Daily Archives: July 12, 2016

‘కబాలి’ సిమ్ కార్డ్స్

తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన ‘కబాలి’ సినిమా ప్రస్తుతం సౌతిండియాలో హాట్ టాపిక్ ఈ సినిమాపై అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి.సినిమా విడుదల కి మరో పది రోజుల గడువు మాత్రమే ఉండటంతో దాంతో ప్రమోషన్స్ మరింత పెంచేస్తున్నారు. బ‌స్సులు, కార్లు,ఆఖ‌రికి విమానాల‌పై సైతం క‌బాలీ పోస్ట‌ర్లు అంటించారు. నిన్నే సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకొన్న క‌బాలీ అందుతున్న సమాచారం మేరకు త్వరలో కబాలి స్పెషల్ సిమ్ కార్డులను ఎయిర్ టెల్ విడుదల చేయనుంది.కొత్తగా విడుదల చేసే కబాలి సిమ్ కార్డులు కొనుక్కునే వారికి స్పెషల్ ప్యాకేజీలు.. టాక్ టైమ్ ఆఫర్లు.. ప్రత్యేక వాల్ పేపర్లను రిలీజ్ చేయనున్నారని చెప్తున్నారు. అంతేకాకుండా…పాత కస్టమర్లకు కూడా కొన్ని కబాలి రీఛార్జ్ ప్లాన్స్ ఇచ్చే ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తోంది.

FB_IMG_1468335406153

వొర్లుతున్న పిట్టే

వొర్లుతున్న పిట్టే
_______________________ కృష్ణ మణి

అద్దుమ్మరాతిరి
కట్టకింది తాటిముంజల కొయ్యా
పటేల్ శేనుకాడ దొంగలమే
ఎర్రటెండకు తోడబుట్టినొల్లకు
ఆ ముంజనీళ్ళను తాపే మనసున్న దొరలమే !

కొబ్బరిమట్ట మీద సవారి ఎక్కితే
గుర్రాలై గుంజే దోస్తులం
అలుగుమీదెగిరే
పర్కపిల్లలబట్టే యాటగాళ్ళం

ఈతపల్లకోసం
ఈదులళ్ళ తిరిగే పెద్దీగలం
బరఫ్ పుల్లను నాక్కుంట ఊరిలిచ్చే అమాయకులం
మొటబాయిల పల్టీలు కొట్టే చేప పిల్లలం

మల్లెతోట్ల పూలేరే లేతమొగ్గలం
పిల్లలకు పాలుదాపే తల్లిమ్యాకలం
చెరువు నీళ్ళను శేనుమలిపే పలుగుపారలం
అమ్మయ్యకు ఎదిగొచ్చిన లేత రెట్టలం

అవును తాత చేతి కట్టెలం
నాయనమ్మ ఆకులో పోకలం
ఆకలెరుగని అలుపెరగని ఆటల పాటలం
అల్లరిమాటల మూటల గురుగులం

మేం దొరలం
పావులం
పాపమెరుగని పక్షులం
ఆ దేవుని రూపాలం

కప్పలం డొప్పలం
తిప్పలమోసే ఎద్దులం బుద్దులం
అమ్మ చేతి ముద్దలం
నాయిన చూపుకు వాన కురుసే తెప్పలం
పండుగపూట ఊరినొకటి చేసే రంగులం
గొర్లకాడ టుర్రు టుర్రు అరుపులం

కాలమయిన సొట ఆరుద్రలం
గడచిన దినాలు యాదికొచ్చి
కండ్లనీళ్ళు తోడుకొచ్చి
ఇప్పటికీ మేం పసి పిట్టలం
నవ్వుల గంటలం

కృష్ణ మణి

IMG-20160712-WA0001

15 న వస్తున్న ‘నాయకి’

త్రిష కథానాయికగా హారర్ ఎంటర్ టైనర్ గా
తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న చిత్రం ‘నాయకి’. రాజ్ కందుకూరి సమర్పణలో గిరిధర్ ప్రొడక్షన్స్ హౌస్ పతాకంపై గిరిధర్ మామిడిపల్లి, పద్మజ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ సినిమాకు తెలుగు దర్శకుడు గోవి దర్శకత్వం వహించగా, గిరిధర్ నిర్మాతగా వ్యవహరించారు. గణేష్ వెంకట్రామన్, ‘సత్యం’ రాజేష్, సుష్మా రాజ్ తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు. తొలిసారి త్రిష
3 నిమిషాల పాటు సాగే పాటను తమిళ వెర్షన్‌తో పాటు తెలుగులోనూ పాడింది.రఘుకుంచె సంగీతాన్ని అందించగా, ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, ఫస్ట్ లుక్‌లు అందరిలో ఆసక్తిని పెంచేశాయి.

40 రోజుల లో నే తెలుగు మరియు తమిళ భాష ల లో రూపొందిన ఈ చిత్రం,ఈ నెల 15న రెండు భాషాల్లో చిత్రాన్ని విడుదల చేయడం జరుగుతుందన్నారు. విభిన్న కోణాలున్న త్రిష పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకులు గోవి తేలియచేసారు.

IMG-20160712-WA0000