అన్న‌మాట ప్ర‌కారం వ‌చ్చారు. నా లైఫ్‌లో సుకుమార్‌గారిని, రామ్‌గారిని మ‌ర‌చిపోలేను.నేను కేవ‌లం హీరోగానే చేస్తాన‌ని ఎవ‌రూ అనుకోవ‌ద్దు. రెండు సీన్స్ ఉన్న సినిమా అయినా చేస్తాను . మ‌ధ్య‌ మ‌ధ్య‌లో బంతిపూల జానకి వంటి సినిమాలు చేస్తుంటాను. బోలె  సంగీతం చాలా బాగుంది అన్నారు.

ముఖ్య అతిధి హీరో రామ్ మాట్లాడుతూ ధ‌న్‌రాజ్‌ చాలా క‌ష్టాలు దాటుకుంటూ ఈ స్థాయికి ఎదిగారు. సినిమా మంచి స‌క్సెస్ సాధించాలి.  ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్‌కు, నిర్మాత‌లు స‌హా ఈ టీమ్‌కి ఆల్ ది బెస్ట్‌.
బోలె మంచి సంగీతాన్ని ఇచ్చారు. పాట‌లు, సినిమా పెద్ద విజ‌యం సాధించాలి అన్నారు.
చిత్ర నిర్మాత  మాట్లాడుతూ
పూర్తి వినోదం పంచే చిత్ర‌మిది. అనుకున్న స‌మ‌యంలో పూర్తి చేశాం.ఇందుకు సహకరించిన మా హీరో ధ‌న్‌రాజ్‌ మంచి ప్రోత్సాహాన్నిచ్చారు. ద‌ర్శ‌కుని ప‌నిత‌నం చాల బాగుంది, స‌హ‌క‌రించిన అంద‌రికీ ధ‌న్య‌వాదాలు అన్నారు.

ద‌ర్శ‌కుడు నెల్లుట్ల ప్రవీణ్ చందర్ మాట్లాడుతూ మా హీరో ధ‌న్‌రాజ్‌ మంచి ప్రోత్సాహాన్నిచ్చారు.చిత్ర షూటింగ్ అంతా అందంగా జరిగింది.ఈ చిత్రం ఇంత బాగ రావడానికి చిత్ర నిర్మాత సహకారం చాల వుంది. అంద‌రికీ థాంక్స్‌“ అన్నారు.
రెజీనా, నందినీ రెడ్డి, అభిరాం దగ్గుబాటి, రాజ్ కందుకూరి,రామ‌స‌త్య‌నారాయ‌ణ‌, అదుర్స్ ర‌ఘ, సిద్ధు, సురేష్ కొండేటి, సంపూర్ణేష్ బాబు, సాయిరాజేష్, తనీష్, డార్లింగ్ స్వామి, తదితరులు ఆడియో వేడుక‌లో పాల్గొన్నారు.

unnamed