Daily Archives: July 18, 2016

వ్యాస పూర్ణిమ (గురు పూర్ణిమ)

 

అద్వైతతత్త్వసుఖాంబోధివిహరమహిమాన్వితతపోతేజసం
చతుర్వేదవిభజనకారణసనాతనధర్మసుప్రతిష్టితజ్ఞానపీఠం
భారతభాగవతాదిగ్రంధరచనాచాతుర్యజ్ఞానమయప్రదీపం
శ్రీ వ్యాసమునీంద్ర మమ దేహి కరావలంబం ||

వ్యాస భగవానుడు జన్మించిన రోజుగా భావించే రోజుని వ్యాస పూర్ణిమ అని గురు పూర్ణిమ అని అంటారు.హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున ఈ రోజు వ్యాసమహాముని పుట్టిన రోజు కాబట్టి దీనికంత ప్రాధాన్యత ఉంది.ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి, చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు.
గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరుచుకుని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు. తర తరాలకూ కొనసాగవచ్చు.
హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తుంటారు. వేదవ్యాసుని మానవజాతి కంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు కాబట్టి ఆయన్ను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు.
దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూంటారు. వ్యాసుడు భారతీయ సంస్కృతిని రూపుదిద్దాడు. వేదాలను విభజించి చక్కగా పరిష్కరించాడు. పంచమ వేదంగా కౌరవ, పాండవ గాథను ‘మహాభారతం’గా నిర్మించాడు. అందులో శ్రీకృష్ణప్రోక్తం, సర్వోపనిషత్తు సారమైన ‘గీత’ను గ్రథనం (కూర్పు) చేశాడు. భాగవతాది పురాణాలు లోకానికి అందించాడు. వ్యాసుడు తన శిష్యుల్లో పైలుడికి రుగ్వేదాన్ని, వైశంపాయనుడికి యజుర్వేదాన్ని, జైమినికి సామవేదాన్ని, సుమంతుడికి అధర్వణవేదాన్ని అప్పగించి లోకంలో ప్రసరింపజేశాడు. వ్యాసుడు పరిపూర్ణ తత్వజ్ఞానంతో బ్రహ్మసూత్రాలు రచించాడు.వ్యాసుడి జనన తిథిని ‘ఆషాఢపూర్ణిమ’గా బ్రహ్మాండ పురాణం చెబుతోంది.ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు. ఈ రోజునే చాతుర్మాస్యవ్రతాన్ని ఆరంభిస్తారు. ఆచార్యులవారిని అంటే గురుదేవుణ్ణి త్రిమూర్తి స్వరూపంగా ఆరాధించాలనేది ఋషివచనం.
ఈ రోజున గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజంచే రోజు గురు పూర్ణిమ అని పిలుస్తారు.
ఒకప్పుడు గురుకులాలుండేవి.వాటిలో చేరిని విద్యార్థులకు తల్లీ తండ్రీ అన్నీ తామే అయ్యేవారు గురువులు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అంటారు. తల్లీ తండ్రీ తరువాత స్థానం గురువుదే.ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించివందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు.
“గురుబ్రహ్మ, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరఃగురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః”అంటారు. దైవోపచారం చేస్తే గురువైనా రక్షిస్తాడు. అదే గురువుకు కోపం వస్తే ముల్లోకాలలో ఎవరూ రక్షించలేరట. అందుకే సమస్త విద్యలను నేర్పే గురువుకు, జ్ఞనాన్ని అందించే గురువుకు సేవచేసి, గురుకృప పొంది మహనీయులైనవారు ఎందరో వున్నారు.
“గురువునూ, గోవిందుడిని పక్కనపెట్టి ముందు ఎవరికి నకస్కారం చేస్తావంటే, గురువుకే నమస్కరిస్తాను. కారణం గోవిందుడు వున్నాడని చెప్పింది గురువేకదా” అంటాడు భక్తకబీర్ దాస్. అదీ మన భరతీయసంస్కృతి ఆర్షధర్మం నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యం. కాబట్టి గురుపౌర్ణమినాడు ప్రతి ఒక్కరూ గురువుల్ని సేవించాలి. షిర్డీ బాబా కు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగలలో గురు పూర్ణిమ ఒకటి. ఆయన జీవించినంత కాలం షిర్డీ లో ఈ గురు పూర్ణిమ ను అత్యంత ఘనంగా నిర్వహించే వారు. ఇప్పటికీ షిర్డీ సంస్థానంలోనే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న సాయి ఆలయాలలో ఈ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. అందుకే ఈరోజు బాబా ఆలయాలు అన్నీ సాయి నామస్మరణతో హోరెత్తిపోతాయి.

received_1097439066997422

మెంటల్ పోలీస్ కాదు మెంటల్, ఆగ‌స్టు 12న విడుదల

శ్రీకాంత్, అక్ష హీరోహీరోయిన్ లుగా రాజా ఆర్ట్ ప్రొడక్షన్స్ మరియు సుబ్రమణ్య ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘మెంటల్’. కరణం బాబ్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగ‌స్టు 12న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం హైద‌రాబాద్‌లో చిత్ర యూనిట్ పత్రిక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ..ఈ చిత్రంలో సిన్సియర్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌న‌ప‌డ‌తాను. రూల్స్ కు వ్య‌తిరేకంగా ఎవ‌రూ న‌డుచుకున్నా, చివ‌ర‌కు క‌ట్టుకున్న భార్య అయినా క్ష‌మించ‌ని పాత్ర నాది. ఆగ‌స్టు 12న సినిమా విడుద‌ల‌వుతుంది. మెంట‌ల్ పోలీస్ అనే టైటిల్ కారణంగా కోర్టు కేసు అయ్యింది. ఇప్పుడు సినిమా ‘మెంట‌ల్’ అనే టైటిల్‌తో విడుద‌ల‌వుతుంది. పోలీసులు గ‌ర్వంగా ఫీల‌య్యే సినిమా. అలాగే నేను నెగ‌టివ్ రోల్స్ లో చేస్తున్నానని ప్రచారం చేస్తున్నారు. న‌న్నెవ‌రూ ఆలాంటి పాత్రలకు సంప్ర‌దించ‌లేదు. భ‌విష్య‌త్‌లో ఎవ‌రైనా సంప్ర‌దించి, నాకు న‌చ్చితే త‌ప్ప‌కుండా చేస్తాను. ఇక మా అబ్బాయి న‌టించిన నిర్మలా కాన్వెంట్ చిత్రం విడుద‌ల నిర్మాత నాగార్జున‌గారి చేతుల్లో ఉంది. బ‌హుశా వ‌చ్చే నెల‌లో ఉండ‌వ‌చ్చున‌ని అనుకుంటున్నాను..అన్నారు.
ద‌ర్శ‌కుడు క‌ర‌ణం బాబ్జీ మాట్లాడుతూ…టైటిల్ కోర్టులో ఉండటం వల్ల సినిమా విడుద‌ల ఆల‌స్య‌మైంది. మెంట‌ల్ పోలీస్ అనే టైటిల్ ను మెంటల్ గా మార్చాము. ఇందులో శ్రీకాంత్‌గారు ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌న‌ప‌డ‌తారు. చ‌చ్చినా, బ్ర‌తికినా పోలీస్‌గానే బ్ర‌త‌కాల‌నే పాత్ర‌లో శ్రీకాంత్‌గారు అద్భుతంగా న‌టించారు. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఆగ‌స్టు 12న సినిమా విడుదల అవుతుంది.. అన్నారు.

శ్రీకాంత్ సరసన అక్ష నటించిన ఈ సినిమాలో సుహాసిని, నిఖిత, రచన మౌర్య, ముమైత్ ఖాన్, పోసాని, కోట, బ్రహ్మానందం మొదలగు వారు ఇతర తారాగణం.
ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, ఎడిటింగ్: కోటగిరి, ఫైట్స్: రవి, కెమెరా: బుజ్జి, నిర్మాతలు: వి.వి.ఎస్.ఎన్.వి ప్రసాద్ దాసరి, వి.వి. దుర్గాప్రసాద్ అనగాని, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: కారణం బాబ్జి

IMG-20160718-WA0003

” ఫ్రిజ్ ” సెన్సార్ పూర్తి.

తెలంగాణా చిరంజీవి (సంపత్),
ప్రణాలి షా హీరో హీరోయిన్ లుగా, బేబీ అక్షయ ప్రధాన పాత్ర లో తెరకెక్క్కుతున్న చిత్రం ‘ఫ్రిజ్’. పులి అమ్రుత్ సమర్పణలో మాన్సి మూవీస్ పతాకంపై జి.పాండురంగారావు, పులి అమృత్ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి శ్రీదర్ కూడిక్యాల దర్శకత్వం వహిస్తున్నారు .
సమాజంలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేదింపుల నెపద్యంతో పాటు కామెడీ హర్రోర్ గా వస్తున్న ఈ చిత్రానికి
సతీష్ గాదర్ల మాటలు అందించడం తో పాటు కమిడియన్ గా చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసిన టీమ్, సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు ‘యూ/ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది.

సెన్సార్ బృందం తరపున సినిమాకు మంచి రిపోర్ట్ వచ్చిందని తెలుపుతూ, త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తేలియచేసారు.
వెంకటస్వామి విలన్ గా చేస్తున్న ఈ చిత్రం కి
కెమెరా: కిషన్ తిప్పరవేని
ఎడిటర్ కిశోర్
కో డైరెక్టర్: రమేష్ వడ్లకొండ
నిర్మాతలు : జి.పాండురంగారావు.
పులి అమృత్ గౌడ్.
కథ,మాటలు:సతీష్ గాదర్ల
స్క్రీన్ ప్లే,దర్శకత్వం : శ్రీధర్ కుడిక్యాల.received_1112058822184512

1983 Hindi Movie Press meet

The Popularity that Indian Cricket enjoys today is the result of the Victory that the 1983 World Cup Team has delivered going into the tournament as the least favorites. This Journey of the 1983 World Cup team into the World Cup Final is now being made as a Bollywood Movie by Vishnu Induri, Founder of Celebrity Cricket League and Madhu Mantena of Phantom Films.

The producers have signed an MOU with the entire 1983 Team and got them on board to make an official Biopic of their journey towards winning the first World Cup in 1983. As per this MOU the producers will get to use the actual names of the players and true incidents from their lives. Eleven Members out of the 14 players of the 1983 Team came together on 10th June in Mumbai were excited that their story is being told to this generation which treats cricket as their religion which was not the same scene back then. Speaking on the occasion Kapil Dev Said “The Journey of 1983 Team is a story of inspiration which proves that one can achieve anything if they aim for it and work for it no matter what the world thinks”. Speaking about the Movie Vishnu Induri and Madhu Mantena the producers of the film said “We are super excited about making of the 1983 Movie and it’s a huge responsibility on our shoulders to get it right as we don’t get to tell stories like this often”.

The Movie is Scheduled to go on floors by March 2017.1983 1

1983 141983 121983 61983 21983 0