Daily Archives: July 17, 2016

|| అందుకే…||

 

ఆకులో పువ్వునైనా..
నును లేత రెమ్మకు నీడనిచ్చేందుకై…

విరులలో పరిమళాన్నైనా…
గాలిని గాంధర్వం చేసేందుకై…

పరిమళాలలో పుప్పొడినైనా…
మకరందాలను పంచేందుకై…

మకరందాలనే గ్రోలుతున్నా…
తేనెటీగనై తేనెను సేకరించేందుకై…

తేనెల జల్లే కురిపిస్తున్నా..
ప్రేమకు మాధుర్యాన్ని నింపేందుకై…

ప్రేమనే నేనవుతున్నా…
అందరి హృదయాలలో ఉదయించేందుకై…

ఉదయాన్నే నేనవుతున్నా…
చీకటికి ప్రాణం పోసేందుకై…

ప్రాణమే నేనవుతున్నా…
మొక్కనై పుట్టేందుకు…

అవని పై హరిత వర్ణమద్దుతున్నా….
ఎండనక , వాననక తడిచినా…

మీకు నీడై- తోడై నిలిచేందుకు….
కలకాలం మమ్మల్ని కాపాడేందుకై…

 కాకరపర్తి పద్మజా