Daily Archives: July 20, 2016

విడుదలకు సిద్ధమైన ‘క్యాంపస్‌ అంపశయ్య’

‘అమ్మానీకు వంద‌నం‘, ‘ప్రణయ వీధుల్లో’ చిత్రాల ద్వారా తనలో డిఫరెంట్ ఫిలిం మేకర్ ఉన్న విషయాన్ని ప్రభాకర్ జైని నిరూపించుకున్నారు. ‘క్యాంపస్-అంపశయ్య’ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు ఆయన ఓ ప్రధాన పాత్ర కూడా చేశారు. శ్యామ్ కుమార్‌, పావ‌ని హీరో హీరోయిన్ గా నటించారు. జైనీ క్రియేష‌న్స్‌, ఓం న‌మో భ‌గ‌వ‌తే వాసుదేవాయ ఫిలింస్ పతాకంపై విజయలక్ష్మి జైని ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈనెల 29న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన నవీన్‌ నవల ‘అంపశయ్య’లోని ఆత్మను తీసుకుని తెరకెక్కించామని తెలిపారు. 70వ దశాబ్దంలో ఓ అసమర్థ విద్యార్థి జీవితంలో జరిగిన సంఘటనలకు ఈ చిత్రం అద్దం పడుతుందన్నారు. కార్యక్రమంలో శ్యామ్‌ కుమార్‌, పావని, ఆకెళ్ల రాఘవేంద్ర, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

 

received_910886349058247

received_910886419058240

అధ్యాత్మిక సౌరభం

జ్ఞానకుమార వేంకట రమణ ప్రసాద్ గారు రచించి స్వరపరిచిన అధ్యాత్మిక సౌరభం లోని కోన్ని కీర్తన లో ఒకటి.received_10154344085204561