Daily Archives: July 23, 2016

” బాల గంగాధర తిలక్ ” జన్మదిన సందర్బంగా ఆయన జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ , ఒక చిరు నివాళి.

” బా ” వితరాల భవిష్యత్త్తును ముందుగానే ఊహించిన గణిత విజ్ఞాన ఖని…..
” ల ” క్ష్యాల సాధనలో వెన్ను చూపని ఈ ‘లోకమాన్యుడు’ అసామాన్యుడు….
” గం ” ధం వంటి చల్లని మనసుతో, ‘గీతారహస్యాన్ని’ విరచించిన మహోన్నత నేత….
” గా ” లి కబుర్లు లేవు ” స్వరాజ్యమే నా జన్మహక్కు ” అనే నినాదం తప్ప…
” ద ” రణి పై నడయాడి, స్వదేశీ ఉద్యమానికి ఊపిరిపోసిన ఉద్యమ స్ఫూర్తిదాత…
” ర ” వి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఆలోచనల్లో పడవేసిన ఘన చరిత్ర….
” తి ” మిరాన్ని తరిమే వెలుగురేఖై , విదేశీ విద్యను తరిమి కొట్టిన విశాల హృదయం….
” ల ” లితమైన స్వభావమున్నా, అతివాదిగా ముద్రవేసుకున్న అనితరసాధ్యుడు….
” క్ ” (క)ల్లోలమై విడిపోయిన కాంగ్రెస్ ను ఒకటి చేసి, ఉద్యమానికి ఊపిరూధిన మహా మనీషి……

మహా నేత ” బాల గంగాధర తిలక్ ” జన్మదిన సందర్బంగా ఆయన జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ , ఒక చిరు నివాళి.images
——బోయినపల్లి రమణ, రచయిత.

సదా మమ పాతు మే ప్రభో శ్రీ వేంకటరమణ

సంతతఘనఘోరతిమిరాపహారభయభంజనభవసాగరనిస్తరణకారణ
సతతబ్రహ్మేంద్రాదిసురకోటివందితమృదుపల్లవకుసుమకోమలచరణ
కాళీయదర్పదమనశకటాసురపూతనకంసాదిదుష్టదానవప్రాణహరణ
సదా మమ పాతు మే ప్రభో శ్రీ వేంకటరమణ ||IMG_20160723_094205_282

జ్ఞానకుమార వేంకట రమణ ప్రసాద్