Daily Archives: July 4, 2016

పూరి, కళ్యాణ్ రామ్ ‘ఇజం’

పూరి జ‌గ‌న్నాథ్ – క‌ల్యాణ్‌రామ్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతోన్న చిత్రానికి‘ఇజం’ అనే
టైటిల్ ఖరారు చేసి ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేశాడు. జులై 5న కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా పూరి ఈ ఫస్ట్‌లుక్ రివీల్ చేశాడు.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హీరో కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అదితి ఆర్య హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ రిపోర్టర్‌గా నటిస్తున్నాడని సమాచారం.IMG-20160704-WA0002

IMG-20160704-WA0001

//నవ నాగరికత//

//నవ నాగరికత//

ప్రకృతి సందేశం వినే తీరికెక్కడుంది నేటి తరానికి
ఎవరి చిరునామా వారే వెతుక్కుంటున్న నాగరికతలో
పువ్వుల పరిమళాన్ని గమనించేదెవరని
వీచే గాలి ఊసులను ఆలకించేదెందరని
సూర్యోదయ సూర్యాస్తమానాలూ..
చందమామ.. పాలపుంతలూ తిలకించే హృదయమెవ్వరిదని
చెమ్మగిల్లిన చూపులోని ఆర్ద్రతొకటి తాకివెళ్ళినా
నిండు మనసుతో తడమలేని మొండి మనసులు
సజీవమనుకొనే కణాలు మరణించినందుకేమో
ప్రాణంలేని మరబొమ్మలే సాటి మనుషులు
అనుబంధాలన్నీ గాలిలో దీపాలై రెపరెపలాడుతుంటే
అనుభూతులకి వేరుగా సమాధి చేయాల్సిన పనేముందన్నట్లు
ఆశలన్నీ దహించుకుపోవడం నిజమే
అందుకే అప్పుడప్పుడూ నీరవమూ గాయపడుతుందేమో
రవళించేందుకు ఒక్క అడుగూ కదిలి రాలేదని..!!

Laxmi radhika

నూతన నటీనటులకు అవకాశం

మోక్ష మీడియ క్రియేషన్స్ పతాకం పై పవన్ దర్శకత్వం లో కృష్ణ ఒక నూతన చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా  మీద మంచి  అభిరుచి ఉన్న ఈ దర్శక నిర్మాత లు చిత్ర నిర్మాణం కోసం అవసరమైన నూతన నటుల ఎంపికకు కూడా శ్రీకారం చుట్టారు. నటన పట్ల ఆసక్తి ఉన్న యువకులు తమ లేటెస్ట్ ఫోటోలను వారి వివరాలతో కలిపి ఈ దిగువ పేర్కొంటున్న ఈ మేల్ అడ్రెస్ కి పంపించవలసినదిగా ఈ సినిమా దర్శక నిర్మాత లు కోరుతున్నారు.

FB_IMG_1467556930949