Daily Archives: July 9, 2016

*** నేను ఎవరిని ***

*** నేను ఎవరిని ***
ప్రతి జన్మకు అమ్మా,నాన్న కారణం
నా జన్మకు ఆడ,మగ అయిదు నిమిషాల సుఖమైంది..
చెత్తకుండీ ఊయలై
చిరిగిన విస్తరాకులు ఆటబొమ్మలై
కుక్కల అరుపులు సంగీతమై నిద్రపుచ్చేవి…
వయసొచ్చిన నా శరీరం
ఏటి ఒంపులతో, వసంత ఋతువేలా కూసిన
అందమైన కోకిల గొంతు
బ్రతకడం తెలియక శరీరానికి
మాటల ఆలంకారాలన్నీ వేసుకొని
సాయంత్రానికి విరగబూసిన మల్లెనై
ఎన్నో శరీరాలు నా వాసనతో తడిసారో
ఒక్కోసారి నన్ను నేను ప్లాస్టిక్ పువ్వులా పాలిష్ చేసుకుంటూ
కష్టమనే కన్నీళ్ల వుప్ప రుచి పెదవిపై మేకప్ అయ్యేది
నా శరీరాన్ని ఎన్నో పూటలు, ఎన్నో రాత్రులు, ఎన్నో తెల్లవారు ఝాములు
ఎన్నో శరీరాలు ముల్లులా గుచ్చాయో ….
నా శరీరం పై ఎన్నో ముద్రలు వారి సుఖానికి నిదర్శనం
ఇప్పుడు నా శరీరం దిక్కులేని ఆకాశం
మాటలన్నీ రాలిపోయిన చెట్టు
పిడచకట్టి నుజ్జు తియ్యగా మిగిలిన గుజ్జు ….
నేను కని వదిలేసిన కలని ఇంతకు నేను ఎవరిని ?!
రాజు పెండ్యాల
FB_IMG_1459303349000

శ్రీ కృష్ణ మమ దేహి కరావలంబం

గోగోవత్సగోపీజనగోపికాసంరక్షణాకవచశ్రితజనరక్షాకరం

గోపీచందనతిలకాంచితవనమాలాధరశిఖిపించమౌళిం

గోవర్ధనోద్ధరగోగోపబాలకసహయమునాతీరసంచారం

శ్రీ కృష్ణ మమ దేహి కరావలంబంkrishna17 ||

జ్ఞానకుమార వేంకట రమణ ప్రసాద్