Daily Archives: July 8, 2016

మొదటి షెడ్యుల్ పూర్తి చేసుకున్న ” సింధూర “

అశోక్ రాయల్, అవంతిక, కీర్తిక హీరోహీరోయిన్లుగా సాయి సింధు క్రియేషన్స్ బ్యానర్ పై పులి అమృత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సింధూర ‘. ఈ సినిమా మొదటి షెడ్యుల్ పూర్తి చేసుకుంది.
దర్శక నిర్మాత పులి అమృత్ మాట్లాడుతూ….నూతన నటీనటులతో నేను తెరకెక్కిస్తున్న నా పదోవ చిత్రం ‘సింధూర ‘ ప్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపోందుతుంది,ఈ రోజు సింధూర మొదటి షెడ్యుల్ పూర్తీ అయ్యింది. విజయవంతంగా పూర్తి చేయడానికి సహకరించిన యూనిట్ సభ్యులందరికి కృతజ్ఙతలు తేలియచేసారు.

FB_IMG_1467981073830

FB_IMG_1467981068446


FB_IMG_1467981064393

‘జనతా గ్యారేజ్’ రికార్డ్

ఎన్టీఆర్‌ ‘జనతా గ్యారేజ్‌’ టీజర్‌కు విశేష స్పందన లభిస్తోంది. బుధవారం సాయంత్రం యూట్యూబ్‌లో విడుదలైన ఈ చిత్ర టీజర్‌ను ఇప్పటి వరకు రెండు మిలియన్ల కు పైగా వ్యూస్ తో 60వేల లైక్స్ తో యు ట్యూబ్ ని దద్దరిల్లేలా చేస్తున్నాడు ఎన్టీఆర్ . ఈ టీజర్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి.

49351d548ce46cd6d8281b0d652169bc_M

శాండల్ వుడ్ లోకి హీరో ‘ఆది’

తొలి చిత్రం  ప్రేమ‌కావాలి తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే యూత్ లో మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న ‘ఆది’ మొదట్లో పరవాలేదనిపించినా ఆ తరువాత సరైన హిట్ దొరక్క కాస్త వెనుకబడ్డాడు.ఇప్పుడు చుట్టాల‌బ్బాయి తో ఫ్యామిలీ ఆడియ‌న్స్ ని ఆక‌ట్టుకునేందుకు త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు.ఇదిలా ఉంటే…క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో కూడా హీరోగా ప‌రిచ‌యం అయ్యేందుకు ఆది రెడీ అవుతున్నాడు అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. తండ్రి సాయి కుమార కు
శాండల్ వుడ్ లో
మంచి పాపులారిటీ ఉంది. అందుకనే ఆయన ఆదిని కన్నడ పరిశ్రమలోకి కూడా ప్రవేశపెట్టాలని చూస్తున్నాడట.

తెలుగులో నిఖిల్ కి మంచి విజ‌యాన్ని అందించిన కార్తీకేయ క‌న్న‌డ రీమేక్ లో ఆది న‌టించ‌నున్న‌ట్టు స‌మాచారం.

IMG-20160708-WA0001

జూలై 15న వస్తున్న ‘ నిన్నే కోరుకుంటా’

శుభకరి క్రియేషన్స్‌ పతాకంపై విజయ్‌భాస్కర్‌, సందీప్, ఆనంద్‌, పూజిత మొదలగువారు ప్రధాన తారాగణంగా గణమురళి దర్శకత్వంలో నిర్మాత మరిపి విద్యాసాగర్‌ (వినయ్‌) నిర్మిస్తున్న చిత్రం ‘నిన్నే కోరుకుంటా’.ఈ చిత్రం
జూలై 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మరిపి విద్యాసాగర్‌(వినయ్‌) మాట్లాడుతూ..‘‘ఇది రొమాంటిక్‌ కామెడీ మూవీ. సినిమా అంతా ప్రేక్షకుల్ని ఫుల్‌గా నవ్విస్తుంది. నేటి యువతీ యువకుల మనస్థత్వాలను ఈ చిత్రం ప్రతిబింబిస్తుంది. ఈ సినిమాలో చేస్తున్న ఆర్టిస్ట్‌లందరూ సినిమాకోసం ఎంతగానో సహకరించారు. దర్శకుడు గణమురళి..చెప్పినదానికంటే గొప్పగా చిత్రాన్ని తెరకెక్కించాడు.పలువురు సినీ ప్రముఖులు మా సినిమాను చూసి అభినందిచటం జరిగింది.నేటి యువతరాన్ని మా సినిమా 100% ఆకట్టు కుంటుందన్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు , ట్రైలర్స్ కు మంచి స్పందన వచ్చింది. జూలై 15న సినిమాని విడుదల చేస్తున్నాము అన్నారు.

విజయ్‌భాస్కర్‌, సందీప్, ఆనంద్‌, పూజిత, వైజాగ్‌ ప్రసాద్‌, పూర్ణిమ, సారిక, ప్రదీప్‌, సత్యం రాజేష్‌, సుమన్‌శెట్టి, కొండవలస,చమ్మక్ చంద్ర, సంజన, అంబటి శ్రీను, ప్రసాద్‌ చౌదరి,అప్పారావు మొదలగువారు నటించిన ఈ చిత్రానికి మాటలు: సాహు, ప్రకాష్‌, మాధవ్‌, పాటలు: పోతుల రవికిరణ్‌, కులశేఖర్‌, సంగీతం: ప్రణవ్‌, ఎడిటింగ్‌: నందమూరి హరి, నిర్మాత: మరిపి విద్యాసాగర్‌(వినయ్‌) కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: గణమురళి.

IMG-20160708-WA0000