Daily Archives: July 5, 2016

విడుదలకు సిద్ధమవుతున్న ‘తొలిప్రేమలో’

నూత‌న నిర్మాణ సంస్థ యాదాద్రి ఎంట‌ర్ టైన్మెంట్స్ తొలి ప్ర‌య‌త్నంగా త‌మిళంలో ఘ‌న‌విజ‌యం సాధించిన `క‌య‌ల్` చిత్రాన్ని `తొలిప్రేమ‌లో` అనే పేరుతో తెలుగులోకి విడుద‌ల చేస్తున్నారు. ప్రేమ‌ఖైదీ, గ‌జ‌రాజు వంటి చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ప్ర‌భుసాల్మ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో గౌళీకార్ శ్రీనివాస్ స‌మ‌ర్ప‌ణ‌లో త‌మ‌టం శ్రీనివాస్‌, జ‌యార‌పు రామ‌కృష్ణ నిర్మాత‌లుగా ఈ సినిమా రూపొందుతుంది. చంద్ర‌న్‌, ఆనందిని, ప్ర‌భు ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించారు. స్వ‌చ్చ‌మైన ప్రేమ‌క‌థ‌తో రూపొందిన ఈ చిత్రం త‌మిళంలో మంచి విజ‌యాన్ని ద‌క్కించుకుంది. ఈ చిత్రానికి శ‌శాంక్ వెన్నెల‌కంటి మాట‌లు, చంద్ర‌బోస్‌, శివ‌గ‌ణేష్‌, పెద్దాడ శ్రీరామ‌మూర్తి పాటలు అందిస్తున్నారు. డి.ఇమాన్ సంగీతం అందించారు. వెట్రివేట్ మ‌హేంద్ర‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. ద‌ర్శ‌క నిర్మాత‌లు సినిమా ఎంతో క‌ష్ట‌ప‌డి క్లిష్ట‌మైన లోకేష‌న్స్ అయిన మ‌నాలి, చిరపుంజి, మేఘాల‌యాల్లో ఎన్నోవ్య‌య ప్ర‌యాస‌ల‌కోర్చి చిత్రీక‌ర‌ణ‌ను జ‌రిపారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌కుడు రాజ‌మౌళి `బాహుబ‌లి` కోసం కొన్ని స‌న్నివేశాల‌ను అక్క‌డే చిత్రీక‌రించ‌డం విశేషం. త్వ‌ర‌లోనే ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు తెలియ‌జేశారు.
636033252762531266

||కలలు కలవరిస్తున్నాయి ||

 

కలలు కలవరిస్తున్నాయి. ..
ఊహలతో ఊసులల్లుతూ…
మనసును పలకరించాలని…

వలపు గీతాలను పాడుతూ. ..
కమ్మని భావాలను….
మనసు కలం తో లిఖించాలని…

వయసు వాకిట…
సొగసు పూలు వికసించాలని.
ఏకాంతాన జ్ఞాపకాలకు…
రూపమై కనులలో..
ఒదగాలని…

రాలిన నిరాశలతో..
రెప్పలపై వారధి కట్టి…
కొంగ్రొత్త ఆశలకు…
పూల బాట కావాలని..

పుట్టింటి లాంటి …
కనుల స్ధావరంలో..
స్ధిర పడాలని…

వేకువ వేడికి..
కరిగిపోని కలలు గా…
మిగలాలని..
కలవరింతలే కలలకు…
కనులు మూసిన క్షణం నుండి. ..
పులకింతలతో అనుక్షణం. .

కాకరపర్తి పద్మజా

వినూత్నంగా ” అమీర్ పేట్ లో” ఆడియో వేడుక

డ్యాన్స్,మిమిక్రీ,కామెడీ చేసె ఆసక్తి ఉందా. సినిమా లో అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా ??మీ పనులు వదులుకుని , మీ ప్రాంతం నుండి వచ్చి అవకాశాల కోసం తిరిగే సమయం మీకు లేదా ?
అయితే మీ కోసమే ఈ అవకాశం మీ టాలెంట్ తో మెప్పించే సత్తా ఉంటె చాలు,మీలాంటి వాళ్ళకోసమే ఈ అవకాశం
శ్రీ హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహిస్తున్న చిత్రం ” అమీర్ పేట్ లో”. ‘పద్మశ్రీ క్రియేషన్స్ బ్యానర్ లో మహేష్ నిర్మిస్తున్నారు. ‘శ్రీ’కి జంటగా ‘ అశ్విని’ నటిస్తోంది. ఈ సినిమా ఆడియోను జూలై 17 న శిల్పకళా వేదిక లో
పెద్ద ఎత్తున విడుదల చేస్తున్నారు.ఈ సినిమా ఆడియో విడుదల రోజున పలువురు సినిమా ప్రముఖుల ముందు అవకాశం ఆవిష్కరించుకునే అధ్బుత అవకాశం…
డోంట్ మిస్… అల్ ది బెస్ట్….

received_1118510758215086