Daily Archives: July 11, 2016

“హరిత హారం” కార్యక్రమంలో “ఆమె అతడైతే” సినిమా టీం

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు “హరిత హారం” కార్యక్రమంలో
“ఆమె అతడైతే” సినిమా టీం అన్నపూర్ణ స్టూడియోస్ లోని 7 ఎకరాలలో
రక రకాల మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో సిని హీరో అక్కినేని నాగార్జున ముఖ్య అతిధిగా పాల్గొని
మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు
ఇందులో “ఆమె అతడైతే” దర్శకులు: K. సూర్య నారాయణ, హీరో: హనీష్, హీరోయిన్: సాక్షి, సంగీత దర్శకులు: యశో కృష్ణన్, గాయని గాయకులు: విష్ణు కిషోర్, లలితా సాగరి యాంకర్: కృష్ణ వేణీ, తదితరులు పాల్గొని హరిత హారం
కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.

received_1076931595718998received_1076931682385656FB_IMG_1468250277380

సెన్సార్ పూర్తి చేసుకున్న కబాలి 

తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన ‘కబాలి’ సినిమా ప్రస్తుతం సౌతిండియాలో హాట్ టాపిక్ ఈ సినిమాపై అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. కాగా తాజాగా ఈ
చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైపోయింది. ఈ చిత్రానికి క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ ను సెన్సార్ బోర్డు జారీ చేసింది. 152 నిమిషాల నిడివి గల ఈ చిత్రం లోరాధికా ఆప్టే హీరోయిన్ గా, పా రంజిత్ డైరక్షన్ లో కబాలి సినిమా జులై 22 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

 

kabali-5-300x225-1

జయతు జయతు పార్వతీనందనోయం

జయతు జయతు పార్వతీనందనోయం
జయతు జయతు బిభ్రాణతేజోమయం
జయతు జయతు తారకాసురభంజనం
జయతు జయతు నమో సుబ్రహ్మణ్యం ||

జ్ఞానకుమార వేంకట రమణ ప్రసాద్

images

ఓమ్ నమెా భగవతే రుద్రాయ !!

 

మం!! ” నమెా రుద్రేభ్యో యే పృథివ్యాం యే అన్తరిక్షే
యే దివి యేషా మన్నం వాతో వర్షమిషవస్తేభ్యో దశ
ప్రాచీర్దశ దక్షిణాదశ ప్రతీచీర్దశోదీచీర్దశోర్ద్వాస్తేభ్యో నమస్తే
నో మృడయన్తు తే యం ద్విష్మో యశ్చనో ద్వేష్టి తం
జమ్భే దధామి !! ఓం శాంతిః శాంతిః శాంతిః !!

భావం:- ఈ భూమి యందును, అంతరిక్షమునందును
మరియు దివి(దివ్య) లోకము యందును రుద్రమూర్తులు
ఎవరెవరు కలరో, ఎవరికి ఆహారం, గాలి, వర్షం ఆయుధములో
అట్టి రుద్ర రూపులకు మేము ప్రణమిల్లుతున్నాము ! తూర్పు,
పడమర, ఉత్తర, దక్షణ దిశలలో వున్న రుద్ర రూపులకు
నమస్కారములు ! వారు మాకు సుఖశాంతులను ప్రసాదించు
గాక ! ఎవరు మమ్ములను ద్వేషింతురో, ఎవరిని మేము ద్వేషింప వలసి వచ్చునో అట్టి వారిని బాగుగా తెరచి యున్న
నీ (రుద్రుని) నోటి యందు మేము సమర్పించుచున్నాము !!

FB_IMG_1468165307622